పేదల కడుపు నింపడానికి... అన్న క్యాంటిన్లు సిద్ధమవుతున్నాయి. రేపు (జూలై 11న ) రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. తక్కువ ధరకే రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటుచేస్తోంది. ఇవి రంగుల హంగులు అమర్చుకుని, గాజు తలుపులు, అంతర్గత అలంకరణ, నిఘా నిత్రాలు.. నగరంలోని రెస్టారెంట్ల మాదిరి.. క్లాస్లుక్ తో కనిపిస్తున్నాయి. పేద , మధ్యతరగతి వర్గాలకు ‘అక్షయపాత్రతో వేడివేడిగా అల్పాహారం, కేవలం ఐదు రూపాయలకే భోజనం వడ్డించడానికి .. బుధవారం నుంచి అధికారికంగా అన్న క్యాంటిన్లు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని విద్యాధరపురం, నల్లగేట్, ధర్నా చౌక్ లో తొలుత ప్రారంభం కానున్నాయి. రెండు రోజులుగా ఆహార పదార్థాల పంపిణీ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

anna 10072018 2

పేద, మధ్యతరగతి వర్గాల కోసం ప్రభుత్వం విజయవాడ నగరానికి 16, మచిలీపట్నంకు ఒకటి, గుడివాడకు రెండు అన్న క్యాంటిన్లను మంజూరు చేసింది. విజయవాడలో మూడు క్యాంటిన్లు ప్రారంభానికి సిద్దం కాగా మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. నగరంలో ప్రస్తుతం 11 చోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరో ఐదు చోట్ల స్థలాన్వేషణ సాగిస్తున్నారు. నగరంలో విద్యాధరపురం (ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు), హెచ్ బీ కాలనీ ( భవానీపురం) , సింగ్ నగర్ (ఫ్లై ఓవర్ దిగువన), అయోధ్యనగర్, రాణిగారితోట (కృష్ణలంక), నల్లగేటు స్కూల్ (కృష్ణలంక), సాయిబాబా గుడి (కృష్ణలంక), ధర్నా చౌక్ (అలంకార్ సెంటర్), అల్లూరి సీతారామరాజు వంతెన, హైస్కూల్ రోడ్డు (పటమట), గాంధీజీ హై స్కూల్ ( వన్ టౌన్)లో అన్న క్యాంటిన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిలో విద్యాధర పురంలోని ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు , ధర్నా చౌక్, నల్లగేటు స్కూల్ (కృష్ణలంక) వద్ద నిర్మిస్తున్న అన్న క్యాంటిన్లు పూర్తిగా రూపుదిద్దుకున్నాయి, ఇవి రేపు ప్రారంభం అవుతాయి.

anna 10072018 3

మిగిలినవి త్వరలో ప్రారంభిస్తారు. స్థలాలను ఇంకా కేటాయించకపోవడంతో రాజీవ్ నగర్ (సెంట్రల్), మధురానగర్ (సెంట్రల్), గీతానగర్ (కృష్ణలంక), సీఎం ఇంటి వద్ద (తాడేపల్లి ) పనులు ఇంకా మొదలుకాలేదు. ఆధునిక రెస్టారెంట్ల తరహాలో ఆధునిక రెస్టారెంట్ల తరహాలో క్యాంటిన్లు నిర్మిస్తున్నారు. ఆరంభమే అదిరేలా కనిపిస్తోంది. పసుపు, ఎర్రటి రంగులతో అన్న క్యాంటిన్లకు డిజైన్ చేశారు. ఫ్రంట్ డోర్, విండోలను పూర్తిగా అద్దాలతో ఏర్పాటు చేస్తున్నారు. లోపల, బయట ఖరీదైన వాల్ పెయింటింగ్ వేశారు. కిచెన్ను ఆకర్షణీయంగా టైల్స్ తో రూపకల్పన చేశారు. గచ్చు పై పూర్తిగా తెల్లటి పాలరాళ్లను ఏర్పాటు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సీలింగ్ కోటింగ్ ఇచ్చారు. ఒక్కో అన్న క్యాంటిన్లో ఆరు నుంచి ఎనిమిది ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరా, పదికి పైగా ట్యూబ్ లైట్లు అమరుస్తున్నారు. ప్రహరీకి, క్యాంటీన్ కు మధ్యన ఉన్న ప్రాంతంలో టైల్స్ వేస్తున్నారు. వీటిలో అందుబాటులో ఉంచాల్సిన ఆహార పదార్ధాల తయారీ బాధ్యతలను ప్రభుత్వం అక్షయపాత్ర సంస్థకు అప్పగించింది.

