15 రోజుల క్రితం, విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయ్యి, 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే, అనేకమంది అస్వస్తతకు గురయ్యారు. అయితే ఈ కంపెనీ విషయంలో, అనేక ప్రశ్నలు, అనేక ఆరోపణలు వస్తున్న వేళ, హైకోర్ట్ లో శుక్రవారం జరిగిన వాదనలు, హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు సంచలనం అయ్యాయి. ఈ రోజు ఆ ఆదేశాలకు సంబంధించి, పూర్తి డాక్యుమెంట్ బయటకు రావటంతో, కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయిన తరువాత, హైకోర్ట్ ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. ఈ విషయం పై శుక్రవారం హైకోర్ట్ కీలక ఆదేశాలతో పాటుగా, కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. ఇవే ప్రశ్నలు సామాన్య ప్రజలకు కూడా వచ్చాయి. మొన్న సిఐడి ఆర్రేస్ట్ చేసిన రంగనాయకమ్మ గారి కేసు విషయంలో కూడా, ఇందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రజలకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో, ఈ రోజు కోర్ట్ కూడా అవే ప్రశ్నలు వేసింది.

ముందుగా కోర్ట్ ఆదేశాలు ఇస్తూ, ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సీజ్ చెయ్యాలని ఆదేశించింది. కంపెనీ డైరెక్టర్ లతో, కంపెనీకి సంబంధించిన ఎవరూ లోపలకు వెళ్ళవద్దు అని ఆదేశాలు ఇచ్చింది. అలాగే విచారణ కోసం కొన్ని కమిటీలు ఏర్పాటు అయ్యాయని, విచారణ కోసం వెళ్ళే వారు లోపలకు వెళ్ళవచ్చు కాని, గేటు బయట ఒక రిజిస్టర్ పెట్టి, ఎవరు ఎవరు లోపలకు వెళ్తున్నారో, వారు అక్కడ రిజిస్టర్ అవ్వాలని కోర్ట్ కోరింది. అలాగే ఎల్జీ పాలిమర్స్ కు సంబంధించి ఏ ఒక్కటీ, మిషనరీ కాని, ఫర్నిచర్ కాని, బయటకు వెళ్ళటానికి వీలు లేదని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ డైరెక్టర్ లకు, కోర్ట్ కు తెలయకుండా పాస్ పోర్ట్ ఇవ్వకుడదు అని, ఎవరూ దేశం విడిచి వెళ్ళటానికి వీలు లేదని కోర్ట్ ఆదేశించింది.

అలాగే లాక్ డౌన్ తరువాత పర్మిషన్ ఎవరు ఇచ్చారు ? ఒక వేళ పర్మిషన్ ఇవ్వకపోతే, ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో చెప్పాలని కోర్ట్ కోరింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ విషయాల్లో ఎందుకు సరిగ్గా స్పందించ లేదు అంటూ కోర్ట్ అడిగింది. ఎల్జీ పాలిమర్స్, పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా పని చేస్తుంది, అని కోర్ట్ ప్రశ్నించింది. కంపెనీలో అలారం ఎందుకు మోగలేదు అని ప్రశ్నించింది. ప్రమాదం జరిగితే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే, ట్రైనింగ్ ఎందుకు ఇవ్వలేదు ? అని ప్రశ్నిస్తూ, కంపెనీ నెట్ వాల్యు ఎంత ? కోర్ట్ పరిధిలో ఉండగానే, స్టరీన్ మోనోమార్ ని సౌత్ కొరియాకి తరలించే ఆదేశాలు ఇచ్చింది ఎవరు ? నేరం జరిగినాక ఎటువంటి మాజిస్టీరియల్ విచారణ కానీ ఇన్సెపక్షన్ టీం ఏర్పాటు కా కుండానే
ఎలా తరలించారు? అని కోర్ట్ ప్రశ్నిస్తూ, కౌంటర్ దాఖలు చెయ్యమని కోరింది.

