అధికార వైసిపీ చేస్తున్న అరాచకాలకు నిరసనగా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, ఎన్నికలు బహిష్కరిస్తుంది అంటూ, మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమ కొమ్ములు విరిచిన నిమ్మగడ్డ ఉన్నప్పుడే రెచ్చిపోయిన వైసిపీ , ఇప్పుడు తమకు అనుకూలంగా ఉన్న అధికారి ఉంటే, ఎన్నికలు ఎలా జరుగుతాయో అర్ధమవుతుందని, అందుకే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలు బహిష్కరించే ఆలోచనలో ఉంది అంటూ, వస్తున్న వార్తల పై, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యులు అచ్చెన్నాయుడు స్పందించారు. ఎన్నికల బహిష్కరణ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్నికల కమిషన్ కొత్త నోటిఫికేషన్ ఇస్తుందని ఆశిస్తున్నామని, రేపు ఎన్నికల కమిషన్ తో జరిగే ఆల్ పార్టీ మీటింగ్ లో ఇదే చెప్తాం అని, ఎప్పుడో ఏడాది క్రిందట, అదీ దౌర్జన్యాలు చేసి చేసుకున్న ఏకగ్రీవాల విషయంలో స్పష్టత కోసం చూస్తామని, ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్మాణం ప్రకారం, తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఇక మధ్యానం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎన్నికల సంఘానికి లేఖ రాసారు వర్ల రామయ్య. ఎంపిటీసి, జెడ్.పి.టి.సి ఎన్నికలకు మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

achemnaidu 01042021 2

2020 మార్చి లో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఎంపిటీసిలలో 24 శాతం, జెడ్.పి.టి.సి లలో 19 శాతం బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుని వైసీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడిందని లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గత ఎన్నికల కమీషనర్ కేంద్ర హోం సెక్రటరీకి సైతం లేఖ రాశారని తెలిపారు. కొంత మంది పోలీసులతో అధికార పార్టీ కుమ్మక్కై బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. పోలీసులే పోటీదారుల చేత బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపజేశారు. వైసీపీ బెదిరింపులు, దా-డు-లు, దౌర్జన్యాలకు పాల్పడింది. నిజమైన ప్రజాస్వామ్యమంటే ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ పోటీదారుడికి, అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలి. కానీ, గత మార్చిలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో వైసీపీ దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది. ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని కాపాడాలంటే ఎం.పీ.టి.సీ జెడ్.పి.టీ.సీ లకు కొత్త నోటిఫికేషన్ జారీచేచేసి, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని వర్లరామయ్య ఎన్నికల సంఘాన్ని కోరారు.

హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్ పై సీబీఐ ప్రాథమిక విచారణ పూర్తిచేసి హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారం మొత్తంగా అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థలు ఉన్నందున పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు కొంత వ్యవధి పడుతుందని కోర్టుకు వివరించింది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు పలు తీర్పువెలువరించిన తరువాత న్యాయవ్యవస, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వ్యాఖ్యానాలు చేస్తూ పోస్టింగ్లు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు వ్యతిరేకంగా, నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకరను పోలీస్ కస్టడీకి తీసుకున్న అంశంపై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో కూడా న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థపై ఫేస్ బుక్, వాట్సాప్, ఉతర సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను, కోర్టులను టార్గెట్ చేస్తూ పోస్టింగ్లు వచ్చాయి.. వీటిపై విచారణ జరపాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గతంలో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అప్పట్లో సీఐడీ అధికారులు పలువురిపై కేసులు నమోదు చేశారు. అయితే దర్యాప్తలో పురోగతి లేనందున సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి వాటి నుంచి వివరాలు తీసుకోవటంలో సీఐడీ అధికారులు విఫలమయ్యారంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసారు.

