రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాల ఆందోళనలకు, ఉభయ సభల్లో ఎంపీలు చేస్తున్న ఆందోళనకు కేంద్రంలో కదలిక వచ్చింది... విభజనలోని అన్ని అంశాల పై, నిర్దిష్ట క్లారిటీ ఇచ్చింది... అయితే, కేంద్ర వైఖరి తెలిసిన టిడిపి ఎంపీలు, ఇవన్నీ చట్ట సభల్లో ప్రకటన చేసి, అమలు అయ్యే వరకు, నమ్మలేము అని ప్రకట... ఆంధ్రప్రదేశ్ అంశాలు పరిష్కారానికి సుమారు రెండున్నర గంటలపాటు భేటీ అయిన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుజనా చౌదరి, పియూష్ గోయల్, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా... ఎపికి ఇవ్వాల్సిన నిధులు, పలు సంస్థలు, రైల్వే జోన్ ప్రకటన, దుగరాజపట్నం పోర్టు వంటి కీలక అంశాలపై చర్చ... పార్లమెంటు నిబంధనల ప్రకారం నడుచుకోవాలనే ఉద్దేశంతోనే, పలు మంత్రిత్వ శాఖల అంశాల ప్రస్తావన చేయకూడదని, భేటీలో పేర్కొన్న జైట్లీ... రెండో దశ బడ్జెట్ సమావేశాల ప్రారంభం లోపు అన్ని ప్రకటనలూ పూర్తి చేసి కార్యాచరణకు వెళ్లాలని నిర్ణయించినట్లు వెల్లడించిన ఉన్నత స్థాయి వర్గాలు...
రెవెన్యూ లోటు పూర్తి చేయడానికి ఓప్పుకున్న కేంద్ర ప్రభుత్వం... 14వ ఆర్ధిక సంఘం ప్రకారం 2014-15 ఏడాదిలో పదినెలల కాలానికి రాష్ట్రానికి రావాల్సిన మొత్తం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు పేర్కొన్న ఉన్నత వర్గాలు... గత మూడేళ్ళ నుంచి రావాల్సిన మొత్తాన్ని వెంటనే విడుదల చేసేందుకు... మిగిలిన మొత్తాన్ని ప్రతి ఏటా విడుదల చేసేందుకు అంగీకారం.... ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి వచ్చే నిధుల మొత్తాన్ని ఒకే సారి ఇచ్చేందుకు సంసిధ్దత వ్యక్తం చేసినట్లు సమాచారం.... ప్రత్యేక ప్యాకేజి ప్రకారం ఈఎపి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నవిశ్వసనీయ వర్గాలు.. ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేసేందుకు కూడా అంగీకారం.... దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి ఇస్రో అభ్యంతరం తెలిపిందని... అక్కడ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ సూచిస్తే అక్కడ పోర్టు నిర్మాణాకి సిద్దంగా ఉన్నట్లు కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఇస్తున్నట్లు తెలిసింది.... ఏ నిమిషంలోనైనా రైల్వేజోన్ ప్రకటించాలని పీయూష్ గోయాల్‌ను అరుణ్‌జైట్లీ ఆదేశం..
పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 12 శాతం నుంచి ఎంత ఎక్కువ సాధ్యం అయితే అంత వరకు ఐఆర్ తగ్గించుకోవాలని చమురు సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు పంపారని, ఇందుకు సంబంధించిన ఇంటర్ ఆఫీస్ మెమోనే వెంటనే విడుదల చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు భేటీలో వెల్లడి... కడప ఉక్కు కర్మగారం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని... ఉద్యోగ, ఉపాధి కల్పనే దీనికి ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నట్లు తెలిసింది. కర్మాగార నిర్మాణానికి కావలసిన నివేదిక మెకాన్ సంస్థ ఈనెల 12కి అందించనున్నట్లు వెల్లడి. రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటన త్వరలో ఇవ్వాలని నిర్ణయం... విశాఖ - ఛెన్నై, కడప - ఛెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు వస్తున్న అడ్డంకులు అన్ని తొలగించి... అందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయం... అమరావతి నిర్మాణానికి చేసిన ఖర్చు వివరాలు పంపితే... ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని నిర్ణయం... పోలవరం ప్రాజక్టుకు ఇప్పటికే ఒక వ్యవస్థ ఏర్పాటైందని... దాని ప్రకారం నిదులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని... ఆ ప్రాజక్టును అనుకున్న రీతిలో పూర్తి చేయనున్నట్లు బేటీలో చర్చ..