మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు , నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ పై తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఎస్పీ భాస్కర్ భూషన్‍కు వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే "ఇటువంటి పోస్టింగ్ పెడితే, ఆ పోలీస్ డిపార్టుమెంటుకు చెందిన జిల్లా అధికారి, ఆయనకు ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేసారని, కేసు రిజిస్టర్ చేయవద్దు అని చెప్పేది ఏమిటి నాకు అర్ధం కావటం లేదు ? ఏమనుకుంటున్నాడు ఆయన ? ఎవరనుకుంటున్నాడు ? ఏ గవర్నమెంట్ అనుకుంటున్నాడు ? నాకు అర్ధం కావటం లేదు. బాగుండదు, పద్దతి కాదు, తమాషాలు పడొద్దు, దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. చేయండి. ముందు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయండి. డీఎస్పీ వచ్చి ఎంక్వయిరీ చేస్తాడు. ఫాల్స్ కేసు అయితే తీస్తాడు. లేకపోతే కేసు రిజస్టర్ చేసి లోపల వేస్తారు. అంతే కదా ? కేసు రిజిస్టర్ చేయవద్దు అని చెప్పటానికి నువ్వు ఎవరివి ? జిల్లా అధికారివి ? నీకేమి సంబంధం ? 13 జిల్లాల్లో ఇదే జరుగుతుందా ? ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఎస్పీ అనుమతి లేనిదే పెట్టకూడదా ? ఎక్కడ నుంచి వచ్చావు నువ్వు ? ఎవరు నేర్పించారు నీకు రూల్స్ ? ఎస్సీ ఎస్టీ కేసు ఇచ్చిన తరువాత కేసు రిజస్టర్ చేస్తారు. డీఎస్పీ వచ్చి ఎంక్వయిరీ చేస్తాడు. అంతే కదా ? నీకు ఏమి అధికారం ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయవద్దు అని చెప్పటానికి ? బాగుండదు. ఉన్నన్ని రోజులు జాగ్రత్త. ఇంకో నెల ఉంటావో, రెండు నెలలు ఉంటావో, ఉన్నన్ని రోజులు శుద్ధంగా ఉండి, చివరి రోజులో అయినా మంచి పేరు తెచ్చుకునో పో. తమాషాలు పడుతున్నాడు. ఏమనుకుంటున్నాడో ఏమో. ఎవరు అనుకుంటున్నాడో.

prasanna 180120212

ఎక్కడి నుంచో వచ్చాడు. మన కర్మకు వచ్చాడు ఈ జిల్లాకి. ఏమి పనులు ఇవి ? అందరి మీదే ఇది జరుగుతుంది. జగన్ గారి మీద అయితే ఇష్టం వచ్చినట్టు బాషతో రాస్తున్నారు. ఇన్ని జరుగుతా ఉంటే ఏమి చేస్తున్నారు మీరు అంతా ? ఎవరు కాపాడుతారు నిన్ను ? ఏమైనా విజయవాడలో ఉన్న డీజీపీ కాపాడుతాడు అనుకుంటున్నావా ? బాగుండదు చెప్తున్నా. మీడియాకు చెప్తున్నా. ఎంత దూరం రాసుకుంటారో రాసుకోండి. ఓపెన్ గా, చెప్తున్నా. నువ్వు తెలుగుదేశం పార్టీ అజేంట్ వా ? మా ప్రభుత్వం తరుపున ఈ జిల్లా ఆధికారిగా వచ్చిన వ్యక్తీవా అని నేను అడుగుతున్న ? ఎవడో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి ఫోన్ చేస్తే, మమ్మల్ని ఇబ్బంది పెడతావా ? ఎన్ని రోజులు ఉంటావు, నువ్వు ఈ నెల్లూరు జిల్లాలో, తరువాత నీ బ్రతుకు ఏమిటి ? వేరే జిల్లాకు పోతావ్ . నువ్వు ఎవరు అసలు ? కేసు పెట్టొద్దు అనటానికి నువ్వు ఎవరు ? బెదిరిస్తావా ? జైల్లో వేయిస్తాను అన్నావు అంటా, కింద పోలీస్ వారిని. నీకుందా దమ్ము ? రా నీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేపించు. ఎవరి గవర్నమెంట్ అనుకుంటున్నావ్ ? జాగ్రత్తగా ఉండు, నాతొ పెట్టుకోమాక ?" అంటూ జిల్లా ఎస్పీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి పోలీస్ సంఘం వారు, ఇప్పుడు కూడా మీసాలు మెలేసి, ప్రెస్ మీట్లు పెడతారేమో చూడాలి. ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడిన వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/Qc_qgcWLPHQ

ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ ఘాట్ లో, నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ మనకు దూరం అయి 25 ఏళ్ళు అయినా, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు అంటే, ఆయన చేసిన పనులు శాశ్వతంగా నిలిచి పోయాయి అని చెప్పటానికి నిదర్శనం అని అన్నారు. ఎన్టీఆర్ పేరు వినగానే శత్రువులు గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి అని అన్నారు. సినిమాల్లో కానీ, రాజకీయల్లో కానీ, ఆయన రారాజు అని, ఆయన సృష్టించిన చరిత్ర, భవిష్యత్తులో కూడా ఆయన్ను అందుకోలేరని అన్నారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నతమైన వ్యక్తి తీసుకొచ్చిన అనేక పధకాలు, సమాజంలో ఎంతో మార్పు తీసుకుని వచ్చాయని, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఆయన నిలిచారని అన్నారు. దేశంలో సంక్షేమం అనే పదానికి నిర్వచనం తెచ్చింది ఎన్టీఆర్ అని, ఇప్పటికీ ఆయన స్పూర్తితోనే పధకాలు ఉన్నాయని అన్నారు. దేశ రాజకీయాల్లో కూడా అయన తన ముద్ర వేసుకున్నారని గుర్తు చేసారు. అయితే ఈ సందర్భంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ కు భారతరత్న అనేది, కేవలం అయన జయంతి, వర్ధంతికి ఇచ్చే డిమాండ్ గానే చూడాలా, ఎప్పుడు సాధిస్తారు అని విలేఖరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పారు.

cbn 18012021 1

"తప్పకుండా సాధించాలి. భారత దేశం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నాన్ కాంగ్రెస్ పార్టీలు అన్నీ ఏకతాటి పైకి తీసుకుని వచ్చి, ఒక స్పూర్తి ఇచ్చిన వ్యక్తీ ఎన్టీఆర్. అదే మారిగా దేశంలో కూడా రాజకీయాలకు వన్నె తెచ్చారు. ఇప్పటికే ఆయనకు భారత రత్న లేట్ అయ్యింది. ఆయన వందో పుట్టిన రోజుకి అయినా భారత రత్న ఇవ్వాలి. దాని కోసం మేము పోరాడతాం, సాధిస్తాం." అని అన్నారు. అదే విధంగా ఎన్టీఆర్ సమాధి కూల్చేస్తాం అంటూ, కొన్ని పార్టీలు చేసిన వ్యాఖ్యల పై స్పందన అడగగా, చంద్రబాబు స్పందించారు. "ఎన్టీఆర్ సమాధి కుల్చేస్తాం అని ఎవడైనా అంటే, అది మన సంస్కృతిని కూలదోసినట్టే. ఆ ఆలోచనే ఎవరికీ రాకూడదు. ఆయన ఏమి చేసారు తెలుగుజాతి అనేది గుర్తు పెట్టుకోవాలి. ఆయన ఎవరికీ వివాదాస్పదం కాదు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి. రాజకీయాలు కోసం, అలాంటి వ్యక్తిని, వివాదాల్లోకి లాగకండి. ఎవరూ అలాంటి సాహసం చేయవద్దు అని కోరుతున్నా" అని చంద్రబాబు అన్నారు. అలాగే తెలంగాణాలో పార్టీ పరిస్థితి పై అడగగా, తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణాలో, తెలుగువారి కోసం ఎప్పుడూ, ఎక్కడైనా కృషి చేస్తూనే ఉంటాం అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మాట్లాడిన వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/7BuPj85uiIY

ఇన్నాళ్ళు బీజేపీ నేతలు ఎంత తిట్టినా, పడి ఉన్న వైసీపీ నేతలు, ఇప్పుడు స్ట్రాటజీ మార్చారు. లోపాయికారీ ఒప్పందంతో బయటకు ఇలా తిడుతున్నారో, లేకపోతే నిజంగానే, ఇక బీజేపీతో ఎందుకు అనుకున్నారో ఏమో కానీ, బీజేపీ మీద డోస్ పెంచారు. ఈ రోజు మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ, నోటాతో పోటీ పడే పార్టీ బీజేపీ అంటూ తీసి పడేసారు. అంతే కాదు, కేంద్రంతో ఫిర్యాదు చేస్తే మాకు ఏమైనా భయమా, చేసుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. మరి ఇది వెల్లంపల్లి సొంత అభిప్రాయమో, పార్టీ చెప్తే ఈ వ్యాఖ్యలు చేసారో కానీ, బీజేపీని ఒక ఆట ఆదుకున్నారు. రెండు రోజులు క్రితం డీజీపీ పెట్టిన ప్రెస్ మీట్ లో, దేవాలయల పై జరిగిన ఘటనల విషయంలో, ఇద్దరు బీజేపీ నేతలు కూడా ఉన్నారని చెప్పిన విషయం తెలిసిందే. దీని పై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. అసలు డీజీపీ అలా ఎలా చెప్తారు, సోషల్ మీడియాలో చెప్పినవి కేసు అంటారా, మా పైన ఆపాదిస్తారా ? డీజీపీ వైసీపీ పార్టీకి పని చేస్తున్నారు అంటూ, ఇలా డీజీపీ పై విరుచుకు పడ్డారు. అంతే కాదు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని, ఇక డీజీపీ తమ పార్టీ పై చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించకాపోతే పరువు నష్టం దావా వేస్తాం అంటూ హడావిడి చేసారు. అయితే సోము వీర్రాజు ఇలా వ్యాఖ్యలు చేసారో లేదో, ఈ రోజు మంత్రి వెల్లంపల్లి బయటకు వచ్చి సోము వీర్రాజు పై విరుచుకు పడ్డారు.

