అలుగుటయే ఎరుగని చంద్రబాబు అలిగితే.... ఎలా ఉంటుందో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ... మిత్ర ధర్మం పాటిస్తూ, 3.5 సంవత్సరాలు ఓర్పుగా, ఆయానకు ఉన్న హోదా, అనుభవం అన్నీ పక్కన పెట్టి, 29 సార్లు ఢిల్లీ వెళ్లి, మాకు సహాయం చెయ్యండి అయ్యా, మా హక్కులు మాకు ఇవ్వండి అని వేడుకుంటే, చివరకు ఢిల్లీ పెద్దలు ఏమి చేసారో తెలిసిందే... ఇనుముని సైతం నానా పెట్టే చంద్రబాబు, లాంటి వాడే వీళ్ళ పనులకి ఓర్పు నశించి బయటకు వస్తున్నారంటే, బీజేపీ పెద్దలు ఎలా ఇబ్బంది పెట్టారో తెలుసుకోవచ్చు... అయితే, మనకు కళ్ళకు కనిపించింది చాలా తక్కువ, అంతకు మించి మోడీ ఎలా ఇబ్బంది పెట్టారో, అతని నైజం ఏంటో చెప్పటానికి, నిన్న చంద్రబాబు ఆవేదనతో చెప్పిన ఒక విషయం తెలుసుకోవాలి...

cbn 08032018 2

ఏపీకి సహాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడిన తరువాత, చంద్రబాబు రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, ఎన్డీఏ నుంచి మా మంత్రులు బయటకు వస్తున్నారు అని చెప్పేశారు.. ఈ సందర్భంలో చంద్రబాబు చెప్పిన ఒక విషయం విస్మయానికి గురి చేసింది... మనం ఫెడరల్ సిస్టంలోనే ఉన్నామా, లేదా అనే అనుమానం కలుగుతుంది... కేంద్రం చేస్తున్న అన్యాయం చెప్తూ, చంద్రబాబు ఒక విషయం చెప్పారు.. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం అది... చంద్రబాబు మాటల్లో "వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ఏడాది జనవరి 31వ తేదీన రూ.350 కోట్లు విడుదల చేశారు. కానీ... ప్రధాని ఆమోదం లేదంటూ వెంటనే మొత్తం డబ్బు వెనక్కి తీసుకున్నారు. దీనిని సాయమనాలా, మరింకేదైనా అనాలా?"

cbn 08032018 3

ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది... మరో పక్క, అసలు మోడీ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి... మనం ఏమి అన్యాయం చేసాం ? చంద్రబాబుని సాధించటం కోసం, ప్రజలని ఇబ్బంది పెడతారా ? ఒక పక్క రాయలసీమకు అన్యాయం జరిగింది అని గగ్గోలు పెడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు, మోడీ చేసిన పనికి ఏమి సమాధానం చెప్తారు ?

ఏపీకి జరిగిన అన్యాయం నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు... కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ బయటకు వస్తున్నట్టు ప్రకటించారు... చంద్రబాబు ఆదేశాల ప్రకారం కేంద్ర కేబినెట్‌లో ఉన్న అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి వైదొలగనున్నారు. మరో పక్క ఇదే నిర్ణయం చెప్పటానికి, ప్రధాని మోడీకి ఫోన్ చేసినా, ఆయన అందుబాటులో లేరని చంద్రబాబు చెప్పారు... రాష్ట్రానికి జరిగిన అన్యాయం నేపధ్యంలో, మొదటి అడుగుగా కేంద్రం నుంచి వైదొలుగుతున్నామని చంద్రబాబు చెప్పారు... ఏన్డీఏలో నుంచి బయటకు రావటం తరువాత అడుగని చెప్పారు...

cbn decision 07032018

రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అని, అందుకే మంత్రివర్గంలో చేరామని, కాని రాష్ట్రానికి ఏ మంచి జరగలేదని, అందుకే ఇక క్యాబినెట్ లో ఉండటం కరెక్ట్ కాదని బయటకు వస్తున్నామని చెప్పారు... ఎంతో ఓపికగా, అందరూ ఎప్పుడో వచ్చేయమని చెప్పినా, రాష్ట్ర పయోజనాల కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసామని చంద్రబాబు అన్నారు... కాని, చివరకు ఈ బాధాకరమైన నిర్ణయం తీసుకోవాలసి వచ్చిందని చంద్రబాబు చెప్పారు.. కేంద్ర కేబినెల్‌లో ఉన్నప్పటికీ రాష్ట్రానికి న్యాయం జరగడంలేదనే ఉద్దేశంతోనే కేంద్రమంత్రులు రాజీనాచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

cbn decision 07032018

మరో పక్క, సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుకి ఫోన్ చేశారు. అరుణ్ జైట్లీ తర్వాత పార్టీ నిర్ణయాన్ని అశోక్ గజపతికి రాజుకి వివరించారు. బీజేపీతో పొత్తుపై తమరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సిద్ధమేనని చంద్రబాబుతో అశోక్ గజపతిరాజు చెప్పారు. కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదని అశోక్ గజపతి తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుందామని స్పష్టం చేశారు. 

