ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించి అధికంగా ఖర్చు చేశారన్న కేసులో ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుకు హైదరాబాద్ లోని, ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 10న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కోడెల 2014 ఎన్నికల్లో నిబంధనలకు మించి ఖర్చు చేశారంటూ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ పై, తెలంగాణాలో కేసు పెట్టటం ఒక విచిత్రం అయితే, దానికి నోటీసులు మరో విచిత్రం. ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన దానికి, హైదరాబాద్ కోర్ట్ కి, ఏపి స్పీకర్ రావటం కొంచెం విడ్డురంగా ఉంది.

kodela 04102018 2

తాను ఎన్నికల్లో సుమారు పదకొండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు, ఓ ఇంటర్వ్యూలో కోడెల చెప్పినందున విచారణ జరిపించాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కరీంనగర్ కోర్టు విచారణకు హాజరుకావాలని కోడెలను గతంలో ఆదేశించింది. అయితే కరీంనగర్ కోర్టు ఆదేశాల పై కోడెల శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు నాంపల్లిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కావడంతో ఆ కేసు అక్కడికి బదిలీ అయింది. కోడెల స్టే పొంది ఆరు నెలలు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టే పొడిగించాలని హైకోర్టును కోరారు.

kodela 04102018 3

హైకోర్టులో పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రత్యేక కోర్టు ఈ నెల 10న విచారణకు రావాలని కోడెలను ఆదేశించింది. ఇంట్లర్వ్యూలో ఎన్నికల్లో పెరుగుతున్న వ్యయం గురించి వివరిస్తూ.. తాను రాజ‌కీయ ప్ర‌వేశం చేసినప్పుడు ఎన్నిక‌ల్లో రూ.30వేలు ఖ‌ర్చు చేశానని.. ఆ రూ.30వేలు కూడా గ్రామాల్లోని ప్ర‌జ‌ల నుంచి చందాల రూపంలో వ‌చ్చాయ‌న్నారు. తర్వాత ఖ‌ర్చు పెరుగుతుందని.. 2014లో తనకు రూ.కోట్లు ఖ‌ర్చయ్యిందన్నారు. ఈ వీడియో ఆధారంగానే తెలంగాణా కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఇప్పుడు కోడెల స్వయంగా రావాలి అంటూ నోటీస్ వచ్చింది.

మరో వారం, పది రోజుల్లో 100 కొడుతుంది అనుకున్న పెట్రోల్ కి, కొంచెం బ్రేక్ పడింది. పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సామాన్యుడికి ఊరట కల్పించింది. ఇంధనాలపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని 1.50 మేర తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సైతం ఇంధన ధరలను రూ.1 మేర తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలపై సామాన్యుడికి రూ.2.50 మేర ఉపశమనం కల్పిస్తున్నట్టయింది. సవరించిన పెట్రోల్ ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై 15.33 మేర సుంకం వసూలు చేస్తోంది.

petrol 04102018

కాగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నులను రూ.2.50 మేర తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు జైట్లీ పేర్కొన్నారు. ఇటీవల ఇంధన ధరలు రోజూ పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడమే కారణమన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.10,500 కోట్ల భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం బాటలో నడిస్తే ఇంధన ధరలు మరింత దిగి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సహా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించి సామాన్యుడికి కొంతమేర ఊరట కల్పించగా.. మిగతా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

petrol 04102018

సమావేశం అనంతరం జైట్లీ మాట్లాడుతూ...‘పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ప్రజల మీద అత్యధిక భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2.50 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించేలా ఈ సమావేశంలో తీర్మానించాం. ఈ సుంకంలో కేంద్రం రూ.1.5, ఆయిల్‌ కంపెనీలు రూ.1 తగ్గించనున్నాయి. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉంది. ప్రజలు తమ సంపాదనను కేవలం వీటిమీదే కాకుండా ఇతర నిత్యావసరాలపైనా వెచ్చించాలన్నదే మా ఉద్దేశం. ద్రవ్యోల్బణం ప్రస్తుతం 4 శాతంలోపే ఉంది. దాన్ని తగ్గించే పనిలో ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు పెరుగుతుండటమే ఇందుకు కారణం. గతంలో కూడా ఇలా ధరలు పెరిగినప్పుడు రూ. 2 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాం. దేశంలోని చమురు, మార్కెట్‌ కంపెనీలన్నీ ఈ తగ్గించిన సుంకాన్ని భరించే స్థాయిలోనే ఉన్నాయి. రాష్ట్రాలు వారి సామర్థ్యం మేరకు ఈ పన్నును తగ్గించాలి. ప్రతి రాష్ట్రం దీన్ని అమలు చేయాల్సిందిగా లేఖలు రాస్తాం’ అని తెలిపారు.

