అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూదన్ ఈ రోజు ఒక లేఖ రాశారు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న జోన్లు విషయం పై , చేపట్టాల్సిన చర్యల పై ఆ లేఖలో పలు ఆదేశాలు ఇచ్చారు. రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో మార్పులు చేసినట్లు ప్రీతి సూదన్ వివరించారు. నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి తీవ్రత ఆధారంగా జోన్లు విభజించామని తెలిపారు. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు ప్రీతి సూదన్ వెల్లడించారు. కొత్తగా వచ్చిన లిస్టు ప్రకారం దేశంలో 130 జిల్లాలు రెడ్ జోన్లలో ఉన్నాయి. ఆరెంజ్ జోన్‌లో 284, గ్రీన్‌ జోన్‌లో 319 జిల్లాలు ఉన్నాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. రెడ్ జోన్ లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆరంజ్ జోన్ లో ఏమి చెయ్యాలి, గ్రీన్ జోన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని పై, పూర్తీ వివరాలతో లేఖ రాసారు. అలాగే ప్రతి చోట, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే, నడుచుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రెడ్‌జోన్‌ జిల్లాల్లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉన్నాయి. ఆరెంజ్‌ జోన్‌ జిల్లాల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ ఉన్నాయి. గ్రీన్‌జోన్‌ జిల్లాల్లో కేవలం విజయనగరం మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గత 24 గంటల్లో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఈ రోజు విడుదలైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ చెప్పింది. కొత్త కేసులతో కలిపి ... మొత్తం సంఖ్య 1463కు చేరిందని ప్రభుత్వం ప్రకటించింది.

గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో 33 మంది మృతి చెందినట్లు పేర్కొంది. 403 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్​లో తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 1027 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. గత 24 గంటల్లో 7902 మంది నుంచి నమునాల సేకరించి పరీక్షలు చేయగా, వారిలో 60 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించింది. ఇక మే 3తో లాక్ డౌన్ ముగుస్తు ఉండటంతో, కేంద్రం ప్రభుత్వం తరువాత ఏమి చెయ్యాలి అనే దాని పై కసరత్తు చేస్తుంది. దీని పై రేపు ప్రధాని మాట్లాడే అవకాసం ఉంది.

రాష్ట్రంలో ఎన్నికల అధికారి తొలగింపు విషయంలో ఒక్కపక్క వివాదం కొనసాగుతుండగా మరోపక్క హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతుండగా అనుమతి లేకుండా 30 మంది న్యాయవాదులు వీడియోలో చొచ్చుకురావడం మరో సమస్యగా మారింది. ఈ అంశంపై హైకోర్టు సీరియస్ గా తీసుకుంది, పాస్వర్డ్ ఎవరికి ఇస్తారో వారు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ కు రావాల్సి ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ ను ఎన్నికల అధికారిగా తొలగించిన విషయంపై గత రెండు రోజులుగా హైకోర్టులో విచారణ జరగుతోంది. లాక్ డౌన్ అమలులో ఉండటంలో సిజె ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం వాదనలు ప్రారంభమయ్యాయి. . ఇప్పటి వరకు ఆరుగురు పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదనను వివరించారు. ప్రముఖ న్యాయవాది వేదుల వెంకటరమణ తన వాదనలు ప్రారంభించారు.

అయితే ఈ సమయంలో అనూహ్యగా అనుమతించిన వారు కాకుండా సుమారు 30 మంది న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ లోకి చొచ్చుకువచ్చారు. ఒకేసారి స్క్రీన్ పై ఎక్కువ మంది న్యాయవాదులు రావడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో సీక్రెట్ గా ఉండాల్సిన పాస్వర్డ్ ఇతరులకు ఎలా చేరిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరియస్ గా వాదనలు జరుగుతున్న తరుణంలో క్రాస్ టాక్ రావడం సరికాదని ఆయన అన్నారు. దీనితో విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని నేరుగా కోర్టులోనే విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసులో పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులకు లాక్ డౌన్ నుంచి మినహాయిస్తూ పాసులు జారీ చేయాలని డిజిపికి ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది న్యాయవాదులు హైదరాబాద్ నుంచి రావల్సి ఉండటంతో ఈ విషయంలో డిజిపితో సంప్రదించనున్నట్లు సిజె తెలిపారు.

సోమవారం అందరూ సామాజిక దూరం పాటించి విచారణకు హాజరుకావాలని ఆయన కోరారు. ఎన్నికల అధికారిగా విధుల నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్లో పాటు ఆరుగురు ప్రజావాణ్యం పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ఎన్నికల కార్యాలయం కౌంటర్లు దాఖలు చేశాయి. మొత్తం వది మంది ఈ పిటిషన్లో వాదనలు వినిపించాల్సి ఉంటుంది. అయితే విచారణ సోమవారానికి వాయిదా పడటంతో, అప్పటి వరకు కొత్త ఎలక్షన్ కమీషనర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని, ఆదేశాలు ఇవ్వాలని, రమేష్ కుమార్ తరుపు న్యాయవాది కోర్ట్ ని కోరారు. అయితే ఈ విషయం పై మాట్లాడిన హైకోర్ట్, లాక్ డౌన్ ముగిసిన తరువాత, మూడు వారాల లోపు, అన్ని ప్రభుత్వ భవనాలకు వేసిన రంగులు తొలగించే వరకు, ఎన్నికలు జరపటానికి వీలు లేదని, ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేసారు. రంగులు తొలగించకుండా, ఎన్నికలకు వెళ్తే, అప్పుడు కోర్ట్ ఏమి చెయ్యాలో అది చేస్తుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కేసులు దూసుకుపోతున్నాయి. ఏపీలో క-రో-నా పాజిటివ్ కేసులు 1,403 కి చేరుకున్నాయి. నేడు కొత్తగా 71 పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 321 మంది డిచ్చార్జ్ కాగా,31 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 1,051 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో 43, కృష్ణా 10, గుంటూరు 4, కడప 4, అనంతపురం 3, చిత్తూరు 3, తూ.గో 2, నెల్లూరు జిల్లాలో రెండు పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. గత వారం రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి రోజు 70 నుంచి 80 కొత్త కేసులు వస్తున్నాయి. అయితే, ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. ఇందుకు అను గుణంగా బుధవారం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా లాక్ డౌన్ నిబంధనలకు సంబంధించి కొన్ని సడలింపులను చేసింది, ఆర్థిక రంగానికి మినహాయింపు కలిగించింది.

