విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, సరికొత్త ఆపరేషన్ కు తెర లేపారు. అటు ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఇటు మానవత్వ కోణంలో కూడా ఈ ఆపరేషన్ జరగనుంది. విజయవాడ నగరంలో, బిచ్చగాళ్ళను, నిరాశ్రయులను ఆదుకునే కార్యక్రమం, ఆపరేషన్‌ బెగ్గర్‌ కు, విజయవాడ నగరపాలక సంస్థ రెడీ అయ్యింది. ఈ మేరకు, నగరపాలక సంస్థ కమిషనర్‌ జె. నివాస్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్‌ నివాస్‌ ఆదేశాల ప్రకారం, బిచ్చగాళ్ళను, నిరాశ్రయులను కనిపెట్టే ప్రయత్నంలో, నగరపాలక సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా, ప్రధాన కూడల్లలో ఉండే వారిని గుర్తించటం మొదలు పెట్టారు. ఇందులో భగంగా, ఇప్పటికే కొంత మందిని గుర్తించారు. వారితో మాట్లాడారు.

vmc 08072018 2

వారిని, పూర్ణానందంపేట నవజీవన్‌ బాలభవన్‌ కు తీసుకువచ్చారు. అక్కడ నుంచి, హైదరాబాద్‌ చౌటుప్పల్‌ దగ్గర ఉన్న అమ్మనాన్న అనాధ ఆశ్రమానికి శుక్రవారం తరలించారు. ఇలా తరలించిన వారిలో, బిచ్చగాళ్ళు, నిరాశ్రయులు, ముసలి వారు, వికలాంగులు, మతి స్థిమితం సరిగ్గా లేని వారు ఉన్నారు. ఇలాంటి వారిని ఒప్పించటం, వారు ఒప్పుకోకపొతే బలంతంగా తరలించటం చేస్తున్నారు. వీరిని అక్కడకు తీసుకువెళ్ళి సరైన కౌన్సిలింగ్ ఇవ్వటం, వారి ఆరోగ్యం మెరుగు పడేలా చెయ్యటం, ఒపికి ఉన్నవారికి పనులు నేర్పించటం వంటివి చేస్తారు. ఈ కార్యక్రమం పట్ల, విజయవాడ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

vmc 08072018 3

ఈ సందర్భంగా కమిషనర్‌ జె. నివాస్‌ మాట్లాడుతూ నగరంలోని రైల్వే స్టేషన్‌, పాత, కొత్త గవర్నమెంట్‌ హాస్పటల్‌, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లోని నిరాశ్రయులను, బెగ్గర్లను 80మందిని సేకరించి ఒక దగ్గరకు తీసుకువచ్చామన్నారు. వారిలో వికలాంగులు, వ్యాధిగ్రస్తులు, మానసిక వికలాంగులు ఉన్నారన్నారు. నగరపాలక సంస్థ వీరిని మాములు మనుషులుగా తీర్చిదిద్దడానికి హైదారాబాద్‌ చౌటుప్పల్‌లో అమ్మనాన్న అనాధ ఆశ్రమంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. వీరందరిని ఆశ్రమానికి తరలించి వారి ఆరోగ్య, భోజన తదితర వసతులు అందిస్తారన్నారు. రాబోయే రోజుల్లో నగరంలో ఉన్న నిరాశ్రయులు, బెగ్గర్లను గుర్తించి వారిని కూడా తరలించి తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం ప్రెసిడెంట్‌ గట్టు గిరి, వ్యవస్ధాపకులు గట్టు శంకర్‌, నగరపాలకసంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాము భారత్‌లో నెలకొల్పదలిచిన మెట్రో రైల్ తయారీ కర్మాగారం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైనదిగా భావిస్తున్నట్టు మలేసియాకు చెందిన ఎస్ఎంహెచ్ రైల్ కార్పొరేషన్ పేర్కొంది. రైలు ఇంజన్ల తయారీలో పేరొందిన మలేసియా కంపెనీ ఎస్ఎంహెచ్ రైల్ కార్పొరేషన్ ప్రతినిధులు ఆదివారం సింగపూర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ‘ఎస్ఎంహెచ్’ ప్రతినిధులు ఆసక్తి చూపించగా ముఖ్యమంత్రి వారికి ఆహ్వానం పలికారు. జీఈ, సీమెన్స్, అల్‌స్టోమ్, జీఈ, హ్యుండయ్ వంటి సంస్థలతో తాము ప్రస్తుతం కలిసి పనిచేస్తున్నామని, తమ ఉత్పత్తిలో అత్యధిక శాతం ఎగుమతులే వుంటాయని ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జహ్రీన్ జమాన్ ముఖ్యమంత్రికి వివరించారు. పాత లోకోమోటీవ్‌లను కొత్త లోకోమోటీవ్ యూనిట్లుగా మార్చడం, రైళ్ల చక్రాలు, రైలు ఇరుసు, ఎలక్ట్రిక్ రైళ్ల విడి భాగాల తయారీ ‘ఎస్ఎంహెచ్’ పేరుగాంచింది.

