ఎల్టీ పాలిమర్స్ విషవాయువు వెంటాడుతోంది. నిపుణులు హెచ్చరించిన విధంగానే స్టెరీన్ గ్యాన్ ప్రభావం మానవాళిని వెంటాడుతోంది. గ్యాస్ లీకేజీ ఘటనలో అప్పుడు అధిక మోతాదులో గ్యాస్ పీల్చిన వారు, ఇప్పటికీ మృతి చెందుతూనే ఉన్నారు. పోయిన వారం ఒక వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. నిన్న మరొకరు చనిపోయారు. ఎక్కువ మోతాదులో విషవాయువు పీల్చిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కొద్ది మోతాదులో విషవాయువు పీల్చిన వారిపై స్టెరీన్ గ్యాస్ ప్రభావం దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుందని అప్పట్లోనే వాతావరణ నివుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అది అక్షరాలా రుజువు అవుతోంది. ఎల్టీపాలిమర్స్ కర్మాగారం అనుకుని ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం వాసులపై సైరీన్ గ్యాస్ ప్రభావం అధికంగా ఉందని జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఘటన జరిగిన తరువాత మృతులు సంఖ్య 12 కాగా వారానికొకరు వంతున అదే గ్రామానికి చెందిన వృద్ధులు ఆరోగ్యం క్షీణించి హఠాత్తుగా మృత్యువాత పడుతుండడం ఆ గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
సోమవారం వెంకటాపురం గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణ ముసలయ్య(58) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెలలో జరిగిన గ్యాస్ లీకేజీ మటనలో ముసలయ్య విషవాయువు పీల్చి అపస్మారక స్థితిలో చికిత్స పొంది ఇటీవల డిశ్చార్జ్ అయ్యాడు. అయితే సోమవారం ఉన్నట్టుండి మునలయ్య ఆరోగ్యం క్షీణించడంతో హుటా హుటిన కుటుంబ సభ్యులు ఓప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ముసలయ్య సోమవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య 15కు చేరుకుంది. ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు వాపోతున్నారు. దీర్ఘకాలికంగా, దీని ప్రభుత్వం ఉంటుందని అర్ధం అవుతుందని, ప్రభుత్వం, దీని పై తగు చర్యలు తీసుకోవాలని, అందరికీ లైఫ్ లాంగ్ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఉచిత వైద్యం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇది ఇలా ఉంటే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైవపర్ కమిటీ మూడు రోజుల విచారణ పూర్తయింది. దీనిపై ఈ నెల 20వలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హైవపర్ కమిటీ చైర్మన్, భూమిశిస్తు చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. గ్యాస్ లీకేజీ ఘనటకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించేందుకు వీలుగా హైపవర్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. మూడో రోజైన సోమవారం జీవీఎంసీలో హైపవర్ కమిటీ విచారణ చేపట్టింది. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన, తర్వాతి పరిణామాలు, తీసుకున్న చర్యలపై జీవీఎంసీ అధికారులతో హైపవర్ కమిటీ చర్చించింది. అలాగే జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల వివరాలపై కమిటీ ఆరా తీసింది. ప్రమాద తీవ్రత పరిశ్రమలపై విశ్లేషాత్మక నివేదికలు తయారు చేయాలని హైపవర్ కమిటీ సూచించింది.