వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 గా ఉంటూ, జగన్ మోహన్ రెడ్డి , నేను ఒకటే, నేనే చెప్పినా, ఆయన చెప్పినా ఒకటే అనే స్థాయి నుంచి, విజయసాయి రెడ్డికి ఒక్కో మెట్టు తగ్గిస్తూ, అధికారాలు తగ్గిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించి, విజయసాయి రెడ్డికి అధికారాలు కత్తిరించిన సంగతి తెలిసిందే. తాడేపల్లి ఆఫీస్ బాధ్యతలు మొత్తం సజ్జల రామకృష్ణా రెడ్డికి ఇచ్చారు. విజయసాయి రెడ్డిని కేవలం, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు పరిమితం చేస్తూ, నిర్ణయం తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డి, ప్రస్తుతం, ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేస్తున్నారు. గతంలో, ఢిల్లీలో వైసిపీ నేతలు,ఎ వారిని కలవాల్సి వచ్చినా, విజయసాయి రెడ్డితో కలిసి వెళ్ళాలి అనే ఆదేశాలు కూడా వచ్చాయని పేపర్లో చూసాం. అయితే, ఇప్పుడు ఢిల్లీలో కూడా విజయసాయి రెడ్డి పవర్ కట్ చేసే పనిలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది.

దీనికి కారణం లేకపోలేదు. వారం రోజుల క్రితం, మంత్రి బుగ్గన ఢిల్లీ వెళ్ళారు. ఆయనతో పాటు, రిటైర్డ్ అధికారి అజయ్ కల్లం రెడ్డి కూడా ఉన్నారు. వెళ్ళు వెళ్లి మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి, వినతి పత్రం సమర్పించి, రాష్ట్రానికి రావాల్సిన వివిధ నిధుల పై చర్చించారు. అయితే ఈ సమావేశానికి అజయ్ కల్లం రెడ్డిని తీసుకువెళ్లటం, ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనకు సియంఓలో అధికారులు కత్తిరించటంతో, ఆయన పని అయిపొయింది అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా, ఆయన ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. అయితే ఈ రోజు ఒక ప్రముఖ వార్తా పత్రిక కధనం ప్రకారం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, విజయసాయి రెడ్డిని తీసి, అజయ్ కల్లంను నియమిస్తారని ప్రచురిచింది. ఇదే జరిగితే విజయసాయికి ఉన్న, క్యాబినెట్ హోదా కూడా పోతుంది. మరి ఇది నిజంగా కార్యరూపం దాల్చుతుందా ? ఒక వేళ నిజమే అయితే, విజయసాయి రెడ్డికి, మరో పవర్ కట్టించినట్టే.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉహాగానాలకు తెరదిగిందనే చెప్పాలి. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు సంసిద్ధమైంది. ఈ నెల 22న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. అదే రోజున మధ్యాహ్నం ఒంటిగంట తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఆ రోజున ఇద్దరు కొత్త మంత్రులు ప్ర మాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ ఎంఎల్‌సీ పదవులకు రాజీనామాతో చేసారు. దీంతో పాటుగా మంత్రి వదవులకు రాజీనామా చేసి, నంబంధిత పత్రాలను జగన్‌కు అప్పగించారు. జగన్ మోహన్ రెడ్డి ఇంకా వాటిని ఆమోదించలేదు. అయితే రాజ్యసభ సభ్యులైనందున వారు ఆరు నెలలకు మించి పదవిలో కొనసాగే అవకాశం లేదు. దీంతో వారిద్దరి రాజీనామాలను ఆమోదించి, వారి స్థానం లో మరో ఇద్దరి మంత్రులుగా అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నారు.

లభించిన నమాచారాన్ని అనునరించి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే!, అందువలన రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గాలకు చెందిన వారితోనే ఖాళీ అయిన మంత్రుల స్థానా లను భర్తీ చేయాలని జగన్ భావిస్తోన్నట్లు నమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో ఐదుగురు ముఖ్యమంత్రుల్లో ఒక్కరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను పిల్లి నుభాష్ నిర్వహిస్తున్నారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తే, ఆ స్థానంలో మరో బీసీ వర్గానికి చెందిన వారికి ఉపముఖ్యమంత్రి హోదాను ఇవ్వా ల్సివుంది. కొత్తగా తీసుకునే మంత్రులకు ఆ అవకాశం కల్పిస్తారా, ప్రస్తుతం ఉన్నవారిలో ఎవ్వరికైనా ఆ హోదా కల్పిస్తారా అనే విషయంలోను చర్చ జరుగుతోంది. లభించిన సమాచారాన్ని అనుసరించి ఎమ్మెల్యే చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, పలాన ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రివదవులు దక్కే అవకాశం ఉంది. మంత్రులశాఖల్లోను స్వల్ప మార్పు లు జరిగే అవకాశం ఉందని సమాచారం. మంత్రి ధర్మాన, బొత్స శాఖలలో మార్పు ఉండే అవకాసం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

జగన్ సర్కార్ పై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని, ధ్వజమెత్తారు. దిశా చట్టం చేసామంటూ, హడావిడి చేసిన ప్రభుత్వం, అమలులో, ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసారని, ధ్వజమెత్తారు. మహిళలకు రక్షణ కల్పించాలనే, చిత్తశుద్ధి, నిబద్ధత ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం లేదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటె, ఈ వరుస అత్యాచారాలు, మహిళల పై ఎందుకు ప్రశ్నించారు. రాజమండ్రిలో ఒక దళిత మహిళను, నాలుగు రోజుల పాటు, నిర్బంధించి, సామూహిక అత్యాచారం చేసారని, చివరకు ఆ బాలికను, నిందితులే పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి, పోలీసులకే సవాల్ విసిరారని అన్నారు. అత్యాచారం చేసి పోలీసులకే సవాల్ విసిరారు అంటే, రాష్ట్రంలో నేరస్తులు ఎలా పేట్రేగిపోతున్నారో అర్ధం అవుతుందని అన్నారు. రాజమండ్రి ఒకటే కాకుండా, రాష్ట్రంలో జరిగిన అనేక ఘటనలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం పై ప్రశ్నలు వర్షం కురిపించారు చంద్రబాబు. 

జగన్ వచ్చిన ఈ 14 నెలల్లో, 400కు పైగా అత్యాచారాలు జరిగాయని, 16 గ్యాంగ్ రేపులు జరిగాయని అన్నారు. చిత్తూరు జిల్లాలో ఒక బాలిక, నెల్లూరులో మరో బాలిక, అనంతపురంలో ఒక బాలిక, గుంటూరులో మరో బాలిక, ఇలా జరుగుతూ ఉన్నాయని, ఇప్పుడు రాజమండ్రిలో జరిగిన ఈ ఘటనను కూడా ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను, ఎండగట్టారు చంద్రబాబు. నెల్లూరులో ఎంపీడీవో పై, చిత్తూరులో మహిళా డాక్టర్ పై, మాస్కు అడిగినందుకు మహిళా ఉద్యోగి పై దాడి, ఇవన్నీ మహిళల పై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనం అని, పాలకులు స్వప్రయోజనాల కోసం, వ్యవస్థలను నాశనం చేస్తే, దాని ప్రయోజనాలు ఇలాగే ఉంటాయని, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయం పై కఠినంగా ఉండాలని, బాధితులకు న్యాయం చెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ అఫ్ లా ఉందా ? ఇప్పటికి హైకోర్టు నుంచి ఈ ప్రశ్న, మూడు సార్లకు పైగానే వచ్చింది. ఇప్పటికే మూడు సార్లు రాష్ట్ర డీజీపీ, హైకోర్టు ముందుకు వెళ్లి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అలాగే, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా హైకోర్టు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థతి వచ్చింది. అయినా, ఇన్ని జరిగినా, ఎలాంటి మార్పు రావటం లేదు. అధికారులకు మళ్ళీ మళ్ళీ కోర్టు చేతిలో మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. తాజాగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందినా, న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ని అర్ధరాత్రి పూట వచ్చి, భయబ్రాంతులకు గురి చేసి, ఆయన్ను తీసుకు వెళ్ళటం పై, న్యాయవాది భార్య, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‍ దాఖలు చేసారు. నిన్న దీని పై విచారణ జరిపిన హైకోర్టు సీరియస్ అయ్యింది. రేపటి లోగా న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ని మా ముందు హాజరు పరచాలని, అలాగే తూర్పు గోదావరి ఎస్పీ తమ ముందు హాజరు కావాలి అంటూ, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలు ప్రకారం, ఈ రోజు సుభాష్ చంద్రబోస్ ని హైకోర్టు ముందు హాజరు పరిచారు, తూర్పు గోదావరి పోలీసులు. అంతే కాకుండా, తూర్పు గోదావరి ఎస్పీ కూడా కోర్టు ముందు హాజరు అయ్యారు.

తూర్పు గోదావరి ఎస్పీ నయీం అస్మి పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక న్యాయవాదిని, అంత ఇదిగా, అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఆయన ఏమైనా పారిపోయే వ్యక్తా, ఎటువంటి ఆధారాలు లేకుండా, అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముంది ? ఇలా అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చెయ్యవచ్చు అని నిబంధనలు ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో రూల్ అఫ్ లా ఉందా అని కోర్టు ప్రశ్నించింది. మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తే, మేము తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. పోలీసులు ఉంది, ప్రజల కోసం అని గుర్తుంచుకోవాలని, రాజకీయ బాసులు కోసం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీకు రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఉంటే, యూనిఫాం తీసి వెళ్ళండి, యూనిఫాం వేసుకుంటూ మాత్రం, ప్రజల కోసమే పని చెయ్యాలని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని చెప్తూ, తదుపరి విచారణ వచ్చే మంగళవారనికి వాయిదా వేసింది హైకోర్టు.

Advertisements

Latest Articles

Most Read