జగన్, పవన్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు, మిగతా వారందరూ ఎక్కువగా ప్రత్యెక హోదా కావాలంటూ ఆందోళన చేస్తున్నారు... మిగతా విభజన హామీలు అయిన ఆర్ధిక లోటు, పోలవరం లాంటి విషయాలు మాట్లాడుతున్నా, అంతకు మించి మనకు విభజనలో తెలంగాణా నుంచి రావాల్సినవి కూడా ఉన్నాయి... ఇవి కెసిఆర్ చేతిలో ఉన్న విషయాలు... కెసిఆర్ ప్రత్యెక హోదాకు మద్దతు ఇస్తున్నారని, ఆహా ఓహో అంటున్న వారు, మనకు తెలంగాణా నుంచి రావల్సిన వాటి గురించి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు ఎత్తరు... జగన్ మాట్లాడడు, పవన్ మాట్లాడడు, మిగతా వారు మాట్లాడరు...

cbn 07032018 2 12

వీటి మీద కేంద్రాన్ని అడగరు... వీటి కోసం ఆందోళన చెయ్యరు... అవే మనకు తెలంగాణా నుంచి రావాల్సిన 4 వేల కోట్లు విద్యుత్ బకయాలు, ఉమ్మడి ఆస్తుల విభజన, హైదరాబాద్ లో ఉన్న 9,10 షడ్యుల్ సంస్థల... వీటి విలువ దాదాపు 40-50 వేల కోట్లు ఉంటుంది... వీటి గురించి, కేంద్రం పట్టించుకోవటం లేదు, కెసిఆర్ ఇబ్బంది పెడతాడు... అందుకే చంద్రబాబు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా, ఒక ప్రభుత్వ సంస్థ, మరొక ప్రభుత్వ సంస్థ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థను నుండి తన బకాయిలను తిరిగి పొందడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వద్దకు వెళ్లి, ఆ సంస్థ పై దివాలా ప్రక్రియ ప్రారంభించి, ఆస్తులు జప్తు చేసి, మా బాకీ మాకు తీర్చేలా చెయ్యండి అంటూ, పిటీషన్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ...

cbn 07032018 212

ఇదే విషయం ఈ రోజు అసెంబ్లీలో కూడా చెప్పారు... ప్రత్యేక హోదా, పోలవరం, ఆర్ధిక లోటు భర్తీ కాదు, EAP నిధులు, రైల్వ జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగ్గిరజపట్నం పోర్ట్, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులు, వివిధ విద్య సంస్థల నిధులు , ఉమ్మడి ఆస్తుల విభజన, 9,10 షడ్యుల్ సంస్థలు, ఇలా అన్ని విషయాల పై చంద్రబాబు పోరాడుతున్నారు... మిగతా వారు కూడా, కెసిఆర్ తో ఈ విషయం పై పోరాడాలి... లేకపోతే హైదరాబాద్ లో ఉంటూ, కెసిఆర్ అంటే భయం కాబట్టి, ఈ విషయాలు అడగటం లేదు అని అనుకోవాల్సి ఉంటుంది..

ఏపీకి ప్రత్యేక హోదాపై ఇటు రాష్ట్రంలోనూ, అటు ఢిల్లీలోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. హోదాపై బీజేపీ సర్కార్ దాటవేత ధోరణిపై అన్ని స్థాయిల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీటి పై ఈ రోజు క్లారిటీ ఇస్తాను అంటూ 5.30కి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో సమావేశం పెట్టారు.. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, తదితర అంశాలపై మాట్లాడిన జైట్లీ, అన్ని విషయాలు రాష్ట్రం పై నెట్టేశారు... ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ఈ హోదాను ఇవ్వడం లేదని తెలిపారు..

jaitley 07032018 2

జీఎస్టీ రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. తగినంత రాబడి లేకపోవడం వల్లే ఆశాన్య రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతోందని వివరించారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం కోల్పోయిన మాట వాస్తవమేనన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదన్నారు. హోదా మనుగడలో లేదు కాబట్టి ప్యాకేజీ ప్రకటించామని చెప్పారు.. ఏపీకి 60:40 శాతం నిధులు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని, కానీ తాముప్రత్యేక పరిస్థితుల్లో 90:10 శాతం నిధులు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. స్టేటస్ అనే పదం వాడకుండా సాయం అందిస్తున్నామని తెలిపారు..

jaitley 07032018 3

నాబార్డు ద్వరా నిధులు మంజూరు చేయాలని ఏపీ కోరిందని జైట్లీ చెప్పారు. నాబార్డుతో చర్చించి అందుకు అంగీకరించామని చెప్పారు. నాబార్డు, కేంద్రం ద్వారా నిధులన ఎస్‌పీవీకి పంపిస్తుందని, ఈ రుణాన్ని కేంద్రమే తీర్చే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. కొన్ని రోజుల పాటు రెవిన్యూ లోటు భర్తీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై సానుకూల దృక్పథం ఉందన్నారు. రెవిన్యూ లోటు 2013-14 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 4,000 కోట్లు ఉంటుందని, దీనిలో రూ.138 కోట్లు మాత్రమే ఇవ్వవలసి ఉందన్నారు. పన్ను మినాహయింపులు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వటం కుదరదని, మిగతా రాష్ట్రాలు కూడా అలాగే అడుగుతాయని చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ పై సానుభూతి ఉందని చెప్తూ, నిధుల కేటాయింపు సెంటిమెంట్ ఆధారంగా ఉండదని జైట్లీ తేల్చి చెప్పారు.

