జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, 2012 నుంచి సాగుతూ ఉన్న విషయం తెలిసిందే. తండ్రి అధికారంలో ఉండగా, జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కూడబెట్టారు అంటూ, సిబిఐ 12 కేసులు, ఈడీ 5 కేసులు పెట్టింది. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ఈ కేసులు విషయంలో 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. తరువాత కండీషనల్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తరువాత సియం అయిన విషయం తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డి కేసులు, 2012 నుంచి ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. ఎక్కడా ఇంకా ట్రైల్స్ కు రాలేదు. సిబిఐ, ఈడీ కూడా ఈ కేసులు విచారణ పై తగు చర్యలు తీసుకోవటం లేదు. కేసులు పెట్టి పదేళ్ళు అవుతున్నా, ఇంకా ఈ కేసులు ట్రైల్స్ కు ఎందుకు రాలేదో ఎవరికీ అర్ధం కాదు. వివిధ రకాల పిటీషన్లు వేసి, కేసుని సాగదీస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ కేసులు విషయం తేల్చటానికి వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు రంగంలోకి దిగారు. దాదపుగా పది నెలలు క్రితమే, రఘురామకృష్ణం రాజు, జగన్ మోహన్ రెడ్డికి చెందిన సిబిఐ, ఈడీ కేసుల విచారణ జాప్యం పైన, తగిన ఆదేశాలు ఇవ్వాలి అంటూ, తెలంగాణా హైకోర్టు ముందు పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ దాఖలు చేసి కూడా, దాపుగా పది నెలలు పైన అవుతుంది.

tg 08032022 2

అయితే అనూహ్యంగా ఈ పిటీషన్ మాత్రం విచారణకు రావటం లేదు. ఎందుకు విచారణకు రావటం లేదో అర్ధం కావటం లేదని పలు సందర్భాల్లో రఘురామరాజు వ్యాఖ్యానించారు కూడా. ఇప్పటికీ ఈ కేసు విచారణ లిస్టింగ్ కూడా అవ్వక పోవటంతో, రఘురామకృష్ణం రాజు తెలంగాణా హైకోర్టుని ఆశ్రయించారు. జగన్ మోహన్ రెడ్డికి చెందిన అక్రమ ఆస్తుల కేసు, ఎందుకు విచారణ రావటంలోదో చూసి, ఆ కేసు గురించి చూడాలని హైకోర్టుని అభ్యర్ధించారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ, రఘురామరాజు వేసిన పిటీషన్ కు నెంబర్ కేటాయించాలని, లిస్టింగ్ కు వచ్చేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని రిజిస్ట్రీ చెప్పగా, వాటిని హైకోర్టు తోసి పుచ్చింది. అభ్యంతరాలతోనే హైకోర్టు ఈ పిల్ కు అనుమతి ఇస్తూ, నంబర్ కేటాయించాలని కోరింది. ఒక్కసారి నెంబర్ వచ్చి విచారణకు రాగానే, విచారణ అర్హత నిర్ణయించి, దీని పైన తదుపరి విచారణ జరపనుంది హైకోర్టు. మొత్తం మీద, రఘురామరాజు మాత్రం, జగన్ ని వదిలే ప్రసక్తే లేదని ఆయన వైఖరిని చూస్తే అర్ధం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు తరుచూ వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పై గతంలో అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. చివరకు డీజీపీ కూడా హైకోర్టు మెట్లు ఎక్కి, హైకోర్టు ఆగ్రహానికి గురి కావలసిన పరిస్థితి. మీకు అసలు సెక్షన్లు తెలుసా అంటూ, హైకోర్టు సెక్షన్లు కూడా చదవమంది అంటే, ఏపిలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాక్ష్యాత్తు డీజీపీ చేతే హైకోర్టు చట్టాలు చదివించింది. అయినా మార్పు లేదు. అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్ట్ లు, అక్రమ కేసులు, ఇలా నిరంతరం పోలీసులు తీరు పైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. అనేక మంది హైకోర్ట్ లను ఆశ్రయించారు. ఆయా కేసుల్లో హైకోర్టు తీర్పులు ఇస్తూ వచ్చింది. అయితే గత కరోనా టైంలో, టీవీ5 చైర్మెన్ బీఆర్ నాయుడు, అలాగే టీవీ5 యాంకర్ మూర్తి పైన ఏపి సిఐడి పోలీసులు కేసులు పెట్టి వేధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో, విచారణ పేరుతో వారి ఇరువురిని సిఐడి వేధించిన తీరుతో, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆలోచనలో పడ్డారు. పై స్థాయిలో ఉన్న మా మీదే ఇలాంటి వేధింపులు ఉంటే, కింద స్థాయిలో ఉండే ప్రజలు, హక్కుల కోసం పోరాడే వారి పరిస్థితి, వారు పోలీసులు నుంచి ఎదుర్కుంటున్న వేధింపుల పై దృష్టి పెట్టారు.

