లేటెస్ట్ గా వచ్చిన మహేష్ బాబు సినిమా, భారత్ అనే నేను సినిమాలో, స్కూల్స్ గురించి వచ్చే సీన్ గుర్తుండే ఉంటుంది. కాని అది సినిమా, మన రాష్ట్రంలో ఇలాంటివి రియాలిటీలో జరుగుతున్నాయి. మొన్నటి దాక ప్రభుత్వ స్కూల్స్ అంటే, ఎదో టైం పాస్ కి పంపించే వారు. ఆ ప్రభుత్వ స్కూల్స్ పుణ్యమా అని, ప్రైవేటు స్కూల్స్ దండుకోవటం మొదలు పెట్టాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక ప్రణాలిక ప్రకారం, అన్నీ మార్చుకుంటూ వచ్చారు. ప్రైవేటు స్కూల్స్ కి దీటుగా స్కూల్స్ లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ మొదలు పెట్టారు, ఇంగ్లీష్ మీడియం చదువు మొదలు పెట్టారు, టీచర్స్ సరిగ్గా పని చేసేలా, వారి పని తీరుని, పిల్లల పాస్ పెర్సెంటేజ్ తో బేరీజు వేసుకుని, చదువుని కూడా లైన్ లో పెట్టారు. ఈ సంవత్సరం పదవి తరగతి ఫలితాల్లో ఎప్పటికంటే, ఎక్కువ రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడతో ఆగిపోలేదు, ఎవరూ ఊహించని మరో కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది.

cbn schools 30052018 2

చదువులో వెనుకబడిపోతున్న విద్యార్థు సామర్ధ్యం పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం సోమవారం నుంచి జ్ఞాన ధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తెలుగు, గణితం, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్ధ్యాలను పెంచి ఆ సబ్జెక్టుల్లో వెనుకుబాటు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ జ్ఞానధార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. జ్ఞానధార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా చేపట్టనుంది. మొదటి విడత ఐదు నుంచి ఆరో తరగతిలో చేరే విద్యార్థులకు, రెండో దశలో 9నుంచి 10 తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండోదశలో కనీస సామర్ధ్యాలను చేరుకోలేని విద్యార్ధులకు దీన్ని కొనసాగించి ఏడాది చివరి వరకు సామర్ధ్యాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి 9,10 తరగతి చదువుతున్న విద్యార్థుల్లో సి-గ్రేడ్‌, డి-గ్రేడుల్లో ఉన్నవారిని గుర్తించారు. శిక్షణా కార్యక్రమంలో మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలల్లో, బిసి, ఎస్సీ వసతిగృహాలు, మోడల్‌ స్కూలు, కెజిబివి పాఠశా లల్లో బాల, బాలికలకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వను న్నారు. శిక్షణలో భోజనం, ఇతర వసతి సౌకర్యాలు కల్పించనున్నారు.

cbn schools 30052018 3

జ్ఞానధార కార్యక్రమానికి ఎంపికయ్యే విద్యార్థుల శిక్షణ టైముటేబుల్‌ ఇలా ఉంది. ఉదయం యోగా, అనంతరం బోధనా తరగతలు, మధ్యాహ్నం హోంవర్క్‌, హ్యాండ్‌ రైటింగ్‌, డ్రాయింగ్‌, క్రాప్ట్‌ వంటి కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం సాయంత్రం 5గంటల నుంచి వ్యాయామం. అనంతరం సాయంత్రం రాత్రి భోజన సమయం వరకు లఘుచిత్రాల ప్రదర్శన ఉంటుంది. ప్రతి ఆధివారం వారంలో నేర్చుకున్న సబ్జెక్టులపై వారంతపు పరీక్షలు నిర్వహిస్తారు. హోంవర్కు సమయంలోనే రాయించడం, తెలుగులో చదివించడం, వ్యాకరణం, లెక్కల్లో ప్రాథమిక సూత్రాలు, సైన్సులో మెళకువలు, ఇంగ్లీషులో మాట్లాడే సామర్ధ్యం పెరిగేలా విద్యార్థులతో చదివించడం, మాట్లాడించడం వంటి నైపుణ్యాలను నేర్పించనున్నారు.

రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు.. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే తెలుగోడి సత్తా చూపించి, బాహుబలితో ఇండియన్ సినిమా కీర్తి పతాకను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు. మన అమరావతి కోసం కూడా ఒక చెయ్యి వేసాడు రాజమౌళి. రాజమౌళి అంటే ఒక క్రేజ్. రాజమౌళి నుంచి కంప్లిమేంట్ వచ్చింది అంటే అదో కిక్కుగా ఫీల్ అవుతారు సినిమా వాళ్ళు. అలాంటి రాజమౌళి మన విశాఖపట్నం పై ప్రశంసలు కురిపిస్తూ, విశాఖపట్నం నగర అభివృద్ధి సంస్థ (వుడా) అధికారులను మెచ్చుకుంటూ ట్వీట్ చేసారు. రాజమౌళి తాజాగా విశాఖపట్నం వెళ్లారు. వైజాగ్ లో తిరుగుతూ, రోడ్ల అందాల్ని, శుభ్రతను చూసి ఫిదా అయిపోయాడు. చాన్నాళ్ల తర్వాత వైజాగ్ వచ్చానని.. ఇక్కడి రోడ్లు చాలా పరిశుభ్రంగా.. పచ్చదనంతో నిండి ఉన్నాయని.. చాలా సమర్థవంతంగా వీటిని నిర్వహిస్తున్నారని.. ఇందుకు వుడాను అభినందిస్తున్నానని రాజమౌళి ట్వీట్ చేశాడు.

rajamouli 30052018 2

మూడేళ్ళ క్రిందట, మహా నగరం విశాఖ హుద్‌హుద్‌ తుపాన్‌ దెబ్బకు కుదేలైపోయింది. ఎదుగుతున్న సుందర నగర భవిత ఇక ఇప్పుడు అంధకారమే అనుకున్నారు అందరూ... కాని అక్కడ ఉన్నది చంద్రబాబు... అంత విద్వంసం సృష్టించిన ప్రచండమైన తుఫాను సైతం ఆశ్చర్యపోయే విధంగా, కేవలం 10 రోజుల్లో అంతా నార్మల్ అయిపొయింది... ముఖ్యమంత్రితో పాటు అధికార యంత్రాంగం మొత్తం, ఆ పది రోజుల పాటు, వైజాగ్ లోనే ఉండి, నష్ట నివారణ చర్యలు చేపట్టారు... సర్వం కోల్పోయిన ప్రజలకు భరోసా ఇచ్చారు... కట్ చేస్తే... ఈ మూడు ఏళ్ళలో వైజాగ్, పడింది, లేచింది, నిలబడింది, ప్రకృతి కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇప్పుడు పరిగెడుతుంది... స్వచ్ఛ భారత్ పథకం కింద అందజేసే స్వచ్ఛ సర్వేక్షణ 2017 ర్యాంకులలో, దేశంలోనే మూడువ సుందర నగరంగా ర్యాంకు సాధించింది.... ఇది ఆంధ్రావాడి దమ్ము అంటే...

rajamouli 30052018 2

తుఫానుకి అతలాకుతలం అయిన విశాఖ, స్వచ్ఛభారత్‌ మిషన్‌లో ర్యాంకింగ్స్ లో దేశంలోనే 3వ ర్యాంకులో నిలిచింది. దేశంలోనే ఎల్‌ఈడీ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ ఖ్యాతి గడించింది. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌ రివ్యూ, బ్రిక్స్‌ సదస్సు , భాగస్వామ్య సదస్సుతో విశాఖకు ప్రంపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ఏకంగా, రెండో సారి ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు కు ఆతిథ్యం ఇచ్చి, నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని మరోసారి నిరూపించింది. వైజాగ్ క్రికెట్ ఆడటానికి వచ్చిన విదేశీ క్రికెటర్లు అయినా, రాజమౌళి లాంటి సినిమా వారు అయినా, వైజాగ్ లో రోడ్ల శుభ్రతని పొగడకుండా ఉండలేరు. మన నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని ఇలాగే సుందర నగరంగానే ఉండాలి.... పెట్టుబడులు రావాలి... ఎప్పటికీ, శాంతి భద్రతలతో, పూర్తి ప్రశాంతంగా ఉండాలి... ఎదుగుతూనే ఉండాలి... నవ్యాంధ్ర ప్రగతిలో భాగస్వామి కావలి...

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖరీదైన క్యాథ్‌ల్యాబ్‌ సేవలు రోగులకు అందుబాటులో రానున్నాయి. పీపీపీ విధానంలో ఈ ల్యాబ్‌లు 13 ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. గుండె సంబంధ రోగులకు వైద్య సేవలు అందించడంలో ఈ క్యాథ్‌ ల్యాబ్‌ సేవలకు ప్రాధాన్యం ఉంది. ఒక్కో క్యాథ్‌ల్యాబ్‌కు కనీసం రూ.3 కోట్లు వ్యయమవుతుంది. అంతేకాకుండా..ప్రత్యేకంగా వైద్యులు, సాంకేతిక నిపుణులు అవసరం. ఖరీదైన ఈ సేవలు జిల్లా ఆస్పత్రుల్లో లేనందున రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రోగుల అవస్థలు తీరనున్నాయి.

