చిత్తూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి సమస్యకు, ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు ఎదురౌతున్నాయి. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నవారే కాక తమకు కూడా కరోనా సోకిందేమో అనే అనుమానంతో ప్రజలు పరీక్షా కేంద్రాలకు వస్తున్నారు. రోజురోజుకీ కేసులు ఎక్కువ అవ్వటంతో, ప్రజలు ముందుకు వచ్చి పరీక్షలు చేసుకుంటుంటే, ఉన్న పరీక్షాకిట్లు చాలక, తగినంత కిట్లు లేక ఏర్పడుతున్న మౌలిక సమస్యలతో సహజంగానే పరీక్షా ఫలితాలు రావడంతో ఆలస్యం చోటుచేసుకుంటోంది. మరోవైపు పరీక్షల్లో పాజిటివ్ అని తేలినవారికి తగినన్ని పడకలతో వసతి సౌకర్యాలను కల్పించడానికి నానాపాట్లు పడుతోంది ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో కోవిడ్ పరీక్షా కేంద్రాల వద్ద క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల నిమిత్తం స్వాబ్ శాంపిళ్లను ఇచ్చి వెళ్లేవారితో కొత్త సమస్య ఎదురౌతోంది. శాంపిళ్లు ఇచ్చే సమయంలో ప్రతి ఒక్కరు తమ సెల్ నెంబర్లను, చిరునామాలను సంబంధిత కేంద్రాల వద్ద సమర్పించాల్సివస్తుంది.

పరీక్షల్లో వారికి పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఆ సెల్ నెంబర్‌కు సమాచారం పంపుతారు, పరిస్థితిని బట్టి వారిని ఆసుపత్రికి వచ్చేయమని చేస్తుంటారు. అయితే గత వారం, పది రోజులుగా సెల్ నెంబర్లకు పరీక్షా ఫలితాలను తెలియచేయడానికి చేసే ప్రయత్నాలు విపలమవుతున్నాయి. కొన్ని సెల్ నెంబర్ల నుంచి స్విచాఫ్ అని కానీ, మరికొన్ని నెంబర్ల నుంచి రాంగ్ నెంబర్ అనికానీ సమాధారం వస్తోంది. కొందరిచ్చిన చిరునామాలు కూడా తప్పుడు చిరునామాలని పరిశీలనలో నిర్ధారణ అవుతున్నాయి. వారు సమర్పించిన ఆధార్ నెంబర్లు, అందులో పేర్కొన్న చిరునామాలు కూడా సక్రమంగా లేదని తేలింది. ఆ విధంగా రోజుకు సగటున 20 మంది ఇచ్చిన వివరాలు సరైనవి కావని తేలిపోయాయి. జిల్లాలో అత్యధికంగా తిరుపతి ప్రాంతంలో ఎక్కువగా ఈ సమస్య ఉందని, ఇప్పటివరకు 230 మందికిపైగా తప్పుడు సమాచారం ఇచ్చినవారున్నారని అధికారులు చెబుతున్నారు.

వారందరికీ పాజిటివ్ అని తేలిందని, అయినా తప్పుడు సమాచారం ఇచ్చి ఎటువంటి వైద్యచికిత్సలు చేయించుకోకుండా జనం మధ్య తిరుగుతూ పలువురికి కరోనా వైరసన్ను పంచుతున్నారని జిల్లా వైద్యశాఖాధికారి ఒకరు తెలిపారు. ఇటువంటి వారి వల్ల జిల్లాలో గత మూడు, నాలుగువారాలుగా వీరవిహారం చేస్తున్నకరోనా మరింతగా వ్యాప్తి చెందడానికి ఆస్కారం లభిస్తోందని ఆ ఆధికారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ 230 మందిపై పోలీసులకు వైద్య అధికారులు పిర్యాదులు చేసారు. అయితే ఇదే సమస్యని, 20 రోజుల ముందు చంద్రబాబు ఒక ట్వీట్ చేసి ప్రభుత్వం దృష్టికి తెస్తే, అప్పట్లో వెటకారం చేసారు. ఒకటో రెండో ఫోన్ నంబర్లు తప్పు ఉంటే ఇంత రాద్ధాంతం ఎందుకు అని ఎదురు దాడి చేసారు. ఇప్పుడు ఆ సంఖ్యా ఒకటో, రెండో నుంచి, ఒకే ప్రాంతంలో 230 దాకా వెళ్ళింది. ఇప్పటికైనా, ఈ నంబెర్లు తీసుకునే సమయంలో ఓటీపీ విధానం అమలు చెయ్యాలని, అధికారులు నిర్ణయం తీసుకోవటం, మంచి పరిణామం.

