ఎప్పుడెప్పుడు చంద్రబాబుని వదిలేసి, జగన్ పంచన చేరదామా అని ఎదురు చూస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇవ్వటంతో, అందరికంటే ముందుగా పురంధేశ్వరి, సోము వీర్రాజు రియాక్ట్ అయ్యారు... వీరికి చంద్రబాబు కామెంట్ తో ప్రాణం లెగిసి వచ్చినంత పని అయ్యింది... "వాళ్లు(బీజేపీ) వద్దనుకుంటే మా దారి మేం చూసుకుంటాం" అని చంద్రబాబు అనటంతో, వీరి పని ఇంకా తేలిక అయిపొయింది... పొత్తుల గురించి అమిత్ షా, మోడీ, చంద్రబాబు తేల్చుకుంటారు... కాని, రాష్ట్ర బీజేపీ నేతలు, పొతే పొండి, మాకు జగన్ ఉన్నాడుగా అనే ధీమాతో ఉన్నారు...
చంద్రబాబు భిక్షతో ఎమ్మెల్సీ అయ్యి, చంద్రబాబునే తిట్టే సోము వీర్రాజు మాట్లాడుతూ, చంద్రబాబుపై తమ పార్టీ అధిష్టానం స్పందించే సమయం ఆసన్నమైంది, అంటూ చంద్రబాబుకే వార్నింగ్ ఇస్తున్నాడు... ఈ విషయంలో తమ పార్టీ అధిష్టానం త్వరలోనే స్పందిస్తుందని, జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరిస్తున్నాడు... బీజేపీతో పొత్తు ఉండాలో వద్దో, చంద్రబాబే డిసైడ్ చేసుకోవాలి అంటూ, వ్యాఖ్యలు చేసారు... కేంద్రంపై మీరు సుప్రీంకోర్టుకు వెళ్తారా? అని చంద్రబాబుని అడుగుతున్నారు సోము... అయ్యా సోము వీర్రాజు, విభజన సమస్యలు, మీ పార్టీ వవ్యహరమో, టిడిపి వ్యవహారమో కాదు... రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా, కోర్ట్ కి వెళ్లి అయినా సాధించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది... రాజకీయానికి, రాష్ట్ర భవిష్యత్తుకి ముందు మీరు తేడా తెలుసుకోండి...
ఇక పురందేశ్వరి... ఈమె జీవిత ఆశయమే చంద్రబాబుని సాధించటం... అందుకోసం అన్నగారి పుత్రికగా పుట్టి, కాంగ్రెస్ పార్టీలో చేరి, ఢిల్లీ పెద్దల దగ్గర ఊడిగం చేసి, రాష్ట్ర విభజన సమయంలో ఏమి మాట్లాడకుండా సోనియాకి భజన చేసి, తరువాత బీజేపీలో చేరి, ఏ నాడు పోలవరం గురించి, అమరావతి గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడక, చంద్రబాబు మీద దాడి చేస్తూనే ఉంటారు... ఈమే కూడా ఇవాళ వేగంగా స్పందించారు... బీజేపీ మిత్రధర్మం పాటించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం సమజసం కాదని అన్నారు.టీడీపీ పార్టీ మాతో కలిసి ఉండాలనే ఉద్దేశం లేకుంటే రాష్ట్ర అద్యక్షుడు హరిబాబు తో మాట్లాడాలని సూచించారు. అలాగే ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు... అమ్మా, పురందేశ్వరి గారు...ఫిరాయింపు నేతలపై చర్యలు అమిత్ షా తీసుకోడు... అసెంబ్లీ స్పీకర్ తీసుకుంటారు... ఆయన చర్యలు తీసుకోక ముందే, మీ స్నేహితుడు జగన్, హై కోర్ట్ లో కేసు వేసాడు.. కోర్ట్ పరిధాలో ఎదో ఒకటి తేలేదాకా, స్పీకర్ కూడా ఏమి చెయ్యలేరు.. రాష్ట్ర సమస్యల పై పోరాడి, మీ వీర ప్రతాపం చూపించండి.. అన్న గారి పుత్రిక అనే విషయం మర్చిపోకుండా, కొంచెం సోయలో ఉండండి...