లోక్‌సభలో ఈ రోజు కూడా టీడీపీ ఎంపీలు ఆందోళనను కొకొనసాగించారు.... ఉదయం సభ ప్రారంభమైనప్పట్నుంచి నిరసనలు వ్యక్తంచేస్తూనే ఉన్నారు.... విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.... ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభను స్తంభింపజేశారు. మరోవైపు టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో చిడతలు వాయిస్తూ, గోవిందా....గోవిందా అంటూ నారదుడి వేషంలో నిరసన తెలియజేశారు.... పార్లమెంట్ లోపల కూడా, గోవిందా....గోవిందా అంటూ నినాదాలు చేసారు...

sivaprasad 06022018 2

తల వెంట్రుకలకు పిలక వేసుకొని, రిబ్బన్ కట్టుకొని, మెడలో పూలమాల, చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జెలు కట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. టీడీపీ సభ్యులు గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతుంటే 'ఓం నమో నారా' అంటూ శివప్రసాద్ నిసన తెలిపారు... సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరింత జోరుపెంచిన టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌‌లో, బయట పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా లోక్‌సభలో అయితే ఏకంగా వెల్‌‌లోకి వెళ్లి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’.. ‘విభజన హామీలు నెరవేర్చండి’ అంటూ నినాదాలు, ప్లకార్డులతో హోరెత్తిస్తున్నారు.

sivaprasad 06022018 3

మరో పక్క పార్లమెంట్ లో కొద్దో గొప్పో ఆందోళన చేసిన వైసిపీ ఎంపీలు, రాజ్యసభలో మాత్రం, పూర్తిగా సైలెంట్ అయిపోయారు... రాజ్యసభలో నిరసన చేపట్టినప్పుడు, కేంద్రమంత్రి జైట్లీ ప్రకటన చేస్తునప్పుడు గానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏమాత్రం ఉలుకూ పలుకు లేకుండా మిన్నకుండిపోయారు. అంతే కాదు ఆయన కూర్చున్న సీట్లోంచి కనీసం లేవకుండానే కూర్చోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని కార్యాలయం పై ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు... మంగళవారం తెలుగుదేశం పార్టీ సమన్వయక మిటీ సమావేశంలో, పార్లమెంట్ లో జరిగుతున్న పరిణామాల పై చర్చిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు... పీఎంవో కారిడార్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి తిరుగతూ.. దర్యాప్తు సంస్థలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు... పీఎంవో పరిసరాల్లోకి విజయసాయి రెడ్డి వారిని అనుమతించొద్దని అన్నారు. విజయసాయి రెడ్డికి అపాయింట్‌మెంట్‌ ఇస్తే పీఎంవోకే కళంకమని సీఎం అన్నారు....

cbn pmo 06022018 2

మరో పక్క వైసీపీ తీరు పై కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు... కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే..వైసీపీ ఏమో కేంద్రానికి దగ్గర అవుతూ టీడీపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకుందంటూ మండిపడ్డారు. మరోవైపు బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.. ఓ వైపు బడ్జెట్ బాగుందని కేంద్రాన్ని పొగుడుతూనే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అనడం వైసీపీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు.

cbn pmo 06022018 3

పదే పదే కేంద్రానికి ఫిర్యాదులు పంపుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా ప్రపంచ బ్యాంక్‌కు కూడా ఫిర్యాదులు పంపుతూ అక్కడ్నుంచి వచ్చే రుణాలను అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో వైసీపీ తీరును ఎండగట్టాలని, అలాగే ఈ పరిస్థితులను అధిగమించి కేంద్రం నుంచి నిధులు వచ్చేలా టీడీపీ ఎంపీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.

లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగిస్తున్నారు... ఉదయం 11 గంటల నుంచి నిరాటంకంగా ఆంధ్రా ప్రజల ఆక్రోశం దేశానికి వినిపిస్తున్నారు... ప్రధాని మోడీ ఉదయం నుంచి సభలో లేరు... ప్రధాని మోడీ సభలోకి వచ్చిన తరువాత కూడా, టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు... మోడీని చూసి మరింత బిగ్గరగా నినాదాలు చేసారు... మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మిత్ర ధర్మం పాటించండి... మిత్రులకి న్యాయం చెయ్యండి... దగా పడ్డ మా రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అంటూ, ఆందోళన చేసారు... ఈ సమయంలో మోడీ కొంచెం ఇబ్బందిగా కనిపించారు...

