టిటిడి గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, టిటిడి పై ఫైర్ అయ్యారు. గతంలో జరిగినట్టే, ఇప్పుడు జరుగుతున్నాయని అన్నారు. అంతే కాకుండా, స్వామీ వారి సేవ చేసే, అర్చకుల్లో 50 మందిలో, 15 మందికి కరోనా వచ్చిందని, వెంటనే దర్శనాలు ఆపాలి అంటూ ఆయన ట్వీట్ చేసారు. కేసులు పెరుగుతున్నా, ఈవో, ఏఈవో దర్శనాలు ఆపటం లేదని అన్నారు. ఇంకా 25 మంది రిపోర్ట్ లు రావాల్సి ఉందని, ఈ పరిస్థితిలో దర్శనాలు కొనసాగించటం పై అభ్యంతరం వ్యక్తం చేసారు. రమణ దీక్షితులు ట్వీట్ పై టిటిడి ఉద్యోగులు, అర్చకులు, ఇతర సిబ్బంది, చర్చించుకుంటున్నారు. శాస్త్రీయమైన దృక్పదం లేకపోలేదనే వాదన నడుస్తుంది. దర్శన ఏర్పాట్లు పై దృష్టి పెట్టారు కానీ, ఉద్యోగులను పట్టించుకోలేదు అనే వాదన వినిపిస్తుంది. అయితే గతంలో రమణ దీక్షితులు చేసిన ట్వీట్ పై, టిటిడి పై చేసిన విమర్శలతో టిటిడి అలెర్ట్ అయ్యింది. రమణ దీక్షితులు, గత నెల రోజులుగా, ఏదో ఒక ఆరోపణ చేస్తూ, టిటిడిని టార్గెట్ చేసారు. దీంతో రమణ దీక్షితులు సలహాలు మాత్రమే ఇవ్వాలనే వాదన తెర పైకి వస్తుంది.
టిటిడి గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల వ్యాఖ్యలను, టిటిడి చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. కీలకమైన హోదాలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదని అన్నారు. ఏమైనా ఉంటే బోర్డుకు సలహాలు ఇవ్వాలి కాని, ఇలా మీడియా ముందుకు వచ్చి, వ్యాఖ్యలు చెయ్యటం సరికాదని అన్నారు. తిరుమల దర్శనాల విషయంలో, రాజకీయ రంగు పులమోద్దని, అర్చకులకు ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతోనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. దర్శనాలు నిలిపే ప్రసక్తే లేదని అన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ, "మా ప్రభుత్వం వచ్చిన తరువాత, ఆయనకు గౌరవ ప్రధాన అర్చకుడు హోదా ఇచ్చాం. ఆయన ఏమైనా చెప్పాలి అనుకుంటే బోర్డుకు సలహాలు ఇవ్వాలి. మీడియా ద్వారా కామెంట్ చేయ్యాటం మంచి పధ్ధతి కాదు. ఆయనను పిలిచి మాట్లమంది చెప్తాను. దేవస్థానంలో పని చేసే మొత్తం స్టాఫ్ లో, 140 మందికి పాజిటివ్ కేసులు వచ్చాయి. ఎక్కువ శాతం పోలీస్ వారికి వచ్చాయి. తరువాత పోటులో పని చేసే వారికి వచ్చింది, ఆ తరువాత 14 మంది అర్చకులకు వచ్చింది. వీళ్ళలో 70 మందికి తగ్గిపోయింది.