cathlab 30052018 2

ఈ క్యాథ్‌ ల్యాబ్‌ ద్వారా 20 రకాల వైద్య సేవలు రోగులకు అందుబాటులో రానున్నాయి. ఈ జాబితాలో స్టంట్స్‌, ఫేస్‌మేకర్‌, యాంజియోప్లాస్టీ వంటి సేవలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు నిర్దేశించిన మేరకు రూ.7,770 నుంచి 80వేల రూపాయల విలువ కలిగిన సేవలు రోగులకు అందుతాయి. ఇక నుంచి ఒక్కో కేంద్రంలో రోజుకు 25 నుంచి 30మందికి స్టంట్, యాంజియోగ్రామ్ పరీక్షలు పరీక్షలు నిర్వహించొచ్చు. గుండె పనితీరుని గుర్తించి లోపాలను తెలియజేయడం, గుండె రక్త నాలాల్లో ఉన్న బ్లాక్స్ ని, వాటి తీవ్రతని గుర్తించడం క్యాథ్ ల్యాబ్ ప్రత్యేకత. వైజాగ్‌ కేజీహెచ్‌, కర్నూలు జీజీహెచ్‌లో పదేళ్ల కిందట, గుంటూరు జీజీహెచ్‌లో ఏడేళ్ల కిందట ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీటి కాలపరిమితి ముగిసింది.

cathlab 30052018 3

ఈ నేపథ్యంలో క్యాథ్‌ల్యాబ్‌లను వైజాగ్‌, కర్నూలు, గుంటూరు జీజీహెచ్‌ల్లోనే కాకుండా....కడప, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, కాకినాడ, శ్రీకాకుళం బోధనా ఆస్పత్రులు, ఏలూరు, విజయనగరం జిల్లా ఆస్పత్రుల్లో కొత్తగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ సుబ్బారావు వెల్లడించారు. విజయవాడ, అనంతపురం బోధనాస్పత్రులకు కేంద్రం నిధుల ద్వారా పరికరాలు రాబోతున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైంది. జూన్‌ చివరినాటికి సంస్థ ఎంపిక జరిగేలా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల సందర్శనకు ముఖ్యమంతి చంద్రబాబు వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితులను తెలుసుకునేందుకు విశ్వవిద్యాలయాలను సందర్శించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అన్ని వర్సిటీలను సందర్శించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విశ్వవిద్యాలయాలకు పంపించింది. వచ్చే నెల 22 నుంచి ప్రారంభమయ్యే సీఎం పర్యటన డిసెంబరు 28న చిత్తూరుతో ముగియనుంది. ఉన్నత విద్యలో ప్రపంచ పోటీ, ప్రపంచంలో వస్తున్న మార్పులపై విద్యార్థులతో సీఎం మాట్లాడనున్నారు. జిల్లాల పర్యటనకు వెళ్లే సమయంలోనే వర్సిటీలను సందర్శించనున్నారు.

cbn colleges 30052018 2

రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎం దార్శినికతకు అనుగుణంగా వర్సిటీలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ దిశగా సాగుతున్న వర్సిటీల ప్రగతి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో సీఎం తెలుసుకోనున్నారు. వర్సిటీ అనుబంధ కళాశాలల విద్యార్థులు, క్యాంపస్‌ విద్యార్థులతో సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో వర్సిటీల ఉపకులపతులు సమావేశాలకు అవసరమైన చర్యలు చేపట్టారు. ముందుగా జూన్ 22న శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్లనున్నారు, జూలై 6న విజయనగరంలో ఉన్న జేఎన్టీయూ, ఆగష్టు 3న విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలకు వెళ్తారు.

cbn colleges 30052018 3

ఆగష్టు 17న పశ్చిమ గోదావరి జిల్లాలోని వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ, సెప్టెంబర్ 2న తూర్పు గోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, సెప్టెంబర్ 17న కృష్ణా జిల్లాలోని, ట్రిపుల్ ఐటి, కృష్ణా యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ, అక్టోబర్ 3 న గుంటూరులోని, నాగార్జునా యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యావసాయి యూనివర్సిటీ, నవంబర్ 2 న నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ, నవంబర్ 16న అనంతపురంలోని జేఎన్టీయూ, శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ, నవంబర్ 30న కర్నూల్ లోని రాయలసీమ యూనివర్సిటీ, డిసెంబర్ 14 న, కడపలోని యోగి వేమన యూనివర్సిటీ, డిసెంబర్ 28 న, చిత్తూరులోని, శ్రీ వెంకటేశ్వర, శ్రీ పద్మావతి మహిళా, ద్రావిడ యూనివర్సిటీలను సందర్శిస్తారు...

Advertisements

Latest Articles

Most Read