ఏపీలో శుక్రవారం ఉదయం నుంచి పలుచోట్ల ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. టీడీపీ నేత బీద మస్తాన్‌రావుకు చెందిన వీఎంఆర్‌ సంస్థలో ఐటీ తనిఖీలు చేయడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే పోతుల రామారావు కుటుంబసభ్యుల కంపెనీల్లో కూడా అధికారులు సోదాలు చేశారు. ఇదిలా ఉంటే.. విజయవాడలోని సదరన్ కంపెనీ ప్రతినిధుల ఇళ్లలో ఐటీ దాడులు జరిగాయి. సదరన్‌‌‌, వీఎస్‌ లాజిస్టిక్స్‌ కంపెనీల్లో ఐటీ సోదాలు చేసింది. జగ్గయ్యపేట సమీపంలో సిమెంట్ బ్రిక్స్‌ కంపెనీల్లో ఐటీ దాడులు చేయడం జరిగింది.

it 06102018 2

అయితే ఏ కంపెనీల్లో అధికారులు ఏమేం గుర్తించారు..? అసలు సోదాల్లో ఏం బయటపడ్డాయి..? ఎందుకు ఇంత సడన్‌గా ఐటీ అధికారులు ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు..? అనే విషయాలు తెలియరాలేదు. శుక్రవారంతోనే ఐటీ సోదాలు ముగిశాయా..? లేకుంటే మరో రెండు మూడ్రోజులు దాడులు జరుగుతాయా..? అనే వివరాలు కూడా తెలియట్లేదు. రేవంత్ కేసులో చేసినట్టు, మూడు రోజులు దాడి చేసి, ఉత్తి చేతులతో ఊపుకుంటూ వెళ్లినట్టు, ఇక్కడ కూడా జరిగినట్టు సమాచారం. ఎందుకంటే, ఐటి అధికారులు ఏమన్నా పట్టుకుంటే, ఈ పాటికే రచ్చ రచ్చ చేసి, ప్రెస్ మీట్లు పెట్టి, హడావిడి హడావిడి చేసేవారు. అయితే ఈ దాడులు ముగిసాయా, ఈ రోజు కొంసాగుతాయా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీంతో ఏపీకి చెందిన పలు కంపెనీల యజమానులు, రాజకీయ నేతలు ఎప్పుడేం జరుగుతుందో అని అయోమయంలో పడ్డారని తెలుస్తోంది.

it 06102018 3

కాగా.. ఏపీలో ఐటీ సోదాలు చేయడంపై శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వ్యవహారంపై సుమారు అరగంటకుపైగా చర్చించి అధికారులు భద్రత కల్పించకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా కేంద్రం.. ఏపీపై వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఐటీ సోదాలు జరపడంపై తెలుగు తమ్ముళ్లు కన్నెర్రజేశారు. మీడియా ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదంతా కుట్రపూరితంగా కేంద్రం చేస్తున్న పనేనని విమర్శలు మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు.

బాబ్లీ కేసులో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఏపీ కేబినెట్‌లో వాడీ వేడి చర్చ జరిగింది. ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాలా వద్దా అనే అంశం పై మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. దీని పై అడ్వకేట్ జనరల్, సీనియర్ మంత్రులతో శనివారం చంద్రబాబు భేటీ కానున్నారు. అయితే ర్యాలీగా కోర్టుకు హాజరైతే బాగుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు సూచించినట్టు తెలుస్తోంది. వారెంట్ రీకాల్ చేయకపోతే ఎలా అని సీనియర్ మంత్రి యనమల ప్రశ్నించగా, అడ్వేకేట్ జనరల్, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.

