ఆంధ్రాకు ద్రోహం చేసిన మోడీకి, బుద్ధి చెప్పేలా, చంద్రబాబు ఏ అవకాసం వదులుకోవటం లేదు. మొన్న కర్ణాటక అయినా, ఈ రోజు తెలంగాణా అయినా, రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీకి బుద్ధి చెప్పే దిశలోనే రాజకీయం నడుస్తుంది. సెప్టెంబర్ 6 వ తేదీన కెసిఆర్ అసెంబ్లీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ రద్దు అనంతరం టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశం అనంతరం సీఎం చాంబర్‌లో సుమారు గంట పాటు తెలంగాణ రాజకీయ పరిణామాలపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. శనివారం హైదరాబాద్‌లో జరగనున్న టీడీపీ కీలక సమావేశం నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన అత్యవసర సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సమావేశానికి హాజరైన మంత్రులు, సీనియర్ నాయకులు ప్రధానంగా బీజేపీ ఓటమితో పాటు కాంగ్రెస్ తో పొత్తు విషయంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తెలంగాణలో పొత్తులపై వేచి చూడాలని కొందరు సూచించగా, కెసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని కొందరు సూచించారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు పరిణామాలను పరిశీలిస్తే బీజేపీ వ్యూహత్మాకంగానే దక్షిణాదిలో పాగా వేసేందుకు పావులు కడుపుతుందని అభిప్రాయ పడ్డారు. తెలంగాణలో కేసీఆర్, ఏపిలో జగన్, పవన్‌లతో బీజెపీ నాటకీయంగా వ్యవహారాలు నడుపుతున్నట్లు స్పష్టమవుతుందన్నారు. గత మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే కేసీఆర్ ను ఉపయోగించి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళకుండా పధకంవేస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. కేసీఆర్, మోడీల గాఢమైన స్నేహ బంధాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా టీడీపీ కూడా వ్యూహత్మాకంగా పావులు కదపాలని సమావేశంలో నిర్ణయించారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ముందున్న ఆప్షన్స్‌ను కూడా చర్చించారు. పార్టీకి ప్రధాన శత్రువు మోడీ కాబట్టి మోడీకి వ్యతిరేకంగా వ్యవహరించే శక్తులతో చేతులు కలిపితే బాగుంటుందని చర్చలో కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన అనంతరం "కాంగ్రెస్ పశ్చాత్తాపాన్ని ప్రకటించి తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదానిస్తామని ప్రకటించిందని" బీజేపీ హోదా ఇచ్చేది లేదని నిర్ధ్వంద్వంగా ప్రకటించిందని, అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా దాడులు చేస్తుందని సమావేశంలో చర్చిచారు. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలలో బీజేపీ పాత్ర ఉందని స్పష్టంచేశారు. కేంద్రం ఎలా చెపితే కెసిఆర్ అల నడుచుకుంటున్నారని పార్టీకి చెందిన సీనియర్ నేత సిఎం వద్ద అభిప్రాయం వ్యక్తం చేశారు. కెసీఆర్ వ్యతిరేక శక్తులన్ని ఏకమయ్యే పరిస్ధితి తెలంగాణలో కల్పిస్తుందన్నారు. క్షేత్రస్ధాయిలో పార్టీని సమయాత్తం చేసుకుంటునే పరిణామాలు గమనించాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది.