ప్రతిపక్ష నాయకుడు జగన్ మహాన్ రెడ్డి నోటికి అడ్డు అదుపూ అనేది లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే ఉరి వేస్తా, బట్టలు విప్పుతా, కాల్చేస్తా, చీపిరితో కొడతా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఎమ్మల్యేల పై కూడా ఇలాగే విమర్శలు చేస్తున్నారు. అయితే, సిన్సియర్ ఐఏఎస్ అధికారుల పై కూడా, ఇలాంటి మాటలే మాట్లాడుతూ, సొంత పార్టీ నేతల చేత ఛీ కొట్టించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కాటంనేని భాస్కర్‌ సుధీర్ఘకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారని, ఆయనను ఇక్కడ ఎందుకు అంతకాలం పనిచేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యేలతో కలసి దోచుకున్న సొమ్మును కలెక్టర్‌ చంద్రబాబుకు చేరవేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

jagan 22062018 2

నాలుగేళ్లుగా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్ పై జిల్లా వైకాపా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఆయన అవినీతికి పాల్పడినట్లు కానీ, చంద్రబాబుకు ముడుపులు ఇస్తున్నారని కానీ ఈ నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ విమర్శించలేదు. అత్యంత నిజాయితీపరుడైన యువ ఐఎఎస్‌ అధికారిగా భాస్కర్‌ కు పేరుంది. ఇటువంటి విమర్శలు, ఆరోపణలు వస్తాయనే కారణంతోనే తనను బదిలీ చేయాలని ఆయన కోరుతున్నా, సిఎం చంద్రబాబు మాత్రం ఒప్పుకోవటం లేదు.

jagan 22062018 3

అయితే జగన్ కలెక్టర్ పై విమర్శలు చెయ్యటంతో, స్థానిక వైకాపా నాయకులు ఈ వ్యవహారంపై మాట్లాడుతూ తమ అధినేతను, ఎవరో తప్పుదోవపట్టించా, జిల్లా కలెక్టర్‌ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారైనా, ఆయన ఎప్పుడు కులపక్షపాతం వహించలేదని, అందరినీ ఆయన దగ్గరకు తీస్తారని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ పై ఆరోపణలు చేసిన జగన్‌ పై చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన కొందరు అధికారులు డిమాండ్‌ చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేయడం, పోలవరం ప్రాజెక్టును ఒక కొలిక్కి తేవడం, మారు మూల ప్రాంతాలకు సైతం సుపరిపాలన అందించి ప్రజా కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న భాస్కర్‌ పై ఇటువంటి ఆరోపణలు చేయడం విడ్డూరమని వారు అంటున్నారు.

సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన దాదాపు ఏడేళ్లు సేవలందించారు. అయితే ఈ సందర్భంలో, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‍దీప్ సర్దేశాయ్ అదిరిపోయే ట్వీట్ చేసారు... ఇది ఆయన ట్వీట్ "Justice Chelameshwar retires from SC today; he and wife packed their bags, left their Govt bungalow at 5 am for his village. Bungalow handed over exactly as he got it 6 years go! How many netas would do this? Inspiring! Salute you sir! Not everyone is trapped in VVIP culture!"

rajdeep 22062018 2

1953 జూన్‌ 23న జన్మించిన జస్టిస్‌ చలమేశ్వర్‌ స్వస్థలం కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని పెదముత్తేవి. మచిలీపట్నంలో పాఠశాల విద్య, చెన్నైలో కళాశాల విద్య పూర్తయ్యాక 1976లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. 1995లో సీనియర్‌ న్యాయవాది అయ్యారు. ఏపీ, గువాహటి, కేరళ హైకోర్టులకు సేవలందించాక 2011 అక్టోబరు 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. . ప్రధాన న్యాయమూర్తి పనితీరుపై సహచర న్యాయమూర్తులతో కలిసి జనవరి 12న విలేకరుల సమావేశంలో ఆయన చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అవుతుందని చరిత్రాత్మక తీర్పు ప్రకటించిన తొమ్మండుగురు న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని రద్దు చేసిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆయన ఒకరు.

