పార్లమెంటులో మూడో రోజూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు... ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే... విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ గత రెండు రోజులుగా టీడీపీ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే... కాగా... బుధవారం మూడో రోజు కూడా పార్లమెంటు ఎదుట, అలాగే గాంధీ విగ్రహం ఎదుట ఎంపీలు ధర్నా నిర్వహించారు... సభ ప్రారంభం కాగానే, లోపల కూడా ఆందోళన చేస్తున్నారు...

rajnath 07022018

ఇదిలా ఉండగా పార్లమెంటు నుంచి సస్పెండ్ చేసినా కూడా స్పష్టమైన హామీ లభించే వరకు ఆందోళన విరమించవద్దని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎంపీలకు బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు... దీంతో కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు... ఇవాళ ప్రధాని మోడీ ప్రసంగం ఉంది అని, దాంట్లో ఒక ప్రకటన ఉంటుంది అని, ఎంపీల ఆందోళన విరమించుకోవాలని రాజ్ నాథ్ సింగ్ చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పారు... ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ప్రధాని స్వయంగా కోరారని అన్నారు. ఆందోళనలు విరమించాలని మీ ఎంపీలను కోరాలని చెప్పారు.

rajnath 07022018

దీంతో చంద్రబాబు ఫైర్ అయ్యారు... ఇంకా ఎంత సేపు, ఇలా ప్రకటనలతో సరిపెడతారు అని, టైం బౌండ్ ప్రోగ్రాం ఇస్తేనే, మేము వెనక్కు తగ్గుతామని, ఇది మా ప్రజల బాధ అని, అదే మేము సభ లోపల వ్యక్తపరుస్తున్నామని, తగ్గేది లేదు అని చెప్పారు... దీంతో రాజ్ నాథ్ సింగ్, కనీసం ప్రధాని ప్రసంగించే సమయంలో అయినా, ఆందోళన విరమించి, ఆయన చేసే ప్రకటన వినాలని చెప్పారు... చంద్రబాబు మాత్రం, ఏ హామీ ఇవ్వలేదని సమాచారం...

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గత రెండు రోజులుగా నిరసనలకు దిగిన తెలుగుదేశం ఎంపీలు, వరుసగా మూడో రోజు కూడా పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి... ఉభయ సభల్లో తెదేపా సభ్యులు కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై గళమెత్తుతున్నారు... ఈ ఉదయం కొందరు ఎంపీలతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు, హామీల అమలుకు నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని అప్పటివరకు పోరాడుతూనే ఉండాలని, ప్రజల బాధ, దేశానికి చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు...

parliament day 3 07022018 3

ఇవాళ ప్రధాని ప్రసంగం ఉంటుంది అని, ప్రధాని ప్రసంగం చేసేప్పుడు కూడా, ఆందోళన కొనసాగించాలని చంద్రబాబు ఎంపీలకు ఆదేశాలు ఇచ్చారు... పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయవద్దని ఎంపీలకు ఆదేశాలు ఇచ్చారు... పార్లమెంటు సమావేశాలు మరో రెండు రోజులు మాత్రమే ఉన్నాయని... నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఏ మాత్రం తగ్గవద్దని, కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచాలని తమ ఎంపీలను ఆదేశించారు.

parliament day 3 07022018 2

ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, విభజన సమయంలో పార్లమెంట్ లో ఆరు నెలలు పోరాటం చేశామని గుర్తు చేసిన ఆయన, ప్రజాభీష్టం మేరకే తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఏపీ సమస్యలను జాతీయ స్థాయి అజెండాగా మార్చామన్నారు. అలాగే ఏపీకి జరిగిన అన్యాయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేశామని, దీనిని హేతుబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలి... రాష్ట్ర ప్రయోజనాలను సాధించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకోసం తాము లోక్‌సభలో పోరాడుతుంటే మీరు అభ్యంతరం తెలుపుతారా? అంటూ తెలుగుదేశం సభ్యులు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, ప్రతిపక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఇతర కాంగ్రెస్ సభ్యులపై దుమ్మెత్తిపోశారు. మీవల్లనే రాష్ట్రం ఆథోగతి పాలైందంటూ వారు తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. బీజేపీ మిత్రపక్షమైన మీరు మావైపు నిలబడి నిరసన ఎందుకు తెలుపుతున్నారు, అధికార పక్షం వైపు నిలబడవచ్చు కదా అని ప్రశ్నించిన కాంగ్రెస్ సభ్యులతో తెలుగుదేశం సభ్యులు గొడవపడ్డారు. పరిస్థితిని అర్థం చేసుకున్న సోనియా వారికి నచ్చజెప్పేందుకు తీవ్రంగా కృషి చేయవలసి వచ్చింది.

