అమరావతిని ఏదో ఒక పరిపాలన నగరంగా కాకుండా ఆర్థికాభివృద్ది కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో సమ్మిళిత వృద్ధి సాధించాలన్నదే తమ ప్రయత్నమని, సమాజంలో ప్రతి ఒక్కరికీ అమరావతి అవకాశాలు కల్పించాలన్నది తమ అభిమతమని వివరించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి పెట్టుబడులు, సాంకేతిక సహకారాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన ఆదివారం ఉదయం ఆరంభమైంది. ముందుగా ముఖ్యమంత్రి సింగపూర్ జాతీయాభివృద్ధి మంత్రి (Minister for National Development) లారెన్స్ వోంగ్ తో భేటీ అయ్యారు. నవ్యాంధ్ర రాజధానిలో 30 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. తాము రూ.30 వేల కోట్ల విలువైన టెండర్ల ప్రక్రియను చేపట్టామని వివరించారు.

singapore cbn 08072018 2

రాజధాని అమరావతి ప్రజారాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన ఇబ్బందులు అధిగమించేందుకు పెద్దఎత్తున అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఉభయ దేశాల మధ్య పరస్పర సహకారానికి, సౌహార్ద సంబంధాలకు ఇది సదవకాశమని ముఖ్యమంత్రి అన్నారు. రాజధాని అభివృద్ధికి తమ ప్రణాళికలు వాస్తవరూపం ధరించేందుకు సాంకేతికతను సాధనంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో భారత్ కు ప్రాతినిధ్యం ఉండాలని, అందులో అమరావతిని ప్రపంచస్థాయి 5 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు తెలిపారు. అమరావతి సమీపంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన రెండు పెద్ద నగరాలున్నాయన్నారు. అమరావతిని క్రమానుగతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

singapore cbn 08072018 3

ఇష్టం లేని విభజన ఎదుర్కొని కసిగా అభివృద్ధి చెందిన సింగపూర్ తమకు ఆదర్శమని, సింగపూర్ ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తుందని, రాజధాని లేని తమకు నూతన రాజధాని నిర్మాణానికి బృహత్తర ప్రణాళికను రికార్డు సమయంలో తయారు చేసి ఇచ్చిన సింగపూర్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. నగరాభివృద్ధి దశలవారీగా ఉంటుందని వివరించారు. అమరావతిలో రాజధాని నిర్మాణంకోసం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన పనిలో నిమగ్నమయ్యాయమని, ఇందుకోసం రూ.40 నుంచి 50 వేల కోట్లు అవసరమవుతాయన్నారు.

సింగపూర్ నేషనల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ వోంగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికలు తమనెంతో ఆకట్టుకున్నాయన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి గ్రీన్‌ఫీల్డ్ సిటీ ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. అమరావతిలో ఇక జన సంఖ్య పెరగాలన్నారు. ఇటీవల సింగపూర్ మంత్రులు పలువురు భారత్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషం వ్యక్తంచేశారని వోంగ్ గుర్తు చేశారు. అమరావతి అభివృద్ధి చెందుతున్న తీరు బావుందని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు భూసమీకరణ కింద 33 వేల ఎకరాల భూములివ్వటం అపూర్వ విషయమన్నారు. ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణ విధానం అందరికీ మార్గదర్శకమని అభివర్ణించారు. అమరావతి నగర నిర్మాణంలో నవీన సాంకేతికత, వినూత్న విధానాలను అమలు చేయడానికి తాము తప్పకుండా సహకరిస్తామని, హరిత నగరంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వామ్యం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

సింగపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ నగరాల సదస్సు(Global cities summit) ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలపై అందరిలో అవగాహన పెంచేందుకు తప్పకుండా దోహదపడుతుందని తమ విశ్వాసమని, అంతేకాదు, అనేక వినూత్న పెట్టుబడి భాగస్వామ్యాలకు ఈ సదస్సు వేదికగా నిలవబోతోందని చెప్పారు. అమరావతి అభివృద్ధికి నిర్ధిష్ట కాల పరిమితులను నిర్ణయించుకోవడం అవసరమని, ఇప్పటికే అక్కడ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో త్వరలో గణనీయమైన మార్పు తప్పకుండా కనిపిస్తుందని చెప్పారు. ఇతర దేశాలతో సింగపూర్ సంబంధాలన్నీ నిర్ణీత పద్ధతిలో వుంటాయన్నారు. అయితే భారతదేశం విషయానికి వస్తే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా సహకారం అందిస్తున్నామని, ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌తో తమ సంబంధాలు దృఢంగా ఉంటాయని, తాము త్వరలో భారత్ వచ్చినప్పుడు అమరావతిని తప్పక సందర్శిస్తామని వివరించారు.

