రెండు రోజుల క్రితం అత్యవసర సమావేశం అంటూ, జగన్ పాదయత్ర ఆపేసి మరీ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు... తరువాత రోజు, మేము ఏప్రిల్ 6న రాజీనామా చేస్తున్నాం అంటూ గట్టిగా అరిచి ప్రకటించారు... ఇక అప్పటి నుంచి, మా అన్న మగాడు, మా అన్న మగాడు అంటూ, ఒకటే గోల మొదలు పెట్టారు, కిరాయి బ్యాచ్... పోయిన ఏడు కూడా ఇలాగే రాజీనామా చేస్తా అని, దాక్కున్నాడు కదరా, మరి అప్పుడు మగాడు కాదా అంటే ? ఒక్కొక్కడికీ ఫీజులు ఎగిరిపోయాయి... అయితే, ఈ రాజీనామాల విషయం పై, జగన్ కు అత్యంత సన్నిహితుడు క్లారిటీ ఇస్తూ, మీడియాతో అఫ్ ది రికార్డు లో అసలు గుట్టు చెప్పేశారు....

jagan 14022018 2

ఏవండీ, తెలంగాణా ఇస్తున్నారు అంటే, ఇక్కడ ఆంధ్రాలో అందరు ఎంపీలు, అందరు ఎమ్మల్యేలు రాజీనామా చేస్తున్నాం అంటూ, రాజీనామాలు ఇచ్చారు... ఏమైంది ? ఒక్కటన్నా ఆమోదం పొందిందా ? ఇలాంటి రాజీనామాలు స్పీకర్ ఆమోదిస్టారా ? అంటూ అక్కడ ఉన్న విలేకరులతో చిట్ చాట్ లో చెప్పారు... అంతే కాదు, ఒక వేళ రాజీమాలు ఆమోదిస్తే, ఏమిటి అనే చర్చ కూడా, వీళ్ళ మీటింగ్ లో వచ్చింది అంట.. అందుకే జగన్ తో పాటు, లెక్కలు బాగా వేసే విజయసాయి రెడ్డి, లెక్కలతో సహా, ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఎలా ఫూల్స్ చేస్తున్నారో చెప్పాడు ఈ పెద్ద మనిషి...

jagan 14022018 3

కరెక్ట్ గా పార్లమెంట్ చివరి రోజు, ఏప్రిల్ 6న రాజీనామా చేస్తాం.. తరువాత వేసవి సెలవులు అని, అవి అని ఇవి అని, 3-4 నెలలు వరకు రాజీనామా ఆమోదం పొందే అవకాసం లేదు... స్పీకర్ కార్యాలయం ఒక్కొక్కరిని పిలిచి, మీరు నిజంగానే చేసారా అనే అడుగుతారు... ఇవన్నీ ఎప్పటికి అయ్యెను... ఒక వేళ ఆమోదం పొందినా, నవంబర్ డిసెంబర్ లో ఎన్నికలు అంటున్నారు...సాధారణ ఎన్నికలకు సంవత్సరం ముందు ఉప ఎన్నికలు జరగవు... ఒక వేళ ఉప ఎన్నికలు ప్రకటించినా, మంగళగిరి ఎమ్మల్యే లాంటి వాడి చేత కోర్ట్ లో పిల్ వేసి, ప్రజాధనం వృధా కాబట్టి, సాధారణ ఎన్నికలతో పాటే జరిపేయండి అని చెప్పిస్తాం... ఇన్ని లెక్కలు ఉన్నాయి మాకు... ఉప ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో, నంద్యాల దెబ్బ మా వాడికి గుర్తుంది... అందుకే ఇన్ని ప్లాన్లు వేసాం.. ఫైనల్ ట్విస్ట్ చెప్పనా అంటూ, ఆయన ఏమి చెప్పారో తెలుసా ? ఇన్ని దాటుకుని ఎన్నికలు జరిగినా, మా విజయసాయి రెడ్డికి ఇబ్బంది ఉండకూడదు అని, రాజీనామలు పార్లమెంట్ సభ్యుల వరుకే పరిమితం చేసాం... ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇలా ఏప్రిల్ ఫూల్ అవుతున్నారు అంటూ, జగన్ ఆలోచనలు బయటపెట్టారు...

ఆంధ్రప్రదేశ్ లో 80 శాతం వోట్ బ్యాంకు సంపాదించటానికి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఒక నాలుగు సీట్లు భిక్ష పడేయటానికి, 2019 ఎన్నికల్లో సియం అభ్యర్ధి ఎవరో సోము వీర్రాజు నిర్ణయించటానికి, ఇంకా కుదిరితే, సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వటానికి, ఉత్తర్ ప్రదేశ్ నుంచి బైకులు వచ్చాయి... ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగకపోవటానికి కారణమేమిటో అమిత్ షా, మోడీకి తెలిసిపోయింది.. అందుకే యూపీలో బ్రహ్మాండమైన ఘనవిజయానికి కారణమైన బైకులను బెజవాడ తెప్పించారు... ఇక ఈ బైకులు వేసుకుని, ఊరు ఊరు తిరిగి, 2019 ఎన్నికల్లో బీజేపీ అబ్యార్ది సియం అవ్వటమే మిగిలింది...