సొంత డబ్బులతో వాటర్ బాటిల్ కొనుక్కుని, నీళ్ళు తాగుతున్నా, నీకు స్పెషల్ బాటిల్ ఉంది, మిగతా వారికి నార్మల్ బాటిల్ ఉంది అని, బూతద్ధంలో పెట్టి చూసే జగన్ పార్టీ నేతలకి, ఇలాంటి వార్తలు కనపడవు. తిరుపతి పర్యటనకు వెళ్ళాల్సిన ఐటి మంత్రి నారా లోకేష్, నిన్న రాత్రి విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్ లో బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి కొడుకు అయ్యి ఉండి, మంత్రి అయ్యి ఉండి, ఇలా ట్రైన్ లో వెళ్ళటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో ట్రైన్ లో మంత్రులు వెళ్ళటం చాలా అరుదు. కార్ ప్రయాణం చెయ్యలేని వారు, విమాన ప్రయాణం అవకాసం లేని ప్రజా ప్రతినిధులు మాత్రమే, ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు. ఒక పక్క, రాష్ట్రంలో మావోల కదలికతో టెన్షన్ వాతావరణం ఉన్న పరిస్థితుల్లో, లోకేష్ ట్రైన్ లో వెళ్ళటంతో, పోలీస్ శాఖ కూడా ఒకింత టెన్షన్ పడింది. విజయవాడ నుంచి తిరుమలకు ఫ్లిట్ ఉన్నా, టైం ఉంది, అవకాసం ఉంది కదా, ట్రైన్ కి వెల్లిపోదాం అని లోకేష్ చెప్పారు.

loesh 04102018 1

తిరుమలలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి, ఈఎంసీ-2లో నూతనంగా నిర్మించిన డిక్సన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ రెండో దశ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. దీంతోపాటు తిరుపతిలో షియామీ ప్రతినిధులతో సమావేశమై సంస్థ నూతనంగా ఉత్పత్తి చేసిన టీవీని ఆవిష్కరించనున్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆనుకుని ఇప్పటికే ఈఎంసీ-1(ఎలక్ట్రానిక్‌ పరికాల ఉత్పత్తి కేంద్రం), ఈఎంసీ-2లను ఏర్పాటు చేశారు. ఈఎంసీ-1లో సెల్‌కాన్‌ సంస్థ తమ చరవాణుల తయారీని ప్రారంభించాయి. సెవెన్‌హిల్స్‌ డిజిటల్‌, కార్బన్‌, ఐఅండ్‌ హెల్త్‌ కేర్‌లు తమ సైతం ముందుకు వచ్చాయి. రూ.150 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి కల్పిస్తూ డిక్సన్‌ మొదటి దశ కార్యకలాపాలను ఇప్పటికే నిర్వహిస్తోంది.

loesh 04102018 1

రెండో దశలో రూ.150 కోట్ల వ్యయంతో ఈఎంసీ-2లో డిక్సన్‌ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో టీవీలు, సీసీ కెమెరాలను తయారు చేయనున్నారు. దీన్ని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. మొత్తం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశ్రమ స్థాపించారు. ఇక్కడ ఏడాదికి 2.4 మిలియన్‌ టీవీలు, 1.2 మిలియన్‌ సీసీ కెమెరాలను ఉత్పత్తి చేయనున్నారు. మరో 2.5 లక్షల చదరపు అడుగుల్లో పరిశ్రమను విస్తరించి వాషింగ్‌మెషీన్లు, ఎల్‌ఈడీ బల్బులు తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. షియామీ సంస్థ నూతనంగా ఉత్పత్తి చేసిన 32, 43 అంగుళాల ఎంఐ స్మార్ట్‌ టీవీలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు.

కెసిఆర్ ! నీ అహంకారంతో, నీకున్న మదంతో, కొవ్వుతో తెలంగాణాను ఎంత నాశనం చేస్తున్నావో అర్ధం అవుతుందా ! నిన్ను ఎవడొ బట్టేబాజ్ అన్నాడు అని నీ అహం దెబ్బతినిందే ! నువ్వు నీ జీవితంలో ఎవడినైనా భట్టే బాజ్, బాడ్కోవ్ అని కాకుండా మరోలా సంభోదించావా ! మరి నిన్ను అదే మాట అనేసరికి పౌరుషం పొడుచుకువచ్చిందా ! నువ్వు మాత్రం అందరినీ తిట్టవచ్చా ! నిన్ను మాత్రం ఎవ్వరూ ఏమీ అనకూడదా ఇది కదా నీ దొర బలుపు ! స్టేట్ మొత్తం నీ దొరగడీ,ప్రజలందరూ నీ బానిసలు అనుకుంటున్నావా ! ఎన్నికల్లో అధికారం అప్పగిస్తే తాగటం చేతకాని పిల్లి పాల గిన్నె బోర్లించుకున్నట్లు బోర్లాపడి , ఇప్పుడు ఎన్నికలు రాగానే ఆంద్రోళ్ళు రాక్షసులు అని మరో కొత్తపాట పాడతవా ! ఈ ఐదేళ్ళలో నువ్వు చేసిన పని ఒక్కటి కూడా లేదు. కనీసం ఉన్న మిగులు ఆదాయం తో ఇచ్చిన రాష్ట్రాన్ని, అప్పులపాలు చేసి మరోసారి నీ నీచమైన బుద్దిని బయట పెట్టుకున్నావు !