modi 06022018 1

అయినా సరే మన ఎంపీలు నినాదాలు ఆపలేదు.. దీంతో, సభ వాయిదా పడింది... అయితే, వైసిపీ ఎంపీలు మాత్రం, కనిపించకుండా పోయారు... ఉదయం ప్లకార్డులు పట్టుకుని కొంచెం సేపు వెల్ లో హడావిడి చేసినా, మోడీ వచ్చిన తరువాత కనిపించలేదు... మొత్తానికి, మోడీ ముందే, ధైర్యంగా మన ప్రజల ఆక్రోశాన్ని, మిత్ర పక్షంగా ఉంటూనే వినిపించారు.... పార్లమెంట్ లోనే కాదు, రాజ్యసభలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది... దీంతో రాజ్యసభ కూడా వాయిదా పడింది...

modi 06022018 1

ఇది ఇలా ఉండగానే, తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చర్చలకు పిలిచారు. అయితే... ఈ చర్చలకు వెళ్లేందుకు టీడీపీ ఎంపీలు విముఖత వ్యక్తం చేశారు. విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ రెండు రోజులుగా టీడీపీ ఎంపీలు అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభలో ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో ఉభయ సభల నిర్వహణకు కొంత ఆటంకం కలుగుతోంది. దీంతో చొరవ తీసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ టీడీపీ ఎంపీలను చర్చలకు పిలిచారు. కాగా... విభజన హామీలపై స్పష్టత వస్తే తప్ప తాము చర్చలకు వచ్చేది లేదంటూ చర్చలకు టీడీపీ ఎంపీలు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

పార్లమెంట్ లో, రాజ్యసభలో టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన పై ఎట్టకేలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు... ఇటు రాజ్యసభలోనూ, అటు పార్లమెంట్ లోనూ, జైట్లీ ప్రకటన చేసారు... ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన నిధులను వివిధ మార్గాల్లో సమకూరుస్తున్నామని చెప్పారు.... ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ కార్యదర్శిని త్వరలోనే ఢిల్లీకి పిలిపిస్తున్నామని, ఆ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీ విధివిధానాలు రూపిందిస్తామని జైట్లీ తెలిపారు... విదేశీ సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే కేంద్రం 90 శాతం చెల్లిస్తుందని ఆర్థికమంత్రి పేర్కన్నారు....

jaitley 06022018 2

రెవెన్యూ లోటు భర్తీపై స్పష్టమైన సూత్రం లేదు. కొత్త ఫార్ములాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం. లోటు భర్తీ కింద ఇప్పటికే రూ.3,900 కోట్లు ఇచ్చాం. ఏపీ విభజన చట్టం హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం అంటూ జైట్లీ ప్రకటించారు.... అలాగే రైల్వే జోన్ పై, సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజ్యసభలో వెల్లడించారు. రైల్వే జోన్‌పై పొరుగు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని అన్నారు. రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని మాత్రమే చట్టంలో ఉందని, కాంగ్రెస్ సరిగా చేసి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావని పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు.

jaitley 06022018 3

అయితే, వీరిద్దరూ చేసిన ప్రకటనలో ఎక్కడా స్పష్టత లేకపోవటం, పాడిన పాటే పాడటంతో, ఎంపీలు వెనక్కు తగ్గటం లేదు.... హామీల అమలుకు కాలపరిమితి కూడా నియమించాలని డిమాండ్ చేశారు. అయితే ఎంపీల అభ్యర్థనను కేంద్రమంత్రులు తోసిపుచ్చారు. సభలో ప్రకటన చేస్తే మిగతా పార్టీలు కూడా ఇలానే ఆందోళన చేస్తాయని దాటవేత ధోరణితో వ్యహరించారు. ఆర్థికశాఖ కార్యదర్శిని పిలిపించి మాట్లాడతామని కేంద్రమంత్రులు చెప్పుకొచ్చారు. కానీ దీనికి ఎంపీలు అంగీకరించలేదు. హామీల వారీగా ప్రకటన చేస్తేనే ప్రజలు నమ్ముతారని, టెక్నికల్ అంశాలను తెరమీదకు తెస్తే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ఎంపీలు కుండబద్ధలు కొట్టినట్లుగా తెగేసిచెప్పారు.

Advertisements

Latest Articles

Most Read