veerraju 14022018 2

యూపీ నుంచి యూపీ రిజిస్ట్రేషన్‌తోనే బైకులు బెజవాడ వచ్చయి.. దాదాపు ఒక 100 బైకులు తెప్పించారు... బైకులు కూడా అక్కడ నుంచి తెప్పించాలా అని అడిగితే, వీటితో అక్కడ పని లేదు, అక్కడ ముఖ్యమంత్రి మా వాడే, ఇక్కడ మేము ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి, ఈ బళ్ళు తెప్పించాం... ఈ బైకుల మీద తిరిగి, ఆంధ్రప్రదేశ్ మారు మూల ప్రాంతాలకు తిరిగి చంద్రబాబుని ఎండగట్టి, మా అభ్యర్ధి ముఖ్యమంత్రి అవుతారు అని తేల్చేసారు రాష్ట్ర బీజేపీ నేతలు... అందుకే ఇవి యూపీ రిజిస్ట్రేషన్ బైకులు కాబట్టి, మళ్ళీ చంద్రబాబు టెక్నాలజీ ఉపయోగించి, అవి ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు అని ఎక్కడ లోపల వేస్తాడో అని, ముందుగానే బెజవాడలో రీ రిజిస్ట్రేషన్ చేపించారు...

veerraju 14022018 3

ఇక టైం చూసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి, సోము వీర్రాజు గారు వీటిని ప్రారంభించి, సరా సరి ఈ బైకులు వేసుకునే 2019లో అమరావతి అసెంబ్లీలో అడుగు పెట్టి, "సోము వీర్రాజు అనే" నేను అంటూ ప్రమాణ స్వీకారం చెయ్యటమే మిగిలింది... ఎలాగు సోషల్ మీడియాలో పనీ పాట లేకుండా కొంత మంది దేశం కోసం పోరాడుతూ, గో సంరక్షణ చేస్తున్నారు... అలాంటి వీర దేశ భక్తులకు ఈ బైకులు అందచేసి, తన వీర ప్రతాపాన్ని చూపించబోతున్నారు.... కేంద్రం రాష్ట్రానికి చేసిన లక్షల కోట్ల సహాయం గురించి, ఈ బైక్ లు మీద చెప్తారు, వినటానికి రెడీ అవ్వండి...

ఆ రోజుల్లో టెలికాం రంగంలో రెవల్యుషన్ గురించి వాజ్ పేయ్ కి నేనే సలహా ఇచ్చా అంటే.ఎగతాళి చేసిన బ్యాచ్... 1999లో చంద్రబాబు ఇచ్చిన సలహా మేరకే రిలయన్స్ టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది అని ముకేష్ అంబానీ చెప్తున్నారు వినండి.... ‘‘1999లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జామ్‌నగర్‌లోని మా రిఫైనరీని సందర్శించారు. అప్పుడు మా నాన్న ధీరూబాయ్‌ అంబానీతో మాట్లాడారు. టెలికాం రంగంలోకి వస్తే బాగుంటుందని మాకు సలహా ఇచ్చారు. ఆ రంగం ఊహించనంత ఎదుగుతుందని చెప్పారు. ఆ సలహాతోనే మా నాన్న టెలికాంవైపు అడుగు వేశారు. ఆ రకంగా రిలయన్స్‌ కంపెనీ చంద్రబాబుకు రుణ పడి ఉండాలి’’ అంటూ ప్రశంసలు కురిపించారు.

reliance 14022018 12

రియల్‌ టైం గవర్నెన్స్‌ కేంద్రం గురించి మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిని వెళ్లి రియల్ టైమ్ గవర్నెన్స్‌ను పరిశీలించాలని విజ్ఞప్తిచేస్తే తనకు ఆసక్తి కలిగిందని, ఇప్పుడు సందర్శించే అవకాశం వచ్చిందని పారదర్శక పరిపాలన, జవాబుదారీతనంతో ప్రభుత్వాలు వ్యవహరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైమ్ విధానం అపూర్వమన్నారు. రెవెన్యూ విభాగంలో తీసుకొచ్చిన సంస్కరణలను ప్రధానంగా భూవివరాలను ఆన్‌లైన్ లో వుంచిన విధానం, భూదార్‌లపై అంబాని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ లో మంగళవారం భూగర్భజలాలు సగటున 11.3 మీటర్ల స్థాయిలో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించినప్పుడు ముకేశ్ అంబానీ ప్రశంసాపూర్వకంగా చూశారు.

