చంద్రబాబుకు ఈనాటి రాజకీయం తెలియక, ఇంత పని చేసినా ఓడిపోతున్నారు కాని, ఆయన వేసిన బీజాలు మాత్రం, ప్రతి క్షణం తెలుగు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎంతటి శత్రువుకి అయినా, బయటకు చెప్పక పోయినా, లోపల మాత్రం, చంద్రబాబుని గుర్తు చేసుకోకుండా ఉండలేరు. ఇంత ఎందుకు, చంద్రబాబు 2003లో దిగిపోయిన తరువాత, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత, హైటెక్ సిటీ ముందు నుంచి వెళ్తూ, చంద్రబాబు ఎంతో చేశాడయ్యా అని చెప్పారని, అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. చంద్రబాబు ముందు చూపుతో, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసారు. అందుకే ఆయన్ను విజనరీ అని అనేది. కాకపోతే సరైన రాజకీయం చెయ్యలేక, చేసిన మంచి కొనసాగించక లేకపొతున్నారు. మొన్నామధ్య ఢిల్లీలో, ఒక టిడిపి ఎంపీతో, కేంద్ర మంత్రి అన్న మాటలు "బాబు ఈజీ ఏ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, బట్ నాట్ ఏ పొలిటీషియన్" అని అన్నారు అంట. ఇదంతా ఎందుకు అంటే, చంద్రబాబు చేసిన పనికి, 20 ఏళ్ళు తరువాత కూడా ఇంకా ఫలితాలు వస్తున్నాయి అని చెప్పటానికి.
ప్రపంచ అందాల ప్రపంచం పారిస్ లో నుండి గత రాజకీయ మహానాడు ప్రాంగణంలో స్టాల్ వరకు మన అరకు గిరిజనులు పండించిన కాఫీ ముక్కుపుటాలను తాకుతూ ఘుమఘుమలాడించింది. అరకు కాఫీ ఆ స్థాయికి ఎదగడానికి నాంది పడింది ఇరవై ఏళ్ల క్రితం. డాక్టర్ అంజిరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు పిలిపించుకుని ఒప్పించి సందేహాలు తీర్చి నాందీ ఫౌండేషన్ అనే సామాజిక స్వచ్ఛంద సంస్థ పెట్టించడం వలన. రెడ్డి గారు దానిని మనోజ్ గారికి అప్పజెప్పడం వలన. ఆనాటి ముచ్చట్లను రెడ్డి గారు తన ఆత్మ కథలో వ్రాసుకొన్నారు. చంద్రబాబు తన 2020 విజన్ కి రెడ్డీస్ ల్యాబ్ ఫలితాల అంకెలను ఆదర్శంగా తీసుకొని, ప్రభుత్వం కూడా ఇలా ఆర్థిక పురోగతి సాధించాలని అలవాటు చేసుకొని, మొన్న దిగిపోయే వరకు ఆంధ్రాను దేశంలో అభివృద్ధి ర్యాంకింగులలో నిలిపేవరకు ఆచరించారు.
మంచి చేయడానికి ఒకరి ఆశయాలు మరొకరు అందిపుచ్చుకోడానికి కులాలు అడ్డు అనుకోలేదు. వారి వారి రంగాలలో అధికులమనే అహంకారం తలకెక్కించుకోలేదు. అందుకే ఆంధ్రా అయినా అరకు కాఫీ అయినా పోటీపడి నిలబడ్డాయి. అహంకారంతో వేరేవారికి పేరు రాకూడదని పెడధోరణలు పడితే 5 నెలల పాలన పాతాళం వైపు ఎలా పయనిస్తుందో చూస్తున్నాం. ప్రజాధనంతో వేల గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల కల్పనకే మనం బెక బెక మంటే, లక్ష ఉద్యోగాలు కల్పించిన ఇలాంటివి కార్పోరేట్ దిగ్గజాలతో పెట్టించిన నాయకుని గురించి ఏమని ప్రశంసించాలి. నాందీ ఫౌండేషన్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలతో. సౌజన్యం: చాకిరేవు.