నూతన అసెంబ్లీలో రెండోసారి సమావేశాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబు సభలో ప్రసంగించారు. రైతుల దయ వల్లే అమరావతిలో అసెంబ్లీ నిర్వహించుకుంటున్నామని.. రూ.40వేల కోట్ల విలువైన 34వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చెయ్యకుండా, ఎదురు రాష్ట్రము పై ఎలా బీజేపీ ఎదురు దాడి చేస్తుందో చంద్రబాబు చెప్పారు... ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు నిధులను ఇచ్చేశామని చెప్పారని... గట్టిగా అడిగితే లెక్కలు ఇవ్వలేదని అంటున్నారని చంద్రబాబు విమర్శించారు...

cbn assembly 07032018 2

కాగ్ నివేదిక ప్రకారం లోటును భర్తీ చేయాలని మళ్లీ కోరుతున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 13000 కోట్లు ఖర్చయితే... కేంద్ర నుంచి ఇప్పటి వరకు కేవలం రూ. 5,349 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మెత్తం ఖర్చు కేంద్రమే భరించాల్సి ఉందని చెప్పారు. పోలవరం, అమరావతికి ఇచ్చిన నిధులకు లెక్కలు పంపించామని చంద్రబాబు తెలిపారు. అమరావతికి రూ. 2,500 కోట్లు ఇచ్చారని, ఆ లెక్కలు పంపించామని వెల్లడించారు. మౌలిక వసతులకు రూ. 42,900 కోట్లు ఖర్చవుతుందని... ఇప్పటి వరకు కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. యూసీలు ఇవ్వడం లేదు కాబట్టే నిధులు ఇవ్వడం లేదు అని చెప్పడం దారుణమని మండిపడ్డారు.

cbn assembly 07032018 3

రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల్లో విశాఖ రైల్వే జోన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని... ఎన్నో కమిటీలు వేశారని... కానీ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీని పెండింగ్ లో పెట్టారని అన్నారు. ఐఐటీ తిరుపతికి రూ. 100 కోట్లు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. 11 జాతీయ విద్యాసంస్థలకు రూ. 11 వేల కోట్ల విలువైన భూములను ఇచ్చామని... వీటి ఏర్పాటుకు రూ. 11,500 కోట్లు ఖర్చవుతుండగా... కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 400 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. దుగరాజపట్నం పోర్టు కుదరదంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సీట్లను పెంచుతామన్న హామీ కూడా నెరవేరలేదని చెప్పారు. అది అడిగితే, రాజకీయం అంటారని, ఆ విషయం అడగటం కూడా మానేసాను అని చెప్పారు..

వినూత్న నిరసనలతో ప్రతి రోజు ఆంధ్రప్రదేశ్ సమస్యలు పై ఆందోళన చేసే టీడీపీ ఎంపీ శివప్రసాద్‌, ఈ రోజు మరో సారి పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. రైతు వేషధారణలో వచ్చిన శివప్రసాద్‌ పార్లమెంటు ఆవరణలో నిరసనను వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలను అమలు చేయాలని గత కొన్ని రోజులుగా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ధర్నాలు, నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. నిరసనలో భాగంగా టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కావడితో రైతు వేషాధారణలో వచ్చి కేంద్ర ప్రభుత్వానికి తన నిరసనను తెలిపారు.

sivaprasad 07032018 2

ఏపీ రాజధానికి ప్రధాని ఇచ్చిన మట్టి, నీటిని ఎంపీ శివప్రసాద్‌ రెండు కుండల్లో తీసుకొచ్చారు. కావడితో వచ్చిన శివప్రసాద్‌ పవిత్ర మట్టి, నీటిని స్పీకర్‌ ద్వారా తిరిగి మోడీకి ఇవ్వాలని పార్లమెంటులోకి వెళ్లేందుకు యత్నించారు. మెట్లు ఎక్కిన ఆయనను పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇలాంటివాటిని లోపలకు అనుమతించబోమని నవ్వుతూ చెప్పారు. కాసేపు అక్కడే ఉన్న శివప్రసాద్... చివరకు మెట్లు దిగి, కిందకు వచ్చేశారు. శివప్రసాద్ నిరసన కార్యక్రమాన్ని వివిధ పార్టీలకు చెందిన ఎంపీలంతా ఆసక్తిగా గమనించారు.

sivaprasad 07032018 3

ఇదిలా ఉండగా సోమవారం నుంచి పార్లమెంటు మలివిడత సమావేశాలు ప్రారంభం కాగా మొదటి రోజు శ్రీకృష్ణుడి వేషం వేసిన ఎంపీ శివప్రసాద్.. రెండో రోజు ఎన్టీఆర్ గెటప్‌తో ఆకట్టుకున్నారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించిన ఎన్టీఆర్ వేషంలో పార్లమెంట్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. 'చెయ్యెత్తు జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా ' అంటూ పాట కూడా పాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొటితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కేంద్రాన్ని హెచ్చరించారు.

