సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి కర్నూలు విమానాశ్రయంగా నామాకరణం చేయడం జరిగిందని ఇంధన, పెట్టుబడులు, వౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. సోమవారం స్థానిక విద్యుత్ భవన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు ఎయిర్ పోర్టు (ఓర్వకల్లు) పనులను వచ్చే జూన్ నెరాఖరులోగా పూర్తి చేసి రన్‌వే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక అక్టోబర్ మాసం నుండి కర్నూలు-విజయవాడ, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు - విజయవాడకు అతి తక్కువ టిక్కెట్ ధర రూ.1500కే జిల్లా ప్రజలకు విమానయ ప్రయాణం కల్పిస్తున్నామన్నారు.

orvakallu 15052018 2

కర్నూల్ జిల్లా లో ఓర్వకల్లు సమీపాన విమానాశ్రయ పనులు వేగవంతం చేసారు.. అక్టోబరు నాటికి పూర్తిచేసి, డిసెంబరుకు ప్రయాణాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర రాజధాని అమరావతికి వాయు మార్గంలో చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు , జూన్‌ 30వతేదీ నాటికి రన్‌వే పనులు పూర్తి చేస్తారు.. టర్మినల్‌ బిల్డింగ్‌, ఏటీసీ కేంద్రం పనులు ముగిసిన తర్వాత డిసెంబరు ఆఖరు లోగా ఓర్వకల్లు నుంచి విజయవాడ, చెన్నైలకు విమానాలు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారు..

orvakallu 15052018 3

రూ.1500 ఛార్జీతో 35 నిమిషాల్లో విజయవాడ చేరుకునే అవకాశం ఉంది..నెల్లూరు, పుట్టపర్తిలో విమానాశ్రయ పనులు జరుగుతున్నాయి..పుట్టపర్తి నుంచి జూన్‌ నుంచి విజయవాడకు విమాన ప్రయాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.. కర్నూల్ జిల్లాలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. ఈ సెప్టెంబర్ లో ఓర్వకల్లు లో విమానాశ్రయం ప్రారంభం కానుందని ప్రకటించారు. పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని, ఓర్వకల్లుకు పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. విద్యావంతులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, రూ.85 వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని, 85 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.

ఆగష్టు ఒకటితో సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తుందని,ఆ గడువు లోపే తదుపరి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి , రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్.రమేష్ కుమార్ రాష్ట్రానికి లేఖ రాసారు. ఈ నెల 15 నుండి పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించాలని అందులో సూచించారు. జూన్ 25 నాటికి వార్డులు వారీగా రిజర్వేషన్లు ప్రకటించాలని, జులైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని పేర్కొన్నారు. నెలరోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రమేష్ కుమార్ సూచించారు. అయితే, ఈ రోజు పంచాయతీల వారీగా ప్రదర్శించాల్సిన ఓటర్ల జాబితాలు మరో నెలరో జులు వాయిదా పడ్డాయి. ఎన్నికల కార్యాచరణలో మార్పులు, చేర్పులు చోటుచేసుకోవడంతో మంగళవారం ప్రదర్శించాల్సిన ఓటర్ల జాబితా ప్రక్రియ నిలిచిపోయింది. తిరిగి జూన్‌ 15న ఈ జాబితాలు ప్రదర్శించనున్నారు.

august 15052018 2

పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు తగిన విధంగా రాష్ట్రంలో కసరత్తు జరుగుతుండగా ఈ ప్రక్రి య నెల రోజులు వాయిదా పడింది. దీనిలో తొలి అంకమైన ఓటర్ల జాబితా ప్రచురణ ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 15న అన్ని పంచాయతీల్లో వార్డుల వారీగా ప్రదర్శిం చాల్సి ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు దాదాపు అన్ని పంచాయతీల్లోనూ పూర్తయ్యాయి. జాబి తాలు ప్రదర్శించేందుకు అధికారులు సిద్ధమ వుతుండగా సోమవారం కార్యాచరణలో చేర్పులు, మార్పులు చేస్తూ తాజా ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో పంచాయితీ ఎన్నికలు, జూలై నేలాఖరులో కాని, ఆగష్టు రెండో వారం లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

august 15052018 3

ప్రస్తుత పాలక వర్గాల పదవీ కాలం ముగిశాక అన్ని పంచాయితీలకు స్పెషల్‌ ఆఫీ సర్లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. ఆగస్టు ఒకటితో పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తోంది. అంటే రెండు నుంచి కొత్త పాలక వర్గాలు రావాల్సి ఉంటుంది. ఈ లోగా ఎన్నికలు జరిగితేనే అందుకు అవకాశం ఉంటుంది. దీనిపై సందిగ్ధం నెలకొనడంతో పంచాయితీలలో హడావుడి మొదలైంది. డీపీవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, "వార్డుల వారీగా పంచాయతీ ఓటర్ల జాబితాలు జూన్‌ 15న విడుదల చేస్తాం. ఈ నెల 15న ప్రచురించాల్సిన జాబితాలను నెల రోజుల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. షెడ్యూల్‌లో స్వల్పంగా చేర్పులు, మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సామాజిక స్థితి నమోదుతోనే ప్రచురణ చేయడం జరిగేది. ఈ సారి కేవలం ఓటర్ల జాబితాలు మాత్రమే పంచాయతీల్లో ప్రదర్శించాలని ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు జిల్లాలో ఓటర్ల జాబి తాలు తయారు చేస్తాం." అని అన్నారు.

