ఎప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నా, సర్వేలు రావటం అనేది సహజం. అయితే మన రాష్ట్రంలో మాత్రం, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి, అనూహ్యంగా, జాతీయ మీడియాలో కూడా, మన రాష్ట్రం గురించి సర్వేలు వెయ్యటం ప్రారంభం అయ్యాయి. ఇలాంటివి ఇది వరకు ఎన్నికలప్పుడు మాత్రమే జాతీయ మీడియా వేసిది. అయితే జగన్ మాత్రం, తనకు తెలిసిన విద్యలతో, జాతీయ మీడియాతో టై అప్ అయ్యి, సంవత్సరం ముందు నుంచి హడావిడి చేస్తూ, జగన్ గెలిచిపోతున్నాడు అంటూ ఆ సర్వేలు వేయించుకుంటాడు. అదే తీసుకవచ్చి, తన పేపర్ లో మెయిన్ హెడ్డింగ్ గా వేసుకుని, తాను ఆనంద పడుతూ, తన అభిమనాలుని ఆనంద పరుస్తాడు.

republic 05102018 1

ఈ కోవలోనే, నిన్న ఒక సర్వే వచ్చింది. అందులో, జగన్ గెలిచిపోతున్నాడు, చంద్రబాబు ఓడిపోతున్నాడు అంటూ, ఆ సర్వే ఊదరగొట్టింది. జగన్ మోహన్ రెడ్డికి 21 ఎంపీ సీట్లు, చంద్రబాబుకి కేవలం 4 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయి అంట. అంతే కాదు, బీజేపీకి మన రాష్ట్రంలో 12.5% ఓటు షేర్ ఉంది అంట. కాంగ్రెస్ కి 7.2% ఇక ఓటు షేర్ ఉంది అంట. ఇది చూసుకుని, జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా ఆగటం లేదు. అయితే, ఈ సర్వే ఫాల్స్ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే, ఇది వరకు కూడా ఇలాంటే సర్వేలే వచ్చాయి. తీరా ఎన్నికలు ఆయిత తరువాత, జగన్ ఓడిపోవటం అనేది కామన్.

republic 05102018 1

జగన్ ఏమో సర్వేల్లో గెలుస్తాడు, చంద్రబాబు ఏమో, ప్రజల్లో గెలుస్తాడు, ఇదే జరుగుతూ వస్తుంది. కావాలంటే, అప్పట్లో జగన్ గెలుస్తాడు అంటూ చెప్పిన సర్వే లు చూడండి.. ఇలా ప్రజలను ప్రభావితం చెయ్యటానికి, జగన్, అమిత్ షా పడుతున్న తిప్పలు ఇవి. దీని పై తెలుగుదేశం కూడా స్పందించింది... కేంద్ర ప్రభుత్వం ఛానెల్స్ ద్వారా తప్పుడు సర్వేలు చేయిస్తోందని, మన రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉంటే, ఈ సర్వేలో మాత్రం 26 సీట్లు చూపిస్తున్నారని, ఈ సర్వే ఎలాంటిదో ఇక్కడే తెలుస్తుందని అన్నారు. బీజేపీకి బాకా కొట్టే ఇలాంటి ఛానెల్స్ లో సర్వేలు వేస్తే, ప్రజలు నమ్మరని, కనీసం గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉన్నా ప్రజలు నమ్ముతారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల ఈరోజు ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత బీద మస్తాన్ రావు సహా పలువురు నేతలకు సంబంధించిన కంపెనీల్లో ఈ రోజు తనిఖీలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈరోజు అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశానికి ముందే కొందరు మంత్రులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న విమర్శలు, రాష్ట్రంలో ఐటీ అధికారుల దాడుల అంశంపై అంతర్గతంగా చర్చ జరిగినట్టు సమాచారం.

cbn cabinet 05102018 2

కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించి టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని, నేతలంతా ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. టీడీపీలోనే కాకుండా ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా టీడీపీ నేతలే టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుగుతుండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీద మస్తాన్ రావు వ్యాపార సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. నిన్న మొదలైన ఈ తనిఖీలు నేడు కూడా కొనసాగాయి. కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన కుటుంబసభ్యుల కంపెనీల్లో సోదాలు జరిగినట్లు సమాచారం.

cbn cabinet 05102018 3

టంగుటూరు మండలం చెరువుకొమ్ముపాలెంలోని సదరన్‌ గ్రానైట్స్‌ కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహించింది. అలాగే జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంటలో సదరన్‌ ట్రోపికల్‌ ఫుడ్స్‌ ఆఫీసులో ఐటీ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. నారాయణ విద్యా సంస్థల్లో తనిఖీలు చేసేందుకు ఐటీ ప్రయత్నించడంతో ఇది కేవలం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోదీకి తనకు నచ్చని వారిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయించడం అలవాటుగా మారిందని, భయపడాల్సిన అవసరం లేదని.. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని నేతలకు టీడీపీ అధినేత సూచించారు. ఇదిలా ఉంటే.. మంత్రులతో చంద్రబాబు జరిపిన సమావేశంలో కేసీఆర్ విమర్శలు కూడా చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.