కొలీజియం సిఫార్సులు అపారదర్శకంగా ఉంటున్నాయని తప్పుపట్టిన ఏకైక న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌. మరోపక్క- ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించే అంశంపై డోలాయమాన పరిస్థితి మరికొంత కాలం కొనసాగడం అనివార్యంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును సిఫార్సు చేయగా ప్రభుత్వం దానిని తిప్పిపంపడం, జస్టిస్‌ జోసెఫ్‌ పేరునే పునరుద్ఘాటించాలని కొలీజియం భావించడం తెలిసిందే. పదవీ విరమణ చేస్తున్న జస్టిస్‌ చలమేశ్వర్‌ స్థానంలో మరో న్యాయమూర్తి కొలీజియంలోకి రావాల్సి ఉంది.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి... మొన్నటి దాక, తెలుగుదేశం పార్టీతో ఉన్న పవన్ కళ్యాణ్, సడన్ గా ప్లేట్ మార్చేసారు... మోడీని ఒక్క మాట అనకుండా, ప్రత్యెక హోదా పై, విభజన అంశాల పై ఏమి చేస్తాడో చెప్పకుండా, కేవలం రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబునే టార్గెట్ చేస్తూ, గత మూడు నెలలుగా పవన్ హంగామా చేస్తున్నాడు... మోడీని ఒక్క మాట అనకుండా, కేంద్రం పై ఎదురు తిరుగుతున్న చంద్రబాబుని ఎందుకు నిందిస్తున్నారో, పవన్ ఎజెండా ఏంటో అని ప్రజలు అనుకుంటున్నారు... అయితే ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఆట అని, కేవలం తనకి ఎదురు తిరిగాడు అనే కసితో, చంద్రబాబు పై అన్ని అస్త్రాలని ప్రయోగిస్తుందని ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు.

jagan 2062018 2

ఇది ఇలా ఉండగా, ఇప్పుడు ఈ ముసుగు ఆటలు లేకుండా, పవన్, జగన్, బీజేపీ బహిరంగగా కలిసి, చంద్రబాబు పై దాడి చెయ్యటానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, వైసీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే ఒక అవగాహానకు వచ్చేసాయి. ఈ రోజు వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, ఇవన్నీ అవును అనే సమాధానం వస్తుంది. వరప్రసాద్, పవన్ కల్యాణ్ స్నేహితులన్న సంగతి తెలిసిందే. తాజాగా వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ వైసీపీకి మద్దతిస్తారని.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తనతో చెప్పారని వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బాగా అవినీతి చేస్తున్నారని, అందుకే జగన్ తో కలిసి వెళ్లి, చంద్రబాబుని ఓడించాలి అని పవన్ చెప్పినట్టు, ఈ రోజు వరప్రసాద్ మీడియాతో చెప్పారు.

jagan 2062018 3

ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. 2019లో మద్దతంటూ ఇస్తే వ్యక్తిగతంగా అన్యాయం జరిగిన కష్టజీవి జగన్మోహన్‌రెడ్డికి సపోర్ట్ చేస్తానని పవన్ చెప్పారని.. ఇది వాస్తవమని.. ఆయన అభిప్రాయం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానని ఈ వైసీపీ మాజీ ఎంపీ చెప్పారు. ఇన్నాళ్లూ పవన్, జగన్ కలిసి బీజేపీ ఆడిస్తున్నట్లు ఆడుతున్నారన్న టీడీపీ ఆరోపణలకు వరప్రసాద్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చుతున్నాయి. చంద్రబాబు అవినీతి పరుడు, జగన్ కష్టజీవి అని పవన్ అనటం చూస్తుంటే, ఆపరేషన్ గరుడ ఎంత ఫుల్ ఫ్లో లో ఉందో అర్ధమవుతుంది. కేవలం, రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అని అన్నందుకు, బీజేపీ, పవన్, జగన్, ఇలా ఎగబడుతూ, చంద్రబాబుని దించటానికి నానా అవస్థలు పడుతున్నారు.