rail 08072018 2

డస్సాల్ట్ సంస్థ... గాలి వాలును అంచనా వేసి ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించే సాంకేతికతను అభివృద్ధి చేసిన డస్సాల్ట్ సంస్థ అమరావతిలోనూ ఈ పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు సిద్ధమవుతోంది. జల వనరుల సంరక్షణకు, నగరాన్ని ఆకుపచ్చగా ఉంచేందుకు ఈ సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని స్మార్ట్ నగరాల రూపకల్పనలోనూ డస్సాల్ట్ సేవలను వినియోగించు కుంటామని వారికి ముఖ్యమంత్రి వెల్లడించారు.

rail 08072018 3

అమరావతి ప్రాజెక్టులో భాగంగా ఏపీతో కలిసి పనిచేస్తుండటం ఆనందంగా వుందని డస్సాల్ట్ సీఈవో బెర్నార్డ్ చార్లెస్ అన్నారు. ఇదే అంశంపై చైనా, సియోల్, సింగపూర్‌లతో కలిసి పనిచేస్తున్నామని, అక్కడి అనుభవాన్ని రంగరించి అమరావతిలో మరింత మెరుగ్గా పనిచేస్తామని ముఖ్యమంత్రికి మాటిచ్చారు. మరోవైపు స్థానిక విశ్వవిద్యాలయాలలో దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టడానికి కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కోరగా సెప్టెంబరులో అమరావతికి వచ్చి డిసెంబరు కల్లా అన్ని అంశాలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని చార్లెస్ చెప్పారు.

ఇది స్మార్ట్‌ ప్రపంచం. మనకు ఉన్నది స్మార్ట్ టెక్ సావీ ముఖ్యమంత్రి. మరి మారుతున్న కాలానికి తగ్గట్టుగా మన రాజధాని మారకపోతే ఎలా? అందుకే సాధారణ కరెంటు స్తంభాల స్థానంలో స్మార్ట్‌ పోల్స్‌ వచ్చేస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో, మరో విశిష్ట సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది. విపత్తులు తట్టుకుని, సాంకేతికత తోడుగా నిలావాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్న తరుణంలో అలాంటి ఒక సర్వీస్ ఇప్పుడు రాజధానిలో కులువుదీరుతుంది.. ఇప్పటికే ఇది వైజాగ్ లో సక్సెస్ అవ్వటంతో, మరిన్ని సౌకర్యాలు జోడించి అమరావతిలో పెట్టనున్నారు. స్మార్ట్ పోల్ గా పిలిచే ఈ స్తంబంలో వివిధ రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి...

smart poles 08072018 2

అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయనున్న పోల్స్‌లో స్మార్ట్‌ ఎల్‌ఈడీ వీధి దీపాలు, వైఫై హాట్‌ స్పాట్‌లు, పర్యావరణ సెన్సర్లు, నిఘా కెమేరాలు, డిజిటల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ బోర్డులు, ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ పాయింట్లు, వాయిస్‌ ఓవర్‌తో కూడిన ఇంట్రాక్టివ్‌ స్క్రీన్లు, పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టమ్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, ఎమర్జెన్సీ కాల్‌బాక్స్‌లు వంటి సదుపాయాలుంటాయి. వీటికి ఉండే లైట్లు, వాతావరణ పరిస్థితులను బట్టి లైటింగ్ ఇస్తాయి. అంటే రాత్రివేళ ఎక్కువ లైటింగ్ ఉంటే.. తెల్లవారుజాము నుంచి లైటింగ్ తగ్గించేస్తాయి. ఈ పోల్స్ అన్నీ, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం అయ్యి ఉంటాయి.

smart poles 08072018 3

రాజధాని జనాభా, అవసరాలు పెరిగే కొద్దీ స్మార్ట్‌పోల్స్‌లో అదనపు సదుపాయాలు జమచేస్తుంటారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని నగరాల్లో పరిమిత సంఖ్యలో స్మార్ట్‌ పోల్స్‌ ఉన్నాయి. కానీ నగరం మొత్తంలో స్మార్ట్‌ పోల్స్‌ అమరావతిలోనే ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కంట్రోల్‌ సెంటర్‌కి సమాచారం పంపించేందుకు అవసరమైన ప్రత్యేక వ్యవస్థలు స్మార్ట్‌పోల్స్‌లో ఉంటాయి. దానిలో ఉండే ఒక బటన్‌ను నొక్కడం ద్వారా ఆపదలో ఉన్న విషయాన్ని కంట్రోల్‌ సెంటర్‌కి తెలియజేసే వీలుంటుంది. అలాగే నగరానికి కొత్తగా వచ్చినవారికి సమాచార కేంద్రంగా, మార్గదర్శిగా పయోగపడుతుంది.