దిల్లీలో అరుణ్‌ జైట్లీ మీడియా సమావేశం తర్వాత అమరావతిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ మీడియా సమావేశాన్ని యనమల, ఇంకొందరు ముఖ్య నేతలతో కలిసి వీక్షించిన చంద్రబాబు, అసహనానికి గురైనట్టు సమాచారం. జైట్లీ మళ్లీ చెప్పిందే చెప్పారని, విభజన బిల్లులో పేర్కొన్నవి అడుగుతున్నప్పుడు చేయలేమని చెబుతున్నారని సీఎం అక్కడ ఉన్న నేతలతో అన్నట్టు తెలుస్తోంది. నిధుల విషయంలో సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకోవడం కుదరదని కూడా జైట్లీ అన్నారు. ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

cbn amaravati 07032018 2

జైట్లీ చేసిన వ్యాఖ్యలపై, తాము కేంద్ర ప్రభుత్వంతో ఇకపై పోరాడే తీరు పై వివరించడానికి చంద్రబాబు నాయుడు కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే సచివాలయానికి రావాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు... కాల్వ శ్రీనివాసులు, నారాయణ చంద్రబాబుతో భేటీ అయ్యారు.

cbn amaravati 07032018 3

ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేయడంపై చంద్రబాబు మరి కాసేపట్లో స్పందించనున్నారు. బీజేపీతో తమ పార్టీ మిత్రత్వం కొనసాగించే అంశం పై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు నిర్ణయం తీసుకొంటారా, లేక పోలిట్ బ్యూరో మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ పెట్టిన తరువాత నిర్ణయం ప్రకటిస్తారా అనేది చూడాలి... ముందుగా, సీఎం సమావేశం 7.30గంటలకు ఉన్నప్పటికీ దాన్ని 8గంటలకు వాయిదా వేశారు. అది మరింత ఆలస్యం కూడా అవ్వచ్చు అంటున్నారు... ఈ ప్రెస్ మీట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రెస్‌మీట్‌ తర్వాత అమరావతిలో ఎంపీలతో, మంత్రులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, నారాయణ, ఇతర మంత్రులు భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రులు, ఎంపీలు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గున్నారు... పొత్తు పై ఎంపీలు , ఎమ్మెల్యేలు కూడా ఒకే మాట మీద ఉన్నారు... ఇన్నాళ్లూ ఓర్పు, సహనంతో.. మిత్రధర్మంతో ఉన్నానని.. కానీ ఇలా చేయడం అన్యాయమని మంత్రులు, ఎంపీల దగ్గర సీఎం చంద్రబాబు వాపోయారు... దీంతో ముందు అడుగుగా ఆశోక గజపతి రాజు, సుజనా చౌదరి ముందుగా రాజీనామా చేయ్యనున్నట్టు సమాచారం...

cbn rajeenama 07032018

మరి కొంత సేపట్లో చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించనున్నారు... ముందుగా ఈ విషయం నరేంద్ర మోడీ, అమిత్ షా తో చెప్పి రాజీనామా చెయ్యనున్నారు.. అందుకే 8 గంటలకు రావాల్సిన నిర్ణయం లేట్ అయ్యింది... ఈ నేపధ్యంలో రేపు ఉదయం మంత్రులు రాజీనామా చెయ్యనున్నారు... అయితే మంత్రి ఆశోక గజపతి రాజు కొన్ని కార్యక్రమాల్లో ఉండటంతో అందుబాటులో లేనట్టు సమాచారం... ఆయన ఇప్పటికే మీరు ఎప్పుడు అంటే అప్పుడు రాజీనామా ఇచ్చేస్తా అని ఇప్పటికే చెప్పారు కూడా... రేపు రాష్ట్రపతిని కలిసి రాజీమాలు ఇస్తారని సమాచారం..

cbn rajeenama 07032018

అయితే ఎన్డీఏ నుంచి బయటకు రావటం మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు... ముందుగా మంత్రుల చేత రాజీనామా చేసి, కేంద్రం పై ఏమన్నా ఒత్తిడి వస్తుందేమో చూడనున్నారు.. అలాగే ఇక్కడ కేంద్ర మంత్రులు రాజీనామా చెయ్యగానే, రాష్ట్ర బీజేపీ మంత్రులు కూడా రాజీనామా చేయ్యనున్నట్టు సమాచారం... అయితే ముందుగా ఆశోక గజపతి రాజుతో మాట్లాడి, తరువాత మోడీకి విషయం చెప్పి, చంద్రబాబు ఈ నిర్ణయం మరికొంత సేపట్లో చంద్రబాబు నిర్ణయం ప్రకటించనున్నారు...

Advertisements

Latest Articles

Most Read