ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, ఉత్తమ సేవలు అందించిన పౌరులకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది... ఆంధ్రోడికి దేశంలో అత్యున్నత పౌర పురస్కారంలో, నాలుగవ స్థానంలో ఉన్న పద్మశ్రీ అవార్డు దక్కింది... ఒకే సీజన్ లో నాలుగు సూపర్ సిరీస్ లు సొంతం చేసుకున్న ఘనుడు , పుల్లెల గోపీచంద్ శిష్యుడు, ప్రముఖ బ్యాడ్ మింటన్ క్రీడాకారుడు, 25 ఏళ్ళ గుంటూరు కుర్రాడు, అర్జున అవార్డ్ గ్రహీత "కిడాంబి శ్రీకాంత్" ఇక నుండి "పద్మశ్రీ కిడాంబి శ్రీకాంత్"...

srikant 26012018 2

గుంటూరు నగరానికి చెందిన కిడాంబి శ్రీకాంత్ చిన్ననాటి నుండి షటిల్ క్రీడపై మక్కువతో స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో శిక్షణ పొంది, అనంతరం అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగి అనేక సిరీస్ లు గెలుచుకున్నాడు... శ్రీకాంత్ కు పద్మశ్రీ వచ్చింది అని తెలుసుకుని, బృందావన గార్డెన్స్‌లోని శ్రీకాంత్ నివాసంలో ఉన్న తల్లిదండ్రులు, బంధువులు ఉద్వేగానికి లోనయ్యారు. దేశంలో ఉత్తమమైన పురస్కారం అందటంతో, కుటుంబీకుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది...

అయితే పద్మ పురస్కారాల విషయంలో, ఆంధ్రప్రదేశ్ కు కేవలం ఒక్క అవార్డు దక్కటం, తెలంగాణాకు అసలు ఏ అవార్డు దక్కకపొవటంతో, తెలుగు రాష్ట్రాల ప్రజలు కేంద్రం పై ఆగ్రహంగా ఉన్నారు.. ఏపీ నుంచి కూడా 25 పేర్లను అవార్డులకు నామినేట్‌ చేస్తే ఒక్కరికే పురస్కారం దక్కింది... దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న కోసం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధూను పద్మభూషణ్‌కు ఇరు తెలుగు రాష్ట్రాలు సిఫారసు చేసాయి.. అయినా కేంద్రం పట్టించుకోలేదు... ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ఏకంగా 9 అవార్డులు లభించాయి... ఇంకా తాము పాగా వేయాలని భావిస్తున్న తమిళనాడుకు 5, పశ్చిమ బెంగాల్ కు 5, కేరళకు 4, ఒడిశాకు 4 అవార్డులను ఇచ్చిన కేంద్రం మిగతా రాష్ట్రాలను చిన్న చూపు చూసిందన్న విమర్శలు వస్తున్నాయి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దావోస్ పర్యటన నిన్నటితో ముగిసింది... నిన్నే చంద్రబాబు బృందం, దావోస్ నుంచి బయలుదేరింది.. ఇవాళ ఉదయం 7:30 కి చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగుతారని, 11:30 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గుంటారని, అధికారులు సమాచారం ఇచ్చారు.. దీని కోసం గవర్నర్ కూడా షడ్యుల్ మార్చుకున్నారు... ప్రతి సారి, ఉదయం 7:30 కి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి, 10 గంటలకు తెలంగాణా వెళ్ళే వారు.. ఈ సారి ముందు తెలంగాణా వేడుకల్లో పాల్గుని, విజయవాడ వస్తున్నారు...

cbn 26012018 2

ఈ నేపధ్యంలో, చంద్రబాబు రాక లేట్ అవుతుంది అనే సమాచారం అమరావతి వచ్చింది... ఆయన రిపబ్లిక్ డే వేడుకుల్లో పాల్గునే అవకాసం లేదు అని, గవర్నర్ ముఖ్య అతిధిగా, వేడుకులు పూర్తి చెయ్యాలని అధికారులు నిర్ణయించారు... వాతావరణం అనుకూలించక చంద్రబాబు ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది... ఉదయం 7:30 కి రావాల్సింది, మధ్యాహ్నం 3గంటలకు చంద్రబాబు బృందం గన్నవరం రానుంది... చంద్రబాబు రావటం ఆలస్యం అవుతుంది అని సమాచారం రావటంతో, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి లేకుండానే, రిపబ్లిక్ డే వేడుకులు చెయ్యటానికి సిద్ధం అయ్యారు...

cbn 26012018 3

నవ్యాంధ్రకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫౌరం లో చంద్రబాబు పాల్గున్న సంగతి తెలిసిందే... భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సారి ఇక్కడకు వచ్చారు... ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం నాలుగు రోజుల దావోస్‌ పర్యటన గురువారంతో ముగిసింది.... నాలుగు రోజుల పర్యటనలో, అనేక మంది కంపెనీలతో చర్చలు జరిగాయి.. మూడు కంపెనీలతో ఏంఓయు లు జరిగాయి...

