బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంధం ఇంకా ఆఫిషయాల్ గా కలవకపోయినా, బయట మాత్రం మాంచి జోష్ లో ఉన్నారు... ఎంపీ గోకరాజు గంగరాజు సోదరుడు నర్సింహరాజు, ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రికార్డింగ్ డాన్సుల్లో మునిగి తేలారు... భీమవరం యూత్ క్లబ్ 27వ వసంత వేడుకల్లో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు జరిగాయి... ఈ నెల 24న అర్ధరాత్రి తర్వాత రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా నిర్వహించారు... అయితే ఇప్పటి వరకు ఈ విషయం బయటకు రాలేదు... లేటుగా వెలుగులోకి వచ్చింది.. ఐదు రోజుల ఆలస్యంగా ఈ డ్యాన్సుల బాగోతం బయటకు వచ్చింది...

recording 29122017 2

ఈ విషయం పై కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు.. భీమవరం యూత్ కల్చరల్ క్లబ్‌లో అశ్లీల నృత్యాల వీడియోలను కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ మీడియాకు విడుదల చేశారు. బీజేపీ ఎంపీ గోకరాజు సోదరుడు నరసింహరాజు తన డీఎన్‌ఆర్‌ కాలేజీలో మహిళలతో అసభ్య నృత్యాలు చేయించారన్నారు. ఉండి వైసీపీ కన్వీనర్ నరసింహరాజు కూడా ఇందులో ఉన్నారని పద్మశ్రీ తెలిపారు. ప్రభుత్వం ఈ విషయం పై విచారణ చేసి, తగు చర్యలు తీసుకోవలాని డిమాండ్ చేసారు. మహిళా కమీషనర్ నన్నపనేని రాజకుమారి ఈ విషయం పై స్పందించాలి అని అన్నారు..

recording 29122017 3

మరో పక్క, విషయం తెలుసుకున్న భీమవరం వాసులు, బీజేపీ, వైసీపీ నేతలు చేస్తున్న పనికి దుమ్మెత్తి పోస్తున్నారు. నిత్యం సాక్షిలో తెలుగుదేశం వాళ్ళు అలా చేసారు, ఇలా చేసారు అని మాట్లాడే వారు, ఇలా చెయ్యటం ఏంటి అని మండిపడుతున్నారు.. ఇలాంటి వాటి పై రోజా ఎందుకు నోరు ఎత్తదు అని అడుగుతున్నారు... మరో పక్క, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడే పార్టీ తమదేనని చెప్పుకునే గోకరాజు, గంగరాజు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగడం దారుణమన్నారు. సంస్కృతి, సంప్రదాయల గురించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చే బీజేపీనేతలు ఇలాంటి సంస్కృతిని ఎలా ప్రొత్సహిస్తారని భీమవరం వాసులు ప్రశ్నిస్తున్నారు.

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మల్సీ ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నికల సంఘం అధికారులు కేఈ ప్రభాకర్ ని ఎమ్మెల్సీగా ప్రకటించారు.అయితే ఈ తతంగం వెనుక చాలా స్టొరీ జరిగింది. అసలు మేము పోటీ చెయ్యట్లేదు అంటూ వైసీపీ జెండా పీకేసిన సంగతి తెలిసిందే... దీంతో అందరూ ఈ ఎన్నిక లైట్ తీసుకున్నారు... కాని, కేఈతో పాటు మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. ఇందుఅలో ఓ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. బీఎస్పీ అభ్యర్థి నామినేషన్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం తిరస్కరించింది.

jagan kurnool 29122017 2

అయితే ఇక్కడ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు ఎంపీటీసీల సంఘం నేత జయప్రకాశ్ రెడ్డి రంగలో ఉన్నారు.. దీంతో వైసీపీ రంగంలోకి దిగింది... మీరు పోటీలో ఉండాలి అని, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి జర్క్ ఇవ్వాలి అని, ఆర్ధిక సహాయం కూడా చేస్తాము అని కోరింది.. దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి, ఒకటి, ఓడిపోయినా అది వైసీపీ ఖాతాలోకి రాదు... రెండు, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చేత, డబ్బులు ఖర్చు చేపించవచ్చు... ఈ విధంగా ప్రత్యర్ధి పై కక్ష సాధించ వచ్చు అని ప్లాన్ వేసింది... విషయం తెలుసుకున్న తెలుగుదేశం రంగంలోకి దిగింది...

jagan kurnool 29122017 3

ఎమ్మల్సీ అభ్యర్ధి జయప్రకాశ్ రెడ్డి చేత నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేసి, సక్సెస్ అయ్యింది.. ఈ క్రమంలోనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకుంది. దీంతో అప్పటి వరకు తన వర్గం అనుకున్న బైరెడ్డి లాంటి నేత కూడా తెలుగుదేశం వైపు తిరగటంతో, అనవసరంగా ఈ విషయంలో కల్పించుకుని, ఒక నేతను పోగుట్టుకున్నాం అని వైసీపీ బాధపడుతుంది. మొత్తానికి, చివరి నిమషం వరకు ఎదో చేసేద్దాం అనుకుని ఆరాటపడి, చివరకు పోరాటం చెయ్యకుండా చేతులు ఎత్తేసింది వైసీపీ.