 

తెలంగాణా ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో, కేసీఆర్ ను ఉద్దేశించి, "రెండు ఏస్తే కాని లెగవడు, నాలుగు ఏస్తే కాని నుంచోడు" అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్న మురికి భాష చూస్తుంటే, ఆ నాలుగు ఏసి వచ్చి మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి, ఇంకో ముఖ్యమంత్రిని, పచ్చి బూతులు తిడుతుంటే, గవర్నర్ ఏమి చేస్తున్నారో మరి. అయితే, కేసీఆర్ మురికి వాగుడు పై, చంద్రబాబు స్పందించారు. తిరుపతి పర్యటనలో ఉన్న సీఎం గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు. బుధవారం నిజామాబాద్‌లో, గురువారం నల్లగొండలో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా... చంద్రబాబు వివరంగా స్పందించారు.

kcr 05102018

‘‘తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉండకూడదు? నన్ను ఎందుకు తిట్టాలి? నేను చేసిన తప్పేమిటి? తెలుగు వారు సామరస్యంగా ఉండాలని కోరుకోవడం నా తప్పా? హైదరాబాద్‌ అభివృద్ధికి రాత్రింబవళ్లు తిరిగి కష్టపడటం నా తప్పా? ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని బాబ్లీపై పోరాటం చేయడం తప్పా?’’ అని చంద్రబాబు.. టీఆర్‌ఎస్‌ అధిపతి కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ‘‘నేను విధానాలు, సిద్ధాంతాలపైనే మాట్లాడతాను. వ్యక్తిగతంగా మాట్లాడను. పరుష పదజాలంతో మాట్లాడటం నా పద్ధతి కాదు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరికీ మంచిది కాదు. గుప్పిట మూసి ఉన్నంత వరకే మర్యాద. ఆ తర్వాత ఎవ్వరికీ మర్యాద కాదు. నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. దానిని కాపాడుకుంటాను. ఏదంటే అది మాట్లాడి నాలుక్కరుచుకునే అలవాటు లేదు’’ అని తెలిపారు.

kcr 05102018

ఇదే కేసీఆర్‌ 2009 ప్రచార సభల్లో తనను ఎలా పొగిడారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ‘‘హైదరాబాద్‌ అభివృద్ధి చంద్రబాబు వల్లే కేసీఆర్‌ పలుమార్లు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులూ బాహాటంగా అంగీకరించారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీని కార్నర్‌ చేయాలనే కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను వదిలి వెళ్తున్నందుకు బాధ అనిపించదా అని అడిగారు. నేను తెలుగు వారి కోసమే చేశాను. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని వారే అనుభవిస్తున్నారు. రాష్ట్రవిభజన తర్వాత మరో నగరాన్ని నిర్మించాల్సిన బాధ్యత నాకు అప్పగించారు. అందుకే అమరావతికి వచ్చాను. ప్రతిరోజూ కొట్టుకుంటే అనవసరమైన విద్వేషాలుంటాయని, సామరస్యంగా పరిష్కరించుకుందామని భావించాను’’ అని చంద్రబాబు వివరించారు. తెలంగాణను టీడీపీ ఎందుకు వదలిపోవాలని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒకేసారి, వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది ఐటి అధికారులు రావటం, ఉదయంగా నుంచి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల పై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ సీనియర్లతో మాట్లాడారు. ఎన్నికల జరగబోయే రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దాడులు చేయటం బీజేపీకి అలవాటైపోయిందని వ్యాఖ్యానించారు. ఇది మోడీ, షా నైజం అని తెలిపారు. తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, తెలంగాణాలో ఇలాగే చేసారని, మన పై ఎన్నికల ముందు వస్తారనుకుంటే, ఇప్పుడే మొదలు పెట్టారని అన్నారు. పార్టీ నేతలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొంటామని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

itraids 05102018

అయితే ఉదయం టిడిపి నేతల ఇళ్ళ పై దాడికి బయలుదేరిన ఐటి అధికారులు, మీడియా వెంబడించడం, టీడీపీ వర్గాలకు సమాచారం అందటంతో ప్లాన్ బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. మొదట బెంజిసర్కిల్‌లోని నారాయణ కాలేజికి వెళ్లిన ఐటీ బృందం మీడియా వెంబడించడంతో అక్కడి నుంచి బందర్ రోడ్డులోకి వెళ్లారు. అయితే తమను వెంబడించవద్దని మధ్యాహ్నం తర్వాత తామే వివరాలు వెల్లడిస్తామని ఐటీ అధికారులు స్పష్టం చేశారు.విజయవాడలో నారాయణ కళాశాలల వద్దకు వచ్చిన ఐటీ అధికారులు ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ కళాశాలలపై ఎటువంటి ఐటీ దాడులు జరగలేదని మంత్రి నారాయణ ప్రకటించారు.

itraids 05102018

నెల్లూరులోని మంత్రి ఇంటి వద్దకు కూడా వెళ్లారని సమాచారం అందింది. అయితే ఆ సమయంలో మంత్రి నారాయణ ఇంట్లోనే ఉన్నారు. అక్కడకు ఎవరూ రాలేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలపై మోదీ ప్రభుత్వం కక్షసాధిస్తోందని మంత్రి నారాయణ ఆరోపించారు. బీదా మస్తాన్‌రావు సంస్థలపై ఐటీ దాడులు కుట్రపూరితమే అని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటకలో మాదిరిగా ఏపీపై పెత్తనం చేయాలని భావిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని నారాయణ విద్యాసంస్థలపై ఎక్కడా కూడా ఐటీ అధికారులు దాడులు చేయలేదని వివరించారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలపై కూడా దాడులు జరుగుతాయని ముందుగా ప్రచారం జరిగింది. విజయవాడ నుంచి కొన్ని ఐటీ బృందాలు గుంటూరు వైపునకు వెళ్లడమే ఈ ప్రచారానికి కారణం.

Advertisements

Latest Articles

Most Read