అది ఓ ఆధ్యాత్మిక ఆశ్రమం.. కానీ ప్రజలు ఎవరికీ ఎంట్రీ లేదు... అసలు అక్కడ ఓ ఆశ్రమం ఉన్నట్టే ఎవరికీ తెలియదు. కానీ ఆ ఆశ్రమం గురించి ఉత్తరాది నాయకులు అందరికీ బాగా తెలుసు అందుకే కేవలం వీవీఐపీలు మాత్రమే అక్కడకు వస్తూ ఉంటారు... ఉత్తరాదికి చెందిన రాజకీయ ప్రముఖులు కూడా వస్తుంటారు... అయితే ఇక్కడకి ఎవరు వచ్చినా అంతా సీక్రెట్ గానే వస్తుంటారు తప్ప ఎక్కడా ఫోకస్ అవ్వడానికి మాత్రం ఇష్టపడరు. మొన్న అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు కూడా, ఇక్కడ 40 నిమషాలు సీక్రెట్ గా ఉన్నారు. ఇప్పుడు దీని గురించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీ సిద్దేశ్వర్ తీర్థ్ బ్రహ్మర్షి ఆశ్రమంలో స్వామి గురువానంద కొంత మందిని మాత్రమే కలుస్తారు, అదికూడా రహస్యంగా. కొన్ని నెలల క్రితం ఒకానొక అధికారి వచ్చారు! ఆ ఆశ్రమంలో స్వామీజీని సందర్శించుకున్నారు! వెళ్లారు! ఆ తర్వాత ఇరవై రోజుల్లోపలే దేశంలోని ఒక ప్రముఖ ఆర్థిక లావాదేవీల సంస్థకు ఆయన సారథి అయ్యారు.

అమిత్‌షా కంటే ముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రవిశంకర్‌ ప్రసాద్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ తదితర ప్రముఖులు ఈ ఆశ్రమానికి వచ్చి వెళ్లారు. ఇక్కడకు వచ్చే చాలామంది ప్రముఖులు రెండో కంటికి తెలియకుండా, రాత్రి సమయాల్లో నే వచ్చిపోతుండటం విశేషం! దీంతో ఈ ఆశ్రమం చుట్టూ అనేక ఊహాగానాలు అలుముకుంటున్నాయి. పెద్దగా ప్రచారంలో లేని, మారుమూలన ఉండే ఆశ్రమాలను భద్రమైనవిగా భావించి.. వాటిని వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల ‘అవసరాలకు’ ఉపయోగించుకుంటున్నారా.. అ నే ఊహ అందులో ఒకటి! తిరుపతి సమీపంలోని గుట్టల్లోని ఆశ్రమానికి అత్యంత ప్రముఖుల రాకపోకలు రహస్యంగా జరుగుతుండటం మాత్రం నిజం.. అయితే ఈ వార్తా బయటకు రాగానే, స్థానికులు భగ్గు మన్నారు. రామాపురం సిద్ధేశ్వరతీర్థ బ్రహ్మర్షి ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాల పై ఎదురు తిరిగారు. నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి, ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు. ఆశ్రమంలోని కృష్ణ మందిరం, గోశాలను కమిటీ సభ్యులు పరిశీలించారు.

కాగా గురుదేవ్ ఏకాంత మందిరాన్ని కూడా పరిశీలించాలని లోనికి వెళ్తున్న కమిటీ సబ్యులను ఆవ్రమం సిబ్బంది అడ్డుకున్నారు. స్వామీజీ గురువానంద్ ఆశ్రమంలో లేరని ఆపడంతో కమిటీ సభ్యులు కాసేపు ధర్నా చేశారు. నిజనిర్ధారణ కమిటీ ఆందోళనకు దిగితే అంతలో వైసీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. గురుదేవ్ లేని సమయంలో రాద్ధాంతం ఏంటంటూ విరుచుకుపడ్డారు. దీంతో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ధీటుగా బదులిచ్చారు. ఇక్కడ రాజకీయాలు చేయవద్దన్నారు. వాస్తవాలు తెలుసుకునేందుకే తాము వచ్చామన్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆశ్రమంలో తనిఖీలకు వెళ్లిన సందర్భంలో సి.రామాపురం గ్రామస్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్వామీజీ తమ భూములను ఆక్రమించుకున్నారని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Advertisements

Latest Articles

Most Read