తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేటి నుంచి చంద్రబాబు మూడు రోజులు పాటు కుప్పంలో పర్యటన చేయనున్నారు. సభలు, రోడ్‍షోలకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‍కి నోటీసులు జారీ చేసి చంద్రబాబు సభకు పర్మిషన్ లేదని చెప్పారు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం, సభ నిర్వహించి తీరుతామని అంటున్నారు. సభ నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయంటున్న పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, కుప్పం పర్యటన కోసం తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం మొత్తం పసుపుమయంగా మారింది. తమ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ భారీగా స్వాగత తోరణాలు కట్టారు టిడిపి శ్రేణులు. ఈ రోజు షడ్యుల్ ప్రకారం కుప్పంలోని శివకురుంబూరులో "ఇదేం ఖర్మ-రాష్ట్రానికి" కార్యక్రమంలో చంద్రబాబు పాల్గుని, కెనుమాకులపల్లిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గుంటారు.

రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స్వ‌యంగా చెప్పాన‌ని, ఆయ‌న త‌న మాట విన‌డంలేద‌ని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్ల‌డించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సంద‌ర్భంగా మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తప్పుకుంటాని  సిఎంకు స్వయంగా చెప్పాన‌ని, త‌న‌కు రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందని అనిపిస్తుందని వివ‌రించాన‌న్నారు. దీనికి ముఖ్య‌మంత్రి ఒప్పుకోలేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని, ఆ త‌రువాత ఆలోచిద్దామ‌న్నార‌ని మంత్రి తెలిపారు. వాస్త‌వంగా ఈ సారి ఎన్నిక‌ల్లో త‌న కొడుకుకి సీటు ఇవ్వాల‌ని, తాను పోటీ నుంచి త‌ప్పుకుంటాన‌ని ధ‌ర్మాన ప్ర‌తిపాదించార‌ని..అయితే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు త‌న‌యుడు ప‌నితీరుపై ఐప్యాక్ నివేదిక‌లు చాలా ఘోరంగా ఉన్నాయ‌ని అందుకే ప్ర‌సాద‌రావునే మ‌ళ్లీ పోటీ చేయాల‌ని సీఎం చెప్పార‌ని, పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. అయితే ఈ అస‌లు విష‌యం వెల్ల‌డించ‌కుండా నా తరువాత  పనిచేసిన వారందరూ కూడా  ఎద‌గాల‌ని, తరువాత తరానికి నాయకులను తయారు చేసి సమాజానికి అందించేందుకు చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తానంటూ క‌వ‌రింగ్ ఇచ్చారు మంత్రి అని అంటున్నారు.

డాల‌స్లో న్యూ ఇయ‌ర్ ఈవెంట్ ఆర్గ‌నైజ్ చేసింది థ‌ర్డ్ పార్టీ. వివిధ రాజ‌కీయ పార్టీల‌ను అభిమానించే వాళ్లూ వ‌చ్చారు. మందు, విందూ ఆరంభం అయ్యాయి. చిరు, బాల‌య్య ఫ్లెక్సీలు ప్ర‌ద‌ర్శించారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇది వివాదంగా మార‌కముందే వారిలో వారే స‌ర్దుకున్నారు. ఇక్క‌డే వైసీపీ త‌న న‌క్క‌బుద్ధి ప్ర‌ద‌ర్శించింది. టిడిపి,వైసీపీ, జ‌న‌సేన అభిమానులు వ‌చ్చిన పార్టీలో సినిమా పోస్ట‌ర్లు వివాదం రేపిన సంగ‌తిని ప‌ట్టించుకోకుండా ఏకంగా వైసీపీ పాట‌లు వేయ‌డం ఆరంభించారు. రాయ‌ల‌సీమ ముద్దుబిడ్డ జ‌గ‌న‌న్న అంటూ పాట‌లు హోరెత్తించారు. ఇవి ఎందుకు ప్లే చేస్తున్నార‌ని టిడిపి అభిమానులు అడ్డుకున్నారు. వీరిపై వైసీపీ ఫ్యాన్స్ దాడి చేశారు. వీరు ప్ర‌తిదాడికి పాల్ప‌డ్డారు. ఈ ఈవెంట్ నిర్వ‌హించిన సంస్థ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసీ చేకూరిని అరెస్ట్ చేశారు. జ‌రిగింది ఇది అయితే వైసీపీ నీలి మీడియా, వైసీపీ కూలి మీడియా, పేటీఎం మేధావులు కులం రంగు పులిమారు. క‌మ్మ కాపు మ‌ధ్య గొడ‌వ అని బులుగు మీడియా9, బాల‌య్య‌, ప‌వ‌న్ ఫ్యాన్స్ కొట్టుకున్నార‌ని బులుగు మీడియా ఎన్, టిడిపి-జ‌న‌సేన మ‌ధ్య గ‌లాటా అంటూ సాక్షి క‌థ‌నాలు కుమ్మేసింది. గొడ‌వకి బాట‌లు వేసింది వైసీపీ పాట‌లు. కానీ వైసీపీ మీడియా రాత‌లు, కూత‌లు కులాల కుమ్ములాట అనీ, టిడిపి-జ‌న‌సేన మ‌ధ్య కొట్లాట అంటూ త‌ప్పుదారి ప‌ట్టించే క‌థ‌నాలు వండి వార్చారు.

నాలుగేళ్ల పాలనలో ఏమి చేశామని మళ్లీ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతామని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి జ‌గ‌న్ స‌ర్కారుపై మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చి ఐదు ఏళ్ళు పూర్తి కావస్తోంద‌ని, కానీ ఇంకా సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేద‌న్నారు. సాంకేతిక కారణాలా లేక.. బిల్లులు చెల్లింపులు ఆలస్యమవుతుందని కట్టడానికి ఎవ‌రూ ముందుకు రావడం లేదా.. తెలియడం లేదన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు, నాయకులు గుర్తించుకోవాల‌న్నారు. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంద‌న్నారు. నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్నామ‌ని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాగుల వద్ద హై లెవెల్ బ్రిడ్జిలు కట్టబోతున్నామ‌న్నారు. రాష్ట్రం వేయ‌లేని రోడ్డు కేంద్రం వేస్తుంద‌ని ఆనం చెప్ప‌డం పార్టీ మార్పు సంకేతాలేనంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read