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులోని టిడిపి కార్యాలయంపై వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషను హైకోర్టు కొట్టివేసింది. ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ గురించి, పిల్ వేయడంలో, మరో రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఆసక్తి ఏమిటని ఆ న్యాయస్థానం ప్రశ్నించింది ? ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది ? ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ గురించి పిల్ ఎందుకు అనే విధంగా, హైకోర్టు స్పందించింది. 2017లో ఇదే అంశం పై ఆళ్ల రామకృష్ణారెడ్డి, హైకోర్టులో పిటీషన్ వెయ్యగా, కోర్టు అప్పుడు తోసిపుచ్చింది. అయితే ఇప్పుడే అదే అంశంలో, అదే వ్యక్తీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెయ్యటం పై, హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఇది వరకు తోసిపుచ్చిన అంశాన్ని, పిల్ రూపంలో రావాటం ఎందుకని, అసలు మీకు ఈ విషయంలో ఉన్న ఆసక్తి ఏమిటి అంటూ, హైకోర్టు ప్రశ్నించింది. ఏది ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ఏది రాజకీయ వ్యాజ్యం అనేది కోర్టులకు తెలుసని, కోర్టులకు అన్నీ తెలుసు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించింది.

అయితే అనూహ్యంగా ఈ సందర్భంగా, ప్రభుత్వానికి సంబందించిన న్యాయవాది వాదనలు చెప్పబోతూ ఉండగా, ఈ విషయం పై మీకు ఏమి సంబంధం, మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని కోర్టు ప్రశ్నించింది. వేసిన వ్యక్తి ప్రైవేటు వ్యక్తీ అంటే, ప్రభుత్వం తరుపు న్యాయవాది స్పందించటంతో, కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని అనుకోవాలి. అయితే ఈ విషయం పై, ఇది వరకే హైకోర్టు తోసిపుచ్చిన నేపధ్యంలో, మళ్ళీ విచారణ అవసరం లేదని, పిటీషన్ కొట్టేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే, సుప్రీం కోర్టులో అపీల్ చేసుకోవచ్చని, హైకోర్టు ఆదేశించింది. వాగు పోరంబోకి స్థలంలోని, కొంత భాగంలో, తెలుగుదేశం కార్యాలయం ఉందని, దాన్ని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని, ఆళ్ళ పిటీషన్ వేసారు. అయితే గతంలోనే ఈ అంశం పై హైకోర్టుకు వెళ్ళిన ఆళ్ళ, రిట్ పిటీషన్ వేసారు. అయితే అప్పట్లో హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఇప్పుడు, ఆ విషయం దాచి పెట్టి, పిల్ రూపంలో, ఇదే అంశం పై మళ్ళీ హైకోర్టుకు రావటంతో, హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

రాజమండ్రిలో, ఒక దళిత మైనర్ బాలిక పై జరిగిన గ్యాంగ్ రేప్ విషయం, సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజమండ్రినే కాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొత్తం ఉలిక్కి పడింది. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన దిశా చట్టం అమలులో ఉన్నా, ఒక మహిళా ముఖ్యమంత్రి హోం మంత్రిగా ఉన్నా, ఈ ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే, రాష్ట్రంలోనే మొదటి దిశా పోలీస్ స్టేషన్ మొదలు పెట్టిన రాజమండ్రిలోనే ఈ ఘటన జరగటం కాక, నాలుగు రోజులు సాముహిక అత్యాచారం చేసి, ఆమెను తీసుకొచ్చి, పోలీస్ స్టేషన్ ముందే పడేసి, పోలీసులకే ఛాలెంజ్ చేసారు అంటే, రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సంచలన ఘటనను తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. జరిగిన విషయం మొత్తం పై నివేదిక ఇవ్వాలి అంటూ, చంద్రబాబు పార్టీ తరుపున ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి, వాస్తవ పరిస్థితి వివరమించమని కోరటం, రెండు రోజుల క్రితం ఆ కమిటీ ఆ బాలికను, కుటుంబ సభ్యులను, పోలీసులను కలిసి వివరాలు సేకరించింది.