hc 08032022 2

వీటికి ఫుల్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో, ఏపి పోలీసులు పై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. చాలా కేసుల్లో అసలు ఎఫ్ఐఆర్ ఏంటో చెప్పకుండా, అరెస్ట్ లు చేస్తున్నారని, కింద స్థాయి మెజిస్ట్రేట్లు కూడా ఇష్టం వచ్చినట్టు రిమాండ్లు వేస్తున్నారని, వీటి పై తగు ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారు. దీని పైన గత ఏడాది కాలంగా వాదనలు జరిగాయి. న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అయితే 167 సీఆర్‍పీసీ ఉల్లంఘనలు జరుగుతున్న మాట వాస్తవమే అని కోర్టు కూడా అంగీకరించింది. ఇష్టం వచ్చినట్టు రిమాండ్ వేయటం అనేది హక్కులను భంగపర్చడమే అని, అసలు ఎఫ్ఐఆర్ లో ఏమి ఉందో చెప్పక పోవటం అనేది చట్ట ఉల్లంఘన అని కోర్టు పేర్కొంది. ఇష్టం వచ్చినట్టు రిమాండ్ లు విధించటం కుదరదు అని పేర్కొంటూ, కింద కోర్టులో ఉన్న జడ్జీలు కూడా విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలని, ఎలా పడితే అల రిమాండ్ విధిస్తే, మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు కుడా ఉంటాయని, అలాగే ఎఫ్ఐఆర్ ని కూడా 24 గంటల్లో రెడీ చేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం జరిగింది. గత రెండేళ్లుగా కరోనా ఉండటంతో, గవర్నర్ ప్రసంగం ఆన్లైన్ లోనే జరిగింది. మొదటి సారి గవర్నర్ అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వినిపించారు. అసెంబ్లీ, శాసనమండలి సభ్యులు కలిసి ఈ ప్రసంగం విన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే నిరసన తెలిపింది. గవర్నర్ గో బ్యాక్ నినాదాలు చేసింది. రాష్ట్రంలో అనేక రాజ్యాంగ సంస్థల విధ్వంసం జరుగుతున్నా, గవర్నర్ వాటిని కాపాడే ప్రయత్నం జరగలేదని, టిడిపి గవర్నర్ ప్రసంగానికి అడ్డు పడి, నిరసన తెలిపింది. ఇక ఇక్కడ మరో అంశం, గవర్నర్ ప్రసంగం. సహజంగా గవర్నర్ ప్రసంగం అంటే, ప్రభుత్వం చేసే కార్యకరమాలు అన్నీ గొప్పగా గవర్నర్ చేత చెప్పిస్తారు. ముందుగా గవర్నర్ ప్రసంగాన్ని క్యాబినెట్ లో ఆమోదిస్తారు. అయితే గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే, అందరికీ ఆశక్తి మూడు రాజధానుల గురించి ఏమి చెప్తారా అని. గత రెండేళ్లుగా గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల విషయం చెప్పించారు. అయితే ఇప్పుడు అమరావతి విషయంలో రైతులు కోర్టుకు వెళ్ళటం, సుదీర్ఘ వాదనల అనంతరం, కోర్టు ఈ విషయంలో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పు పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

governor 07032022 2

కొంత మంది కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మాట్లాడారు. చంద్రబాబు మ్యానేజ్ చేస్తున్నాడు అంటూ ఆపాదించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసెంబ్లీ హక్కులను న్యాయస్థానం హరిస్తుందని, దీని పైన అసెంబ్లీలో చర్చ పెట్టాలి అంటూ, ధర్మాన లేఖ రాసారు. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో ఏదో ప్లాన్ చేస్తుందని, అసెంబ్లీ వేదికగా న్యాయ వ్యవస్థ పైన దా-డి చేస్తారని అందరూ భావించారు. దీనికి టీజర్ గా గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల విషయం ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా మూడు రాజధానుల ప్రస్తావన తేలేదు. వికేంద్రీకరణ పాలన అంటూ కొత్త జిల్లాల గురించి చెప్పారు కానీ, ఎక్కడా మూడు రాజధానుల ప్రస్తావన చేయలేదు. దీంతో ప్రభుత్వం బయట మీడియా ముందు చేస్తున్న హడావిడికి, లోపల చేస్తున్న దానికి పొంతన లేదు అనేది అర్ధం అవుతుంది. కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏమి చేసే సాహసం చేయలేదు, బయటకు మాత్రం రాజకీయంగా ఉపయోగపడటానికి మూడు రాజధానులు అంటూ బిల్డ్ అప్ మాత్రం ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ గా పని చేసిన కొణిజేటి రోశయ్య, డిసెంబర్ నెలలో చనిపోయిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పైన, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరు పైన గతంలోనే విమర్శలు వచ్చాయి. పెళ్లిళ్లకు, పేరంటాలకు బయటకు వచ్చే జగన్, రోశయ్య పార్ధివదేహానికి నివాళులు అర్పించకపోవటం పై, పెద్ద చర్చే జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ అంశం తెర పైకి వచ్చింది. నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. సహజంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజు గవర్నర్ స్పీచ్ ఉంటుంది. రెండో రోజు సంతాప తీర్మానాలు ఉంటాయి. ఈ రోజు అలాగే మేకపాటి గౌతం రెడ్డి మృతి పైన సంతాప తీర్మానం ప్రవేశ పెట్టి, గౌతం రెడ్డికి నివాళులు అర్పించారు. అయితే సహజంగా సంతాప తీర్మానం తరువాత, సభ వాయిదా వేయటమో, లేక ఆ రోజుకి సభ ముగించటమో జరుగుతుంది. ఇక్కడ మాత్రం, వాయిదా వేసి, రేపు కూడా అసెంబ్లీకి సెలవు తీసుకున్నారు. గౌతం రెడ్డి మృతికి సంతాపంగా రేపు సెలవు అని చెప్పారు. టిడిపి నేతలు మాత్రం, బొత్సా కుమారుడి పెళ్లి రిసెప్షన్ ఉందని, అందుకే సెలవు తీసుకున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు రోశయ్య సంతాపం విషయం కూడా బయటకు వచ్చింది.

rosaiah 08032022 2

ఈ రోజు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ గా పని చేసిన రోశయ్యకు ఎందుకు సంతాపం ప్రకటించ లేదు అంటూ, విమర్శలు వస్తున్నాయి. అయ్యన్నపాత్రుడు కూడా ఇదే విషయం పై ప్రశ్నించారు. రోశయ్య ఒక మాజీ ముఖ్యమంత్రి అని, ఆయన అంటే, జగన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా, కనీస సాంప్రదాయాలు పాటించాలి కదా అని, విమర్శలు వస్తున్నాయి. మేకపాటి ఒక మంత్రిగా చేసారని, ఆయనకు ఘనమైన నివాళులు అర్పించారని, మరి రోశయ్య ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అనేక సార్లు మంత్రిగా, ఒక రాష్ట్ర గవర్నర్ గా పని చేసిన విషయాన్ని గుర్తుకు తెస్తున్నారు. దీనికి తోడూ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, రోశయ్య ఎంతో ఆత్మీయుడుగా, ఒక అన్నలా ఉండేవారని, కనీసం అది కూడా జగన్ కు ఎందుకు గుర్తుకు లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. రోశయ్య అంటే జగన్ కు ముందు నుంచి కోపం అనే, ఇప్పుడు అదే చూపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరి అసెంబ్లీలో రాబోయే రోజుల్లో, రోశయ్య మృతి పట్ల సంతాపం ప్రకటిస్తారో లేదో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read