ఒక పక్క నిరుద్యోగ బృతి పై కసరత్తు చేస్తూనే, భవిష్యత్తులో, నిరుద్యోగ సమస్యను అధిగమించటానికి, పిల్లల్లో కాన్ఫిడెన్సు పెంచటానికి, చంద్రబాబు ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో అప్రెంటిస్ షిప్ సెల్ ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ అప్రెంటిస్ షిప్ విధానం జర్మనీ, స్విట్జర్లాండ్, యూకే, స్వీడన్, ఆస్ట్రేలియా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో విజయవంతంగా అమలవుతోంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం అప్రెంటిస్ షిప్ ఐటీఐలు, తయారీ రంగ పరిశ్రమలకు మాత్రమే అనుసంధానమై ఉన్నాయి.

cbn 10072018 2

అప్రెంటిస్ షిప్ విధానాన్ని స్వల్పకాలిక కోర్సులు, శిక్షణతో అన్ని రంగాలకు అనుసంధానం చేయడం ద్వారా మరింత మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే దేశంలోనే తొలిసారిగా ఇంత విస్తృత శ్రేణిలో ‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ ఇన్ ఏపీ’ పేరుతో విశాఖపట్నంలోని నొవాటెల్ లో ఈనెల 11వ తేదీన కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. ఏపీ ఎస్‌ఎస్‌డీసీ, సీఐఐ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువజన, క్రీడలు, నిరుద్యోగ ప్రయోజనాలు, ఎన్నారై సంబంధాల మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, చిన్న, మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వ రంగంలోని సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం తరఫున పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

cbn 10072018 3

ఈ అప్రెంటిస్ షిప్ విధానాన్ని అమలు చేసే సంస్థలకు శిక్షణ కోసం ఒక్కొక్క అభ్యర్థికిగాను 1500 రూపాయల చొప్పున ప్రోత్సాహకంగా ప్రతినెలా మంజూరు చేస్తారు. పరిశ్రమలు, సేవారంగంలోవున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. విశాఖలోని నొవాటెల్ లో ఈనెల 11వ తేదీ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న పరిశ్రమలు, ట్రైనింగ్ పార్టనర్స్ https://goo.gl/forms/iE9YW5vJlgEm6Eyn1 లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 0891-2555535, 9848283261 నంబర్లలో సంప్రదించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలకు వింత పరిస్థితి ఏర్పడింది. కుడితోలో పడ్డ ఎలుకులా మారింది. తెలుగుదేశం పార్టీతో పొట్టు పుణ్యమా అని, గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకుని, రాష్ట్రంలో అధికార వైభవాన్ని వెలగబెట్టిన ఆ పార్టీ నేతలుకు తాజా పరిస్థతి ఘోరంగా మారింది. బీజేపీ అనే పేరు పలకటానకే, రాష్ట్ర ప్రజలు ఇష్ట పడటం లేదు. అయితే బీజేపీ నేతలు మాత్రం , రాష్ట్రంలో పుంజుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి అది ఇచ్చాం , ఇది ఇచ్చాం, లక్షల కోట్లు ఇచ్చాం, పోలవరం మా పుణ్యమే, ఇళ్ళు మా పుణ్యమే, అసలు ఆంధ్రప్రదేశ్ లో మనషులు బ్రతుకుతున్నారు అంటే మా పుణ్యమే అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ప్రజలు మాత్రం, వీరిని నమ్మటం లేదు. అందుకే ఇప్పుడు పాజిటివ్ గా వెళ్తే, ప్రజలు విశ్వసించటం లేదని, వ్యూహం మార్చి, నెగటివ్ గా వెళ్తున్నారు.

kanna 09072018 2

బెంగాల్, కేరళ తరహా వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. బెంగాల్, కేరళలో బీజేపీ ఒకప్పడు ఒక్కశాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. కానీ ఇప్పుడు కొంతమేర బలపడింది. దీని వెనుక అసలు కారణం ఎప్పటికప్పుడు తమ పార్టీ కార్యకర్తలు, అనుబంధసంస్ధల కార్యకర్తలపై దాడులు, ప్రతిదాడులు వ్యవహారాలతో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండడం.. రాజకీయం, ప్రజా సంక్షేమం కన్నా ఇతర భావోద్వేగ అంశాలతోనే ఆయా రాష్ట్రాల్లో దూకుడుగా వ్యూహాలు అమలుచేస్తోంది. ఈ క్రమంలో దాడులు ప్రతిదాడులకు ఆ పార్టీ శ్రేణులు పాల్పడుతున్నారు. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు బీజేపీ విభజనహామీల ఉద్యమకారులపై ప్రయోగిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

kanna 09072018 3

అందులో భాగంగానే, ఎవరన్నా ప్రజలు , కడుపు మండి నిరసన తెలుపుతున్నా, వారిని తరిమి తరిమి కొడుతున్నారు. ఇలా రెచ్చగొట్టి, అవతల వైపు నుంచి కూడా వచ్చి కలబడితే, భావోద్వేగం రేపి, చలి కాచుకోవాలని బీజేపీ ఎత్తుగడ.. ఒంగోలులో ప్రత్యేక హోదా ప్లకార్డు పట్టుకున్నారని వెంటపడికొట్టారు. కావలిలో చెప్పు చూపించారని, చెప్పులతో చితక్కొట్టారు. అనంతపురంలో వెంటపడి మరీ జెండాలు తగులపెట్టారు. ఇవన్నీ చూస్తూ ఉంటే, బీజేపీ ఎదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టే తెలుస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో పర్యటనలకు వస్తూ ఉంటే నిరసనల సెగ ఎదురవుతోంది. నిరసనలు తట్టుకోలేక పోతున్న బీజేపీ నేతలు దూకుడుగా ప్రవర్తిస్తున్నారు.