శ్రీరాముడు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద టీవీ ప్యానలిస్టు కత్తి మహేశ్‌కు హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓ వర్గం వారి మనోభావాలను దెబ్బ తీస్తుండటంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. కత్తి మహేష్ ను చిత్తూరులోని అతని స్వస్థలానికి తరలిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించిన అధికారులు, ఇతన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగిస్తున్నామని నిన్న, మీడియాతో చెప్పారు. అతను హైదరాబాద్ తిరిగి రావటానికి వీలు లేదని చెప్పారు.

poliece 10072018

అయితే, ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంటనే తెలంగాణా పోలీసులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అతన్ని ఆంధ్రపదేశ్ పంపించటం ఏంటని ? తప్పు ఎక్కడైనా తప్పే కదా అంటూ ప్రశ్నించారు. అతన్ని ఆంధ్రపదేశ్ లో విడిచి పెడితే, మేము మళ్ళీ తీసుకువచ్చి హైదరాబాద్ లో విడిచి పెడతామని చెప్పినట్టు తెలిసింది. ఆంధ్రపదేశ్ పోలీసులు గట్టిగా చెప్పటంతో, తెలంగాణా పోలీసులు కూడా వెనక్కు తగ్గారని సమాచారం. అయితే, ఇప్పటి వరకు కత్తి మహేష్ ను పోలీసులు ఎక్కడ విడిచి పెట్టారో తెలియదు. కత్తి మహేష్ మాత్రం, సోషల్ మీడియాలో , నేను ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నాను అంటూ స్టేటస్ పెట్టాడు.

poliece 10072018

విశ్వసనీయ సమాచారం ప్రకారం కత్తి మహేశ్‌ను కర్ణాటకలోని ఆయన బంధువుల ఇంటికి తెలంగాణా పోలీసులు తరలించినట్లు తెలిసింది. ఆంధ్రపదేశ్ పోలీసులు కత్తి మహేష్ ను ఇక్కడ దింపితే, మేము మళ్ళీ తీసుకువచ్చి హైదరాబాద్ లో దింపుతాం అని చెప్పటంతో, తెలంగణా పోలీసులు, అతన్ని కర్ణాటక తరలించినట్టు తెలుస్తుంది. మరో పక్క, కత్తి శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠం అధిపతి సాధూ పరిపూర్ణానంద పాదయాత్ర తలపెట్టడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇప్పటికీ ఆయన హౌస్ అరెస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి, ఇప్పుడున్న పరిస్థితిలో, కత్తి మహేష్ లాంటి వివాదాస్పదుడిని ఆంధ్రప్రదేశ్ లోకి రాకండ, ఆంధ్రపదేశ్ పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించింది.

రంగం ఏదైనా, ప్రకటించే సంస్థ ఏదైనా... నెంబర్ వన్ అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని మరోసారి రుజువైంది. ఒక విజనరీ చీఫ్ మినిస్టర్ ఉంటే ఇలాంటి ఫలితాలే ఒక రాష్ట్రానికి వస్తాయి. కొన్ని నెలలుగా ఈజ్ అఫ్ డూయింగ్ ర్యాంకులు ప్రకటన వాయిదా పడుతూ వస్తుంది. అయితే, ఎట్టకేలకు ఈ రోజు ఈజ్ అఫ్ డూయింగ్ ర్యాంకులు ప్రకటించారు. కేంద్రం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా ఈ ర్యాంకులు ప్రకటించారు. ప్రతి ఆంధ్రుడు గర్వ పడేలా ఈ సారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా అవతరించింది. 2015లో మనమే టాప్ గా ఉన్నాం, 2016లో మనమే టాప్ గా ఉన్నాం, తాజాగా ప్రకటించిన 2017లో కూడా మనమే టాప్ లో ఉన్నాం.. ఇది ఒక విజనరీ ముఖ్యమంత్రిగా ఉంటే వచ్చే ఫలితాలు.

