వైసీపీకి చేతిలో 151+4 అధికారం ఉంది కానీ, మనశ్శాంతి లేదు. శాసనసభ్యులు సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్షనేత చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పోరాడుతున్న తీరుతో వైసీపీ సర్కారుకి ముచ్చెమటలు పడుతున్నాయి. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ పరుగులు తీయిస్తున్నాడు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దీంతో ప్రతిపక్షాలు ప్రజాఉద్యమాలతో ప్రభుత్వంతో ఢీకొడుతున్నాయి. అటు బాబు, ఇటు పవన్ లకి పెరుగుతున్న జనాదరణ తట్టుకోలేక జీవో నెంబర్ 1 పేరుతో బ్రిటిష్ కాలం నాటి చట్టం అమలుకి బరితెగించింది జగన్ సర్కారు. అయితే ఇది బూమరాంగ్ అయ్యింది. జీవోతో జగన్ వీపు గోక్కోమనండి అని ధిక్కరిస్తూ బాబు కుప్పంలో కుమ్మేసారు. జనసేన అధినేత యువశక్తి పేరుతో రణస్థలంలో ఈ నెల 12న వైసీపీపై రణభేరీ మోగిస్తున్నారు. మరోవైపు మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీలా చెలరేగిపోతున్న బాలయ్య వీరసింహారెడ్డిలో పేలిన రాజకీయ డైలాగులు, వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంకోవైపు నుంచి వాల్తేరు వీరయ్య పంచ్ కూడా వైసీపీకే తాకనుంది. నలువైపులా వీరిని అడ్డుకుంటే వైసీపీకి భారీ డ్యామేజీ. అడ్డుకోకపోతే జగన్ మనస్తత్వం శాంతించదు. సభలకు సెక్యూరిటీ సమస్య అంటూ అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయడం, ఇబ్బంది పెట్టడం చేస్తుంటే ప్రజావ్యతిరేకతకి తోడు నలుగురు హీరోలు(పొలిటికల్ హీరో చంద్రబాబు) ఫ్యాన్స్ తో ఫ్యాన్ వార్ షురూ అయినట్టే.
news
బాలయ్య - చిరు సినిమాలతో వైసీపీ బ్యాచ్ కేస్ట్ పాలిట్రిక్స్
ఏపీలో ఎప్పుడూ కమ్మ-కాపు వైరం పెట్టడం రాజకీయంగా మంచి ఎత్తుగడగా భావిస్తుంటారు. వాస్తవంగా ఆ రెండు క్యాస్ట్‌ల మధ్య ఉన్న విభేదాల కంటే సృష్టించినవే ఎక్కువ. తాజాగా మరోసారి కమ్మ-కాపు కేస్ట్ పాలిట్రిక్స్ కి వైసీపీ బ్యాచ్ తెరలేపిందని రఘురామ రాజు ఆరోపించారు. సంక్రాంతికి బాలయ్య వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ అవుతున్నాయి. ఇదే అదనుగా భావించిన వైసీపీ ఫేక్ అకౌంట్లతో ఇరు హీరోల పేరుతో వివాదాలు రేపేందుకు విశ్వప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపణ. బాలయ్య, చిరు సినిమాలు రెండింటికీ ఒకటే సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కులాలైనా, హీరోల ఫ్యాన్స్ అయినా, నిర్మాత అయినా ఇప్పుడు కోరుకునేది సినిమా హిట్ కావడమే. ఏ ట్రైలర్ బాగుంది? ఏ సినిమా హిట్ అవ్వొచ్చంటూ క్యాస్ట్ పేర్లతో ఓపెన్ చేసిన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా విషం చిమ్ముతున్నారు. ఇవి వర్కవుట్ అయ్యే అవకాశం లేకపోవడంతో కాపుల విద్వేషం చిమ్మేలా ఒకవర్గం, కమ్మవాళ్లపై అక్కసు వెళ్లగక్కేలా మరో వర్గంగా వైసీపీ వాళ్లే ఫేక్ ఖాతాలతో వందలకొద్దీ పోస్టులు సృష్టిస్తున్నారు. చిరు, బాలయ్య ఈ వైసీపీ మార్క్ క్యాస్ట్ పాలిట్రిక్స్ పట్టించుకోరు. ఇరు హీరోల ఫ్యాన్స్, కులాలు, వారు మద్దతుగా నిలిచే పార్టీల అభిమానులు మాత్రం చాలా జాగ్రత్తగా సోషల్‌మీడియా పోస్టుల పట్ల వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
రాం గోపాల్ వర్మ ఆత్రం ఎందుకు ? వైసీపీ అధికార ప్రతినిధిగా మారాడా ?