హోం మంత్రి సుచ‌రిత పై మాజీ మంత్రి, తెలుగుదేశం నేత కే. ఎస్ జవ‌హార్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ, "హోం మంత్రి సుచ‌రిత కేవ‌లం ప్రెస్ మీట్లు పెడితే త‌ప్పా చ‌ర్య‌ల ద్వారా ఏ రోజు వెలుగులోకి వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. ఆమె శాఖను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న‌డుస్తుంది. పెద్ద వాళ్ల గురించి మాట్లాడితే మ‌రింత వెలుగులోకి వ‌స్తామ‌న్న ఆలోచ‌న‌తో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. హోం మంత్రి సొంత జిల్లాలో రోడ్డుకు అడ్డంగా గోడ‌లు క‌డితే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు. ఆ రోజు ప్రెస్ మీట్ ప్ర‌జ‌ల సౌక‌ర్యం గురించి మాట్ల‌డ‌ని మీరు నేడు చంద్ర‌బాబు నాయుడుని విమ‌ర్శించ‌డం చూస్తుంటే మీ అవివేకం భ‌య‌ట‌ప‌డుతుంది. అదే విధంగా మాచ‌ర్ల సంఘ‌ట‌న మీద ఎందుకు స్పందించ‌లేదు? ఆత్మ‌కూరులో ద‌ళితులు గ్రామ బ‌హిష్కర‌ణ గురి అయితే క‌నీసం ప‌ట్టించుకోలేదు. కుచ్చులూరు బోటు ప్ర‌మాదం ఘ‌ట‌న‌ప్పుడు మీరు ఎందుకు బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌లేదు? ఎల్జీ పాలిమ‌ర్స్ లో ఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత మీరు వెళ్ల‌కుండా డీజీపీ మాత్ర‌మే ఎందుకు వెళ్లారు? మీస్థాయి మీ ప‌రిస్థితి ఏంటో ఒక్క సారి హోం మంత్రి ఆలోచ‌న చేసుకోవాలి. చంద్ర‌బాబు నాయుడు ఏపీకి రావ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వానికి లేఖ రాస్తే వెంట‌నే స్పందించి అనుమ‌తినిచ్చారు."

"అదే విధంగా ఏపీలో డీజీపీ కూడా లేఖ రాస్తే రాయ‌లేద‌ని హోం మంత్రి స్థానంలో ఉండి అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నారు. సుచ‌రిత ఆన్ లైన్ లో అప్లికేష‌న్ చూడ‌టం నేర్చుకోవాలి. హోం మంత్రి ప్రెస్ మీట్ లో ఏదో యాంక‌ర్ లా మాట్లాడితే ఎలా? ఎల్జీ పాలిమ‌ర్స్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి క‌న్నా, శైల‌జానాధ్ రాలేదా అని చెప్ప‌డంతో మీ అవ‌గాహ‌న ఏమిటో అర్ధం అవుతుంది. వాళ్లు ఈ రాష్ట్రంలో ఉన్న వారు కాబ‌ట్టి అనుమ‌తులు అవ‌స‌రం లేదు. ప‌క్క రాష్ట్రంలో ఉన్న వారికి అనుమ‌తులు కావాల‌న్న క‌నీస ప‌రిజ్ఞానం హెం మంత్రికి లేద‌ని అర్ధం అయ్యింది. మీకు ఇంకా ఏడాది మాకే గ‌డువు ఉంది ఆ త‌రువాత మ‌రో హెం మంత్రి వ‌స్తారు. లిడ్ క్యాప్ భూములు, ద‌ళిత భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ ను అరెస్ట్ చేస్తే మీరెందుకు నోరు మెద‌ప‌లేదు. ద‌ళిత డాక్ట‌ర్ సుధాక‌ర్ పై దాడులు జ‌రుగుతుంటే పోలీసుల‌పై మీరు తీసుకున్న చ‌ర్య‌లు ఏమున్నాయి? డాక్ట‌ర్ సుధాక‌ర్ పై అలా దాడి చేయ‌మ‌ని చెప్పిన వారి ఉద్యోగాలు ఊస్టింగ్ చేయిస్తే మీపై న‌మ్మ‌కం ఉంటుంది. సీబీఐ విచార‌ణ హైకోర్టు ఇచ్చింది. హోం మంత్రి ప‌రిజ్ఞానం, జ్ఞానం పెంచుకోవాలి. దండాన్ని స‌జ్జ‌ల‌కు ఇచ్చి మీరు మాత్రం హావ‌భావాలు వ్య‌క్త ప‌రుస్తూ రిమోట్ లా ప‌ని చేయ‌డం బాధాక‌రం."