eodb 10072018 2

అయితే, గత సంవత్సరం నవంబర్ నెలలో, హైదరాబాద్ మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ప్రకటించకుండానే, తెలంగాణా ఫస్ట్ అని, ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో ఉంది అని ఎలా ఊదరగొట్టారో, సాక్షి లాంటి ప్రతికలు ఎలా రాసి మన రాష్ట్ర పరువు తీసారో చూసాం... తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన బ్రీఫింగ్ తీసుకుని, విషయం తెలుసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉంది అంటూ హేళన చేసారు... ఈ రోజు ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా ఉంది... మరి ఇప్పుడు హైదరాబాద్ మీడియాకి, ఇవి చూపించే దమ్ము ఉందా ? బ్రేకింగులు వేసే దమ్ము ఉందా... మొన్న ఆంధ్రప్రదేశ్ ను హేళన చేసినట్టు, ఈ రోజు తెలంగాణా రాష్ట్రాన్ని హేళన చేసే దమ్ము ఉందా ?

eodb 10072018 3

ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్... గత రెండు సంవత్సరాలుగా, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది... దేశంలో అన్ని రాష్ట్రాల కంటే, మన రాష్ట్రం ఫస్ట్ ఉంటూ వస్తుంది... కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 340 అంశాలను పరామీటర్స్ గా తీసుకుని, ర్యాంకింగ్స్ ఇస్తారు... ఈ సంవత్సరం కూడా, ఇవన్నీ క్రోడీకరించి ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ పరామీటర్స్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు వెబ్సైటులో (http://eodb.dipp.gov.in/) అప్డేట్ చెయ్యాలి... అవన్నీ ఇవాల్యేట్ చేసి ర్యాంకింగ్స్ ఇస్తారు. ఐటి కంపెనీలు సహా ఎలక్ట్రానిక్స్ తయారి కంపెనీలు. ఆటో మొబైల్ రంగంలో కూడా ఈ రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కియా మోటార్స్ వంటి పరిశ్రమలు వేగంగా పనులు ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ౦ అనుసరిస్తున్న విధానాలే కారణం. ఇక ఐటి పరిశ్రమల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ వేగంగా అనుమతులు ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో రాష్ట్రంలోని వివిధ పార్టీలు వివిధ రూపాల్లో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, పార్టీలు చేపడుతున్న వివిధ కార్యక్రమాల ప్రభావంతో అనంతపురం జిల్లా రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. ఫలితంగా రానున్న మూడు, నాలుగు నెలల్లో జిల్లా రాజకీయ ముఖచిత్రం కూడా మారబోతోంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే క్రమంలో భాగంగా జిల్లాలో పాగా వేసేందుకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు రాష్ట్ర విభజనతో అడ్రస్ గల్లంతైన జాతీయ పార్టీ కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో ఉనికి చాటుకోవడానికి పాత నేతల్ని, జిల్లా నాయకుల్ని కలుపుకునేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది.

ananta 1072018 2

పీసీపీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా వాసి కావడంతో పార్టీ వీడిన నేతలను సమీకరించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ఈనెల 23న అనంతపురం జిల్లా పర్యటనకు రానున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘వంచనపై నిరసన దీక్ష’ చేపట్టింది. అదే సమయంలో సీపీఐ జాతీయ నేతలు కూడా జిల్లాలో పర్యటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెలలోపు జిల్లాలో పర్యటించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.

ananta 1072018 3

టీడీపీ నవ నిర్మాణదీక్ష, ఏరువాక, ఇంటింటికీ టీడీపీ వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు పేరుతో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షల ప్రభావం కూడా అనంతపై పడింది. కేంద్రంపై వత్తిడి కొనసాగింపులో భాగంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరుతో టీడీపీ ఎంపీలు చేపట్టిన ధర్మ పోరాటదీక్ష ఈ నెల 11న అనంతపురంలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని పార్టీలూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎత్తుగడలు, వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు అనంతపై ప్రభావం చూపుతుండటంతో పార్టీల పొత్తులు, టికెట్ల కేటాయింపు విషయంలో స్పష్టత కోసం అధిష్టానం నిర్ణయంపై ఆధారపడుతున్నారు. ఎవరికి టికెట్ వస్తుందో, ఎవరికి రాదోనన్న ఆందోళన జిల్లా టీడీపీ నేతలను వెంటాడుతున్నా, నియోజకవర్గాల్లో చురుగ్గా పాల్గొంటుండటం గమనార్హం.

Advertisements

Latest Articles

Most Read