మాములుగా అయితే, ప్రతి శుక్రవారం మాత్రమే జగన్ డైరీలో హాలిడే... పాదయాత్ర అయినా, ఏ యాత్ర అయినా, దేశంలో ఎక్కడ ఉన్నా, శుక్రవారం మాత్రం, నాంపల్లి కోర్ట్ లో వచ్చి హాజరు వెయ్యాలి... అలాంటి జగన్ కు, ఈ వారం మాత్రం, రెండు రోజులు హాలిడేస్ లభించాయి... ఒకటి గురువారం, రెండోది శుక్రవారం... శుక్రవారం సంగతి అందరికీ తెలిసిందే... గురువారం మాత్రం, రాష్ట్ర బంద్ సందర్భంగా,జగన్ కూడా హాలిడే తీసుకోనున్నారు... తనతో పాటు ఉండే వారు అందరూ బంద్ లో పాల్గునాలి అని, నేను హాలిడే తీసుకుంటాను అని జగన్ చెప్పినట్టు సమాచారం...

jagan padayatra 07022018 2

నిజానికి రేపటి బంద్ కేంద్ర బ‌డ్జెట్లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని నిర‌సిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలు బంద్ కి పిలుపు ఇచ్చాయి... ఈ పిలుపు ప్రతిపక్ష పార్టీగా జగన్ ఇస్తారు అని అందరూ అనుకున్నారు... కాని, జగన్ విచిత్ర పరిస్థితి వలన, పిలుపుకి బదులు, ఎవరో పిలుపిచ్చిన బంద్ కు మద్దతు ఇస్తున్నారు... బంద్ కారణంగా గురువారం నాడు పాదయాత్ర ఆపనున్నారు. ఈ బంద్ లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జగన్ పిలుపునిచ్చాడు... అయితే పాదయాత్ర చేస్తూ, ఎక్కడికక్కడ ధర్నా చేద్దామని నాయకులు చెప్పగా, వారి పై జగన్ తీవ్ర ఆగ్రహం చూపించారు.... నాకు ఏమి చెయ్యాలో తెలుసు, మీరు బంద్ చెయ్యండి అంటూ, వారి పై కోపగించుకున్నారు...

jagan padayatra 07022018 3

మరో పక్క, వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన బంద్‌ శాంతియుతంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు అధికారులను ఆదేశించారు... పోలీసులు సంయమనంతో వ్యవహరించాలన్నారు... రాష్ట్రానికి సాయం చేయకపోవడం అన్న సమస్య ఢిల్లీలో ఉందని, బంద్‌ చేస్తామంటున్న పార్టీలు అక్కడ ఒత్తిడి తేవాలని అభిప్రాయపడ్డారు.... రాష్ట్రం అసలే నష్టపోయిందని, మళ్లీ బంద్‌లతో ఇబ్బందులు కల్పించే పరిస్థితి రాకూడదని అన్నారు....

రెండు రోజుల క్రితం జగన్ పాదయాత్రలో, నెల్లూరు రూరల్ మండలం దేవరకొండ దగ్గర నిర్వహించిన ఆర్యవైశ్యులతో జగన్‌ ఆత్మీయ సమావేశంలో, వైసిపీ నాయకుడు ఒకరు రెచ్చిపోయారు... ఆత్మీయ సమావేశం అంటూ, బహిరంగ సమావేశంలో, జగన్ దగ్గర ఉండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పచ్చి బూతులు తిట్టించారు... నెల్లూరు నగర డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌ అనుచరుడు అమరా సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు.

jagan 07022018

అంత అసభ్యకరంగా మాట్లాడుతున్నా, బూతులు తిడుతున్నా, జగన్ నవ్వుతూ ఎంజాయ్ చేశాడే కాని, అతన్ని ఆపలేదు... అందరూ అతను సామాన్య రైతు అనుకున్నారు... కాని స్థానికులు గుర్తించటంతో, అతను వైసిపీ నాయకుడు అని తేలింది... ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ(నుడా) చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం రాత్రి నెల్లూరు రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బైఠాయించారు... చివరకు పోలీసులు కేసు నమోదు చేసారు...

jagan 07022018

అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.. నెల్లూరు రూరల్‌ పోలీసులు సునీల్‌పై ఐపీసీ సెక్షన్లు 188, 153 బీ, 355 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఆదివారం రాత్రి నుంచి ఆయనను వెతుకుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించిన నెల్లూరు రూరల్‌ పోలీసులు ప్రత్యేక సిబ్బందితో గాలిస్తున్నారు... ఆత్మీయ సమావేశం అంటూ, వైసిపీ కార్యకర్తల చేత, నాయకుల చేత, మాట్లాడించి, చంద్రబాబుని తిట్టించి, జగన్ పబ్బం గడుపుకుంటున్నాడు అని, తెలుగుదేశం ఆరోపిస్తుంది...

లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగానికి ముందే వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు... ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే... అయితే... ప్రధానమంత్రి ప్రసంగించే సమయానికే వైసీపీ సభ్యులు తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.... అసలు ప్రధాని ముందే ఆందోళన చెయ్యాలని మిత్రపక్షం తెలుగుదేశం నిర్ణయిస్తే, పోరాడాల్సిన, ప్రతిపక్షం, ఇలా చెయ్యటం ఆశ్చర్యానికి గురి చేసింది...

yscp 07022018

మరో పక్క, తెలుగుదేశం ఎంపీలను, స్పీకర్ మందలించారు... లోక్ సభలో సభ్యుల ప్రసంగాలను అడ్డుకుంటూ నినాదాలతో హోరెత్తిస్తున్న ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. .. ఆందోళన విరమించి తమ తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవలసిందిగా పదేపదే కోరినా తెలుగుదేశం ఎంపీలు అంగీకరించకపోవడంతో స్పీకర్ వారిని చిన్న పిల్లల్లా వ్యవహరించవద్దంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ మందలించారు...

yscp 07022018

మరో పక్క, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేయగా, ఏ మాత్రం బెట్టువీడను అని చంద్రబాబు, తన మనసులోని ఉద్దేశాన్ని ఆయన ముందు స్పష్టం చేశారు. .. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే ఎంపీలు ఆందోళన చేస్తున్నారని, తాము కోరుతున్నది రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమనేనని చంద్రబాబు వెల్లడించారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు...ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ తీరు వల్లే రాష్ట్రానికి ఇప్పుడు సమస్యలు వచ్చాయని, రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా కాంగ్రెస్ మోసం చేసిందని మోదీ మండిపడ్డారు... రెండు రాష్ట్రాలకూ న్యాయం జరుగుతుందనే తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చామని మోదీ తెలిపారు. ఏపీకి అండగా ఉంటామని చెప్పారు. అయితే మోడీ, ఎక్కడా ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై నిర్దిష్ట హామీ కాని, ప్రకటన కాని చెయ్యలేదు....

modi 07022018

ఎక్కడా కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చేసాం, ఇది చేస్తాం అని చెప్పలేదు... టీడీపీ ఎంపీల ఆందోళనపై నేరుగా కామెంట్ చేయని ప్రధాని మోదీ.. సభా కార్యక్రమాలకు అడ్డు తగలాలని ఎవరు అనుకున్నా పార్లమెంట్‌కు అది శ్రేయస్కరం కాదని హితవు పలికారు. ఈ ప్రసంగం మధ్యలో మోదీ.. ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. దీనికోసమే తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ సినిమాలు వదిలి రాజకీయ ప్రవేశం చేశారని గుర్తుచేశారు.

modi 07022018

మోదీ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు... ప్రధాని ప్రసంగం మొదట్లో తెదేపా ఎంపీలు కూడా నినాదాలు చేశారు... అయితే మోడీ ఆంధ్రప్రదేశ్ గురించి ప్రకటన చేస్తారు అని కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ చెప్పటం, మోడీ ప్రసంగం కూడా ఆంధ్రప్రదేశ్ అన్యాయం గురించి మొదలవ్వటంతో, తెదేపా ఎంపీలు ఆందోళన విరమించి వారి స్థానాల్లో కూర్చున్నారు... అయితే అనేక సందర్భాల్లో ఏపికి అన్యాయం గురించి మాత్రమే ప్రస్తావిస్తూ, ఎన్టీఆర్ గురించి, తెలుగు ఆత్మ గౌరవం అంటూ, ఎమోషనల్ డైలాగ్స్ తోనే ప్రసంగం ముగించారు... వైకాపా సభ్యులు మాత్రం ప్రధాని మోడీ ప్రసంగం మొదలు కాక ముందే, సభ నుంచి బయటకు వెళ్లిపోయారు...

Advertisements

Latest Articles

Most Read