శరవేగంగా జరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం చేపట్టినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో జరిగిన ‘ప్రపంచ నగరాల సదస్సు-మేయర్ల ఫోరం’ కార్యక్రమం వేదికపై స్పష్టం చేశారు. ఫోరంలో ఆదివారం ‘మౌలిక సదుపాయాలు- నవీన ఆవిష్కరణలు’ అనే అంశంపై ప్రసంగించిన ముఖ్యమంత్రి 2050 నాటికి ప్రపంచ జనాభాలో 66 శాతం నగరాల్లోనే నివసిస్తారని, ప్రధానంగా ఆసియా-ఆఫ్రికా ఖండాల్లో ఈ మార్పు కచ్చితంగా ఉంటుందని వివరించారు. నగరీకరణే విజన్‌గా 2050 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలో అత్యుత్తమ గమ్యస్థానంగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. విభజన తర్వాత తలెత్తిన సమస్యలను అధిగమించి రెండంకెల సుస్థిర వృద్ధిని నిలుపుకోవడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.

singapore 08072018 2

‘విద్యుత్, జల, గ్యాస్, రోడ్, ఫైబర్ నెట్‌వర్క్ వంటి 5 గ్రిడ్లను తయారు చేసుకుంటున్నాం. నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్‌ను తక్కువ ధరలోనే అందించగలుగుతున్నాం. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మేము అగ్రపథాన ఉన్నాం. ఇది రాష్ట్రాన్ని తయారీ పరిశ్రమల హబ్‌గా నిలిపేందుకు తప్పకుండా ఉపకరిస్తుంది.’ అని సదస్సులో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం పీపీపీ పద్ధతిలో అనేక సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ‘5 నిమిషాల్లో ఎమర్జెన్సీ, 10 నిమిషాల్లో సోషల్ ఇన్‌ఫ్రా, 15 నిమిషాల్లో వాక్ టు వర్క్’ అనే సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నామని వెల్లడించారు.

singapore 08072018 3

సింగపూర్ సహకారంతో తమ రాష్ట్రంలో సరికొత్త రాజధాని అమరావతిని నిర్మించుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు. నవ నగరాల సమాహారంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని, హరిత-జలనగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 35 వేల ఎకరాల భూమిని సమీకరణ విధానంలో సేకరించడం ప్రపంచంలోనే ఒక వినూత్న విధానంగా వివరించారు. 30 మిలియన్ల చదరపు అడుగుల మేర నగరం నిర్మాణం పనులు అమరావతిలో కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఉత్తమ సంస్థలు, అత్యుత్తమ రూపకర్తలు తమ నగర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంతో సహా, అమరావతిని అభివృద్ధి పథాన నిలపడానికి సదస్సుకు హాజరైన అందరి సహకారాన్ని ముఖ్యమంత్రి కోరారు. జల వనరుల నిర్వహణ-స్మార్ట్ టెక్నాలజీ అంశాలపై ఏపీకి సహకరిస్తామని సింగపూర్ మేయర్ల కమిటీ చైర్మన్ లోయెన్ లింగ్ హామీ ఇచ్చారు.

నగరాలను ఎలా మెరుగుపరచుకోవాలో, అభివృద్ధిలో భాగస్వామ్యాలను ఎలా అందిపుచ్చుకోవాలో అర్థం చేసుకునేందుకు సదస్సుకు హాజరైన 140 మంది యువ నగర పాలకులు తమ ఆలోచనలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ‘పౌరులకు అనుసంధానం కావడమే సుపరిపాలనకు మూలస్తంభం’గా యువ నేతలకు నేతృత్వం వహించిన మెలిస్సా అభిప్రాయపడ్డారు. చక్కని రవాణా వ్యవస్థ, అభ్యాస వ్యవస్థలను నిర్మించాల్సిన అవసరముందని, దీనికి విధివిధానాలు రూపొందించాల్సి వుందని పలువురు యువనేతలు భావించారు.

