ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు కూడా పోలవరం ప్రగతిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ పనుల పురోగతిని తెలుసుకున్నారు. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులను వేగంగా పూర్తి చేయడంపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కాంక్రీట్‌ పనుల బాధ్యతల పంపకంతో సహా ఇతర అంశాలపై గత రెండు రోజులుగా నవయుగ, పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్ మధ్య జరిగిన చర్చల్లో రాష్ట్ర జలవనరుల శాఖ భాగస్వామ్యం వహించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది....

polavaram 29012018 2

ఈ సందర్భంలో పోలవరం ప్రాజెక్టు గత వారం ప్రగతి పై అధికారులు చంద్రబాబుకు వివరించారు... 1.90 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు పూర్తయిన మట్టితవ్వకం పనులు... 3,826 క్యూబిక్ మీటర్ల మేర పూర్తయిన స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు... డయాఫ్రమ్ వాల్ 19.6 మీటర్ల వరకు నిర్మాణం... 774 లక్షల క్యూబిక్ మీటర్లు మేర తవ్వకం పనులు పూర్తికాగా, మరో 281 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వకం చేపట్టాల్సి వుంది...

polavaram 29012018 3

స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్‌కు సంబంధించి 34.04 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా, ఇప్పటికి 4.92 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి... ఇదే సందర్భంలో జలవనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణతో ఇప్పటివరకు రూ. 400 కోట్ల విలువైన విద్యుత్ ఆదా చేశామని అధికారులు చెప్పారు... భూగర్భజలాలు పెంచగలగడంతో వ్యవసాయ విద్యుత్ వినియోగంలో మిగులు సాధించడం ప్రభుత్వ విజయమని ముఖ్యమంత్రి కొనియాడారు...

బీజేపీ తమని వద్దనుకుంటే నమస్కారం పెట్టేస్తామని, తమ దారి తాము చూసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పటంతో, ఇప్పటికే నేషనల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది.. ఇదే నేపధ్యంలో వారం క్రితం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన శివసేన, చంద్రబాబు చెప్పిన మాటలను ఏకీభవీస్తుంది... ఇవాళ శివసేన నేత ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, చంద్రబాబు మాటలను వెనకేసుకువచ్చారు... చంద్రబాబు చెప్పిన మాటలు ఏకీభావిస్తున్నా అంటూ చెప్పటంతో, మరో సారి నేషనల్ మీడియా, ఈ వార్త పెద్ద ఎత్తున చూపిస్తుంది...

cbn shivsena 29012018 1

బీజేపీ నైజం మిత్రులని మోసం చెయ్యటం, మేము చంద్రబాబుతో ఏకీభావిస్తున్నా అంటూ, శివసేన నేత ఉద్ధవ్ థాకరే చెప్పారు... చంద్రబాబు భుజాల పై నుంచి, మరో సారి నరేంద్ర మోడీ, అమిత్ షా పై విరుచుకుపడ్డారు.. మోడీ హవా అయిపొయింది అని, ప్రజలకు వాస్తవం తెలుస్తుంది అంటూ, ఉద్ధవ్ థాకరే విమర్శలు చేసారు... నిజానికి, చంద్రబాబు మొన్న చెప్పింది, రాష్ట్ర బీజేపీ వైఖరి గురించి... ఇంకా కేంద్ర బీజేపీ దాకా బహిరంగంగా విమర్శలు చెయ్యలేదు... చంద్రబాబు తెలివిగా, తన అసహనాన్ని, రాష్ట్ర బీజేపీ పై చూపించారు...

cbn shivsena 29012018 2

ఈ విధంగా, కేంద్రంలో ఉన్న బీజేపీకి, ఒక వార్నింగ్ లాగా, తన మనసులో ఉన్న మాట చెప్పారు... ఇలా అయినా, రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, ఇప్పటికైనా ఏమన్నా అనుకూలంగా నిర్ణయాలు ప్రకటిస్తారు అనే ఆశతో ఇప్పటికీ ఉన్నారు చంద్రబాబు.... చంద్రబాబు స్థాయి నేత, బీజేపీ మీద అలిగారు అనే సంకేతం వెళ్తే, అది బీజేపీకే నష్టం.. ఇప్పటికే శివసేన గుడ్ బై చెప్పటం, వారం రోజుల్లోనే చంద్రబాబు, ఒక జర్క్ ఇవ్వటంతో, చంద్రబాబు మాటలు మూడు రోజులు అయినా ఇప్పటికే నేషనల్ మీడియా హైలైట్ చెయ్యటం, ఇవన్నీ బీజేపీకి నష్టం...

తెలంగాణా ప్రభుత్వం మరోసారి ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టింది... ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా నీటి కోటాలో భారీగా కోత విధించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది... ప్రస్తుతం ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 362 టీఎంసీల కోత విధించి, 150 టీఎంసీలకు పరిమితం చేయాలని బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ ను కోరనుంది... త్వరలో జరిగే ట్రైబ్యునల్‌ సమావేశాల్లో, ఇదే వాదన వినిపించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది... ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నీటిపై ఆధారపడే ప్రాంతాలు తగ్గిపోతున్నాయని, గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు ఈ ఏడాది ఇప్పటికే సుమారు 100 టీఎంసీలే తరలించారని తెలంగాణా చెప్తుంది...