"డా. సుధాక‌ర్ విష‌యంలో ఆదిమూల‌పు సురేష్ జోక్యం లేద‌ని చెబుతున్నారు. నిజ‌నిజాలు సీబీఐ విచార‌ణ త‌ప్ప‌క భ‌య‌ప‌డ‌తాయి. గుమ్మ‌డి కాయ‌ల దొంగ ఎవ‌రంటే బుజాలు త‌డుపుకుంటున్నారు. 5 గురు ద‌ళితలు ఉండి దేనికి ప‌నికి రాకుండా ఉన్నారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న జ‌రుగుతుంది. దానిని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శ్నిస్తుంటే భ‌య‌ప‌డుతున్నారు. మీ త‌ప్పులు ఎక్క‌డ భ‌య‌ట‌ప‌డ‌తాయోన‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. విజ‌య‌సాయిరెడ్డిని ఏ ప‌దంతో పిల‌వాలో డిక్ష‌న‌రీలోను దొర‌క‌డం లేదు. ఆయ‌న మా డీజీపీ అని చెబుతున్నారు. డీజీపీ అంటే వీళ్లింట్లో పాలేరు కాదు ఆయ‌న ఆంధ్ర‌ప్‌కదేశ్ డీజీపీ అని ఆయ‌న మ‌ర్చిపోయిన‌ట్లు ఉన్నారు. వైకాపా నాయ‌కులు అహంకారంతో మాట్లాడుతున్న వాటిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ఆ రోజు చంద్ర‌బాబు నాయుడు ఎక్కాల్సిన విమానం ముంబైలో ఉంది కాబట్టి అక్క‌డ నుంచి హైద‌రాబాద్ - వైజాగ్ వెళ్లాలి కాబట్టి కేంద్రానికి లేఖ రాయ‌డం జ‌రిగింది. అప్పుడున్న ప‌రిస్థితిలో కేంద్రం ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. ఈ రోజు డొమోస్టిక్ స‌ర్వీసులు తిరుగుతున్నాయి. హోం మంత్రి బాధ్య‌త‌ల‌ను వేరే వాళ్ల బుజాల మీద పెట్టి ద‌ళితుల‌ను కాల్చాల‌ని చూస్తున్నారు. ద‌ళిత హోం మంత్రి అయినా ద‌ళితుల‌కు ఉప‌యోగం లేదు. క‌రోనాను అడ్డం పెట్టుకొని జ‌నాల ద‌గ్గ‌ర వెల్లం ప‌ల్లి దందాలు వ‌సూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఏడాదిలో మీరు సాధించిన ఘ‌న‌కార్యంపై చ‌ర్చ‌కు నేను సిద్దం. మీరు సిద్ధ‌మా? చంేద్ర‌బాబు నాయుడు చ‌ర్‌కకు సిద్దంగా ఉన్నారు. జ‌గ‌న్ సిద్ద‌మా? 365 రోజుకు 365 వైఫ‌ల్యాలు ఉన్నాయి. మంత్రులు బ‌రితెగించి ఉన్నారు. వారికి ఒక ఏడాది అక‌డ‌మిక్ ఇయ‌ర్ పూర్తి అయ్యింది. బూతులు తిడ‌తంలో, అబ‌ద్దాలు చెప్ప‌డంలో వ‌చ్చే అక‌డ‌మిక్ ఇయ‌ర్ లో వారికి స‌ర్టిఫికేట్లు వ‌స్తాయి. శ్రీదేవి ద‌ళిత మ‌హిళా శాస‌న‌స‌భ్యులు అయ్యి ఉండి అంబేద్క‌ర్ విగ్ర‌హాం ఎవ‌రిది అని అడిగిన ప‌రిస్థితి." అని అన్నారు.

