40 ఏళ్ళ రాజకీయ జీవితంలో, చంద్రబాబు 14 ఏళ్ళు అధికారంలో ఉన్నారు... పరిపాలనలో టెక్నాలజీ వాడకం మొదలు పెట్టారు... పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు... తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో విజయాలు సాధించారు... ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి... ఇంజనీరింగ్ కాలేజీలు, ఐటి ఉద్యోగాలు, లాంటివి ప్రతి మధ్య తరగతి కుటుంబాన్ని తాకాయి... అభివృద్ధిలో అయితే చెప్పనవసరం లేదు... రైతు బాజార్లు, డ్వాక్రా, నీరు మీరు, జన్మభూమి, ఇలా అనేక కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయి... అయితే, చంద్రబాబు అతి పెద్ద విజయం ఏంటి అంటే, అందరూ చెప్పేది హై టెక్ సిటీ...

cbn victory 40 years 2

విజ్ఞాన ఆధారిత కంపెనీలు తెస్తేనే ఉద్యోగాలు, అభివృద్ధి వస్తాయని నిర్ధారణకు వచ్చి, చంద్రబాబు ఐటి వైపు అడుగులు వేసారు... మైక్రోసాఫ్ట్‌ వచ్చిన తర్వాత ఒరాకిల్‌, TCS, Deloitte, Cognizant, ఇన్ఫోసిస్‌... ఇలా వరుసగా అనేక కంపెనీలు ఇక్కడకు తరలి వచ్చాయి. ఇందుకోసం న్యూయార్కులో 18 రోజులుండి ఫైళ్లు మోసుకుంటూ తిరిగారు చంద్రబాబు. తరువాత జరిగింది చరిత్ర... అమలాపురం నుంచి, ఆదిలాబాద్ దాకా, ఆ రోజుల్లో డిగ్రీ పూర్తి చేసుకుని, చేతిలో సర్టిఫికేట్ లు పట్టుకుని, హైదరాబాద్ లో గౌరవంగా ఉద్యోగాలు చేసిన వారని అడిగితే చెప్తారు... ఈ విజయానికి మించిన విజయం, నవ్యాంధ్రలో చంద్రబాబు సాధించారు.. ఆశ్చర్యంగా ఉందా ? అవును సాధించారు...

cbn victory 40 years 3

ఆ విజయం పేరే పట్టిసీమ... ఈ నాలుగేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ని కాపాడింది ఈ పట్టిసీమే... పట్టిసీమ లేకపోతే, నవ్యాంధ్ర ముఖ చిత్రం వేరేగా ఉండేది... చుక్క నీరు ఉండేది కాదు, కృష్ణా డెల్టా, రాయలసీమ ఎండిపోయేది... రైతులలో అశాంతి ఉండేది, తాగు నీరు లేక ప్రజలు విలవిలలాడేవారు... నీరు లేక కియా లాంటి పరిశ్రమలు వచ్చేవి కాదు... ఒక్కటేమిటి, పట్టిసీమ అనేది లేకపోతే, మన రాష్ట్రం ఎలా ఉండేదో ఊహకే అందని విషయం... అందుకే చంద్రబాబుని విజనరీ అనేది... అధికారంలోకి రాగానే, నీటి కష్టాలు ముందే ఊహించి, వెంటనే పట్టిసీమ మొదలు పెట్టారు... రాష్ట్రంలో దాదాపు 75% ఈ రోజు నిశ్చింతంగా ఉంది అంటే, అది పట్టిసీమ చలువే... అందుకే, హై టెక్ సిటీ కంటే, పట్టిసీమే పెద్ద విజయం అంటున్నారు ప్రజలు... వీటికి మించిన విజయాలు, అమరావతి నిర్మాణం, పోలవరం కూడా చంద్రబాబు గారే పూర్తి చెయ్యాలి, చేస్తారు... ఇదే 5 కోట్ల ఆంధ్రుల మాట... జయహో పట్టిసీమ.... జై ఆంధ్రప్రదేశ్....