pattiseema 29012018 2

ఇప్పటికే, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించే కృష్ణా నీటిని రెండు రాష్ట్రాల లెక్కల్లో వేయాలని తెలంగాణ కోరింది. నగరంలో ఆంధ్ర వాసులు ఎక్కువగా నివసిస్తున్న కారణంగా ఇక్కడ వినియోగించే నీటిని రెండు రాష్ట్రాల లెక్కల్లో వేయాలని తెలంగాణ కోరింది. ఐతే ఈ వాదన పై ఆంధ్ర ప్రజలు మండి పడుతున్నారు. హైదరాబాద్ లో నివసించే ఆంధ్రవారి నీటి అవసరాలు తెలంగాణా ప్రభుత్వం తీర్చలేకపోతే వారి నుండి పన్నులు ఎందుకు తీస్కుంటున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు? అదే విధంగా హైదరాబాద్ వేరువేరు రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తూ ఉంటారు వారందరి నీటి అవసరాలు వల్ల రాష్ట్రాలే తీరుస్తున్నాయా? అని అడుగుతున్నారు. పోనీ ఆంధ్రుల నీటి అవసరాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీరుస్తే వాళ్ళు నగరంలో కట్టే పన్నులలో ఆంధ్ర ప్రదేశ్ కు వాటా ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దమా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది.

pattiseema 29012018 3

రాష్ట్ర విభజన జరిగాక .. తెలంగాణ ఆర్థికంగా మిగులులో ఉంది... హైదరాబాధ్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఐటీ హబ్‌ ఉంది. ఆ రాష్ట్రంలో అపార ఖనిజ నిల్వలున్నాయి. కరీంనగర్‌లో బొగ్గు, సున్నపురాయి, ఇనుము, గ్రానైట్‌, ఇసుక, క్వార్జ్‌ ఉన్నాయి. మహబూబ్‌ నగర్‌లో క్వార్జ్‌ , లైమ్‌స్టోన్‌ శ్లాబ్స్‌, సున్నపురాయి, కంకర, బ్లాక్‌ కలర్‌ గ్రానైట్‌, బంకమట్టి, వజ్రాలు, బంగారు గనులు ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, తలసరి ఆదాయం, తలసరి వ్యయంలోనూ తెలంగాణ పరిపుష్టిగా ఉంది. ఆంధ్ర ప్రజలు కృష్ణా డెల్టాపైనే ఆధారపడి ఉన్నారు. ఉభయ రాష్ట్రాల్లో హంద్రీ-నీవా, తెలుగు గంగ, గాలేరు-నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని.. ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి...

ఇవాళ జగన్ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు, వాక్ విత్ జగన్ అంటూ ప్రపంచ వ్యాప్త కార్యక్రమం అంటూ, 25 దేశాల్లో చేస్తున్నాం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేస్తుంది... అయితే ప్రకాశం జిల్లలో మాత్రం, వాక్ విత్ జగన్ కాక, ఫైట్ విత్ జగన్ అయ్యింది... జగన్ చేస్తున్న ముఖ్యమంత్రి కుర్చీ పాదయాత్రకి, సంఘీభావంగా అంటూ, వాక్ విత్ జగన్ అంటూ కార్యక్రమం చేస్తే, ప్రకాశం జిల్లలో మాత్రం, జగన్ కొంప ముంచుతూ, రోడ్డు మీద పడి కొట్టుకున్నారు... కొట్టుకుంది నాయకులు అని చెప్పుకుంటూ తిరగే వారు... నాటు తుపాకులతో హల్ చేసి, చివరకు వాక్ విత్ జగన్ కాస్త, ఫైట్ విత్ జగన్ అయ్యింది...

saikam 29012018 2

ఇందులో ప్రధానంగా దేశ వ్యాప్తంగా 40 వేల మంది దగ్గర డబ్బులు కొట్టేసి, 300 కోట్ల స్వాహా చేసిన, బిట్ కాయిన్ మోసగాడు ప్రకాశం జిల్లాకి చెందిన వైకాపా నేత సైకం రామకృష్ణ రెడ్డి ప్రధానంగా ఉన్నారు... కనిగిరిలో వై సి పి చేస్తున్న వాక్ విత్ జగన్ లో, వైసిపికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది... వైసిపి ఇంచార్జి బుర్రా మధుసుధరావు యాదవ్, బిట్ కాయిన్ సంస్థ నిర్వాహకుడు సైకం రామకృష్ణారెడ్డి, అనుచరుల మధ్య పాదయాత్ర విషయంలో ఘర్షణ జరిగింది... ఇదే సందర్భంలో సైకం రామకృష్ణ రెడ్డి ప్రైవేటు సెక్యూరిటీ అంటూ కొంత మంది నాటు తుపాకులతో హడావిడి చేసారు...

saikam 29012018 3

ఈ పరిణామంతో పోలీసులు అవాక్కయ్యారు... పోలీసులు రంగంలోకి దిగి, సైకం రామకృష్ణారెడ్డితో పాటు తుపాకులతో తిరుగుతున్న అనుచరులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు... నాటు తుపాకులు, ఘర్షణ వాతావరణంతో, అక్కడ ప్రజలు ఈ పరిణామం చూసి ఆందోళన చెందారు... చివరకు వాక్ విత్ జగన్ కాస్త, ఫైట్ విత్ జగన్ అయ్యి, పోలీసులు అరెస్ట్ దాకా వెళ్ళింది... వీరి పనులు ఇలా ఉంటాయి.. ఏ అధికారం లేకుండానే, ఇలా నాటు తుపాకులతో తిరుగుతూ, ప్రజలని భయభ్రాంతులకి గురి చేసి హడావిడి చేసారు...

Advertisements

Latest Articles

Most Read