ప్రసిద్ధ హిందు ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా వున్న వేలాది ఎకరాల ఆస్తు ల్లో తమిళనాడు రాష్ట్రంలో పలు చోట్ల వున్న ఆస్తు లను విక్రయించడానికి తిరుమల తిరుపతి దేవ స్థానం పెద్దలు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీలు కూడా తమిళనాడు లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టిటిడి ఆస్తులకు సంబంధించి నివేదిక కూడా సమర్పించారు. నివేదిక అందడంతో తమిళనాడులోని వేలాది ఎకరాల ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. తమిళనాడులోని చెన్నై, మధురై, కాంచీపురం, ఈరోడ్, కోయంబత్తూరు, నామ క్కల్, తిరుచ్చి, రాలయవేలూరు, విల్లుపురం, తిరువళ్ళూరు, నాగపట్నం, తిరువణ్నామలై, తిరుచిరాపల్లి, ధర్మపురి జిల్లాల్లో ఇళ్ళస్థలాలు, భూములు, ఆస్తులు వున్నాయి, ఈ ఆస్తులన్నీ నిరర్ధకంగా మారాయనే నెపంతో ఏకంగా దేవుని సొత్తు విక్రయాలకు టెండర్ పెట్టారు.

తొలివిడతగా శనివారం తమిళనాడులోని 1.50 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు అమ్మకానికి పెడుతూ టిటిడి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే నిరర్ల కంగా వున్న ఈ ఆస్తుల విక్రయాలపై టిటిడి ధర్మ కర్తలమండలి కూడా పాలకమండలి సమావేశంలోనే తీర్మానం చేసింది. ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను టిటిడి అధికారులకు బాధ్యత అప్పగించారు. ఈ నేపధ్యంలో టిటిడి ఆస్తుల విక్రయాల ప్రక్రియను నిలువుదల చేయాలని ప్రతిపక్షనాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యా ప్తంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, కేరళ, కర్నాటక, గుజరాత్, ఒడిశా, హర్యానా,వుదుచ్చేరి, మహారాష్ట్ర, నేపాల్ లో ఆస్తులు భారీ మొత్తంలో ఉన్నాయి. ఇందులో 125.75ఎకరాల విలువైన ఆస్తులు ఇతర రాష్ట్రాల్లో ఉండటం విశేషం.

భక్తులు ఉదారంగా ఇచ్చిన ఆన్తు లను నేడు టిటిడి పెద్దలు అమ్మకాలకు పెట్టడం పెద్ద దుమారాన్నే రేవు తోంది. అయితే టిటిడి ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిసు న్నాయి. ఈ ఆస్తుల విక్రయాలను ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం పెద్దల కన్ను శ్రీవారి ఆస్తులపై వడిందనే ఆరోపణలు ప్రతిపక్షాలు బహిరంగంగా వ్యక్తంచేస్తున్నాయి. అయితే ఈ విమర్శల పై అధికార పక్షం స్పందించింది. మంత్రి సుచరిత మాట్లాడుతూ, నిరర్ధక ఆస్తులను అమ్ముకుంటే తప్పు ఏమి ఉంది అని ప్రశ్నించారు. అయితే మరో మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం, టిటిడి తీసుకునే నిర్ణయాలకు, ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. టిటిడి బోర్డు నిర్ణయాల ప్రకారం, అన్నీ జరుగుతాయని అన్నారు. ఇరువురు మంత్రులు, తలా ఒక విధంగా స్పందించారు.

