సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపైన సోషల్మీడియా వేదికగా యుద్ధమే ప్రకటించింది వైసీపీ. అధిష్టానంతో గ్యాప్ రావడంతో విధానపరమైన నిర్ణయాలను విమర్శించాడని ఏకంగా సీఐడీని పురమాయించి కస్టోడియల్ టార్చర్ చేశారు. మరోవైపు ఎంపీ అని చూడకుండా సోషల్మీడియా వేదికగా రఘురామకృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్)ని విగ్గురాజు, పెగ్గు రాజు అంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పోస్టులు పెట్టడం చేసేశాడు. ఎంపీ ఫోన్ నెంబర్ షేర్ చేసి ఎవ్వరూ ఫోన్ చేసి తిట్టొద్దంటూ లంఫెన్ గ్యాంగులని వదిలేవాడు. అప్పట్లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా. తనపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని లోకాయుక్తకు ఎంపీ ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు చేశారు.
లోకాయుక్త కేసు నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశానని తప్పయిపోయిందని… ఇంకెప్పుడు అలా అనని గుర్రంపాటి దేవేందర్ రెడ్డి లిఖిత పూర్వకంంగా రాసిచ్చారు. లోకాయుక్త గుర్రంపాటి దేవేందర్ రెడ్డి క్షమాపణని ఎంపీ రఘురామకృష్ణంరాజుకి పంపారు. ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఈ కేసుని ముగిస్తున్నట్లు లోకాయుక్త ప్రకటించింది.
news
నగరిలో లోకేష్ రాక్స్..రోజా ఫ్రస్ట్రేషన్ పీక్స్. ..
యువగళం పాదయాత్ర చాలా నియోజకవర్గాల మీదుగా సాగింది. అయితే నగరి నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చిన జోష్‌తో తెలుగుదేశం శ్రేణులు కదం తొక్కాయి. రోడ్డు షో, బహిరంగసభకి హాజరైన జనం ప్రభంజనాన్ని తలపించింది. సందర్భం చూసుకుని నారా లోకేష్ కూడా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే, పర్యాటకశాఖా మంత్రి రోజాని టార్గెట్ చేశారు. మొత్తం రోజా అవినీతి, అరాచకాలు, అహంకారాన్ని జనం ముందుంచారు. తనపై టిడిపి యువనేత ఇంతలా విరుచుకుపడుతుంటే, వైసీపీ నుంచి ఎవరైనా మద్దతుగా నిలుస్తారని రోజా ఆశగా చూసింది. ఎవరూ స్పందించకపోవడంతో తనకు తానే మీడియా ముందుకొచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది. లోకేష్ చేసిన ఆరోపణలపై వివరణ కూడా ఇచ్చుకోలేని స్థితిలో సంయమనం కోల్పోయి, నోటికొచ్చినట్టు మాట్లాడింది. రోజా మాట్లాడిన ప్రతీ అంశానికి మళ్లీ లోకేష్ కౌంటర్ ఇచ్చారు. జబర్దస్త్ ఆంటీ అవినీతిని ప్రశ్నిస్తే..మహిళల్ని కించపరిచినట్టట. నా పళ్లు రాలగొడతానని జబర్దస్త్ ఆంటీ వార్నింగ్‌లు ఇస్తోంది. పళ్లు రాలగొట్టాల్సి వస్తే ముందుగా జగన్ రెడ్డి పళ్లు రాలగొట్టాలి ఆంటీ`` అని రోజాకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రోజూ నాకు చీర-గాజులు పంపుతానని ప్రకటించే రోజాకి తెలుగు మహిళలు సారె పెట్టేందుకు వెళ్తే వారిని అరెస్టు చేయించిందన్నారు. సాటి మహిళల్ని అత్యంత దారుణంగా కొట్టించి, అరెస్ట్ చేయించిన రోజా మహిళల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నన్ను పళ్లు రాలగొడతానంటోన్న జబర్దస్త్ ఆంటీ చంద్రబాబుని నడివీధిలో కొట్టాలి, కాల్చాలంటూ జగన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినప్పుడు జగన్ పళ్లు రాలగొట్టాల్సిందన్నారు.
