విభజన చట్టంలో హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి.. నాలుగేళ్లయినా కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభలో చంద్రబాబు పాల్గొన్నారు. హక్కులను సాధించుకునేందుకే కేంద్రంతో విభేదించామని... దీంతో, రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా ఆపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని... సవరించిన అంచనాలను ఇంకా ఆమోదించలేదని చెప్పారు. కడప ఉక్కు కర్మాగారాన్ని విస్మరించారని మండిపడ్డారు. విజయవాడ, విశాఖపట్నంలకు మెట్రో రైలు ఇవ్వడం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. దుగరాజపట్నం ఓడరేవును, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీని శాశ్వతంగా పూడ్చిపెడతామని అన్నారు.

cbn tg 29092018

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఉండి ఉంటే.. 90శాతం గ్రాంటు వచ్చేది. రాష్ట్రానికి ఇచ్చిన రూ.1500 కోట్లతో ఎలక్ట్రిసిటీ కేబుల్‌ కూడా రాదు. ఆ నిధులకు యూసీలు ఇవ్వలేదని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఖాతాలో వేసిన సొమ్మును వెనక్కి తీసుకోవడం చట్ట విరుద్ధం. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఏపీకి ఎందుకివ్వరని అడిగాం. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు కర్మాగారం రాకుండా అడ్డుపడుతున్నారు. విజయవాడ, విశాఖ మెట్రో రైళ్లకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఇతర నగరాల్లో ర్యాపిడ్‌, బుల్లెట్‌ రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్‌లో మన ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ప్రాంతీయ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం దేశ చరిత్రలో నూతన అధ్యాయం. రాష్ట్రం కోసం పోరాడితే కటకటాలు తప్పవని వైకాపా ఎంపీలు పారిపోయి వచ్చారు. మోదీ ప్రభుత్వం అవినీతిపరులను కాపాడుతోంది. రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం.. అంతిమంగా గెలిచేది ధర్మం, న్యాయమే" అని అన్నారు.

cbn tg 29092018

ప్రధాని మోదీ అంటే వైసీపీ నేతలకు వణుకు పుడుతుందని... అందుకే రాష్ట్రానికి ఆయన తీవ్ర అన్యాయం చేస్తున్నా, వైసీపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. మోదీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు పార్లమెంటులో లేరని, ఇక్కడ అసెంబ్లీలో కూడా లేరని అన్నారు. ఢిల్లీ నుంచి పారిపోయి వచ్చిన పిరికిపందలు ఈ వైసీపీ నేతలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి పౌరుషానికి తెలుగుదేశం పార్టీ ప్రతీక అని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది టీడీపీ ఎంపీలేనని అన్నారు. మోదీ బెదిరిస్తే భయపడే రకం టీడీపీ కాదని... ఇది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి ఒక బెబ్బులిపులిలా, ఒక కొండవీటి సింహంలా ముందుకు వెళతారని అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో మోదీ మాట్లాడిన వీడియోను ప్లే చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రాణాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి భరోసా ఇచ్చారు. సమాచారం ఇస్తే రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. తాడేపల్లిగూడెం ధర్మపోరాట సభలో మాట్లాడిన ఆయన.. ప్రాణహాని ఉందంటూ గురువారం ఏలూరు సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఫిర్యాదు చేస్తే.. కావలసినంత భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమాచారం ఇవ్వకుండా విమర్శిస్తే, విమర్శగానే ఉండిపోతుందని, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. అనవసరంగా భయపడొద్దని సూచించారు. ఏపీలో స్వచ్ఛమైన, నీతివంతమైన పాలన టీడీపీ అందిస్తోందని చంద్రబాబు అన్నారు.