రాంగోపాల్ వర్మ మానసిక పరిస్థితి బాగాలేదని ఈ మధ్య ఓ హీరోయిన్ కాళ్లు నాకుతున్నప్పుడే అర్థమైంది. ఎవరైనా తనని కలవాల్సిందేనని ముంబైలో మకాం వేసిన ఈ మాఫియా సినిమాల మదపిచ్చోడు ఆర్థిక దుస్థితి అధ్వాన్నంగా ఉందని తాడేపల్లి గడప తొక్కినప్పుడే రూమర్లు వచ్చాయి. పేమెంటుకు ట్వీట్లు పెట్టడం చూశాక వైసీపీ పెద్ద పేటీఎం కార్మికుడిగా మారాల్సిన ఖర్మ వర్మకి పట్టిందని స్పష్టమైంది. కందుకూరు, గుంటూరు విషాదఘటనలు, జీవో 1పై పోర్న్ భాష ట్వీట్లు వేసినప్పుడే ఇలా దిగజారిపోయాడేంటి అని అనుకున్నారంతా. పవన్-చంద్రబాబు భేటీని కమ్మ కాపులకి ముడిపెడుతూ వర్మ చేసిన ట్వీటు ఆయన అథఃపాతాళానికి దిగజారిపోయాడని తేల్చేసింది. మానసికంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలతో వైసీపీకి వర్మ అమ్ముడుపోయారనే ఆరోపణలకి ఊతమిచ్చేలా నేలబారు వైసీపీ భాషలో ట్వీట్లు చూస్తేనే అర్థమైపోతోంది. వైసీపీ ట్విట్టర్ అధికార ప్రతినిధిగా వర్మ మారాడని సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
చాలా రోజుల తరువాత లోకేష్ తో గంటా భేటీ... రాజకీయ వర్గాల్లో చర్చ...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో గంటా శ్రీనివాసరావు దాదాపు గంట పాటు మంతనాలు జరిపారు. వీరి భేటీపై అధికారికంగా ఏ ప్రకటనా ఇంకా విడుదల కాలేదు. అయితే పార్టీలు మారడం, పదవులు పొందడం ఒక నిరంతర ప్రక్రియలా చేపట్టే గంటా కొన్నాళ్లుగా టిడిపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అధికార వైసీపీలో చేరడానికి విశ్వప్రయత్నాలు చేశారని కథనాలు స్పష్టం చేస్తున్నాయి. లేటెస్ట్గా డిసెంబర్ మొదటివారంలో కూడా వైసీపీలోకి జంప్ కొడతారని వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ కాపు హక్కుల పరిరక్షణ అవతారం ఎత్తారు గంటా. మామూలు రాజకీయ నాయకుల్లా కాకుండా నిరంతరం పార్టీలు, ప్రజలనాడిపై సర్వేలు చేయించే గంటా శ్రీనివాసరావుకి వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని తేలిందని, దీంతో ఊగిసలాట ధోరణికి కట్టిపెట్టి పార్టీలో కొనసాగేందుకు మొగ్గు చూపారని టాక్ వినిపిస్తోంది. జనసేన-టిడిపి జత కట్టడం గ్యారంటీ అని తేలిపోవడంతో మౌనం వీడిన గంట మోగిందని తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు ప్యాకేజీ పాలిటిక్స్ ని టిడిపి ఎంటర్ టైయిన్ చేస్తుందా? కష్టకాలంలో తెరమరుగై కలిసొచ్చే కాలంలో తిరిగొచ్చిన గంటాకి పూర్వ ప్రాధాన్యం ఇస్తుందా త్వరలో తేలనుంది. టీడీపీ అధిష్టానం గంటా ఎటువెళ్లినా పట్టించుకోదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లోకేష్ తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గంటకి పైగా గంటా ఏం చర్చించారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశాఖలో బాబు, లోకేష్ పర్యటనలకు వచ్చినప్పుడు పత్తా లేని గంటా కలుగులోంచి బయటకొచ్చింది ఎందుకో అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.