నా తల్లిని అసెంబ్లీలో అవమానించినప్పుడు ఏమైంది ఈ రోజా? అప్పుడు జగన్ రెడ్డి పళ్లు రాలగొట్టలేదు ఎందుకు జబర్దస్త్ ఆంటీ? అని నిలదీశారు. రోజా తమపై చేసిన అవినీతి ఆరోపణలపైనా స్పందిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 16 హౌస్ కమిటీలు, 8 సీఐడీ కేసులు పెట్టారు. ఒక్కటీ నిరూపించలేకపోయారని, రాజశేఖర్ రెడ్డి, వైసీపీలో ఉన్న లక్ష్మీపార్వతి కూడా మాపై సుప్రీంకోర్టు వేసిన కేసుల్లో కనీసం ఆధారాలు కూడా చూపలేకపోవడంతో కేసులను కోర్టు కొట్టేసిందని తెలిపారు. ఇదీ మా చిత్త శుద్ధి జబర్దస్త్ ఆంటీ అంటూనే మేము మా ఆస్తులు ప్రతీ ఏటా ప్రకటిస్తున్నాం. మీ వైసీపీ లో మీరు, మీ 150 మంది దొంగలు కూడా ఆస్తులు ప్రకటించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.మొత్తానికి పాదయాత్రతో నారా లోకేష్ యువగళం వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. నగరి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర విజయవంతం కావడంతో మంత్రి రోజా ఫ్రస్టేషన్ పీక్స్‌కి చేరింది.
ఆ అధికారిని జైలుకి పంపుతాం... హైకోర్టు ఆగ్రహంతో ఉలిక్కిపడ్డ ఐఏఎస్...
మరో సారి... మరో రోజు... మరో మొట్టికాయి... హైకోర్టు చేతిలో గతంలో ప్రభుత్వంలో పెద్దలకు మొట్టికాయలు పడేవి. ఇప్పుడు తమ చేతికి మట్టి అంటకుండా చేస్తూ ఉండటంతో, అధికారులు బలి అవుతున్నారు. ఈ మధ్య కాలంలో అనేక మంది ఐఏఎస్ అధికారులు కోర్టు ముందు దోషులుగా నిలబడటం, వారికి శిక్షలు పడటం, తరువాత వారు హైకోర్టుకు సారీ చెప్పటం, ఇవన్నీ రొటీన్ అయిపోయాయి. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. విశాఖ మర్రిపాలెంకు చెందిన వ్యాపారి లలితేష్‌కుమార్, హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసారు. తన స్థలాన్ని ఖాళీ చేయాలని అంటున్నారు అంటూ, పిటీషన్ వేసారు. ఈ విషయం పై చీఫ్ జస్టిస్ కు విన్నవించుకున్నారు. అయతే ఇదే స్థలం పై లీజు విషయంలో గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినా, అధికారులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ హైకోర్టు ఆగ్రహం చేస్తూ, ఈ పిటీషన్ కాకుండా, కోర్టు ధిక్కరణ పిటీషన్ వేయాలని, అధికారుల తప్పు తేలితే, తాము ఆ అధికారులను జైలుకు పంపుతాం అంటూ, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
గోదావరి జిల్లాల్లో బాబు .. రాయలసీమలో చినబాబు జగన్ ని ఉతికి ఆరేశారు
ఒకే రోజు తండ్రి, తనయుడి ధాటికి జగన్ రెడ్డి విలవిల్లాడారు. గోదావరి జిల్లాలో చంద్రబాబు, రాయలసీమ గడ్డపై నుంచి లోకేష్ బాబు జగన్ రెడ్డి పాలనా వైఫల్యాలపై తీవ్రస్వరం వినిపించారు. ఇద్దరి నినాదం ఒక్కటే. జగన్ పని అయిపోయింది అని జనంలోకి బాగా తీసుకెళ్లారు. యువగళం పాదయాత్ర ప్రారంభం నుంచి ప్రతీ రోజూ సీఎం జగన్ రెడ్డి పాలనా వైఫల్యాలపై విరుచుపడుతోన్న నారా లోకేష్, రెండు రోజులుగా విమర్శల దాడి మరింత పెంచేశారు. మహిళల్ని మోసం చేసిన జగన్ రెడ్డి పళ్లు రాలగొట్టాలంటూ పిలుపునిచ్చారు. గోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగసభలో చంద్రబాబు జగన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. సైకో జగన్ ని ఇంటికి పంపిస్తే జనం బతుకుతారని, రాష్ట్రం మనుగడ సాగిస్తుందని ప్రజలు చైతన్యం కావాలని బాబు పిలుపునిచ్చారు. రెండు వారాలుగా యువగళం పాదయాత్ర సాగుతుండగా చినబాబు ఒక రేంజులో వైసీపీ సర్కారుపై విరుచుపడుతుండడంతో చంద్రబాబు సమీక్షలకే పరిమితం అయ్యారు. రాజధానిపై కేంద్రం అఫిడవిట్ వేసినప్పుడు మీడియా ముందుకొచ్చినప్పుడు కూడా తన శైలికి భిన్నంగా ఆగ్రహంగా స్పందించారు. మళ్లీ ఈ రోజు జగ్గంపేట సభలో సైకోని తరిమేయాలని జనంతోనే చెప్పించారు. జగ్గంపేట సభకి జనం పోటెత్తారు. చంద్రబాబు ప్రసంగానికి ఈలలు, చప్పట్లతో జేజేలు పలికారు. జగన్ పై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకి బాబు సభలకు వస్తున్న స్పందనే నిదర్శనమని టిడిపి నేతలు చెబుతున్నారు.