బుధవారం చంద్రబాబు అసెంబ్లీలో రాష్ట్ర విభజన హామీలపై కీలక ప్రసంగం చేశారు.. రాష్ట్ర విభజన సమయంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన భాజపా ఇప్పుడెందుకు ఇవ్వడంలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందువల్లే ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వడంలేదని ఇప్పుడు భాజపా అంటోందని, అలాంటప్పుడు ప్రస్తుతం హోదా కింద ఇప్పుడు ఏయే రాష్ట్రాలకు ఎంతమేర నిధులు, సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

cbn seats 07032018 2

అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. అసెంబ్లీ సీట్లు పెంచమని విభజన చట్టంలో ఉందని... కాని ఈ విషయాన్ని తాను అడగదల్చుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు... ఇలా అడిగితే మళ్ళీ రాజకీయం చేస్తున్నా అంటారు... అన్ని విషయాలు వదిలేసి, ఇదే అడుగుతున్నా అంటారు... ఇది ఇవ్వకపోయినా పరవాలేదు, మిగతా అన్ని విభిజన హామీలు నెరవేర్చండి అంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసారు.. నేను 29 సార్లు దిల్లీకి వెళ్లాను. అందరినీ కలిశాను. పదేపదే విజ్ఞప్తి చేశాను. మా మంత్రులను, అధికారులను, ఎంపీలను పంపాను. ప్రత్యేకహోదా ఇవ్వరు, నిధులు ఇవ్వరంటే చాలామంది ఆందోళన చెందారు. భయభ్రాంతుల‌కు గురయ్యారు. ఆ సమయంలో ప్రధానికి ఫోన్‌చేసి ఇక్కడి పరిస్థితిని వివరిస్తే.. ఆయన రమ్మన్నారు. దిల్లీకి వెళ్లాం. నీతిఆయోగ్‌ను పిలిచి చెబితే అన్నీ వివరించాం.

cbn seats 07032018 3

పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ చేసినప్పుడు ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పోరాడి బిల్లులో కొన్ని అంశాలు పెట్టి పాస్‌ చేయించారు. మరి దాన్ని అమలుచేయడంలో మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఎందుకింత ఉదాసీనత? అని అడుగుతున్నా. అప్పుడు ఆంధ్ర ప్రజలు పోరాడారు. ఇప్పటికీ పోరాడుతున్నారు. సరికాదని ప్రతిపక్ష పార్టీలన్నీ చెబుతున్నప్పుడు ఎందుకు కనికరించడంలేదు. ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేశారో.. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మళ్లీ మేం అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేకహోదాపైనేనని ప్రకటనలు చేసే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలి. నాలుగేళ్లు నేను ఆవేదనతో, బాధతో ఎంతో ఓపికగా 29సార్లు దిల్లీకి వెళ్లి అడిగితే కనీసం కనికరించలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే ఎందుకు అమలుచేయడంలేదు. మేం సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాం.

కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారు... మోడీకి భయపడుతున్నాడు అంటూ కొంత మంది చేస్తున్న వ్యాఖ్యల పై చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు... బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ హక్కుల సాధనలోఎక్కడా రాజీపడలేదని, లాలూచీ రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. తనపై ఎలాంటి కేసులు లేవని, నిప్పులా బతికానని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో సీనియర్‌ నేతల్లో తొలిస్థానంలో ఉన్నానని ఆయన తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి 28 సార్లు ఎంక్వయిరీ వేసాడని, సోనియా కూడా ఎన్నో సార్లు తన పై కేసులు పెట్టటానికి చూసింది అని చెప్పారు 

cbn cases 07032018 2

మంత్రి పదవులు పట్టుకుని వేలాడుతున్నారని అంటున్న వారికి సమాధానంగా, దేశ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ లాంటి వాటిని లీడ్ చేసి, కేంద్రంలో ప్రభుత్వాలని ఏర్పాటు చేసానని గుర్తు చేసారు... వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో, మన మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి, 6 మంత్రి పదవులు ఇస్తానన్నా తీసుకోలేదని గుర్తు చేసారు... అలాగే పోలవరం పై కూడా రాష్ట్రము ఎందుకు తీసుకొందో చెప్పారు, ప్రత్యేకహోదా ఇవ్వరు, నిధులు ఇవ్వరంటే చాలామంది ఆందోళన చెందారు. భయభ్రాంతుల‌కు గురయ్యారు. ఆ సమయంలో ప్రధానికి ఫోన్‌చేసి ఇక్కడి పరిస్థితిని వివరిస్తే.. ఆయన రమ్మన్నారు. దిల్లీకి వెళ్లాం. నీతిఆయోగ్‌ను పిలిచి చెబితే అన్నీ వివరించాం. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే అనుకున్న సమయానికి పూర్తవుతుందని భావించి రాష్ట్రానికి ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. అప్పుడు పోలవరం తీసుకున్నాం అని చెప్పారు..

cbn cases 07032018 3

లెక్కలు చెప్పటం లేదు అనేదాని పై స్పందిస్తూ, ఏ రోజు, ఏ లెక్కలు కేంద్రానికి పంపించింది, ఎన్ని యూసీలు పంపారో వివరాలు చెప్పారు... ఉమ్మడి ఏపీలో కేంద్రాన్ని ఎప్పుడూ నిధులు అడగలేదని, ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం కాబట్టే సహకరించాలని కోరుతున్నామన్నారు. సంపద సృష్టించే రాష్ట్రాలను ఆదుకోవాలని, కేంద్రం నిధులు ఇవ్వలేదని అభివృద్ధి ఆగదన్నారు. కేంద్రం సాయం చేయలేదని... చెప్పడానికి సిద్ధంగా లేనని చంద్రబాబు చెప్పారు. జాతీయ సగటు కన్నా ఎక్కువ వృద్ధిరేటు సాధిస్తున్నామన్నారు. రాయలసీమలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధిని చేసి చూపామని, కొంతమంది ప్రాంతీయ విద్వేషాలను రగిలించాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read