గత 15 రోజుల నుంచి రాష్ట్రంలో అలజడి వాతావరణం.. ఎవరి రాజకీయ ప్రయత్నాలు వారివి... రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ఎవరికీ పట్టదు... హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తూన్న వారు మరి కొందరు... ఇక మీడియా సంగతి చెప్పనే అవసరం లేదు... కాని, ఇన్ని ఇబ్బందులు మధ్య కూడా తనకు అప్పచెప్పిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్విహిస్తుంది మాత్రం, ఈ రాష్ట్రంలో ఒక్కరే ఒక్కరు... రాజకీయ ప్రయోజనాలు కంటే, ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం... అందుకే ఆయన ఫ్లో లో ఆయన ఉన్నారు... ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
ఇంత గొడవలు మధ్య కూడా దుబాయ్ వెళ్లి ఎమిరేట్స్ తో ఒప్పందం చేసుకుని వచ్చారు... ఇన్ని ఇబ్బందులు మధ్య కూడా, నెంబర్ వన్ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థల అధినేతని, అమరావతి రప్పించారు... అంబానీ లాంటి పారిశ్రామిక వేత్త, ఊరికే రారు కదా... చంద్రబాబు ఆ విధంగా పావులు కదిపారు... రెండు నెలల క్రితం ఐటి శాఖ మంత్రి లోకేష్ ని పంపించి, ప్రాధమిక చర్చలు జరిపించారు... రెండు నెలలు తిరక్కుండానే, అంబానీ అమరావతిలో అడుగు పెట్టారు...
మహా శివరాత్రి పర్వదినాన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించారు ముకేష్ అంబానీ.... రియల్ టైం గవర్నెన్స్ ప్రశంసలు, చంద్రబాబు విజన్ ప్రశంసలు పక్కన పెడితే, ఈ రోజు అంబానీ మన రాష్ట్రంలో పెద్ద ఎత్తన పెట్టుబడి పెట్టబోతున్నారు.... తిరుపతిలో ఫోన్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు సిద్ధమని అంబానీ ప్రకటించారు... నెలకు 10 లక్షల ఫోన్లు తయారు చేసే సామర్ధ్యం ఉన్న కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు... ఇది సౌత్ ఇండియాలోనే అతి పెద్ద హార్డువేర్ మాన్యుఫాక్చారింగ్ ప్లాంట్ కానుంది... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వటమే ఆలస్యం అని, రెండు వారాల్లోనే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతాం అని చెప్పారు...