మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు (71) మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి ఆయన తనువుచాలించారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకునిగా పలు పదవులు చేపట్టారు.

1983లో ఎన్టీఆర్‌ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకెక్కారు. 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తెదేపా ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నారు. జ్వరంతో బాధపడిన ముద్దుకృష్ణమను కుటుంబీకులు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ‘‘డెంగ్యూ జ్వరం, బీపీ కంట్రోల్‌ లేని స్థితిలో ఆదివారం ఆయన ఆస్పత్రిలో చేరారు. రెండురోజుల్లోనే మల్టీఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల పరిస్థితి చేయిదాటిపోయింది’’ అని కేర్‌ వైద్యుడు డాక్టర్‌ కళాధర్‌ తెలిపారు.

మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు (71) మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. డెంగ్యూ జ్వరంతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు. గాలి మృతి పట్ల ఆయన కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ ప్రస్థానంలో ముద్దుకృష్ణమది ముఖ్య భూమిక అని చంద్రబాబు తెలిపారు. క్రీయాశీల రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ పార్టీకి, ప్రజలకు ఆయన అందించిన సేవలు మరచిపోలేనివి అని చంద్రబాబు అన్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో, దేశంలోని సుప్రసిద్ధ విద్యాసంస్థల్లో ఒకటైన అమృత యూనివర్సిటీ ఏర్పాటు కానుంది... మంగళగిరి మండలం కురగల్లు, యెర్రబాలెం గ్రామాల మధ్య అమృత విద్యాపీఠ్‌ మాతా అమృతానందమయి ఆర్గనైజేషన్‌ తరఫున 150 ఎకరాల్లో ఏర్పాటుకానున్న విశ్వవిద్యాలయ ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం శంఖుస్థాపన చేయనున్నారు. సుమారు ఐదువేల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నామని తెలిపారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు .

amrita amaravati 06022018 2

అమృత విశ్వవిద్యాలయం అమరావతి ప్రాంగణ ఇన్‌ఛార్జి స్వామి సదాశివచైతన్య మాట్లాడు తూ భారతదేశంలో ఇది ఏడవ ప్రాంగణమని చెప్పారు. మొదటిదశలో 150 ఎకరాలలో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సును, సెకండ్‌ ఫేజ్‌లో మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి, మూడో ఫేజ్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఫస్ట్‌ఫేజ్‌లో ఇంజనీరింగ్‌లో 640 సీట్లు, మేనేజ్‌మెంట్‌లో 120 సీట్లు ఏర్పాటు చేయనున్నట్లు స్వామీజీ తెలిపారు. మొదటిదశలో రూ.150 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. 2018 ఆగస్టు నుంచి తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు.

amrita amaravati 06022018 3

ఈ విశ్వవిద్యాలయం క్యాంపస్‌కు సంబంధించిన ఆకృతులను ఇటీవల సీఎంకు ‘అమృత’ ప్రతినిధులు చూపారు... ముఖ్యంగా ప్రవేశద్వారం, మంగళగిరి గాలిగోపురాన్ని ప్రతిబంబించే విధంగా ఉండటం, బాగా ఆకర్షించింది.. అమృత అమరావతి యూనివర్శిటీ క్యాంపస్‌ లో, అత్యాధునికమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో సహా మెడికల్‌ విద్యా,వైద్యసంస్థలు మరియు ఇంజినీరింగ్‌ సంస్థలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిసింది... దేశంలోని ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో నంబర్వన్ స్థానంలో, అన్ని యూనివర్సిటీల్లో 9వ అత్యుత్తమైనదిగా, ఆసియా ఖండం బెస్ట్‌ యూనివర్సిటీల్లో 168గా పేరొందిన అమృత సంస్థకు దేశంలోని అమృతపురి, కోయంబత్తూరు, కొచ్చిన్‌, బెంగుళూరు, న్యూఢిల్లీలలో ఇప్పటికే 5 క్యాంపస్ ఉన్నాయి.

రాయలసీమ చివరి అంచుదాకా.. ఆఖరికి నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు కూడా గోదావరి జలాలను తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన సంగతి తెలిసిందే... పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసిన అనుభవంతో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది... దీనికి సంబంధించి ‘గోదావరి - పెన్నా అనుసంధానం మొదటి దశ’ ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు.

cbn penna 06022018 2

పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా మొత్తం 15,370 క్యూసెక్కుల గోదావరి నీటిని తరలించవచ్చని చెప్పారు. 1,370 క్యూసెక్కుల జలాలు వృథాగా పోయినా 7వేల క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు వినియోగించవచ్చని, మిగిలిన 7వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువకు ఎత్తిపోయొచ్చని తెలిపారు. గోదావరి - పెన్నా అనుసంధానం మొదటి దశకు మొత్తం 1,778 ఎకరాలు సీకరించాల్సి ఉంటుందని వెల్లడించారు. మొదటి దశ కార్యరూపం దాల్చడానికి రూ. 4,617 కోట్లు వ్యయం కానుందని అంచనా వేశారు. అలాగే మొత్తం 5 దశల్లో చేపట్టాలని భావిస్తున్న గోదావరి - పెన్నా అనుసంధానానికి రూ. 83,565 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు.

cbn penna 06022018 3

ఇవన్నీ సమీక్షించిన చంద్రబాబు, గోదావరి - పెన్నా నదుల సంధానంలో భాగంగా తొలి దశ నిర్మాణం కోసం ఈ నెలలోనే టెండర్లను పిలవాలని నిర్ణయించారు... రూ.4617 కోట్ల వ్యయంతో చేపట్టే తొలిదశ పనులను ఆరునెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి దశలో నాగార్జున సాగర్‌ కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలిస్తారు... సాగర్‌ కుడి కాలువలోకి 120 రోజులపాటు రోజుకు 7వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 73 టీఎంసీలు తరలిస్తారు....

ఆంధ్రప్రదేశ్‌ను అన్నింటా ముందు నిలపాలని కృతనిశ్చయంతో వున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దఎత్తున పెట్టుబడులు ఆకట్టుకునేందుకు మరోసారి విదేశీ పర్యటనకు సమాయత్తమయ్యారు. ఒకరోజు పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం దుబాయ్ బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి వెంట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, మౌలికవసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్ పయనమవుతున్నారు.

cbn dubai 06022018 2

ముఖ్యమంత్రి దుబాయ్‌లో అక్కడి పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులతో గురువారం వరుసగా ముఖాముఖి సమావేశాలు జరుపుతారు. ముఖ్యంగా ఫీనిక్స్ గ్రూపు, షరాఫ్ గ్రూపు, దాన్యూబ్ గ్రూపు ముఖ్యులతో జరిపే సమావేశాలు ఈ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అదేరోజు సాయంత్రం దుబాయ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జనరల్ డాక్టర్ మహమ్మద్ అల్ జరూనీతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ‘భాగస్వామ్య సదస్సు-2018’కి సంబంధించి రోడ్ షోలో పాల్గొంటారు.

cbn dubai 06022018 3

విశాఖలో ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు ఇది సన్నాహకం. దుబాయ్‌లో వున్న సంస్థలు, పారిశ్రామిక-వాణిజ్య వేత్తలను భాగస్వామ్య సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆహ్వానిస్తారు. ఆంధ్రప్రదేశ్ 15% వృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు చేరువకావడానికి పారిశ్రామికరంగం ముఖ్య వృద్ధికారకంగా వుండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చి ఈ రంగంలో ఆర్ధికవృద్ధి సాధనతో యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగాలనేదే ముఖ్యమంత్రి సంకల్పం.

Advertisements

Latest Articles

Most Read