పిడుగుపాటు నుంచి ప్రజలను రక్షించేందుకు వీలుగా అన్ని పంచాయతీల్లో సైరన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిడుగులు పడే ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికగా సైరన్లు మోగించాలని తెలిపారు. సమాచార గోప్యత, రక్షణ అత్యంత కీలకమని అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆర్టీజీ స్టేట్ సెంటర్‌లో ఈ-ప్రగతి కోర్ ఫ్లాట్‌ఫాం ఏర్పాటు పురోగతి, రియల్‌టైమ్ గవర్నెన్స్‌పై సోమవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పిడుగులు పడే ప్రాంతాల్లో సైరన్లు మోగించే విధానాన్ని ఇప్పటికే విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేస్తున్నారని, ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆ తరువాత పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్నారు. పిడుగుపాటు మరణాలను వీలైనంత వరకూ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

thunder 15052018 2

పాఠశాలలు, కళాశాలలు వద్ద పిడుగు నిరోధక సాధనాలను ఏర్పాటు చేయాలన్నారు. కాగా ఈ-హైవే, ఈ-ప్రగతి పోర్టల్, యాప్ స్టోర్ తదితర ఐదు అంశాలతో ఈ-ప్రగతి కోర్ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంశంపై సమీక్షిస్తూ ఆయన సమాచారం దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్య, ప్రాథమిక రంగం, రహదారులు, భవనాలు, పంచాయితీరాజ్, పరిశ్రమలు, పురాపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో ఈ-ప్రగతి అమలుపై ఆరా తీశారు. ఆయా శాఖలు ఏర్పాటు చేసుకున్న సమయానికే ఈ లక్ష్యాలు నెరవేరతాయని అధికారులు తెలిపారు.

thunder 15052018 3

నందన్ నీలేకనీ కమిటీ 2012 రిపోర్టు ఆధారంగా ఈ-ప్రగతి మానవ వనరుల విధానం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులకు సీఎం తెలిపారు. ప్రజాసాధికార సర్వే అనుసంధానంతో అనేక కార్యక్రమాలు ఈ-ప్రగతి ద్వారా జరుగుతున్నాయని, డేటా పంచుకోవడం, భద్రత, తదితర అంశాలపై స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎన్‌సీబీఎన్ యాప్‌ను ఇప్పటివరకూ 10వేల మంది ప్రజలు డౌన్‌లోడ్ చేసుకున్నారని సీఎంకు తెలిపారు. యాప్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారని వివరించారు. బాపట్ల ఆబ్కారీ కార్యాలయంలో సిబ్బంది మద్యం తాగడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఆ శాఖ, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. నువ్వా? నేనా అన్నట్లు కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీల అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజం అయ్యే అవకాసం కనిపిస్తుంది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల వాయిదా తరువాత 222 స్థానాలకు ఈ నెల 12వ తేదీన ఎన్నికలు జరుగగా, ఈ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటివరకూ 211 స్థానాల్లో ఒకటి నుంచి నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీజేపీ 93 స్థానాల్లో, కాంగ్రెస్ 88 స్థానాల్లో జేడీఎస్ 29 స్థానాల్లో, ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో హంగ్ ప్రభుత్వం తప్పే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

jds 15052018 2

కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ సూచనలు కనిపిస్తుండటంతో బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. గోవా, మణిపూర్‌ అనుభవాలు పునరావృతం కాకుండా పావులు కదిపేందుకు కాంగ్రెస్ దిగ్గజాలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ హుటాహుటిన బెంగళూరు చేరుకున్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్న ఈ నేతలు ఒకవేళ హంగ్ సూచనలు స్పష్టంగా ఉంటే జేడీఎస్‌, తదితర పార్టీల నేతలతో మంతనాలు సాగించి ఎలాగైనా కాంగ్రెస్‌కు మరోమారు అధికార పీఠాన్ని కట్టబెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఆజాద్‌కు జేడీఎస్ అధినేత దేవెగౌడ‌తో సన్నిహత సంబంధాలు ఉండటం కూడా కాంగ్రెస్ నేతలకు అనుకూలించే అంశం.

jds 15052018 3

ఇక బీజేపీ కూడా 30:30 ఫార్ములాకు సిద్ధమవుతోంది. 30 నెలల పాటు బీజేపీ అధికారంలో ఉంటే మిగిలిన 30 నెలలు జేడీఎస్‌కు అవకాశం ఇవ్వడం. ఇది జేడీఎస్‌ గెల్చుకునే సీట్ల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. గతంలో చెరి 20 నెలల అధికార ఒప్పందం కుదుర్చుకున్న బీజేపీకి కుమారస్వామి ఝలక్‌ ఇచ్చారు. తన 20 నెలలు పూర్తి కాగానే మరి బీజేపీకి మద్దతివ్వలేదు. ఈ సారి బీజేపీ తొలి 30 నెలలు తామే ఉంటామని పట్టుబడుతుంది. మరో పక్క, బీజేపీ లేదా కాంగ్రెస్‌ పార్టీల వెలుపలి నుంచి మద్దతుతో కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా పరిశీలనలో ఉంది. దీనికి కాంగ్రె్‌సను అధికారానికి దూరంగా ఉంచడానికి బీజేపీ.. బీజేపీని నైతికంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్‌ ఒప్పుకోవచ్చు.

Advertisements

Latest Articles

Most Read