తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు, వైసీపీ నేతలకు గట్టిగానే తగిలాయి. మంత్రుల నుంచి, నేతల వరకు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల గురించి, చర్చ చేసిన విషయం తెలిసిందే. క-రో-నా రాకపోయి ఉండి ఉంటే, ఈ పాటికే ఆ అంశం ఒక కొలిక్కి వచ్చేది. అయితే ఈ ప్రక్రియ కొంచెం నెమ్మదించింది. అయితే గత వారం ప్రధాన మంత్రి కార్యాలయంలో, ఒక దేశం, ఒక ఎన్నికల జాబితా పై ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. దీంతో ఈ ప్రక్రియ జమిలీ ఎన్నికల కోసమే అని ప్రచారం జరుగుతుంది. జమిలీ ఎన్నికలు జరిగితే 2022 చివర్లో కానీ, 2023 మొదట్లో కానీ జరిగే అవకాశం ఉంది. 2022లో జరిగే ఎన్నికలు ఆపేసి, అలాగే 2024లో జరిగే రాష్ట్రాలు ఎన్నికలు ముందుగా పెట్టి, ఒకే దేశం, ఒకే ఎన్నిక జరపాలని, తద్వారా ఖర్చు ఆదా అవుతుందని, అభివృద్ధి పనులకు ఆటంకం కలగదు అని, కేంద్రం యోచన. ఈ చర్చ జరుగుతూ ఉండటంతో, చంద్రబాబు కూడా ఇదే విషయం తన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు, అప్రజాస్వామికంగా ఉన్నాయని, 2023లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాసం ఉంది కాబట్టి, తొందరగానే మనకు విముక్తి లభిస్తుంది అని, తన ప్రెస్ మీట్ లో చెప్పారు.
అయితే ఈ విషయం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చంద్రబాబు ప్రెస్ మీట్ అవ్వగానే బొత్సా ప్రెస్ మీట్ పెట్టి, జమిలీ ఎన్నికలు వచ్చే అవకశమే లేదు, ఆ వాతావరణమే లేదని, చంద్రబాబు వెంటనే కుర్చీ ఎక్కేయాలనే ఆతృతలో ఉన్నారని అన్నారు. ఇక మిగతా నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి, జమిలీ ఎన్నికలు అంటూ చంద్రబాబు చేసిన ప్రకటన పై అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇందులో ముఖ్యంగా చంద్రబాబు మాటలు కనుక బలంగా ప్రజల్లోకి వెళ్తే, తమకు నష్టం అనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, కేవలం అప్పు చేసి, చేస్తున్న సంక్షేమం మాత్రమే కొంత ఊరట, ఇప్పుడు ఎన్నికలు ముందే వచ్చేస్తే, అంతకు ముందు ఏడాది కాలం నుంచే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. ప్రజలకు చూపించటానికి, తాము చేసిన పని ఏమి ఉండదు అని వైసీపీ నేతల భావన. అంతే కాకుండా, టిడిపి నుంచి బయటకు వచ్చేద్దాం అనుకునే నేతలు ఎవరైనా ఉంటే వారు కూడా, ఆలోచనలో పడతారు. అందుకే చంద్రబాబు జమిలీ అనగానే, దాన్ని డైల్యూట్ చేసే పనిలో పడింది వైసీపీ. చంద్రబాబు చెప్పినా, జగన్ చెప్పినా, పైన ఉన్న ప్రధాని మోడీ ఆగే పని ఉండదు. ఆయన ఏమి అనుకుంటే, అది చేసి తీరుతారు. చూద్దాం ఏమి జరుగుతుందో.