babli 06102018 2

మహారాష్ట్ర ధర్మాబాద్‌ కోర్టుకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు మొగ్గు చూపగా కొం దరు మంత్రులు వారించారు. ఈ నెల 15న కోర్టుకు హాజరుకావాలని సీఎం సహా మరో 14 మందిని న్యాయమూర్తి ఆదేశించారు. బాబ్లీ పోరాటానికి సంబంధించి ఈ కేసు విచారణపై సీఎం సమక్షంలో శుక్రవారం చర్చ జరిగింది. తుది నిర్ణయం జరగలేదు. అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ శనివారం వస్తున్నందువల్ల ఆయన అభిప్రాయం తీసుకొని ఒక నిర్ణయానికి రావాలని అనుకొన్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశానికి ముందు కొందరు మంత్రులతో చంద్ర బాబు సమావేశం అయ్యారు.

babli 06102018 3

ఇందులో ధర్మాబాద్‌ కోర్టు అంశం ప్రస్తావనకు వచ్చింది. శనివారం మరోసారి చర్చించి ఒక నిర్ణయానికి రావాలని నిశ్చయించారు. అయితే శనివారం ఈ విషయం పై అడ్వకేట్ జనరల్ తో చర్చించారు. ఆయన సూచన మేరకు మరో సారి ఈ కేసులో రీకాల్ పిటిషన్ వేయాలని సీఎం నిశ్చయించుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం కోర్ట్ కి వెళ్తేనే మంచిదనే అభిరయంలో ఉన్నా, న్యాయవాదుల అభిప్రాయం మేరకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ కేసు దొరక్క, 8 ఏళ్ళ నాటి కేసుతో సాధించటానికి వచ్చారని, మనం కూడా అలాగే ఎదుర్కుందామని, ప్రజలకు అన్ని విషయాలు అర్ధమయ్యేలా చెప్దామని, చంద్రబాబు అన్నట్టు తెలుస్తుంది. తెలంగాణా తెలుగుదేశం నేతలు కూడా, మీరు కోర్ట్ కి కనుక వెళ్తే, ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున రైతులు మీతో పాటు వస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే, ఇదంతా మోడీ ట్రాప్ అని, కోర్ట్ కి వెళ్తే అరెస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉందని, ఆచి తూచి అడుగులు వెయ్యాలని, కొంత మంది మంత్రులు చంద్రబాబుతో అన్నారు.

శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ సోదాలపై కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్. రాజకీయ వేధింపుల్లో భాగంగానే కేంద్రం ఐటీ అధికారులను రంగంలోకి దించిందని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడింది. ఒకేసారి 19 బృందాలను దించడం ఎప్పుడూ జరగలేదని మండిపడింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంతో ప్ర త్యక్ష యుద్ధానికి దిగాలని నిర్ణయించింది. ఉద్దేశపూర్వకంగా, రాజకీయ వేధింపుల దృష్టితో చేస్తున్న ఇటువం టి దాడులకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల సహకారం ఇవ్వరాదని నిర్ణయించారు.

ap cabinet 06102018

ఐటీ సోదాలకు వచ్చే అధికారులకు భద్రత కల్పించకూడదని నిర్ణయించింది. లా సెక్రటరీ సలహా తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకే సామాజికవర్గంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని.. కేంద్రంపై అన్ని స్థాయిల్లో పోరాటం చేయాలని.. ఈ మేరకు కేబినెట్‌లో చర్చించినట్టు సమాచారం. కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న తీరు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను రాజకీయ ప్రత్యర్థులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయాలని తీర్మానించారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఏసీబీ వంటి సంస్థలు విచారణ జరపకుండా గతంలో ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకోవడంపైనా దృష్టి సారించారు.

ap cabinet 06102018

మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో కూడా చైతన్యం కలిగించడానికి రాజకీయంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ‘‘నేను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇందిరాగాంధీ నుంచి అనేక మంది ప్రధాన మంత్రులను చూశాను. రాజకీయంగా అనేక మందితో విభేదించాం. కానీ, ఈ ప్రధానిలాగా పగ, కక్షతో వ్యవహరించే ధోరణి ఎక్కడా లేదు. ప్రతి రోజూ ఏదో ఒక అలజడి. తెల్లవారితే ఈ రోజు ఏం చేస్తారో... ఎక్కడ సమస్య తెస్తారో అని కాచుకొని చూసుకొనే పరిస్థితి తేవడం ఘోరం. దీనిని చూస్తూ ఊరుకోవడం సరికాదు. ఎంతవరకైనా పోరాడదాం’’ అని సీఎం అన్నారు. రాజకీయ వేధింపులే కాకుండా ఏపీకి పెట్టుబడిదారులు రాకుండా చేయాలన్న కసి కేంద్రంలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

