2014లో తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, రాష్ట్రాన్ని ముందుకు నడిపించటమే చంద్రబాబు పని. తన కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ, ఉదయం 7 గంటల నుంచి మొదలయ్యే సమీక్షలు, రాత్రి 11 గంటల వరకు కొనసాగేయి. ఒక పక్క కేంద్రం పెడుతున్న ఇబ్బందులు, రాష్ట్రంలో కొన్ని పార్టీలు పన్నుతున్న కుట్రలను ఎదుర్కోవాలి. మరో పక్క పెట్టుబడుల కోసం నిరంతరం వివిధ పక్షాలతో చర్చలు. మరో పక్క, ప్రజల సంక్షేమం కోసం పధకాల రివ్యూలు, రాష్ట్రంలో అభివృద్ధి, ఇలా ప్రతి నిమషం రాష్ట్ర అభివృద్ధి కోసమే చంద్రబాబు పాటు పడుతూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీకి దూరం అయ్యారనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల పార్టీలో ఉన్న కలహాలు, ప్రత్యర్ధికి ఆయుధం అవుతున్నాయని, చంద్రబాబు పట్టించుకుంటేనే ఈ సమస్య తీరుతుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది.
అయితే ఎట్టకేలకు చంద్రబాబు వీరి మోర ఆలకించారు. ఎన్నికలు డిసెంబర్ లోనే వస్తాయి అనే సంకేతాలు రావటంతో, ఇక నుంచి పరిపాలనతో పాటు పార్టీని కూడా చూసుకుంటాను అని చెప్పారు. చెప్పటమే కాదు, చేసి చుపిస్తున్నరు కూడా. గత వారం రోజుల నుంచి, ఉదయం నుంచి సాయంత్రం వరకు సెక్రటేరియట్ లో ఉంటూ, సాయంత్రం నుంచి రాత్రి వరకు పార్టీ సమీక్షలకు టైం కేటాయిస్తున్నారు. ఈ పరిణామంతో, పార్టీ వర్గాలు సంతోషిస్తున్నాయి. ఇక చంద్రబాబు పార్టీ విషయాలు చూసుకుంటారు కాబాట్టి, నిశ్చింతగా ఉండవచ్చు అని, ప్రత్యర్ధి పార్టీల కుట్రలు గట్టిగా తిప్పి కొట్టే వీలు ఉంటుందని అంటున్నారు.
చంద్రబాబు కూడా సమన్వయ కమిటీ సమావేశం ఎప్పుడు జరిపినా ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కూడా సూచిస్తున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీ సమీక్షను కూడా మొదలు పెట్టారు. వరుసగా సర్వేలు చేయిస్తున్నారు. 40 నియోజకవర్గాలలో పార్టీ వెనుకబడి ఉందని నిర్దారించుకుని వాటి పై దృష్టి పెట్టారు. పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాల వ్యూహానికి ప్రతివ్యూహం రూపొందించుకుంటున్నారు. ప్రతి మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు..ఎమ్మెల్యేలు.. ఎంపీలు... జిల్లా పార్టీ అధ్యక్షులు.. ఇన్ఛార్జ్లు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.