బీజేపీ, తెలుగుదేశం మధ్య తెగదెంపులు ఫైనల్ కు వచ్చిన పరిస్థితుల్లో, రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయం నేపధ్యంలో, రాష్ట్రంలో బీజేపీకి మొదటి షాక్ తగిలింది... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ముందుగా హామీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పిన కొన్ని గంటల్లోనే ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీతో తెగదెంపులకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్తూరుకు చెందిన ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం సుబ్బయ్యను పార్టీలో చేర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో, మంత్రి అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

bjp minister 07032018 2

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. పట్నం సుబ్బయ్యతోపాటు జెడ్పీ మాజీ చైర్మన్ శ్రీనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు. మరింత మంది బీజేపీ నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో నాలుగేళ్ల స్నేహం తర్వాత బీజేపీ నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

bjp minister 07032018 3

ఏపీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. బిజెపితో పొత్తును టిడిపి తెగదెంపులు చేసుకోవాలని భావిస్తోంది.కొందరు బిజెపి నేతలు టిడిపిలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా బిజెపికి నష్టమే..ఏపీ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఇస్తానన్న హమీలతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి కూడ ఇదే అంశాలను ప్రస్తావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు బిజెపి పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది..

బీజేపీ వైఖరి పై విసిగెత్తిపోయిన చంద్రబాబు, ఈ రోజు అసెంబ్లీ వేదికగా ఫుల్ స్టాప్ చెప్పబోతున్నారా ? బీజేపీకి రాం రాం చెప్పి, బీజేపీ చేసిన అన్యాయం పై అసెంబ్లీ వేదికగా చెప్పబోతున్నారా ? అవును అనే సంకేతాలు అమరావతి నుంచి వార్తలు వస్తున్నాయి... గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు చెప్పే సమయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడాల్సి ఉంటుంది... ఈ సమయంలో చంద్రబాబు కేంద్రం చేస్తున్న అన్యాయం పై అన్ని విషయాలు చెప్పి, చంద్రబాబు అసెంబ్లీ వేదికగానే బీజేపీ కి రాం రాం చెప్పే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది...

cbn 07032018 1 2

ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ బీజేపీ హైకమాండ్ , రాష్ట్ర బీజేపీ మంత్రులకు, నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.. చంద్రబాబు పొత్తుకు రాం రాం చెప్పినా, కేంద్ర మంత్రులు బయటకు వచ్చేస్తారని ప్రకటించినా, వెంటనే బీజేపీ మంత్రులు కూడా రాష్ట్రంలో రాజీనామా చెయ్యాలని, అమిత్ షా ఆదేశించినట్టు సమాచారం... అలాగే ఒకవేళ పొత్తు పై, ఏమి మాట్లాడుకుందా కేంద్రం చేస్తున్న అన్యాయం పై మాత్రమే చెప్తే, దానికి దీటుగా సమాధానం చెప్పాలని ఆదేశాలు వచ్చయి... దీంతో ఈ రోజు చంద్రబాబు ఏమి మాట్లాడుతారో అనే ఆసక్తి దేశం మొత్తం చూస్తుంది....

cbn 07032018 1 3

ఏపీ విషయంలో కేంద్రం వైఖరిపై టీడీపీ ఎంపీలు కూడా అసహనం వ్యక్తం చేశారు. యూసీలు ఇవ్వడం లేదన్న కేంద్రం వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. యూసీలు ఇవ్వడంలో దేశంలో మూడోస్థానంలో ఏపీ ఉందని గుర్తు చేశారు. పోలవరానికి ఇచ్చిన నిధులకు ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నామని, యూసీలు ఇవ్వకుండా నిధులు ఎలా ఇస్తున్నారని సీఎం ప్రశ్నించారు. రెవెన్యూలోటు కింద ఇచ్చిన నిధులపై యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కేంద్ర సంస్థలకు ఇచ్చిన రూ.600కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్‌లు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, వాటి ఆధ్వర్యంలో ఉన్న శాఖలని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని జాతీయమీడియాతో చెప్పాలని ఎంపీలకు ఆదేశించారు.

Advertisements

Latest Articles

Most Read