kcr 0412018 3

మొన్న జి.హెచ్.యం.సి ఎన్నికలప్పుడు ఆంద్రోళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే నీ నోటితో తీస్తానని చెప్పినప్పుడు గుర్తురాలేదా ఈ ఆంద్రోళ్ళ సంగతి ! నీ పదవి కోసం, నీ అధికారం కోసం ఆంద్రోళ్ళు, తెలంగాణోళ్ళు కొట్టుకు చావాలా , నువ్వేమో ప్రగతిభవన్ లో , ఫార్మ్ హోస్ లో కులుకుతావా ! నీకోసం జనాలు చావాలి, విద్వేషాలు పెరగాలి, నీప్రగతి భవన్ గడిలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి, ఇంతకన్నా దొరతనం ఉందా ! నీ ఏడు మండలాలు ఆంధ్రాలో కలుపుకున్నారా ! అవి నీ ఏడు మండాలాలు ఎలా అయ్యాయి ! నీ అయ్యోడివా, నీ అమ్మోడివా ! తెలంగాణా నీ అయ్య జాగీరా ! తెలంగాణా, తెలంగాణా ప్రజలది, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది 1956 కి ముందున్న తెలంగాణాలో ఆ ఏడు మండలాలు ఉన్నాయా ! మరి ఏ లెక్కన అవి నీవయ్యాయి ! పోనీ, నీవే అనుకుందాం, మరి ఈ నాలుగేళ్ళనుండి ఏం గాడిదలు కాశావు ! అప్పుడే అది కుదరదు అని కోర్ట్ కి పోవాల్సింది కదా ! అసలు ఏపి పునర్విభజన చట్టం పార్లమెంట్ లో పాస్ అయ్యిందో లేదో కూడా తెలిసుండేది. నీ బతుకు బయటపడేది ! ఈ నాలుగేళ్ళు ఫార్మ్ హోస్ లో పడుకొని ఇప్పుడు లేచి " ఆంద్రా .ఆంధ్రా " అని అరుస్తున్నావు.

kcr 0412018 2

తెలంగాణా మేధావి సమాజం తెరాస ను తిడితే తెగ బాధపడిపోతూ. వైషమ్యాలు వద్దు, మనమందరం కలిసుందాం అని చెప్తారే ! మరి మీ దొర ఆంద్రోళ్ళని తిడుతున్నప్పుడు మీ చెవుల్లో చుట్టలు పెట్టుకున్నారా ! ఏం అది ఖండించాలి అనే సోయి మీకు లేదా ! లేద మీరు కూడా మీ అహం తగ్గించుకోవటానికి ఒకడు తిట్టించుకొనే పాలేరుండాలి, ఆ పాలేరు అంద్రోడు అనే దొర బలుపు మీ తలలకు కూడా ఎక్కిందా ! మీరు ఆంద్రోడిని తిట్టినప్పుడు సమ్మగా తలూపి, తెలంగాణా ను ఏమనద్దు అనటం లో ఏమైనా అర్దం ఉందా ! మీకుంది కూడా ఆ దొర బలుపే ! ఆ మాటలు ఖండించే ధైర్యం ఒక్క జర్నలిస్ట్ కి కూడా లేదు. వీళ్ళు పాలన ఎలా ఉండాలో సంపాదకీయాలు రాస్తారు. కుక్కలవలె, నక్కల వలె, చచ్చిన పేనులవలె అక్కడ బతుకుతూ ఇక్కడ పెన్నులు లేపి బరాబరా రాస్తారు.

ఫైనల్ గా ఒక్కమాట ! హైదరాబాద్ నీ యబ్బ నీకు ఇచ్చిన ఆస్తి కాదు, అది ఇండియాలో ఒక సిటి, ఎవడైనా ఉండొచ్చు,నువ్వేదో వాళ్ళను ఉండనిచ్చాను అనే ఫీలింగ్ లో ఉంటే మార్చుకో ! నీకున్న బలుపును, అహంకారాన్ని మడిచి నీ గడిలో , నీ పరుపు కిద పెట్టుకో ! మరోసారి , అంద్రోడు ని ఒక్క మాట అన్నావంటే నీ గడిని, నీ పరుపు కింద పెటుకున్న అహంకారాన్ని , నీ పరువుని అన్నిటినీ ఈ ఆంద్రోళ్ళే తరిమి తరిమి కోడతారు, తెలంగాణా సాయుద పోరాటంలో నీ లాంటి దొరలను తరమటానికి సహాయం చేసినవి ఈ చేతులే, మరోసారి, మరో దొరను తరిమికొట్టటానికి కూడా సహాయపడతాయి. ఫైనల్ గా చేతనైతే, నువ్వు ఏం చేశావో చెప్పుకో, చేతకాకపోతే నీ అపోజిషన్ పార్టీలను తిట్టుకో, అంతే కానీ మరోసారి ఆంద్రోళ్ళు అనే పేరు ఎత్తితే మాత్రం పద్దతిగా ఉండదు . మైండ్ యువర్ బ్లడీ లాంగ్వేజ్

Advertisements

Latest Articles

Most Read