cbn 290902018

ఏపీకి కేంద్రం తీవ్రమైన అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘‘ధోలేరా నగరానికి మోదీ రూ. 3వేల కోట్లు ఇచ్చారు. బుల్లెట్‌ ట్రైన్‌కు రూ. 1.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముంబై మెట్రోకు రూ. 52వేల కోట్లు ఇచ్చారు. మన రాజధానికి రూ. 1500 కోట్లే ఇచ్చి ద్రోహం చేశారు. రూ. 1500 కోట్లతో ఎలక్ట్రిసిటీ కేబుల్‌ కూడా రాదు. ప్రపంచ అత్యుత్తమ నగరాల్లో అమరావతి నిలుస్తుంది. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. అకౌంట్‌లో వేసిన డబ్బులు వెనక్కి తీసుకోవడం చట్ట వ్యతిరేకం. విద్యాసంస్థలకు అరకొర నిధులు ఇచ్చారు. దుగరాజపట్నం పోర్టు విషయంలోనూ కేంద్రం మోసం చేసింది. రామాయపట్నం పోర్టు నిర్మించకుంటామంటే అడ్డుకుంటున్నారు. విశాఖ-చెన్నై కారిడార్‌కు నిధులు ఇవ్వడం లేదు’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.

cbn 290902018

ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని బీజేపీ విస్మరించిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఎవరు అడ్డొచ్చినా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు 58 శాతం పూర్తయ్యాయని, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామన్నారు. పోలవరం పూర్తయితే పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పంటలకు సాగునీరు అందుతుందన్నారు. వచ్చే మే నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.

ఎక్కడైనా పెద్ద పెద్ద ఉద్యోగులు, కంపనీల పై ఐటి దాడులు జరిగితే, మహా అయితే ఒక రోజు జరుగుతాయి.. మరీ పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఇంకొంచెం టైం తీసుకుంటాయి. అలాంటిది ఒక రాజకీయ నాయకుడు ఉండే ఒక డూప్లెక్ష్ ఇంట్లో సోదాలు చెయ్యటానికి 43 గంటలు పట్టింది. చివరకు ఒక ఈక ముక్క కూడా పట్టుకోలేక, ప్రెస్ ముందు రావటానికి సిగ్గేసి, అధికారులు వెళ్ళిపోయారు. అయినా ఘనత వహించిన హైదరాబాద్ మీడియా మాత్రం, సిగ్గు వదిలేసి, ప్రగతి భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చెప్తూ, ప్రజలని పిచ్చోల్లని చేసారు. చివరకు తేలింది ఏంటి అంటే, మీడియాలో చూపించిన డాక్యుమెంట్ లు అన్నీ ఫేక్ డాక్యుమెంట్ లు అని..

revanth 29092018

ఇదే విషయం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. తన పెళ్లి 1992, మే 7న జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ దాడుల సందర్భంగా కొందరు టీఆర్ఎస్ నేతలు తన మామయ్య పద్మనాభరెడ్డితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారన్నారు. వారంతా తనకు బినామీగా ఉన్నట్లు చెప్పడం పై రేవంత్ వ్యంగ్యంగా స్పందించారు. సదరు నేతకు బినామీ ఆస్తులంటే అర్థమే తెలియదని వ్యాఖ్యానించారు. తనకు పిల్లనిచ్చిన మామ పద్మనాభరెడ్డి అప్పట్లోనే ఆల్ ఇండియా కిరోసిన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడని తెలిపారు. ఇక తన కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు, ఓ సోదరి ఉన్నారని రేవంత్ అన్నారు. ఇంతమంది ఇంట్లో ఉంటే మరొకరి పేరుపై బినామీ ఆస్తులను పెట్టాల్సిన అగత్యం ఏముందని ఆయన ప్రశ్నించారు.

revanth 29092018

బంజారాహిల్స్ లోని తన నాలుగు అంతస్తుల భవనం నుంచి అవినీతికి పాల్పడినట్లు కొందరు ఆరోపించడంపై రేవంత్ సీరియస్ గా స్పందించారు. తాను 18 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి భారీగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపించడంపై మాట్లాడుతూ.. బంజారాహిల్స్ లోని ఇంటిని 22 ఏళ్లుగా కంపెనీలకు లీజుకు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ చాలా కంపెనీలు ఆ బిల్డింగ్ ను లీజుకు తీసుకున్నాయని వెల్లడించారు. కంపెనీలు సాధారణంగా తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అద్దెకున్న ఇంటి అడ్రస్ పైనే చేపడతాయనీ, వాటన్నింటిని తన నెత్తిపై రుద్దితే ఎలాగని రేవంత్ ప్రశ్నించారు. తాను 23 మంది డైరెక్టర్లను నియమించి బినామీ కంపెనీలను నడిపానని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

