ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ వచ్చింది. గుంటూరులో సెమి కండక్టర్ పార్క్ ఏర్పాటుకు ఇన్వెకాస్ ముందుకు వచ్చింది. ఆటోమోటివ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,బయో మెడికల్ రంగాల్లో ప్రోటోటైపింగ్,సెమి కండక్టర్ తయారీలో ఇన్వెకాస్ సంస్థ ఉంది. దేశంలోనే ప్రముఖ సెమి కండక్టర్ తయారీ కంపెనీగా ఇన్వెకాస్ కు పేరు ఉంది. ఇన్వెకాస్ రాకతో హై ఎండ్ ఉద్యోగాల కల్పన జరగనుంది. విశాఖపట్నం ఐటీ హబ్ గాను,తిరుపతి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ కేంద్రం గాను,అమరావతి తో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హై ఎండ్ టెక్నాలజీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి నారా లోకేష్, అమరావతి తో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హై ఎండ్ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా
ఇన్వెకాస్ మొదటి అడుగు కాబోతోంది.

invecase 290620018 2

ఈ కంపెనీని, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.. నగరంలోని విద్యా నగర్‌ 1వ లైనులో నిర్మించిన వేద ఐఐటి అండ్‌ ఇన్వేకాస్‌ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గుంటారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ విజ్ఞప్తి మేరకు నగరంలోని విద్యానగర్‌ ఒకటో లైనులో ఏడు అంతస్థుల భవనంలో ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికే మంగళగిరికి పై డేటా సెంటర్‌ని తీసుకొచ్చి వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. వారం రోజుల క్రితం రాజధానిలోని రాయపూడిలో ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేశారు. 36 అంతస్థులలో నిర్మాణం జరగనున్న ఆ టవర్‌ ఐటీ కంపెనీలకు హబ్‌గా మారనుంది.

invecase 290620018 3

తాజాగా గుంటూరు నగరానికి తొలిసారిగా ఐటీ కంపెనీని తీసుకురాబోతోన్నారు. ఇందులోనూ వందల సంఖ్యలో సాఫ్టువేర్‌, హార్డ్‌వేర్‌ ఉద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. 24 వేల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నిర్మించిన వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు ఒకే టవర్‌లో కార్యకలాపాలాను ప్రారంభించనున్నాయి. బెంగుళూరు,అమెరికా పర్యటనల్లో భాగంగా పలు మార్లు ఇన్వెకాస్ ప్రతినిధులతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి నారా లోకేష్ ఒప్పించారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి తదితర వివరాలు ప్రకటిస్తారు.

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ గత తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఆరోగ్యం పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాకబు చేశారు. ఈ మేరకు ఆయన కోల్‌కతా రాజ్‌భవన్‌ నుంచి కడప జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సీఎం రమేశ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, తన ఆరోగ్యం దినదినం క్షీణిస్తున్నా, పట్టు సడలకుండా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని రమేశ్‌ తేల్చి చెబుతున్నారు. ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖమంత్రి బీరేంద్రసింగ్‌ ఆయనతో 15 నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడి దీక్ష విరమించాలని కోరినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేయాలని మంత్రిని కోరిన విషయం తెలిసిందే.

venkayya 28062018 2

మరో పక్క, అమెరికా నుంచి వచ్చిన సీఎం రమేష్ ఫ్యామిలీ డాక్టర్ రాజాతల్లూరి రమేష్ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదని ఐసియూలో పెట్టి చికిత్స చేయాల్సిన స్టేజీలో వున్నారని చెప్పారు. ఇంకా దీక్ష కొనసాగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ రాజాతల్లూరి చెప్పారు. దీంతో టీడీపీ నేతలు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. కాగా సీఎం రమేష్‌తోపాటు దీక్ష చేపట్టి ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోగ్యం క్షీణించడంతో నిన్న ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

venkayya 28062018 3

రాష్ట్ర ప్రభుత్వానికి 9 అంశాలతో మెకాన్ సంస్థ.. అదే విధంగా కేంద్రం కూడా 9 అంశాలపై క్లారిటీ కావాలని కోరింది. అందులో 7 అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది. ఇంకా 2 అంశాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వలేదంటూ నిన్న బీరేంద్ర సింగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న మెకాన్ సంస్థ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖలో రెండు అంశాలకు క్లారిటీ ఇవ్వాలని కోరింది. అందులో లాండ్, లింకేజి విషయంలో స్పష్టత రావాలని కోరింది. మెకాన్ లేఖకు సమాధానంగా ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం సమాధానం రాసింది. లాండ్‌కు సంబంధించి పూర్తి వివరణ ఇచ్చింది.

