దశలవారీగా మద్యనిషేధం హామీతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ హామీనీ నిషేధించారు. దశలవారీగా మద్యం అమ్మకాలు పెంచే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మద్యం ధరలతో షాక్ కొట్టిస్తానంటూ సొంత బ్రాండ్లు అమ్మకానికి పెట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు జగన్ సర్కార్ స్పెషల్ గిఫ్ట్ ప్రకటించింది జగన్‌సర్కారు. నేడు, రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులలో అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. బార్లకు అర్ధరాత్రి ఒంటిగంట వరకూ పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మద్యనిషేధం హామీ ఏమైంది అని అడగడానికి లేకుండా ముందు సర్కారు లిక్కర్ షాపులు, ఆ తరువాత వాకిన్ స్టోర్లు, ఇప్పుడు అదనపు సమయం అమ్మకాలతో మద్యమే తమకి ముద్దు అని జగన్ సర్కారు చెప్పకనే చెప్పింది.
news
జగన్ మూడు ముక్కలాటకి, మూడు చోట్లా బ్రేక్ వేసిన చంద్రబాబు.. గిలగిలా కొట్టుకుంటున్న వైసీపీ
అమరావతి రాజధానిగా వుంటుందని, తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని ఎన్నికల ముందు బహిరంగ సభల్లో మైక్ కొట్టీ మరీ చెప్పిన వైఎస్ జగన్ రెడ్డి, సీఎం అయిన వెంటనే మాట మార్చారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయిన అమరావతి ప్రజారాజధాని కోసం పెట్టే ప్రతీ రూపం వందింతలు ఆదాయం తెచ్చి పెడుతుంది. అయితే ఉద్దేశపూర్వకంగా ఒక ప్రాంతం, ఒక కులంపై కక్షతో విఫలమైన దక్షిణాఫ్రికా మోడల్ మూడు రాజధానుల ప్రతిపాదన ప్రకటించారు. శాసన రాజధాని అమరావతిగా ఉంచుతున్నామని, పరిపాలనా రాజధాని విశాఖ చేశామని, న్యాయరాజధానిగా కర్నూలు అని ప్రకటించారు. తమ మూడుముక్కలాటకి అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యమంటూ మూడు ప్రాంతాల్లో పెయిడ్ ఉద్యమాలు, గర్జనలు ఆరంభించారు. మూడు ప్రాంతాల్లోనా చంద్రబాబుని అడుగుపెట్టనివ్వకుండా పోలీసులు, పెయిడ్ మేధావులను ప్రయోగించారు. ఇది విఫలం అయ్యింది. ఎంత స్పాన్సర్ చేస్తున్నా మూడు రాజధానుల ఉద్యమం ఊపందుకోలేదు. రోడ్లపై మూడు గుంతలు కప్పలేని పాలకుడు జగన్ రెడ్డి మూడు రాజధానులు ఎలా కడతాడంటూ చదువుకోని జనంలో సైతం క్లారిటీ వచ్చేసింది.
అదను చూసిన చంద్రబాబు తన రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. ముందుగా ఉత్తరాంధ్ర టూరులో ఒక రాష్ట్రం-ఒక రాజధాని అంటూ నినదించి లక్షలాది జనంతో జై కొట్టించారు. దీనికంటే ముందు న్యాయరాజధాని పేరుతో అడ్డుకోవాలని చూసిన కిరాయి గర్జకులను కూడా గట్టి హెచ్చరిక చేశారు. రాయలసీమలోనూ అమరావతి రాజధాని జన అంగీకారం నినాదాలతో సాధించారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పిలుపునివ్వక్కర్లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ప్రజారాజధానే మా ఆకాంక్ష అని చాటారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ అంతర్గత చర్చల్లో మూడు రాజధానులతో మాకు మూడుపోయిందని, చంద్రబాబు ఒకే రాజధాని నినాదం కలకాలం నిలిచేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలకు సైకిల్ పై మోజు పెరిగింది... ధర్మాన సంచలన వ్యాఖ్యలు...
రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, విశాఖ రాజధానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇటీవల కాలంలో, చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన సక్సెస్ అయిన తరువాత, వైసీపీ నేతల, మాట తీరు మారిపోయింది. ధర్మాన ఈ రోజు చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. ఈ రోజు మాట్లాడిన ధర్మాన, విశాఖ రాజధాని విషయం పై స్పందిస్తూ, ఎక్కడ చూసినా చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో, ప్రజలు మొత్తం అమరావతి రాజధాని అంటున్నారని, అదే కనుక జరిగితే, విశాఖని ఒక చిన్న రాష్ట్రంగా ప్రకటించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖని ఒక రాష్ట్రంగా, ఉత్తరాంధ్ర జిల్లాలు కలుపుకుని చేసుకుంటాం అంటూ ధర్మాన చేసిన వ్యాఖ్యలు షాక్ అయ్యింది. ఇక్కడ ప్రజలకు సైకిల్ పైన మోజు ఉన్నట్టు ఉందని, అటు వైపు మళ్ళీ మళ్ళితే, మీరు ఇబ్బంది పడతారు అంటూ, ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేసారు.
చంద్రబాబుని వృద్ధుడు అయితే.. జగన్ ముసలి మూర్ఖుడు...
నర్సీపట్నం సభలో చంద్రబాబు 73 ఏళ్ల వృద్ధుడంటూ వెకిలిగా ప్రసంగించిన సీఎం జగన్ రెడ్డికి ట్వీటు ద్వారా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు రిప్లయి ఇచ్చారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ముసుగు తన్ని తొంగునే 50 ఏళ్ల ముసలి మూర్ఖుడు జగన్ రెడ్డి పరదాల మధ్య పగటికలల నుంచి బయటికి రావాలన్నారు. జగన్ రెడ్డికి తెలిసినవి దోచుకోవడం,దాచుకోవడం, ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడం వంటి మూడే విద్యలు వచ్చని ఎద్దేవ చేశారు. బారికేడ్లు అడ్డంపెట్టినా జనాలు సభల నుంచి పారిపోతుంటే, కందకాలు తవ్విన దుర్మార్గ పాలకుడు జగన్ రెడ్డి అని, చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. సీఎం సీటు కోసం తండ్రి శవం పక్కనే సంతకాలు సేకరించాడని, ఓట్లు కోసం బాబాయ్‌పై గొడ్డలివేటు వేసి గుండెపోటని ప్రచారం చేసిన శవ రాజకీయాల బ్రాండ్ అంబాసిడర్ జగన్ అంటూ ట్వీట్ లో ఘాటుగా స్పందించారు. చంద్రబాబువి ఫోటో షూట్లు అంటూ విమర్శించిన జగన్ రెడ్డి ఓదార్పు, పాదయాత్రలకి చేసింది ప్రీ వెడ్డింగ్ షూట్లా? అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం మూడుతరాల అధికార, ధనదాహానికి నెత్తుటి సాక్ష్యాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయన్నారు.
రాజకీయం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమా? డెవలప్మెంట్ అంటే డ్రగ్స్, జె బ్రాండ్స్ అమ్మడమా? అని ప్రశ్నించారు. ప్రజా సేవ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదల్ని దోచుకోవడమా ఏ1 రెడ్డీ అంటూ నిలదీశారు. పాలనని ఫ్యాక్షన్ చేసి, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన జగన్ రెడ్డి అభివృద్ధిలో రాష్ట్రాన్ని అథఃపాతాళంలోకి నెట్టాడంటూ దుయ్యబట్టారు. బాబాయ్ హత్య నుంచి బయటపడేందుకు ప్రత్యేకహోదాని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించాలని రైల్వేజోన్‌ని, 38 క్రిమినల్ కేసుల్నించి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన నీచుడు జగన్ కి చంద్రబాబు గారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. లండన్ మందులు డోస్ పెరిగిందో! డోస్ అందలేదో కానీ..పెళ్లిళ్లు, పిల్లలు అంటూ జగన్ రెడ్డి వాగుతున్నాడన్నారు. కోడి కత్తి నుంచి నేటివరకూ జగన్ మాయమాటలు, నాటకాలు జనానికి తెలిసిపోయాయని, పాపాలు పండి జైలుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని, 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలని లోకేష్ సూచించారు.