revanth 29092018

కేసీఆర్ రెచ్చగొట్టిన ఓ జంతువు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, కేసీఆర్ ముసలి తనంతో, తిన లేక, పారేసే బొక్కలు ఏరుకునే సన్నాసులు తన పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి కనీసం నాలుగు నెలలైనా జైల్లో పెట్టాలని అనుకున్నారని,ఇలా ప్లాన్‌ చేసేది కేసీఆర్ అయితే, దాన్ని అమలు చేసేది మోదీ అని రేవంత్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలని మోడీ ఎలా ఇబ్బంది పెడుతున్నాడో, ఇక్కడ కెసిఆర్ చెప్పిన నా పై దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ సదర్భంగా కెసిఆర్ కు ఛాలెంజ్ చేసారు రేవంత్. 2001నుండి ఈనాటి వరకూ, కేసీఆర్ గారి కుటుంబం ఆస్తులు అప్పులు ఎంత. ? 2007నుండి ఈనాటి వరకూ రేవంత్ రెడ్డి కుటుంబం ఆస్తులు అప్పులు ఎంత. ? హైకోర్టు సీట్టింగ్ జడ్జితో ( లేదా ) సుప్రీంకోర్టు సీట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకుందాము సిద్ధమా.? 24గంటల్లో ఓ కేసీఆర్ గారు నీ జవాబు మాట ఏమిటో చెప్పండి అంటూ కెసిఆర్ కు సవాల్ విసిరారు.

revanth 29092018

ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో, సిగ్గు అనేది పూర్తిగా వదిలేసి, కెసిఆర్ చెప్పిన దానికి లొంగిపోయి, జర్నలిస్ట్ విలువులు లేని హైదరాబాద్ మీడియా పై, రేవంత్ నిప్పులు చెరిగారు. దూకుడు సినిమాలో బ్రహ్మానందంలాగా ఒకరికి మించి ఒకరు పెర్ఫార్మన్స్ ఇచ్చి, కెసిఆర్ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బ్యాంక్ అకౌంట్లు,నంబర్ల వేసే అప్పుడు, నఖల్ కొట్టాలన్నా అఖల్ వాడాలి కదా అంటూ, డూప్లికేట్ చేయడానికైనా బుద్ధి వాడాలి కదా అని మీడియాని ప్రశ్నించారు. "నా మీద ఒక మీడియా అధిపతి ఎగుర్తున్నాడు....నాకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఆయనకు చెప్తున్నా, నాకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని నిరూపించలేకపోతే నువ్ డిఎన్ఏ టెస్ట్ కి రెడీ కావాలి.....నీ పుటక సక్రమం అని , నీ అమ్మ కి నాయన కి నువ్ పుట్టావ్ అని" అంటూ ఒక మీడియా ఛానల్ అధిపతికి సవాల్ విసిరారు.

మలేసియా, హాంకాంగ్ లో అకౌంట్లు ఓపెన్ చేసి కోట్లాది రూపాయల వ్యవహారాలు నడిపినట్లు కొందరు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక అసలు మలేసియా, హాంకాంగ్ లకు వెళ్లనేలేదనీ, అలాంటప్పుడు బ్యాంకు అకౌంట్లు తెరవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేయండి అన్న రీతిన రిపోర్టర్లు తయారయ్యారని రేవంత్ విమర్శించారు. ఐటీ దాడుల్లో రూ.10-20 కోట్ల అక్రమాస్తులు దొరికినట్లు కొన్ని మీడియా సంస్థలు రాస్తే.. ఓ మీడియా సంస్థ మాత్రం రూ.1,000 కోట్లు దొరికినట్లు రాసిందని చెప్పారు. ఇదంతా కేసీఆర్ ఒత్తిడితోనే రాస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే తనపై చేసిన చిల్లర ఆరోపణలను చిల్లర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించాలని సవాల్ విసిరారు. కెసిఆర్ కు లొంగిపోయి, తెలంగాణా సమాజాన్ని నాశనం చెయ్యకుండా, నిజాలు ప్రసారం చెయ్యాలని రేవంత్ అన్నారు. నన్ను అరెస్ట్ చేసి చంచల్ గూడ,చర్లపల్లి కాదు కదా, అండమాన్ జైళ్లలో చీకటి గదుల్లో మగ్గేలా చేసినా ఇలాగే నిటారుగా ఉంటా,కేసీఆర్ తాట తీస్తా, రేపటి నుంచి ప్రజల్లోకి వస్తున్నా కాచుకో అంటూ కెసిఆర్ కి సవాల్ విసిరారు రేవంత్.