తిరుపతి నుంచి అమరావతి దాకా, అలుపెరుగని ప్రయాణం ఆయన రాజకీయం... ఆటుపోట్లకు వెరవని మొండిఘటం... వ్యూహ చతురతలో ఎదురులేని చాణక్యం.. పాలనాదక్షుడిగా అపార అనుభవం.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం !! 23 ఏళ్లకే MLC పదవికి నామినేషన్ !! 26 ఏళ్లకే MLA !!! 28 ఏళ్లకే క్యాబినెట్ మంత్రి !! 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి !! 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు !! తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ఒక చరిత్ర !! ఆయన వయసు 66 ఏళ్లు! అందులో అచ్చంగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం! 1978 ఫిబ్రవరి 27న చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలుపును నిర్ధారిస్తూ అధికారిక ఫలితం వెలువడింది. మరి ఆయనకు మొదటి సారిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, చంద్రబాబుకి మొదటి సారి బీఫారం ఇచ్చింది ఎవరో తెలుసా ? ఇప్పుడాయిన ఏమంటున్నారో చూడండి...

cbn bofrm 27022018 3

చంద్రబాబు రాజకీయ జీవితం నా చేతుల మీ దుగానే మొదలవటం తలచుకుంటే ఇప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో తొలి బీఫారం ఇచ్చి చంద్రగిరి నుంచి పోటీచేసే అవకాశం కల్పించాం. మొదటి నుంచి కష్టపడే తత్వం చంద్రబాబుది. అందుకే అపజయం చాలా తక్కువ సందర్బాల్లో తప్ప ఆయన దగ్గరకు కూడా రాలేదు'... టీడీపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు చెప్పిన మాటలివి. 40 ఏళ్ల రాజకీయ జీవిత విశేషాలను యడ్లపాటి చెప్పారు. రెడ్డి కాంగ్రెస్, ఇందిర కాంగ్రెస్ గా విడిపోయిన రోజుల్లో మర్రి చెన్నారెడ్డి ఇందిర కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్లో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసి, బీఫారాలు ఇచ్చే బాధ్యతను నాపైన, బాపట్లకు చెందిన న్యాయవాది పసుపులేటి కోటేశ్వరరావు పైన పెట్టారు.

cbn bofrm 27022018 2

ఆ సమయంలో చిత్తూరు నుంచి రాజగోపాలనాయుడు గారు, చంద్రబాబును తీసుకువచ్చి, ఈయనకు బీఫాం ఇవ్వాలని, విద్యార్థి సంఘాల్లో లీడర్గా మంచి పాత్ర పోషించారని, తప్పనిసరిగా గెలుస్తా రని సిఫార్సు చేశారు. అప్పుడే చంద్రబాబుకు చంద్రగిరి నియోజకవర్గం ఖాయం చేశాం. మాట నిలబెట్టుకుని గెలిచి చూపారు. అప్పుడే నాకు మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రోత్సాహం, ఎన్టీఆర్ ఒత్తిడితో టీడీపీలో చేరా. జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఇచ్చింది చంద్రబాబే. ఆయన అప్పుడు, ఇప్పుడు నాకిచ్చే గౌరవం మరువలేనిది. అయితే అప్పటి రాజకీయాలకు, నేటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో పార్టీ సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఉండేది. అసెంబ్లీలోనూ వ్యక్తిగతం అసలు ప్రస్తావనకే వచ్చేదికాదు. చిన్నవారు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఆవేశాలు - లేకుండా హుందాగా ఉండే వాదనలతో పెద్దల సభను తలపించేలా నడచుకునేవారు. ఇంత వయసులోనూ చంద్రబాబు ప్రజల కోసం పరితపించటం ఆయన కష్టపడే తత్వానికి నిదర్శనం. పార్టీ ఏదైనా ఆ నేతలోని మంచి లక్షణాలను అవలంబించాలనుకోవటంలో తప్పులేదు. ఇకపైనైనా రాజకీయం తీరు మారుతుందని ఆశిస్తున్నా.

సిఐఐ సమ్మిట్ కు వచ్చిన ఫారన్ డెలిగేట్స్, విశాఖ స్వచ్ఛత చూసి ఫిదా అయిపోయారు... కాలిఫోర్నియా నుంచి, జపాన్ నుంచి, కొరియా నుంచి, స్పెయిన్ నుంచి, ఇలా వివిధ దేశాల ప్రతినిధులు, క్లీన్ గా ఉన్న విశాఖ నగరాన్ని చూసి, పొగడకుండా ఉండలేక పోయారు... వారి మాటల్లో, "George O’Neal from California. “During my drive to the hotel from the airport, I found Vizag to be a clean and green city. There’s no much natural beauty around, there are hills, forests and seas. Driving on the roads back home in California is a nice experience, and it’s a similar feel when you drive on Vizag roads"