ప్రధాని నరేంద్ర మోడీ, అవినీతి పై యుద్ధం చెయ్యటానికో మరి దేనికో కాని, రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద నిజాయితీ పరుడైన జగన్ కు అత్యంత ఆప్తుడు, జగన్ కు అన్నిట్లో తోడూ నీడగా ఉండే విజయసాయి రెడ్డిని కలిసారు. ఈ నిజాయితీ పరుడు జగన్ అక్రమ ఆస్తుల కేసులో 11 కేసుల్లో A2గా ఉన్నారు... అసలైతే ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్ట్ లో హారజవ్వాల్సిన ఈ నిజాయతీ పరుడు, ప్రధాని మోడీని కలిసారు... రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబాట్టి, ఈయనకు కోర్ట్ మినహాయిపు ఇచ్చింది. అయితే, జగన్ మాత్రం ఇవాళ పాదయాత్ర ఆపుకుని మరీ కోర్ట్ కి వెళ్లారు.

modi 29122017 2

ఇవాళ ఉదయం 11.45 నిమిషాలకు, ప్రధాని మోడీతో, ప్రధాని విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 15 నిమషాల పాటు చర్చలు జరిగినట్టు వార్తలు వచ్చాయి.... ఇంత సడన్ గా ఈ భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది.... విజయసాయి రెడ్డి అప్పాయింట్మెంట్ అడిగారా, లేక ప్రధాని మోడీనే, పిలుపించుకుని మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. చర్చలు వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.. అప్పట్లో జగన్ కూడా ఇలాగే సైలెంట్ గా వెళ్లి ప్రధానికి కలిసి వచ్చారు. అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనమే అయ్యింది... ఇప్పుడు విజయసాయి రెడ్డి భేటీ వెనుక అనేక రాజకీయ పరిణామాలే కారణమని తెలుస్తుంది.

modi 29122017 3

ఒక పక్క జగన్ బీజేపీతో విలీనం కాని, ఎన్నికల్లో పొత్తు కాని అనే వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఈ వార్తలకి బలం ఇస్తూ అనేక పరిణామాలు కూడా జరిగాయి... మరో పక్క సోము వీర్రాజు లాంటి సెకండ్ గ్రేడ్ నాయకుల చేత చంద్రబాబుని తిట్టిస్తూ, మరో పక్క జగన్ ను ఎత్తిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు... ఇవన్నీ జరుగుతూ ఉండగానే 2జీ లాంటి అతి పెద్ద అవినీతి కేసులో అందరినీ విడిచిపెట్టటం పెద్ద సంచలనం అయ్యింది.. ఇప్పుడు జగన్ కేసులు కూడా నీరుగారుతాయా అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి... ఈ పరిణామాల నేపధ్యంలో, విజయసాయి రెడ్డి లాంటి ఆర్ధిక నేరాలు చేసాడు అని అభియోగాలు సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు చెప్పిన నేపధ్యంలో, ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి వారిని కలవటం ఎంత వరకు సమంజసమో, ప్రధానికే తెలియాలి...

ఒక పక్క పోలవరంతో రాష్ట్రాన్ని కేంద్రం ఇబ్బంది పెడుతుంది... ఈ తరుణంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేటు బిల్ ఇవాళ ప్రవేశపెట్టి, కేంద్రాన్ని ఇరుకున పెట్టారు... శుక్రవారం ప్రైవేటు బిల్ ప్రవేశపెట్టిన తరువాత, లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ లేదని, దీంతో ఏపీ ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోందని వివరించారు. జోన్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లాలంటే అటు ఒడిశా, లేదా ఇటు తెలంగాణ వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.

rammohan 29122017 2

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనే రైల్వే జోన్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రైల్వే యాక్ట్ 1989 ను సవరించి విశాఖ హెడ్ క్వార్టర్స్‌గా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఆయన లోక్‌సభలో వివరించారు. వాల్టేర్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లను అందులో చేర్చాలని రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని కోరారు. మరి రామ్మోహన్ నాయుడు ఆక్షన్ కు, కేంద్రం రియాక్షన్ ఎలా ఉంటందో చూడాలి... కేంద్రం కనుక ఒప్పుకుంటే, బిల్ పాస్ అవుతుంది. ఈ బిల్లు సభ ఆమోదం పొందితే మూడు నెలల్లో రైల్వే శాఖ చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి.

rammohan 29122017 3

రెండు నెలల క్రితం, విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు పై లోక్‌సభలో బిల్లు పెట్టేందుకు తనకు అనుమతి ఇవ్వాలని రామ్మోహన్‌ నాయుడు స్పీకర్‌కు లేఖ పంపారు. తరువాత లోక్‌సభ సెక్రటేరియట్‌, బిల్ పెట్టటానికి పర్మిషన్ ఇచ్చింది.. దానికి అనుగుణంగా, ఇవాళ రామ్మోహన్ నాయుడు బిల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్ విషయంలో కేంద్రం వైఖరి తెలిసిపోనుంది... ఒక్క దెబ్బతో, అటో ఇటో తెల్చేయ్యటానికి ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో, రామ్మోహన్‌నాయుడు సరైన టైంలో స్పందించారు... కేంద్రం వైఖరి ఈ విషయంలో ఏంటో తెలిసిపోనుంది... ఇప్పటి వరకు రైల్వే జోన్ కోసం చేసిన ప్రయత్నాలతో పాటు, జోన్ ఏర్పాటుకు అవునో కాదో కేంద్రం తేల్చే సమయం వచ్చింది.

Advertisements

Latest Articles

Most Read