cbi 01042021 2

దీనిపై విచారణ జరిపిన కోర్టు గత ఏడాది అక్టోబర్ 12న సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బార్బీ, జస్టిస్ గంగారావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. సీబీఐ తరుపు న్యాయవాది చెన్నకేశవులు ప్రాథమిక విచారణ నివేదిక సీల్డ్ కవర్‌లో కోర్టు ముందుంచి వాదనలు వినిపించారు. సీబీఐ పూర్తి స్తాయిలో దర్యాప్త జరపాలంటే మరికొంత వ్యవధి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. సీబీఐ నివేదికను కేసు రికార్డుల్లో చేర్చాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను జూన్ 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ కేసు పై సిబిఐ విచారణలో ఏమి ఉంది ? అసలు దీని వెనుక నిజంగానే ఒక పార్టీ కుట్ర ఉందా ? ఎవరు దీని వెనుక ఉన్నారు ? ప్రజాప్రతినిధులు కూడా చేసిన కామెంట్స్, ఏ కోణంలో విచారణ చేసారు. మరి ఇవన్నీ తెలియాలి అంటే, కోర్టు ముందు ఏ నివేదిక ఉందో చూడాల్సి ఉంది.

తెలుగుదేశం పార్టీ కానీ, నేతలు కానీ, ఎవరికైనా కౌంటర్ ఇవ్వాలి అనుకుంటే, ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు. మంచి చెడు బేరీజు వేసుకుని, ఒక పద్దతి ప్రకారమే అవతలి వ్యక్తికి కౌంటర్ ఇస్తారు. ఇది మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనేది పక్కన పెడితే, మొదటి నుంచి తెలుగుదేశం స్టైల్ ఇలాగే ఉంటూ వచ్చింది. అయితే ఈ రోజు లోకేష్ స్పందించిన తీరు చూస్తూ, ఒకింత షాక్ అవ్వాల్సిన పరిస్థితి. సహజ శైలికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ, ఈ రోజు స్పందించింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీలో కలిసి పోతుంది అంటూ, వెంకట్రామి రెడ్డి డెక్కన్ క్రానికల్ లో, ఒక వార్త వచ్చింది. అయితే చివరలో ఏప్రిల్ ఫూల్ అంటూ, వెటకారంగా స్పందించారు. ఇది రాసింది కర్రి శ్రీరాం అనే వాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇది చదివిన వారు, ఇవేమీ రాతలు ? సోషల్ మీడియాలో జులాయి గాళ్ళ లాగా, ఇలా పత్రికల్లో రాయటం ఏమిటి అంటూ స్పందించారు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ కూడా సీరియస్ గా స్పందించింది. నువ్వు ఒక ఫూల్ గాడివి, వెళ్లి నీ మాస్టర్ దగ్గరకు వెళ్లి, రివార్డ్ తీచ్చుకో అంటూ, టిడిపి సోషల్ మీడియా స్పందించింది. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఘాటుగా స్పందించారు. బాధ్యతగా ఉండాల్సిన పత్రికలు, ఇలా తప్పుడు రాతలు రాయటం పై సీరియస్ అయ్యారు.

dc 010420212

ఇక టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక అడుగు ముందుకువేసి, ఆ పత్రిక చరిత్ర అంతా బయట పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్షంలో ఉండగా, ఇదే నీలి మీడియాను అడ్డం పెట్టుకుని, ఇలాంటి నీలి సంస్థలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడని, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, అవే అబద్ధపు రాతలు, కూతలతో విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి కూడా తన లాగే, సిబిఐ కేసుల్లో ఇరుక్కుని, దివాళా తీసిన వెంక‌ట్రామిరెడ్డి డెక్కన్ క్రానికల్ లో గాలి వార్తలు రాపిస్తున్నాడని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి సిగ్గు లేదని, వెంక‌ట్రామిరెడ్డికి అసలు ఆ పదమే ఏమిటో తెలియదని అన్నారు. వీళ్ళకే లేనప్పుడు, అక్కడ పని చేసే శ్రీరాం కర్రి లాంటి వాళ్లకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. అసలు ముందు మీది చూసుకోండి, మీ సంస్థలో జీతాలు ఇచ్చి ఎన్నాళ్ళు అయ్యింది, ఆంధ్రభూమి మూసేసి, ఉద్యోగులను రోడ్డున పడేసిన వాటి పై కధనాలు రాసుకుంటే, కనీసం వారికైనా న్యాయం జరుగుతుంది అంటూ, లోకేష్ ఘాటుగా స్పందించారు.