రాజకీయ ప్రేరేపిత దాడులపై సుప్రీం కోర్టు లో పిటిషన్‌ వేయాలని నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేయాలా లేదా పిల్‌ రూపంలో వేయాలా అన్న ది అధ్యయనం చేయాలని న్యాయశాఖకు సీఎం సూచించారు. కేంద్రం మిధ్య అని గతంలో దివంగత ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తావించారు. అధికార పార్టీలో ఉన్న నాయకులను వేధించడంతో పాటు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలను భయభ్రాంతులకు గురి చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందని మంత్రులు ఆరోపించారు. ఈ తరహా ఐటీ దాడులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్న అంశంపై చర్చ జరిగింది. ఆ అవసరం లేదని, అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని న్యాయ శాఖ కార్యదర్శి ఈ సమావేశంలో చెప్పారు.

modi 06102018 2

‘‘ఐటీ దాడులు జరగడం సహజమే. కానీ.. నిర్దిష్ట సమాచారం ప్రకారం, ఒక పద్ధతితో మూకుమ్మడి దాడులు చేస్తారు. కానీ, 200 మంది అధికారులు 19 బృందాలుగా మారి... సూట్‌ కేసులు పట్టుకొని తిరుగుతూ భయాందోళనలు సృష్టించడం... ఎక్కడికి వెళ్తారో తెలియకుండా ఊరంతా తిరుగుతుండటం మొదటిసారి చూస్తున్నా? వీటిని ఐటీ దాడులు అంటారా లేక భయకంపిత వాతావరణం సృష్టించడం అంటారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. అనేక అంశాల్లో రాష్ట్రాల అధికారాలను లాక్కొని వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌ చార్జీలు ఒకేలాఉండే ప్రయత్నం చేస్తున్నామన్న పేరుతో ఆ రంగాన్ని తన చేతిలోకి తీసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తే రాష్ట్రాలు ఈగలు తోలుకుంటూ కూర్చోవాలా అని ఘాటుగా స్పందించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బ తీస్తున్నారన్న కోణంలో దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లే అంశంపై పరిశీలన చేయాలన్నారు.

modi 06102018 3

‘‘టీడీపీ నేతలు బీదా మస్తాన్‌రావు, పోతుల రామారావు ఇళ్లపై దాడులు జరిగాయి. మంత్రి నారాయణ విద్యా సంస్థలపై దాడులకు వెళ్లి అక్కడ మీడియాను చూసి వెనుతిరిగారు’’ అని ఒక మంత్రి వివరించారు. ఇది ఐటీ దాడి కాదని... మోదీ దాడి అని మరో మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఈ స్థాయిలో, ఇన్ని బృందాలతో దాడులు గతంలో ఏ రాష్ట్రంలో నూ జరగలేదన్నారు. ‘‘అడవుల్లో ఉన్న వారు ఇలాంటివి చేస్తే ఉగ్రవాదం అంటున్నారు. అధికారం చేతిలో పెట్టుకొన్నవారు చేస్తే అధికారిక ఉగ్రవాదం కాక మ రేమిటి? దీనిపై ప్ర జల్లో కదలిక తేవాలి. ప్రజలు నిరసన వ్య క్తం చేసేలా చేయాలి. కేం ద్రంలో ఇన్ని ప్రభుత్వాలు చూశాం. కానీ, ఇంత హేయమైన రీతిలో వ్యవహరిస్తున్న వారిని ఎప్పుడూ చూడలేదు. దానిని గట్టిగా ఎదుర్కోవాలి’’ అని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి డిమాండ్‌ చేశారు.

Advertisements

Latest Articles

Most Read