మొక్కు చెల్లించటానికి కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చిన కెసిఆర్, రాజధాని రోడ్లు చూసి కాంప్లిమెంట్ ఇచ్చారు. కెసిఆర్ తో పాటు ప్రోటోకాల్ లో భాగంగా, మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. గన్నవరం దిగిన దగ్గర నుంచి, దర్శనం అయ్యే వరకు, దేవినేని ఉమా అన్నీ దగ్గర ఉంది చూసుకున్నారు. ఈ సందర్భంగా, దుర్గమ్మ దర్శనం బాగా చేయించారని ఏపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ తన సమక్షంలోనే అమ్మవారికి ముక్కుపుడకను అలంకరించడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబుతో మాట్లాడి కృతజ్ఞతలు తెలుపుతానని చెప్పారు. కానీ ఆముదాలవలస సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారని సీఎంవో చెప్పారని.. హైదరాబాద్ వెళ్లగానే ఫోన్ చేస్తానని తెలిపారు.

uma 2806201 2

ఇదే సందర్భంలో రాజధాని రోడ్ల గురించి, దేవినేని ఉమాతో తన అభిప్రయన్ని పంచుకున్నారు. విజయవాడ బాగా అభివృద్ధి చెందిందని కితాబిచ్చారు. అలాగే ఎయిర్‌పోర్టు కూడా బాగుందని ప్రశంసించారు. బందర్ రోడ్డును బాగా విస్తరించారని.. ఎయిర్‌పోర్టు నుంచి బందరు రోడ్డు వరకు గ్రీనరీ బాగుందని మెచ్చుకున్నారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా పెయింటింగులు కూడా బాగున్నాయని తెలిపారు. చెట్లకు కూడా రంగులు వేసారని, వర్షం పడినా, ఎక్కడా పెద్దగా ఇబ్బంది కనిపించలేదని అన్నారు. ఈ సందర్భంగా, విజయవాడకు స్వచ్చ ర్యాంకింగ్స్ లో మొదటి వచ్చిన విషయం కెసిఆర్ కు చెప్పారు ఉమా.. రాష్ట్ర ప్రభుత్వం, తీసుకుంటున్న చర్యలు వివరించారు.

uma 2806201 3

కెసిఆర్ గతాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. బెజవాడతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రవాణా మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ బస్టాండ్ నిర్మించామని గుర్తుచేశారు. ఆసియాలోనే పెద్ద బస్టాండ్‌గా ఉండాలని ఎన్టీఆర్ అన్నారని జ్ఞాపకం చేశారు. బస్టాండ్ పనులను పరిశీలిందుకే అనేక సార్లు విజయవాడ వచ్చానని వెల్లడించారు. దుర్గగుడి బాగా మారిపోయిందని కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు కొండపల్లి బొమ్మను మంత్రి దేవినేని ఉమ బహూకరించారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు పవిత్రసంగమం తన నియోజకవర్గంలోనే ఉందని దేవినేని ఉమ వివరించారు. దుర్గగుడి ఘాట్‌లను ఎప్పుడు అభివృద్ధి చేశారని దేవినేని ఉమను కేసీఆర్ ఆరా తీశారు. పుష్కరాల సమయంలోనే అభివృద్ధి చేశామని దేవినేని ఉమ బదిలిచ్చారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ పల్లెబాట పట్టారు. ఏ హడావిడి లేకుండా, ఏ ప్రచారం లేకుండా, ప్రజల మధ్యకు వెళ్లారు. అందులో భాగంగా చినమత్తూరు మండలం, దిగువపల్లి తండా గ్రామంలో పల్లె నిద్ర చేశారు. గురువారం తెల్లవారుజామున నిద్రలేచి దినచర్యలో భాగంగా వ్యాయామం చేశారు. సినిమాల్లో తాము చేసే ఫీట్లకు శారీరక దృఢత్వం ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో బాలయ ముఖాముఖి చర్చలు జరిపారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అంతా విస్తృత పర్యటనలకు బాలకృష్ణ సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా బుధవారం ‘మూడు రోజుల పల్లె నిద్ర’కు శ్రీకారం చుట్టారు.

balayya 28062018 2

తొలిరోజు చిలమత్తూరు మండలం చాగలేరు ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం దిగువపల్లె ఎస్టీ తాండాలో బాలకృష్ణ పల్లెనిద్ర చేశారు. అంతకు ముందు ప్రజల నుంచి వినతులు అందుకొన్నారు. గ్రామానికి రహదారి, దేవాలయం మంజూరు, సామాజిక భవనం ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. గ్రామంలో అందరూ నిరుపేదలేనని భూముల్ని లేపాక్షినాల్జెడ్‌ హబ్‌కు తీసుకోవడంతో వలసలు తప్పలేదన్నారు. ఉపాధి మార్గం చూపాలని కోరారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ భూములు ఈడీ చేతుల్లోకి వెళ్లడంతో కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.

balayya 28062018 3

ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు, నేరుగా వారి వద్దకే వెళుతున్నట్టు ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తెలుగు ప్రజలకు అండగా ఉంటూ ముందుకు తీసుకెళుతున్నారన్నారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా ప్రజల వద్దకే వచ్చానని తెలిపారు. మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొనేందుకు వస్తారని, మోసపోవద్దని, అభివృద్ధిని చూసి నిర్ణయం తీసుకోమని ప్రజలకు సూచించారు. కడప ఉక్కు కర్మాగారం, పారిశ్రామిక నడవా, విశాఖ రైల్వేజోన్‌, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు అందించాల్సి ఉండగా అడ్డుచెబుతూ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. రాజీనామా పేరిట వైకాపా నేతలు డ్రామాలు ఆడుతున్నారని, కేంద్రాన్ని పల్లెత్తుమాట అనడంలేదన్నారు. గత పాలకులు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకొని దోచేశారన్నారు.

Advertisements

Latest Articles

Most Read