reliance 14022018 3

ఇలాంటి చంద్రబాబుని పట్టుకుని, బొడ్డు కూడా సరిగ్గా ఊడని బచ్చాగాళ్ళు ఆయన్ను ఎగతాళి చేస్తూ ఉంటే, ఆయన చూస్తూ ఊరుకున్నాడు.... అమెరికా తరువాత మైక్రో సాఫ్ట్ హైదరాబాద్ తెచ్చింది నేనే అంటే ఎగతాళి చేసారు... చివరకు స్వయానా మైక్రో సాఫ్ట్ అధినేత వైజాగ్ వచ్చి, ఆ రోజుల్లో చంద్రబాబు పడిన కష్టం చెప్పి, హైదరాబాద్ రావటానికి చంద్రబాబు ఏమి చేసింది చెప్పారు... ఈ బచ్చా గాళ్ళ నోరు మూపించారు... అలాగే హైదరాబాద్ ఐటి నా పుణ్యమే అంటే ఎగతాళి చేసారు... చివరకు ప్రత్యర్ధి అయిన తెలంగాణా ఐటి మంత్రి కేటీఆర్ స్వయంగా, హైదరాబాద్ ఈ రోజు ఐటిలో ఇలా ఉంది అంటే చంద్రబాబు చలవే అని ఒప్పుకున్నారు.... ఈ బచ్చా గాళ్ళ నోరు మూపించారు... ఆ రోజుల్లో టెలికాం రంగంలో రెవల్యుషన్ గురించి వాజ్ పేయ్ కి నేనే సలహా ఇచ్చా, సెల్ ఫోన్ లు తీసుకురమ్మంది నేనే అంటే ఎగతాళి చేసారు, ఈ రోజు ముకేష్ అంబానీ స్వయంగా చెప్పారు "1999లో చంద్రబాబు ఇచ్చిన సలహా మేరకే రిలయన్స్ టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది అని"... మళ్ళీ ఈ బచ్చా గాళ్ళ నోరు మూపించారు... మీరే ఈ కింద వీడియోలో వినండి... అది చంద్రబాబు స్థాయి... సోషల్ మీడియాలో సునకానందం కోసం వీడియోలు చేసి, ఆయన్ని కించపరిస్తే, ఆకాశం మీద ఉమ్మినట్టే అని ఈ బచ్చా గాళ్ళు గుర్తు పెట్టుకోవాలి...

ఏపీకి ప్రత్యేక హోదాపై మార్చి 5 నుంచి పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తామని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజైన ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.... అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే రాజనీమాలు చెయ్యవచ్చు కదా, అనీ సామాన్య ప్రజలకు కూడా డౌట్ వస్తుంది.. అలాగే ఇది వరకు కూడా జగన్ ఇలాగే ఛాలెంజ్ చేసి, మరుసటి రోజే ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగి వచ్చారు... ఏమైందో ఏమో, అప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేక హోదా అనే మాట మర్చిపోయారు, రాజీనామలు మర్చిపోయారు... దీని పై జేసీ దివాకర్ రెడ్డి తనదైన స్టైల్ లో స్పందించారు...

jc diwakar 14022018 2

'ఏప్రిల్ 6న రాజీనామా చేస్తార‌ట‌, జ‌గ‌న్ కి ఎంత‌టి తెలివి తేట‌లు చూడండి!' అంటూ వ్యంగ్యంగా అన్నారు... 'ఎప్పుడో ఏప్రిల్ 6వ తారీఖు చేస్తారట.. జగన్ బాగా తెలివైనవాడు.. ఏప్రిల్ ఆరున రాజీనామాలు పంపితే వాటి అంగీకారానికి కనీసం రెండు నెలలు పడుతుంది. ఆపై కొన్ని నెల‌ల‌కే జమిలి ఎన్నికలు వస్తాయి. నవంబర్ లేక డిసెంబరులో ఈ జ‌మిలి ఎన్నికలు వస్తాయి.. ఏపీ లోక్ స‌భ‌కి మళ్లీ ఎన్నికలు ఎందుకని ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపదు. నవంబర్ లేక డిసెంబరు వరకు ఆగుతుంది' అని అన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలనుకుంటే ఈ రోజే రాజీనామా చేయొచ్చుకదా? అని ప్రశ్నించారు.

jc diwakar 14022018 3

2014లో ఎన్నికలు ఏప్రిల్ 7 నుండి మే 12 వరకు జరిగాయి అంటే.. ఇప్పుడు ఏప్రిల్ 6, 2018న వాళ్లు రాజీనామా చేసినా అది ఆమోదం పొంది, ఎన్నికల సంఘంకి వెళ్లి ఎన్నికల షెడ్యూల్ వచ్చే సరికి సమయం సరిపోదు కాబట్టి ఎన్నికలు రావు. కాబట్టి ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. జగన్‌కి కూడ ఉప ఎన్నికల్లో పోరాడాల్సిన అవసరం కూడా లేదు. సో.. జగన్ చేయిస్తానన్న రాజీనామాల వెనుక ఎంతో వ్యూహం ఉంది. జగన్ కూడా పక్కా రాజకీయ నాయకుడిగా లెక్కలు వేస్తున్నాడు..’’ అంటూ వివరంగా లెక్కలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు...

Advertisements

Latest Articles

Most Read