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు సర్వేలు జరుపుకుంటున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు మరో మారు ప్రత్యేక హోదాను తెరపైకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఆధినేత ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ముప్పేట దాడికి నేతలు కాలు దువ్వతున్నారు. నిన్నా,మొన్నటి వరకు ప్రత్యేక హోదా పై నోరు మెదపన నేతలంతా, మళ్ళీ తమ వాణిని రాష్ట్రానికే పరిమితం చేసుకొని బాబునే టార్గెట్గా పెట్టుకొని ఆందోళనకు దిగి ఓటర్లను తమకు ఆనుకూలంగా మలచుకొనే విధంగా శతవిధాల ప్రాకులాడారు.

cbn 26012018 2

రాష్ట్రంలో ప్రస్తుతం, ప్రజలను కదిలించే సమస్యలు ఏమి లేవు... పలన సజావుగా సాగిపోతుంది... సంక్షేమ పధకాలతో, కింద స్థాయి వరకు దూసుకెళ్ళారు చంద్రబాబు... ఈ తరుణంలో, చంద్రబాబుని ఎదుర్కోవటానికి, ఎదో ఒక సమస్య ప్రతిపక్ష పార్టీలకు కావాలి.. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా ఎత్తుకుంటున్నారు... సంవత్సరం నుంచి, అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యేక హోదాని మర్చిపోయాయి... ఎన్నికలు వస్తున్న తరుణంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్యా మరోమారు ప్రత్యేక హోదాను వైఎస్సార్స్,కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు తెరపైకి తెచ్చి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యేక హోదాను మరోమారు తెరపైకి తెచ్చారు.

cbn 26012018 3

వైసిపి అధినేత వైఎస్ జగన్ తాజాగా సోమవారం హోదా ఇస్తే బిజేపి పొత్తు అనడం, కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు సైతం హోదా పై గళం విప్పడం, కమ్యూనిస్తులు హోదా కోసం బాబు పై కసబుస్సులతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కూడా శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో, ఇదే విషయం పై ఫోకస్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది... మరో పక్క రాష్ట్రంలోని బిజేపి నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ ఆరోపణల పరంపరను కొనసాగిస్తున్నారు. వారి వెనుక కేంద్ర పెద్దల హస్తం కూడా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. వీళ్ళందరి టార్గెట్ చంద్రబాబు... వీరందరినీ చంద్రబాబు, ప్రజా బలంతో ఎలా ఎదుర్కుంటారో చూడాలి...

గుంటూరు జిల్లా కొండవీడు సమీపంలో నిర్మిస్తున్న ఇస్కాన్‌ స్వర్ణమందిర ఆలయం నిర్మాణం జూన్ నాటికి తొలిదశ పూర్తి కానుంది. కొండవీడు ఘాట్‌ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో కొండవీడు కోట, కొండపై ఉన్న ప్రకృతి అందాలను తిలకించడానికి క్రమంగా పర్యటకుల సందడి మొదలైంది. ఈ క్రమంలో కొండవీడు సమీపంలో రూ.200 కోట్లతో ఇస్కాన్‌ ఆలయం, వేద విశ్వవిద్యాలయం, ఆవులపై పరిశోధన కేంద్రం, గురుకుల పాఠశాల ఏర్పాటుతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా ప్రగతి పట్టాలెక్కనుంది. తొలిదశ నిర్మాణాన్ని రూ.100 కోట్లతో పూర్తి చేసే దిశగా పనులు వేగంగా జరుగుతున్నాయి.

golden temple 26012018 2

రాజస్థాన్‌ నుంచి తెచ్చిన గులాబిరంగు నాపరాయితో 108 మండపాలను ప్రధాన మందిరం చుట్టూ ఆకర్షణీయంగా నిర్మించారు. ప్రధాన ఆలయ నిర్మాణం మొదలైంది... ఇవి వరుసగా భాగవతం ఇతివృత్తం వివరించే చిత్రాలులా ఉంటాయి... పస్చిమబంగ నుంచి వచ్చిన కార్మికులు బొమ్మల తయారీ చేస్తున్నారు... ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు యువతను సన్మార్గంలో నడిపించేలా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ సంక్రాంతి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. కొండవీడు కోట, చారిత్రక వెన్నముద్ద గోపాలస్వామి ఆలయం, పురాతన ఆలయాలతో పాటు ఇస్కాన్‌ వారు నిర్మిస్తున్న ఆలయం పూర్తి కావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది.

golden temple 26012018 3

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆలయంలో కృష్ణుని ఆలయంతో పాటు విజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న స్వర్ణహంస మందిరం, కొండవీడు కొండల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలితో ఈ ప్రాంతం మొత్తం సాయంత్రమైతే ఆహ్లాదంగా మారుతోంది. ఇక్కడే వేద విశ్వవిద్యాలయంతో పాటు గురుకుల పాఠశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైన్‌ ఆర్ట్స్‌, సాంస్కృతిక పాఠ్యాంశాలు బోధిస్తారు. ఆవుకు సంబంధించి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఇస్కాన్‌ ఆధ్వర్యంలో బృందావనం, మాయాపూర్‌, బెల్గాం తదితర ప్రాంతాల్లో ఆవు, ఆవు వ్యర్థాలతో మందుల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read