ఆయన రాజకీయం జీవితం 40 ఏళ్ళు. యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ గా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చరిత్ర ఆయనది. అత్యంత చిన్న వయసులో మంత్రి అయిన రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రికార్డు. నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డు. దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి, ప్రాధానులని, రాష్ట్రపతులని నిర్ణయించిన చరిత్ర ఆయనది. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ జోడించి, దేశాన్ని కాదు, ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. తెలంగాణా గుండెకాయ, సైబరాబాద్ సిటీ సృష్టికర్త. ఆయనకు ఉన్న బ్రాండ్ వేల్యూతో, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టిన చరిత్ర. ఆయనే చంద్రబాబు. చంద్రబాబు అంటే గుర్తుకువచ్చేది సమర్ధవంతమైన అడ్మినిస్ట్రేషన్... చంద్రబాబు బద్ధ వ్యతిరేకులు కూడా ఒప్పుకుని తీరాల్సిందే. ఇలాంటి చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ ఒక సవాల్ విసిరారు.

pk saval 08072018 2

కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు, మాట్లాడుతున్న మాటలకు, సహజంగానే రాజకీయంగా, తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. కనీస అవగాహన కూడా లేకుండా, పవన్ కళ్యాణ్ ఎలా అభాసుపాలవుతున్నారో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. నీకు అవగాహన లేదు అని పవన్ పై విమర్శలు చేసినందుకు, పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సవాల్ విసిరారు. నేను మీలాగా ఐఏఎస్ ఆఫీసర్ల పై ఆధారపడి లేను, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా చదువుకున్నాను, ప్రతి రోజు 10 గంటలు అన్నీ చదువుతూనే ఉంటాను, వైద్య, న్యూక్లియర్, వాతావరణ, వ్యవసాయం, మైనింగ్, పంచాయతీరాజ్ ఇలా దేనిపైనైనా నేను ఒక్కడినే వచ్చి, మాట్లాడతాను, మీరు ఐఏఎస్ ఆఫీసర్ల సాయం లేకుండా, నాతో చర్చకు రండి అని సవాల్ విసిరారు. చంద్రబాబు ఒక్కరే కాదు, లోకేష్, జగన్ కు కూడా సవాల్ విసిరారు.

pk saval 08072018 3

నాకు ఏ పాలసీ అయినా తెలుసు, నాకు ముందు చూపు ఎక్కువ, మీకు 2050లో విజన్ డాక్యుమెంట్ లో, వైజాగ్ ఎలా ఉండాలో చెప్పాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు కావలి, కాని నేను ఒక్కడినే చెప్పగలను, అంటూ చంద్రబాబుని ఎద్దేవా చేసాడు పవన్. ఏ టాపిక్ అయినా, ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు ఏదైనా, నేను మీతో చర్చకు రెడీ అంటూ, సవాల్ చేసాడు. అయితే, దీని పై ప్రజలు పడి పడి నవ్వుకుంటున్నారు. గత రెండేళ్ళ నుంచి మిస్సోరీలో ఐఏఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ పూర్తయిన సందర్భంలో, మీకు ఎవరి స్పీచ్ వినాలని ఉంది అంటే, చంద్రబాబు పేరు చెప్పారు. అది చంద్రబాబు సత్తా. సెంట్రల్ సర్వీసెస్ నుంచి, చంద్రబాబు వద్ద పని చెయ్యటానికి, ఐఏఎస్ లు ట్రాన్స్ఫర్ చేసుకుని మరీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు దగ్గర పని చేస్తే, మా కెరీర్ కు ఎంతో ఉపయోగం అని ఐఏఎస్ లు నమ్ముతూ ఉంటారు. అలాంటి చంద్రబాబుకు, అడ్మినిస్ట్రేషన్ లో, పాలసీల్లో , మీరు ఐఏఎస్ ఆఫీసర్ల సహాయం లేకుండా, నాతో చర్చకు రండి అని పవన్ సవాల్ విసిరుతుంటే, "డిక్కీ బలిసిన కోడి, చికెన్ షాప్ ముందుకు వచ్చి తోడ కొట్టింది అంట" అనే మహేష్ బాబు సినిమాలో డైలాగ్ గుర్తుకు వస్తుంది.

Advertisements

Latest Articles

Most Read