vizag 26022018 2

Steel Lee from South Korea, who is the director of Daeha Co, was also struck by the city’s cleanliness. “It’s a good place for business. After the conference, we hope to do some sightseeing around the city and will go to the beaches. We are also interested in setting up our manufacturing unit in Andhra Pradesh,”

vizag 26022018 3

విభజన తరువాత, విశాఖను నవ్యాంధ్ర వెన్నుముకగా చెయ్యటానికి చంద్రబాబు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో ర్యాంకింగ్స్ లో దేశంలోనే 3వ ర్యాంకులో నిలిచింది. దేశంలోనే ఎల్‌ఈడీ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ ఖ్యాతి గడించింది. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌ రివ్యూ, బ్రిక్స్‌ సదస్సు , భాగస్వామ్య సదస్సుతో విశాఖకు ప్రంపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ఏకంగా, మూడో సారి ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు కు ఆతిథ్యం ఇచ్చి, నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని మరోసారి నిరూపించింది... మన నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని ఇలాగే సుందర నగరంగానే ఉండాలి.... పెట్టుబడులు రావాలి... ఎదుగుతూనే ఉండాలి... నవ్యాంధ్ర ప్రగతిలో భాగస్వామి కావలి...

సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు, 1978 ఫిబ్రవరి 27న చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యేగా చంద్రబాబు ఎన్నికయ్యారు... అప్పుడు తెలియదు, దేశ స్థాయిలో చక్రం తిప్పగలిగే ఒక రాజకీయ అపర చాణక్యుడు పుట్టుకొస్తాడని ... అప్పటిదాకా ఎస్వీ యూనివర్శిటీలో మాత్రమే పేరు వినిపించిన ఓ యువకుడు... దేశ రాజకీయాలను శాసించబోతాడని ఎవరూ అనుకోలేదు... కానీ, ఆ యువకుడిలో ఏదో ఉందని భావించిన ఓటర్లు... అతనికి మద్దతుగా బ్యాలెట్ పేపర్ పై ఓటు వేశారు. ఫలితం... ఒక బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించి... రాజకీయరంగంలోకి ఆ యువకుడు అడుగుపెట్టాడు. అతనే నారా చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోని ఆయన... ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఢిల్లీలో చక్రం తిప్పేంత స్థాయికి ఎదిగారు... చిత్తూరు జిల్లా నారావారి పల్లిలో ఒక సామాన్య రైతు కుటుంబంలో ప్రారంభమైన ఆయన జీవన ప్రస్థానం రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించేదాకా సాగింది...

cbn 40 years 2

పల్లె నుంచి తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టడం చంద్రబాబు జీవితాన్ని మలుపుతిప్పింది. విద్యార్థి నేతగా రాణించిన ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1978లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే విడతలో అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో చంద్రబాబుపై అప్పటి అగ్ర హీరో ఎన్టీ రామారావు దృష్టి పడింది. ఆయన తన కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి చంద్రబాబుతో వివాహం చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే రామారావు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశాన్ని స్థాపించారు. కానీ, చంద్రబాబు టీడీపీలో చేరకుండా కాంగ్రెస్‌లోనే ఉండి పోటీ చేసి ఓడిపోయారు. అది ఆయనకు తొలి ఓటమి. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన టీడీపీలో చేరారు. 1984 సంక్షోభంలో రామారావుకు అండగా నిలిచి పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. పార్టీలోకి కొత్తగా రావడంతో 1985 ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవి స్వీకరించి పార్టీ కోసం పనిచేశారు. చంద్రబాబుకు కష్టజీవి అనే గుర్తింపు అప్పుడే వచ్చింది. అదే సమయంలో ఎన్టీ రామారావు ఆయనకు అపరిమిత ప్రాధాన్యం ఇవ్వడం... కర్షక పరిషత్ అధ్యక్ష పదవికి నామినేట్ చేయడానికి ప్రయత్నించడం వివాదాస్పదంగా మారి చంద్రబాబుపై రాజ్యాంగేతర శక్తి అన్న ముద్ర పడింది.