జరిగిన విషయం మొత్తం చంద్రబాబుకు నివేదించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఉండగా చంద్రబాబు చెలించిపోయారు. తెలుగుదేశం పార్టీ తరుపున, మనం చెయ్యగల్గిన సహాయం చేద్దాం అంటూ, పార్టీ తరుపున ఆ బాలికకు, రెండు లక్షల ఆర్ధిక సహాయం చెయ్యటమే కాకుండా, ఆమెను పార్టీ దత్తతు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఎంత వరకు చదివితే అంత వరకు, ఏ చదువు అయితే ఆ చదువుకు అయ్యే ఖర్చు మొత్తం పార్టీ భరిస్తుందని చెప్పారు. చంద్రబాబు నిర్ణయాన్ని, పలువురు ప్రశంసిస్తూ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అంత చేస్తే, ప్రభుత్వం కూడా ఇంతకంటే ఎక్కువ ఆదుకోవాలని, ప్రభుత్వం కూడా ఆ బాలికకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం తరుపున ఉద్యోగ హామీ కానీ, ఏదైనా భారీ ఆర్ధిక సహాయం కనీ, ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం మరింత కఠినంగా ఉండాలని, కొత్త చట్టాలు సంగతి తరువాత, ఉన్న చట్టాలతోనే, కఠిన శిక్షలు వెయ్యవచ్చని, గుర్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రోజుకి ఒక సంచలన సంఘటన దళితుల పై జరుగుతున్నాయి. దళిత సామాజికవర్గానికి చెందిన డాక్టర్లు, జడ్జిల పై దాడులు, గ్యాంగ్ రేప్ లు, శిరోమండనం, మాస్కు లేదని కొట్టి చంపటం, భూములు లాక్కోవటం లాంటి సంఘటనలు రోజు ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. దీని పై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం, వింతగా ఉంటుంది. ఒక సంఘటన తీసుకుంటే, చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ ఉదంతం తెలిసిందే. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువు అయిన ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తి చేస్తున్న పనుల పై, చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు సంబంధించిన, జూనియర్‌ సివిల్‌ జడ్జి అయిన రామకృష్ణ గత కొన్నాళ్ళుగా పోరాటం చేస్తున్నారు. దళిత సమాజికవర్గానికి చెందిన రామకృష్ణ, పెద్దిరెడ్డి బంధువుతో గత కొన్నాళ్లుగా చేస్తున్న పోరాటం, పది రోజులు క్రితం, వికృతరూపం దాల్చి, ఏకంగా జడ్జినే కొట్టేదాకా వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒక జడ్జి పైనే దాడి చెయ్యటం సంచలనంగా మారింది. ఈ విషయం అన్ని వార్తా పత్రికల్లో, చానెల్స్ లో, కొన్ని నేషనల్ మీడియా చానెల్స్ లో కూడా వచ్చాయి.

ఆరోపణలు అన్నీ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైకి వెళ్ళటంతో, ఆయన మీడియా సమావేశంలో ఈ విషయం ఖండిస్తూనే, నోరు జారారు. ఒక జడ్జిని, అదీ దళితుడుని పట్టుకుని, వాడు ఒక జడ్జి అంటూ, వాడు, వీడు అని మాట్లాడారు. దీని పై మనస్తాపం చెందిన జడ్జి రామకృష్ణ, నిన్న మంత్రి పెద్దిరెడ్డి పై, పోలీస్ కేసు పెట్టారు. తన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన, మంత్రి పై, కేసు పెడుతున్నాని, తగు చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తన పై దాడి జరిగిన విషయం పై, జూలై 15న బి.కొత్తకోట పోలీసులు, కేసు ఫైల్ చేసారని, ఆ తరువాత రోజు, అంటే జూలై 16న మంత్రి మీడియా సంవేసం పెట్టి, నన్ను అవమానకర భాషలో, వాడు వీడు అని దుషిస్తూ, కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదు చేసారు. తన పై జరిగిన దాడి విషయంలో, మంత్రి హోదాలో ఉంటూ వెటకారంగా మాట్లాడటం రాజ్యంగా విరుద్ధం, ఆయన మాట్లాడిన మాటలు, తాను నమోదు చేసిన క్రిమినల్ కేసు ప్రభావితం అయ్యేలా ఆందని, ఫిర్యాదు చేసారు. అంతే కాకుండా, ఎస్సీ వర్గానికి చెందిన వారిని, అవమానించే విధంగా మాట్లాడటం, నేరం అని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పరిగణలోకి తీసుకుని, పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisements

Latest Articles

Most Read