sonia 07022018 2

ఖర్గే ప్రసంగం పూర్తయ్యాక లోక్‌సభలో అరుణ్‌జైట్లీ ప్రకటన చేశారు. అనంతరం సుజనాచౌదరి బయట మాట్లాడుకుందాం రమ్మంటూ సహచరులను పిలిచారు. అప్పుడు ఒకొక్కరుగా వెళ్తుండగా సోనియాగాంధీ కేశినేని నానిని పిలిచి.. మీరు వారిపై దండయాత్ర చేయకుండా మావైపు నిల్చొని ఎందుకు నిరసన తెలుపుతున్నారని ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందిస్తూ ప్రధానికి మా నిరసన తెలియాలనే ఇటువైపు నిల్చొని ఆందోళన చేపట్టామని చెప్పారు.

sonia 07022018 3

మీరు ఇదివరకు చేసిన తప్పిదం వల్లే ఇన్ని ఇబ్బందులొచ్చాయని పేర్కొన్నారు. విభజన చేసి రాష్ట్రాన్ని దెబ్బతీశారని, మీరూ దెబ్బతిన్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెద్ద భాగస్వామ్యం ఉండేదని, ఇప్పుడు అక్కడ మీరు పూర్తిగా కనుమరుగయ్యారని చెప్పారు. పోనీ విభజన వల్ల కాంగ్రెస్‌ లాభపడిందా అంటే రెండు రాష్ట్రాల్లోనూ నష్టపోయింది. కేంద్రంలోనూ అధికారంలోకి రాలేకపోయారని నాని అన్నారు. దీంతో తానూ ఏకీభవిస్తున్నట్లు ఆమె నానితో చెప్పారు.

కేంద్ర బడ్జెట్ లో, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజన హామీల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్, రాజ్యసభలో టీడీపీ ఎంపీలు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మిత్రపక్షం ఒత్తిడికి తలొగ్గిన బీజేపీ, తాజా పరిణామానికి తెర లేపింది. ఆంధ్రరప్రదేశ్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తక్షణం ఢిల్లీకి బయలు దేరి రావాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)కు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఏపీ సీఎంవోకు ఫోన్‌ కాల్‌ వచ్చింది.

cmo 07022018 2

ఈ పిలుపుతో హుటాహుటిన ఏపీ ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లారు... రెవెన్యూ లోటు, స్పెషల్‌ ప్యాకేజీపై చర్చించేందుకు పూర్తి సమాచారంతో రావాలని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు ఫోన్‌‌లో వివరించారు.... దీంతో పూర్తి డేటాతో ఢిల్లీకి అధికారులు పయనమయ్యారు... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ కుటుంబరావు, ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.

cmo 07022018 3

అన్ని వివరాలు పూర్తిగా వివరించాలని, ప్రతి విషయంలో పై చేయి సాదించాలని, డేటా మొత్తం వాళ్ళ ముందు ఉంచి, మాట్లాడాలని, మనకు సాధ్యమైనంత మేర, నిధులు వచ్చేలా చూడాలని, చంద్రబాబు అధికారులకి చెప్పి పంపించారు... ఈ సమావేశంలో కేంద్రం ఇంతవరకూ మన రాష్ట్రానికి ఎంత మేరకు నిధులు కేటాయించింది? రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకు ఖర్చులు చేసింది ? ఇంకా కేంద్రం నుంచి ఎన్ని కోట్ల నిధులు రావాలి..ఇవ్వాల్సిన నిధులన్నీ ఎప్పుడిస్తారు? అనే విషయాలపై స్పష్టత రానుంది.... అయితే ఈ సమావేశం కోసం, మీరు ఆందోళన ఆపవద్దు అని, ఆందోళన ఇవాళ ఇంకా ఉదృతం చెయ్యాలని, చంద్రబాబు ఎంపీలను ఆదేశించారు...

Advertisements

Latest Articles

Most Read