మమ్మల్నే ఎదురిస్తారా, మీకు ఇక చుక్కలే.. ఇది, మూడు నెలల క్రితం, ఆంధ్రప్రదేశ్ నేతలను ఉద్దేశించి, ఒక బీజేపీ నేత చేసిన వ్యాఖ్య... వారు అన్నట్టే జరుగుతుంది. ఎన్డీఏలో ఉన్నప్పుడు, ఎంతో కొంత సాయం ఉండేది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, నిధులు మాత్రమే కాదు, అనుమతులు కూడా నిలిచిపోయాయి. పోలవరం నుంచి, ప్రతిదీ ఇలాగే, కక్షసాధిస్తుంది కేంద్రం. తాజాగా, గన్నవరం ఎయిర్ పోర్ట్ పై కూడా అదే వైఖరి. సింగపూర్‌కు ఇంటర్నేషనల్‌ చార్టర్డ్‌ ఫ్లైట్‌ సర్వీసు నడిపే విషయంలో డీజీసీఏ నో అనేసింది. దేశీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు సంబంధించి అనుమతులు ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతర్జాతీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు అనుమతి ఇవ్వలేమని డీజీసీఏ చెబుతున్నట్టు తెలిసింది.

singapore 08072018 2

ఇంటర్నేషనల్‌ చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు అనుమతులు ఇవ్వలేమని చెబుతున్న డీజీసీఏ కేరళ, గోవా, తమిళనాడులకు అనుమతులు ఇచ్చారు. అక్కడ ఇవ్వగా విజయవాడ నుంచి ఇవ్వటానికి సమస్య ఏమిటో అర్థం కాని పరిస్థితి. అయినా పట్టు వదలకుండా డీజీసీఏతో అనుమతుల కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు. ప్రభుత్వం తరపున తాము చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ నడపటానికి అనుమతులు కోరుతున్నామని ఏపీఏడీసీఎల్‌ అధికారులు తాజాగా డీజీసీఏ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ప్రభుత్వాల తరపున చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ నడపటానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి కూడా డీజీసీఏ నుంచి అనుమతులు రావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ నడపాలని నిర్ణయించటం మంచిదే. టికెట్‌ ధర నియంత్రణ కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది.

singapore 08072018 3

విజయవాడ (గన్నవరం)- సింగపూర్‌ మధ్య విమాన సేవలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 86 వేల మంది (సంస్థ వెబ్‌సైట్‌, ఈమెయిల్‌ ద్వారా) సానుకూలంగా స్పందించారు. 79404మంది www.APADCL.com వెబ్ సైటులో స్పందించగా, 1335 మంది ఈమెయిల్ లో, 4020 మంది వాట్స్ అప్ లో, 1993 మంది sms రూపంలో, స్పందించారు. అయినా కేంద్రం కనికరించటం లేదు. ఇప్పటికే కేంద్ర సహకార లేమితో విజయవాడ నుంచి దుబాయ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసు కలగానే మిగిలిపోయింది. ముంబైకి విమనా సర్వీసు నడుపుతున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఇమిగ్రేషన్‌ ఏర్పడిన తర్వాత దుబాయ్‌, షార్జాలకు విమాన సర్వీసులు నడుపుతానని చెప్పింది. తీరా వచ్చాక ఈ సంస్థ వెనుకడుగు వేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్‌ గజపతిరాజు రాజీనామా చేసిన తర్వాత ఆ శాఖ నుంచి కూడా సహకారం రావటం లేదు.