ఎన్ని ఇబ్బందులైనా పడి తమ పిల్లల్ని ప్రయివేట్ పాఠశాలలో చదివించాలని పేదవారు సైతం ఆలోచిస్తారు. ఫీజులు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి అక్కడైతేనే చదువు బాగా చెబుతారని వాళ్ళనుకుంటారు. ఉచితంగా చెబుతున్నాం రమ్మన్నా ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యం ఇవ్వరు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పరిస్థితులు మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న అనేక నిర్ణయాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లలో పోటీపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉందనే వార్తలు వింటుంటే ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.

chintamaneni 09072018 2

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో మరింత నమ్మకం పెంచటానికి, ఏకంగా ఒక ఎమ్మల్యే, తన కుమారుడుని, ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నాడు. అది కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి. ప్రజల్లో నమ్మకం కలిగించటం కోసం, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కొంతమంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు. ఇప్పుడీ జాబితాలోకి తెదేపా నేత, చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ చేరారు. తన కుమారుడిని దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ పాఠశాలలో చేర్పించి ఆదర్శ నేత అయ్యారు. ఒక ఎమ్మల్యే తన కొడుకుని, ప్రభుత్వ పాఠశాలకు పంపించటంతో, ప్రజల్లో కూడా నమ్మకం పెరిగింది.

chintamaneni 09072018 3

ప్రజలకు ప్రభుత్వ స్కూల్స్ లో చేరండి అని చెప్పే ముందు, మన పిల్లలు కూడా ఇక్కడే చదవాలి కదా, అప్పుడే మనకు ప్రజలకు చెప్పే పరిస్థితిలో ఉంటాం అంటున్నారు చింతమనేని ప్రభాకర్. మిగిలిన ఎమ్మల్యేలు, నేతలు, అధికారులు కూడా, ఇలాగే చెయ్యాలని, అప్పుడు ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ప్రైవేటు స్కూల్స్ కు తీసిపోని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయని, ప్రజల్లో పోయిన ఆ నమ్మకాన్ని, తిరిగి తీసుకురావాలి అంటున్నారు. ప్రతి సందర్భంలో, ఎదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే చింతమనేని, ఈసారి మాత్రం, ఒక గొప్ప ఆదర్శ నిర్ణయం తీసుకుని, ప్రజలకు స్ఫూర్తి ప్రదాత అయ్యారు.

అధికార పార్టీ అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలోకి దూకేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ప్రతిపక్ష పార్టీలకు ఇప్పటి నుంచే చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరు పై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. జిల్లాల వారీగా ఆయన చేయించిన సర్వేలను వారి ముందే బయటపెడుతూ వారికి ముచ్చెమటలు పోయిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జిల్లాల సమీక్షలను గ నిర్వహిస్తూ లోటు పాట్లను వారి సమక్షంలోనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో లేని నేతలను సైతం చంద్రబాబు స్వయంగా నిలదీస్తున్నారు. మరో పక్క ఈ రోజు, తెలుగుదేశం అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

tdp 09072018 2

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఈ రోజు కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అయితే ఆయన అక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించి షాక్ ఇచ్చారు. కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంత్రి లోకేష్ ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా మోహన్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు పర్యటన సందర్భంగా ఆయన అభ్యర్థులను ప్రకటించి సంచలనం రేపారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా మోహన్‌రెడ్డి, బుట్టా రేణుకలను గెలిపించాలని లోకేష్‌ ప్రకటించడంతో అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీకి, ఎప్పుడూ చివరి నిమిషం వరకు, అభ్యర్ధులను ప్రకటించే అలవాటు లేదు. అయితే, ఇప్పుడు దాదాపు సంవత్సరం ముందు నుంచే, అభ్యర్ధులను ప్రకటిస్తూ ఉండటంతో, ఎన్నికలకు కొత్త ప్రణాళికతో వెళ్తున్నారు.

tdp 09072018 3

మరో పక్క చంద్రబాబు సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా చంద్రబాబు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ చార్జిలతో సమావేశమవుతున్నారు. సర్వే వివరాలు ముఖ్యమంత్రి మొహమాటం లేకుండా చెబుతున్నారు. కేవలం ఆరోపణలే కాకుండా వారి పనితీరు, ప్రవర్తన తీరులో లోపం ఉన్నా క్యాడర్, ఓటర్లతో సరైన సంబంధాలు ఏర్పరచుకోలేకపోయినా వివరిస్తున్నారు. వారు తమను తాము దిద్దుకోవడానికి ఆయన అవకాశం ఇస్తున్నారు. దిద్దుకుంటే ఇబ్బంది లేదని, ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని, ఈలోపు వారు సరైన దారిలోకి రావాలన్నది ఆయన ఆలోచన అని, అందుకే ఈ కార్యక్రమం జరుగుతోందని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read