ఈ సడలింపులను అనుసరించి లాక్ డౌన్ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు, పవరైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు మినహాయింపు లభించింది. వ్యవసాయరంగం, ఉద్యాన పనులు, ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ రంగా లకు ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసుకునేం దుకు మినహాయింపును ఇచ్చింది. వలస కార్మి కులకు రాష్ట్ర వరిధిలోని సొంత ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకునేందుకు వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించటంతో, ఏపి ప్రభుత్వం కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే కరోనా లక్షణాలు లేని వారు మాత్రమే పనులు చేయాలని స్పష్టం చేసింది.

ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, స్టేషనరీ దుకాణాలకు మినహయింవును కల్పించింది. ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజరును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు, మార్కెటింగ్ కాంప్లెక్స్ లకు అనుమతి లభించింది. కావాల్సిన అనుమతులతో ఈ-కామర్సు కంపెనీలకు, వారు వాడే కార్లుకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్లో కల్పించిన సడలింపుల విషయంలో ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అనుసరించి మార్పులు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో నెలకొని పరిస్థితులను గమనించిన తరువాత ఈ సడలింపులను అమలు చేస్తారు. అయితే అన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుంటే, విపరీతంగా పెరిగిపోతున్న కేసుల టైములో, మినహాయింపుల పై విమర్శలు వస్తున్నాయి. కేసులు కంట్రోల్ అయ్యేదాకా, పటిష్టంగా లాక్ డౌన్ పెట్టటమే నయం అని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కేసులు పెరిగిపోతూ ఉండటం, సరిహద్దు రాష్ట్రాల్లో కేసులు తగ్గుతూ ఉండటం, కాని ఏపిలో పెరుగుతూ ఉండటంతో, కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలు ప్రకారం, కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానుంది. వస్తున్న సమచారం ప్రకారం, మే 4న ఏపీకి కేంద్ర బృందం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటన చేయ్యనున్నట్టు తెలుస్తుంది. కరోనా ప్రభావం, తాజాపరిస్థితి, లాక్ డౌన్ అమలు తీరు, కరోనా పరీక్షలు జరిగే విధానం, రోగులకు అందే వైద్యంపై కేంద్ర బృందం సమీక్ష చేయ్యనుంది. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే విపక్షాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు దాస్తుందని, టెస్టులు విషయంలో కూడా పీసీఆర్ టెస్టులు చెయ్యకుండా, మాములు రాపిడ్ టెస్టులు చేసి, ఎక్కువ చేసినట్టు చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోజు రోజుకీ కేసులు పెరుగుతూ ఉండటం, ఏకంగా గవర్నర్ బంగాళాలో కూడా రావటం పై, ఆందోళన వ్యక్తం చేసారు.

కేంద్రం ఎంటర్ అవ్వాలని, నిజాలు బయటకు చెప్పాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కన్నా కూడా, ఈ విషయం పై, కేంద్రానికి లేఖ రాసారు. అయితే నిన్న కేంద్ర హోం శాఖ సహయమంత్రి కిషన్ రెడ్డి కూడా, కేంద్రం నుంచి టాస్క్ ఫోర్సు, ఏపికి వస్తుందని చెప్పారు. అలాగే, అధికార పార్టీ నేతలకు కూడా చురకలు అంటించారు. కొన్నాళ్ళు బయట తిరగకుండా, సంయమనం పాటించాలని కోరారు. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పినట్టే, కేంద్రం బృందం, ఏపి పర్యటనకు వస్తుంది. అయితే ఇది సహజంగా అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టే జరుగుతుందా, లేక విపక్షాలు ఆరోపిస్తున్నట్టు, ప్రభుత్వం దాస్తుంది అనే విషయాల పై కూడా, ఏమైనా ఆరా తీస్తారా అనేది చూడాల్సి ఉంది.

ఇక మరో పక్క, వరిస్థితులను అనుగుణంగా గ్రీజోన్లలో మరిన్ని వెసులుబాటులు కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గ్రీజోన్లలో పరిశ్రమలు ప్రారంభించేందుకు అనుమతిం చామని ఆయన స్పష్టం చేశారు. విమనాలు, రైల్వే ఇప్పుడే నడిచే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగువారిని వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజా రవాణాకు ఇప్పట్లో అవకాశం ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు 12 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేసిందని, అందులో కేంద్రం ఇచ్చిన 5 కేజీలు, రాష్ట్రానికి సంబంధించి 7 కేజీలు ఉన్నాయని ఆయన వివరించారు. బుధవారం నుంచి రెండో విడత బియ్యం వంపిణీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిందని తెలిపారు. గుజరాత్ లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను స్వస్థలాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 54 బస్సుల్లో గుజరాత్ నుంచి బుధవారం తెల్లువారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బయల్దేరారని చెప్పారు. ఇందుకుసహకరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి మత్స్యకారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read