శుక్రవారం రోజు, అవిశ్వాసం పెట్టుకుని, ఈ రోజు డ్రామా మొదలు పెట్టింది కేంద్రం. మన రాష్ట్రంలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఎల్లుండి ఈ విషయం గురించి, చెప్పాలి కాబట్టి, ఆదరాబాదరాగా ఈ రోజు, ఈ బిల్లు పై కేంద్రం క్యాబినెట్ లో పెట్టి ఆమోదించింది. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయం ట్విట్టర్ లో చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీస్ (అమెండ్మెంట్) బిల్ 2018కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీకి పచ్చ జెండా ఊపిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉన్నత విద్యారంగంలో ఏపీకి ఇదో మైలురాయి అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనం అన్నారు.
అయితే, దీని వెనుక ఉన్న వాస్తవం చూద్దాం.. ఇదేదో, బీజేపీ, మోడీ మన మీద ప్రేమతో ఇచ్చేది కాదు. ఇది రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో పలు కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయం ఉంది. ఇందులో భాగంగానే సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కూడా ఉంది. దీని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా జంతలూరులో, 2015లోనే భూమి కేటాయించింది. దీని కోసం కోట్ల విలువ చేసే, 491.23 ఎకరాలు భూమి అప్పట్లోనే ఇచ్చింది. అంతే కాదు, ఈ యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు కేటాయించింది..
కేంద్రం ముందుగా చెయ్యల్సింది, సెంట్రల్ యూనివర్సిటీ చట్టానికి సవరణలు. అప్పుడు కాని, యూనివర్సిటీ పెట్టటం కుదరదు. ఈ చిన్న పని, 4 ఏళ్ళు అయినా చెయ్యలేదు.. ఇప్పుడు రెండు రోజుల్లో అవిశ్వాసం, సుప్రీమ్ కోర్ట్ లో కేసు, ప్రజల ఆందోళన చూసి, కనీసం ఆ బిల్ అయినా పెట్టి, పనులు మొదలు పెట్టాలని చూస్తుంది. దీని కోసం, ఎదో చేసేసినట్టు, మనకి ఎదో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు హడావిడి చేస్తున్నారు. వీళ్ళు ఆ చట్టంలో సవరణ తెచ్చి, ఇప్పుడు కేంద్ర విద్యా సంస్థలకు ఇస్తున్నట్టు డబ్బులి ఇస్తూ పొతే, ఇది కూడా మరో 50ఏళ్ళు పడుతుంది... దీనికి ఎదో చేసేసినట్టు బిల్డ్ అప్ ఇస్తారేంటి ? ఇలాంటి డ్రామాలు, ఈ రెండు రోజుల్లో చాలా చెప్తారు. కాని ఆచరణలో ఏమి ఉండవు. 4 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం కదా...