మన రాష్ట్రం లో గ్రూప్ 1 టాపర్ అయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి జీవితంను, అవినీతిలో ముంచి సర్వ నాశనం చేసిన మన ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చరిత్ర గుర్తుందా ? ఆమె జైలు, ఆసుపత్రుల చుట్టూ తిరుగింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఐఎఎస్. రత్న ప్రభ, బిపి ఆచార్య లాంటి ఐఏఎస్ ఆఫీసర్లని, జైలు చుట్టూ తిప్పాడు.. అయితే చంద్రబాబు పరిపాలనలో మాత్రం అందుకు భిన్నం. జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్లు, మన రాష్ట్ర ప్రభుత్వం తరుపున అవార్డ్ లు అందుకుంటున్నారు. తాజగా ఐఏఎస్ ఆఫీస్ అహ్మద్ బాబు, అమెరికాలో మన రాష్ట్రం తరుపున అవార్డ్ అందుకున్నారు. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ (ఆర్టీజీ)కి ప్ర‌ఖ్యాత హిటాచీ సంస్థ పీపుల్స్ ఛాయిస్ అవార్డు ల‌భించింది.

jagan 29092018

అమెరికాలోని శాన్ డిగోలో హిటాచీ నెక్ట్్స-2018 అవార్డుల‌ ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ విభాగం ముఖ్యకార్య‌ద‌ర్శి బి.రాజ‌శేఖ‌ర్, ఆర్టీజీఎస్ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి బాబు.ఏ లు అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏ, ఆర్టీజీఎస్ స‌ల‌హాదారు హ‌రిప్ర‌సాద్‌లు కూడా పాల్గొన్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీని స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకుని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ప్ర‌భుత్వం 5 కోట్లమందిప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సేవ‌ల‌కు గుర్తింపుగా ఈ అవార్డును ఆ సంస్థ అంద‌జేసింది. పీపుల్ ఫ‌స్ట్ ల‌క్ష్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తోంద‌ని ఆ సంస్థ ప్ర‌శంసించింది.

jagan 29092018

360 డిగ్రీస్ అప్రోచ్‌లో రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ ప‌నిచేస్తూ స‌త్ఫ‌లితాలు సాధిస్తోంద‌ని తెలిపింది. ఆర్టీజీఎస్ ద్వారా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఫిర్యాదులు, స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా ప‌రిష్క‌రించ‌డ‌మే కాకుండా, రాష్ట్రంలో జ‌రుగుతున్న మౌలిక‌స‌దుపాయ‌ల క‌ల్ప‌న ప‌నులు, ప్రాజెక్టుల ప్ర‌గ‌తిని ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని, అలాగే రాష్ట్రంలో ఏదైనా సంఘ‌ట‌ల‌ను జ‌రిగినా వాటిని ప‌ర్య‌వేక్షించి ప‌రిష్క‌రిస్తోంద‌న్నారు.వాతావ‌ర‌ణంలో మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌ట్టి సాంకేతిక స‌దుపాయంతో ప్ర‌జ‌ల‌కు అద్భుత‌మైన సేవ‌లు అందిస్తోంద‌ని తెలిపింది. ఆర్టీజీ వివిధ మార్గాల ద్వారా సేక‌రించి నిక్షిప్తం చేసిన బిగ్ డాటా వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు పార‌ద‌ర్శ‌క‌ల‌తో కూడిన సేవ‌ల‌ను అందించ‌డానికి అనువైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం సుల‌భంగా మారింద‌ని తెలిపింది. అనంత‌రం జరిగిన ప్యాన‌ట్ డిస్కష‌న్స్‌లో ఆర్టీజీఎస్ సీఈఓ బాబు.ఏ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు అవార్డు వివ‌రాల కోసం http://www.hitachinext.com/en-us/transformation-award-2018.html వెబ్‌సైట్ లింక్‌ను సంద‌ర్శించ‌గ‌ల‌రు.

Advertisements

Latest Articles

Most Read