విశాఖపట్నంలో, డాక్టర్ సుధాకర్ వ్యవహారం పై, హైకోర్ట్, ఈ కేసుని సిబిఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు, హైకోర్ట్ ఆదేశాలు మేరకు, విశాఖ 5వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌, డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం తీసుకున్నారు. ఈ వాంగ్మూలంలో, డాక్టర్ సుధాకర్ సంచలన విషయాలు బయట పెట్టారు. "తాను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్నానని, కోరనా వచ్చిన తరువాత, పలుమార్లు, మాస్కులు అడిగానని, అయితే స్టాక్ లేదనే సమాధానం వచ్చిందని అన్నారు. తమ హాస్పిటల్ ను, ఇసోలేషన్ కేంద్రంగా మార్చారని, తనకు ఎప్పటి నుంచో, బీపీ, షుగర్ ఉండటంతో, సెలవు తీసుకుందాం అనుకున్నా, ఎస్మా వల్ల సెలవు ఇవ్వలేదని అన్నారు. అయితే, పలు సందర్బాలలో, మాస్కులు అడిగినా, మత్తు డాక్టర్ కి మాస్కు అవసరం ఏమి ఉంది అని చెప్పారని అన్నారు. ఈ సందర్భంలోనే ఒక ఎమర్జెన్సీ పేషంట్ రావటం, ఆవిడకు దగ్గు, జలుబు ఉండటంతో, ఎన్‌-95 మాస్కు ఇవ్వాలని కోరాగా, అది ఇచ్చి, దీన్నే 15 రోజులు వాడాలని చెప్పారని అన్నారు.

ఆ ఆపరేషన్ అయిన తరువాత, అక్కడ స్టాఫ్ మాస్కులు లేక ఎదుర్కుంటున్న సమస్యను వీడియో తీసి, స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు వస్తే, ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు గెంటేసారని, ఆ సమయంలో, అక్కడ ఉన్న ఎమ్మెల్యే, మిగతా వారికి ఎన్‌-95 మాస్కులు ఉన్నాయి కాని, డాక్టర్లకు మాత్రం లేవని అన్నారు. తనని బయటకు గెంటేయటంతో, బయట మీడియా వారు ఏమి జరిగింది అని అడగటంతో, వారికి జరిగిన విషయం చెప్పానని, తరువాత తనకు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారని అన్నారు. తరువాత కొంత మంది వచ్చి, మా అబ్బాయి బైక్ సీజ్ చేసారు, ఎందుకు చేసారని పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి అడిగాను, ఆ సమయంలో, మహిళా కానిస్టేబుల్ నా చేయి పట్టుకుని, వదలండి అంటూ అరిచింది, పోలీసులు వచ్చి నన్ను కొట్టారు. ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేస్తాం అని బెదిరించి, నా కొడుకు పై కరోనా సమయంలో బండి నడిపినట్టు కేసు పెట్టారు, నా దగ్గర ఉన్న, మొబైల్, డబ్బులు లాక్కుని పంపించేసారు అని చెప్పారు.

అయితే మే 16న, హౌసింగ్ ఫైనాన్సు వారికి చెక్కు ఇవ్వటం కోసం, ఆంధ్రాబ్యాంక్ లో 10 లక్షలు డిపాజిట్ చెయ్యటానికి వెళ్తుంటే, నా వెనుక ఎవరో ఫాలో అయ్యారు. భయం అనిపించి, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని, వెనక్కు వచ్చేసాను, అయిత దారి మధ్యలో నన్ను ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆపి, రెచ్చగొట్టటం మొదలు పెట్టారు. కారులో ఉన్న నగదు, ఫోన్, పర్స్ తీసేసుకున్నారు. మద్యం బాటిళ్ళు కారులో పెట్టటం కనిపించింది. నన్ను రెచ్చగొడుతూ, కొంత సేపటికి, కొట్టి, చొక్కా చించి, తన్ని, ఇష్టానుసారం చేసారు. తాగాను అని, అరుస్తూ, హడావిడి చెయ్యటంతో, ఏదో కుట్ర పన్నుతున్నారని అర్ధం అయ్యింది. అక్కడ నుంచి ఆటోలో, స్టేషన్ కు తీసుకు వచ్చి, రెండు గంటలు నెల పైనే పడేసారు. నన్ను కలవటానికి వచ్చిన వారిని కూడా లోపలకు వదలలేదు. అక్కడ నుంచి కేజీహెచ్ కు, అక్కడ నుంచి మెంటల్ హాస్పిటల్ కు మార్చారు అని ఆయన వాంగ్మూలంలో చెప్పారు. అలాగే, ఆరు చోట్ల గాయాలు అయిన ఫోటోలు కూడా, కోర్ట్ కు సమర్పించారు.

Advertisements

Latest Articles

Most Read