జూన్ 12 2017న విజయవాడ వాసుల చిరకాల కల బెంజిసర్కిల్ ప్లై ఓవర్ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి, పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన జాతీయ రహదారి ఉండటం, నిత్యం ట్రాఫిక్ ఉండటంతో, పనులు ఎలా సాగుతాయో అనుకున్నారు. అయితే, పనులు మాత్రం, చాలా వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే అతి ముఖ్యమైన పనులు అన్నీ 50 శాతం పైన పూర్తయ్యాయి. షడ్యూల్ ప్రకారం అయితే, ఆగష్టు నెలకు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కావలి. అయితే, నవంబరులో పూర్తి చేయనున్నట్లు జాతీయ రహదారుల సంస్థ ప్రకటించింది. దసరా రోజు నాటికి పూర్తి చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంది. అయితే, నవంబర్ నాటికి పూర్తి చేస్తామని, కాంట్రాక్టు సంస్థ చెప్తుంది.

benz 08072018 2

1450 మీటర్ల దూరం పైవంతెన నిర్మాణంలో 49 పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లర్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం గడ్డర్ల నిర్మాణం జరుగుతోంది. మొత్తం 240 గడ్డర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటికే 50 గడ్డర్లను ఏర్పాటు చేశారు. రాత్రిపూట ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కంకిపాడు సమీపంలో ఫ్యాబ్రికేటెడ్‌ పనులు చేస్తున్నారు. స్పాన్లు, గడ్డర్లను అక్కడ నిర్మాణం చేసి భారీ వాహనాలు, క్రేన్లతో వాటిని తరలించి అమరుస్తున్నారు. బెంజిసర్కిల్‌ దగ్గర ఆంజనేయ స్వామి గుడి నుంచి ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వరకు పిల్లర్ల మీద గడ్డర్లు ఏర్పాటుచేశారు. ఒక్కో పిల్లర్‌ తల మీద ఐదు వంతున గడ్డర్లను ఏర్పాటుచేశారు. ఈ గడ్డర్లు కింద పడకుండా ,జారిపోకుండా ఉండటానికి కాంట్రాక్టు సంస్థ పటిష్ఠ చర్యలు తీసుకుంది. ఈ పనులు పూర్తయితే గడ్డర్లకు సపోర్టుగా ఉంచిన రాడ్లతో పాటు చెక్క దిమ్మెలను కూడా తొలగిస్తారు. ఆ తర్వాత నిలువు గడ్డర్ల మధ్యన క్రాస్‌ గడ్డర్ల పనులు చేపడతారు.

benz 08072018 3

నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు నుంచి సర్కిల్‌ వరకు కూడా గడ్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజులలో ఈ పనులు కూడా పూర్తవుతాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు నుంచి ఐదవ నెంబర్‌ రూట్‌ దాటే వరకు పిల్లర్ల తలలపై గడ్డర్లను ఏర్పాటుచేస్తారు. ఐదవ నెంబర్‌ రూట్‌ నుంచి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వరకు పిల్లర్ల పనులు చేపడుతున్నారు కాబట్టి ఇవి పూర్తయిన తర్వాత మిగిలిన గడ్డర్లను ఏర్పాటు చేస్తారు. మధ్యలో బెంజిసర్కిల్‌ దగ్గర రెండు పిల్లర్ల నిర్మాణంపై కాంట్రాక్టు సంస్థ దృష్టి సారించాల్సి ఉంది. వీటి పనులు పూర్తి చేసే లోపే రమేష్‌ హాస్పిటల్‌ వరకు కూడా పిల్లర్లు పూర్తవుతాయి. ప్రస్తుతం బెంజిసర్కిల్‌కు ఒక వైపు ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వరకు ఫ్లై ఓవర్‌పై స్లాబ్‌ పనులు కూడా చేపడుతున్నారు. స్లాబ్‌ వేయటానికి వీలుగా ఐరన్‌ను తెప్పించారు. క్రాస్‌ గడ్డర్‌ కాంక్రీట్‌ పూర్తయిన తర్వాత నిలువు గడ్డర్లపై ఐరన్‌ ఫ్రేమింగ్‌ చేసి కాంక్రీట్‌తో స్లాబ్‌ పోస్తారు. ఒకవైపు నిర్మాణం శరవేగంగా పూర్తవుతుండగా.. మరోవైపు వంతెన ఇంకా ప్రతిష్టంభనలోనే ఉంది. దీనికి కేంద్రం నుంచి పరిపాలన అనుమతి, ఆర్థిక శాఖ ఆమోదం రావాల్సి ఉంది. త్వరలో టెండర్లను పిలవనున్నట్లు పీడీ వెల్లడించారు. రెండో దశ అంచనా వ్యయం రూ.110 కోట్లుగా నిర్థరించారు. ఒకవైపు పూర్తి చేసినా... చాలావరకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read