cbn 40 years 3

1989 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ, పార్టీ ఓడిపోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న రామారావుకు చంద్రబాబు తోడునీడగా నిలిచి కాంగ్రెస్‌పై బలమైన పోరాటం జరిపారు. 1994 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం తర్వాత చంద్రబాబుకు ఎన్టీఆర్ ఎతో కీలకమైన రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాలను అప్పగించారు. కానీ, పార్టీలో లక్ష్మీ పార్వతి ప్రమేయం పెరిగిపోవడం టీడీపీలో మరోసారి సంక్షోభాన్ని సృష్టించింది. ఆనాటి చీలిక పరిణామాల్లో మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో చంద్రబాబు తన మామ రామారావు స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్న ఆరోపణలు అప్పుడు, ఇప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ పెద్దసంఖ్యలో ఎంపీలను గెలుచుకుంది. జాతీయ రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు చొరవ తీసుకొని యునైటెడ్ ఫ్రంట్ పేరిట కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టారు. ఆ ఫ్రంట్‌కు ఆయన కన్వీనర్ అయ్యారు. కేంద్రంలో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. బయటి నుంచి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ మధ్యలో ఉపసంహరించుకోవడంతో ఆ ప్రభుత్వం ఏడాదిన్నరకు మించి మనలేదు. ఆ సమయంలో చంద్రబాబుకు ప్రధాని పదవి ఇస్తామని మిగిలిన పార్టీలు ప్రతిపాదించినా... ఆయన ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించి ససేమిరా అన్నారు.

cbn 40 years 4

ఆ తర్వాత 1999 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు సమానంగా సీట్లు వచ్చిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ వ్యతిరేకతతో బీజేపీని బలపర్చారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లోనూ కమలంతో పొత్తు పెట్టుకొని పోటీచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఎన్టీఆర్ లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం అదే ప్రథమం. అప్పటి వరకూ తారాజువ్వలా దూసుకుపోయిన చంద్రబాబు గ్రాఫ్ ఆ తర్వాత దిగజారడం మొదలైంది. కేసీఆర్ టీడీపీ నుంచి నిష్క్రమించి టీఆర్ఎస్‌ను పెట్టారు. 2003లో నక్సల్స్ జరిపిన 'అలిపిరి దాడి' నుంచి బాబు త్రుటిలో తప్పించుకున్నారు. అప్పుడు ఏర్పడిన సానుభూతి ఆసరాగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయం వికటించడంతో... విపక్షంలో కూర్చున్నారు. వామపక్షాలను, టీఆర్ఎస్‌ను దరి చేర్చుకొని 2009 ఎన్నికల్లో మహా కూటమిని నిర్మించినా పార్టీకి విజయం దక్కలేదు. అసెంబ్లీలో బలం పెరిగినా విజయం కాంగ్రెస్‌కే దక్కింది. 10ఏళ్ళు అధికారంలో లేకపోయినా, 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసం పొందటంలో సఫలం అయ్యారు... నవ్యాంధ్ర నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యం అని, ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు...

cbn 40 years 5

చంద్రబాబు రాజకీయంగా అత్యున్నత స్థానాన్ని అందుకోవడానికి ఆయన నిరంతర శ్రమ, రాజకీయ చాణక్యం ఉపయోగపడ్డాయి. పార్టీ అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో పార్టీ శ్రేణులను నిమగ్నం చేస్తూ వారికి పార్టీ పట్ల బలమైన బంధాన్ని నిర్మించడంలో ఆయన సఫలమయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు వయసు 67 ఏళ్లు. జననేతగా ఆయన వయసు 40 ఏళ్లు. అయినా... 40 ఏళ్ల క్రితం ఉన్న అదే ఉత్సాహం, అదే పోరాటం, అదే కష్టపడే మనస్తత్వం... చంద్రబాబు రాజకీయ జీవితం, ఒక వన్ డే మ్యాచ్ తో పోల్చుకుంటే, 50 ఓవర్లలో చంద్రబాబు 40 ఓవర్లు ఆడేసారు... అసలైన ఆట ఆడల్సింది ఈ 10 ఓవర్లలోనే... హై స్కోర్ చేసి, ఆంధ్రప్రదేశ్ ని ఎవరూ అందుకోలేనంత ఎత్తులో చంద్రబాబు పెట్టాలని, ఆ దేవుడు చంద్రబాబుకు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, లాంగ్ లివె చంద్రబాబు గారు...

Advertisements

Latest Articles

Most Read