somu 17012021 2

డీజీపీ పై అనవసరపు కామెంట్స్ చేస్తున్నారని, ఆయన దర్యాప్తులో వచ్చిన విషయాలు మీడియాకు చెప్పినా తప్పు అంటారా అని, ఆగహ్రం వ్యక్తం చేసారు. తమ తప్పు ఏమి లేకపోతే, బీజేపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారు అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. మా ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి తెస్తున్న పధకాలను పక్కదోవ పట్టించేందుకే, బీజేపీ ఇలా మాట్లడుతుందని అన్నారు. తెలుగుదేశం హయాంలో ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం గుడిలు తొలగిస్తూంటే, అప్పటి బీజేపీ మంత్రి, బీజేపీ పార్టీ ఎందుకు చూస్తా కూర్చుందని ప్రశ్నించారు. సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి ఎక్కడకి వెళ్లారు అంటూ, ప్రశ్నించారు. మా పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం అంటున్నారని, చేస్తే చేసుకోండని, కానీ అంతర్వేది ఘటనలో సిబిఐ విచారణకు ఇచ్చి ఇన్ని రోజులు అయినా, కేంద్రం ఎందుకు ముందుకు రావటం లేదో చెప్పాలని వెల్లంపల్లి అన్నారు. తిరుపతిలో గెలుపు మాదే అని, రెండో స్థానం కోసం మిగత పార్టీలు కొట్టుకోవాలని అన్నారు. నోటాతో పోటీ పడే పార్టీలు అంటూ బీజేపీని తీసి పడేసారు. మరి బీజేపీ నేతలు స్పందిస్తారో, లేదా వదిలేస్తారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమైన స్థానిక సంస్థల ఎన్నికల పై, నేడు హైకోర్టులో కీలక తీర్పు వచ్చే అవకాసం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే విధంగా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిర్ణయం పై, యధావిధిగానే రాష్ట్ర ప్రభుత్వం ఎదురు తిరిగింది. ఇప్పుడే ఎన్నికలు జరపలేం అంటూ, హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అప్పటికే హైకోర్టుకు సెలవలు కావటంతో, ఈ కేసుని వెకేషన్ బెంచ్ ముందు, సింగల్ జడ్జి విచారణ జరిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తీసుకున్న నిర్ణయం పై, బ్రేక్ వేసారు. ఎన్నికల షెడ్యుల్ ని సస్పెండ్ చేసారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం పై అపీల్ కు వెళ్ళింది. సింగల్ జడ్జి నిర్ణయం పై, డివిజన్ బెంచ్ లో అపీల్ చేసారు. అయితే ఈ పిటీషన్ ని విచారణకు తీసుకున్న డివిజన్ బెంచ్, ఇప్పటికిప్పుడు ఈ కేసు పై విచారణ ఎందుకు, సెలవులు తరువాత ఈ కేసుని రెగ్యులర్ బెంచ్ వాదిస్తే మీకు అభ్యంతరం ఏమిటి అని కోర్టు ఎన్నికల కమీషనర్ ని ప్రశ్నించింది. అయితే 23న షెడ్యుల్ మొదలు అవుతుందని, 18కి వాయిదా వేస్తే, ఒక వేళ కోర్టు అనుకూల నిర్ణయం ఇస్తే, తమకు ఎన్నికల సంనద్ధతకు తక్కవ సమయం ఉంటుందని తెలిపారు.

hc 18012021 2

అందుకే ఇప్పుడే విచారణ చేయమని కోరారు. ఓటర్ల జాబితాలో గందరగోళం ఉంటుందని, ఎన్నికల కమీషనర్ కోర్టుకు తెలిపారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మేరకే, తాము ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ చేపట్టామని, హైకోర్టుకు తెలిపారు. అయితే దీని పై స్పందించిన ప్రభుత్వ తరుపు నయ్యవాది, ఈ పిటీషన్ ఇప్పటికిప్పుడు విచారణ చేయటం అవసరం లేదని, ఎన్నికల ఓటర్ల జాబితా ఆ సమయానికి సిద్ధం అయిపోతుందని, ఈ పిటీషన్ ని 18కి వాయిదా వేయమని కోరటంతో, డివిజన్ బెంచ్ కూడా ఈ వాదనతో ఏకీభవించి, ఈ పిటీషన్ ని,18కి వాయిదా వేసింది. ఈ పిటీషన్ పై ఈ రోజు వాదనలు జరగనున్నాయి. రాష్ట్ర హైకోర్టు, ఈ పిటీషన్ పై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపవద్దని, మరో పక్క ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపాలని, ఈ నిర్ణయం గత మూడు నాలుగు నెలల నుంచి సాగుతుంది. అయితే ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు జరపటం లేదో అర్ధం కావటం లేదు. ఎందుకు ఎన్నికలు అంటే వెనకాడుతుందో అర్ధం కావటం లేదు.

Advertisements

Latest Articles

Most Read