విశాఖపట్నం నగరంలోని ప్యూజన్ ఫుడ్స్ సంస్థను ఖాళీ చేయించిన వ్యవహారంలో అధికారుల తీరును హైకోర్టు తప్పు పట్టింది. ఆదివారం సెలవు రోజున ఎలా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించింది. ముందు రోజు నోటీస్ ఇచ్చి మరుసటి రోజు ఆదివారం అయినప్పటికీ పోలీస్ బలగాలను ఉపయోగించటం అన్యాయమని స్పష్టం చేసింది. ఖాళీ చేయించన స్థలాన్ని పూజన్ ఫుడ్స్ సంస్థకు అప్పగించాలని వీఎంఆర్డీఏ (విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ)ని ఆదేశించింది. లీజు గడువు ముగియక ముందే ఖాళీ చేయించటాన్ని సవాల్ చేస్తూ సంస్థయాజమాన్యం గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణ జరిపారు. ప్రాంగణాన్ని ఖాళీ చేసేందుకు తగిన వ్యవధి ఇవ్వకపోవటాన్ని ఆక్షేపించారు. ఈజ్ మెంట్ చట్ట నిబంధనల ప్రకారం లీజుదారు ఓ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటే అందుకు తగిన వ్యవధి ఇవ్వాల్సి ఉందన్నారు. సెలవు రోజులు, ఆదివారాల్లో ఖాళీ చేయించరాదని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినందుకు గాను పాతికవేల రూపాయలు ఖర్చుల కింద చెల్లించాలని ఖాళీ చేయించిన ప్రాంగణాన్ని తిరిగి అప్పగించాలని జసిస్ సోమయాజులు తీర్పునిచ్చారు.

fusion 01042021 2

ఇక తీర్పులోని ముఖ్య అంశాలు చూస్తే, 2024 వారలు లైసెన్స్ ఉందని చెప్తున్నారు కానీ, ఎక్కడా పిటీషనర్ విరుద్ధంగా వ్యవహరించారని రుజువు చేయలేక పోయారు కదా అని కోర్టు ప్రశ్నించింది. ఎక్కడా అద్దె చెల్లించకపోవటం లేదు కదా. ఒప్పందం ఉల్లంఘించలేదు కదా అని కోర్టు ప్రశ్నించింది. అసలు ఒక్క రోజులో ఖాళీ చేయమని నోటీసు ఇవ్వటం, తరువాత రోజు బలగాలు తీసుకుని, 11 లారీల్లో అక్కడకు వెళ్ళటం చూస్తుంటే, అంతా ప్లాన్ ప్రకారం చేసినట్టు అర్ధమవుతుందని కోర్టు పేర్కొంది. ఇక అసలు పోలీసులను తీసుకుని వెళ్లి ఎందుకు ఖాళీ చేయించాల్సి వచ్చింది, సామాన్యులు పోలీసులును చూస్తే భయపడి పోతారు అనే కదా, అని కోర్టు ప్రశ్నించింది. ఎందుకు బయటకు నెట్టారు, అంత కారణం ఏముందో మాకు కనపడటం లేదని కోర్టు పేర్కొంది. మొత్తంగా, ఈ చర్యను తప్పు బడుతూ, పాతికవేల రూపాయలు జరిమానా విధించింది. అయితే గతంలో దీన్ని రచ్చ రచ్చ చేసిన వైసీపీ నేతలు, సోషల్ మీడియా, ఇప్పుడు మాత్రం, మౌనంగా ఉన్నారు...

Advertisements

Latest Articles

Most Read