వైసీపీ శ్రేణుల్లో జూన్ 1 టెన్షన్ నెలకొంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ రేపు విచారణకు వస్తుంది. అయితే ఈ కేసు గత నెల రోజులుగా విచారణకు రాకుండా సాగుతుంది. గత మూడు వాయిదాల్లో, సిబిఐ కానీ, జగన్ కానీ కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో చివరి వాయిదాలో సిబిఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే, ఇక విచారణకు వెళ్తాం అంటూ, సిబిఐ కోర్ట్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే రేపు చివరి అవకాసం కావటంతో, అందరూ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి విషయంలో అయితే ఆయన కౌంటర్ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. ఆయన బెయిల్ రద్దు చేయవద్దు, నేను బెయిల్ కండీషన్స్ ఏమి ఉల్లంఘించలేదు అనే చెప్తారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి సిబిఐ మీద ఉంది. సహజంగా సిబిఐ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ, ఇలాంటి రాజకీయ పరమైన కేసులో, కచ్చితంగా కేంద్ర హోం శాఖ అభిప్రాయం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ విషయంలో సిబిఐ వైఖరి ఎలా ఉంటుందో తెల్సితే, జగన్ విషయంలో కేంద్రం వైఖరి కూడా అర్ధమైపోతుంది. జగన్ కు, కేంద్ర పెద్దలకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే విషయం, రేపు సిబిఐ వేసే కౌంటర్ తో స్పష్టం అవనుంది.

bail 31052021 2

ఒక దర్యాప్తు సంస్థగా, బెయిల్ రద్దు చేయవద్దు అని సిబిఐ అడిగే అవకాసం సహజంగా ఉండదు. తాము నిందితుడు అని చెప్పిన వ్యక్తి పట్ల, సిబిఐ సానుకూలత చూపించకూడదు. రెండో అంశం బెయిల్ రద్దు చేయండి అని కోరితే, అది పెద్ద సంచలనమే అవుతుంది. ఇక ఏ కోర్ట్ కూడా, జగన్ బెయిల్ రద్దుని ఆపే అవకాశమే ఉంటుంది. ఇక మూడో అంశం, సిబిఐ ఏమి చెప్పకుండా, కౌంటర్ ఇవ్వకుండా ఉండటం. ఎందుకుంటే ఇప్పటికే కోర్టు ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ, మీరు కౌంటర్ వేయకపొతే, మేము విచారణ ప్రారంభిస్తాం అని చెప్పిన విషయం తెలిసిందే. తటస్థంగా ఉండి, సిబిఐ కోర్టుకు ఆ నిర్ణయం వదిలేస్తే, రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి రేపు సిబిఐ ఏమని కౌంటర్ వేస్తుంది అనేది వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ గా ఉందనే చెప్పాలి. ఈ దెబ్బతో కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టం అవుతుంది. ఇప్పటికే ఏపి బీజేపీ నేతలు, పలు సందర్భాల్లో జగన్ బెయిల్ రద్దు అవుతుంది, ఆయన జైలుకు వెళ్తారు అంటూ బహిరంగంగానే చెప్తున్న విషయం తెలిసిందే. దీంతో రేపటి పరిణామాల పై వైసిపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు.

చిత్తూరు సబ్ జైలులో ఖైదీగా ఉన్న జడ్జి రామకృష్ణ ఉన్నటువంటి జైలు సెల్ లో, ఒక క-త్తి ఉండటం కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో జడ్జి రామకృష్ణ, తన కుమారుడికి, జైలులో ఉన్న ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసి, తన సెల్ లో, బెడ్ కింద ఒక క-త్తి ఉన్నట్టు అతనికి ఫోన్ చేసి చెప్పారు. తన తండ్రి నుంచి సమాచారం అనుకున్న కుమారుడు వంశీ కృష్ణ స్పందిస్తూ, రాష్ట్ర హైకోర్టు, అలాగే జిల్లా జైలు అధికారులకు, మరోసారి లేఖ రాసారు. గత రెండు మూడు రోజులు నుంచి కూడా, జడ్జి రామకృష్ణకు సంబందించిన వ్యవహారం సంచలనం కలిగిస్తుంది. సబ్ జైలులో ఉన్న జడ్జి రామకృష్ణ ఉన్న సెల్ లో, కొన్ని రోజుల క్రిందట, ఒక అపరిచిత వ్యక్తీ రావటం, జడ్జి రామకృష్ణనను , జగన్ పై, పెద్దిరెడ్డి పై విమర్శలు చేస్తావా అని బెదిరించటం తదితర అంశాలు బయటకు రావటంతో, తన తండ్రికి ప్రాణ హాని ఉంది అంటూ, జడ్జి రామకృష్ణ కుమారుడు, ఇప్పటికే హైకోర్టుకు, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసారు. ఆలాగే వివిధ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశం పై ఆందోళన వ్యక్తం చేస్తూ, తగిన బధ్రత కలిగించాలని కోరారు. ఈ నేపధ్యంలో, జైలు అధికారులు కూడా స్పందించారు. వంశీ కృష్ణ ఆరోపిస్తున్నవి అన్నీ అవాస్తవాలు అని చెప్పారు. సాధారణ వ్యక్తులు లాగే, ఆయనతో పాటు మరో ఖైదీని ఉంచామని, వేరే ఉద్దేశం లేదని చెప్పారు.

rk 31052021 2

అతను ఆరోపిస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారం అని చెప్పారు. ఇదే నేపధ్యంలో, ఈ రోజు ఉదయం రామకృష్ణ ఉన్న బ్యారెక్ లో బెడ్ కింద, క-త్తి ఉన్నట్టు తన కుమారుడికి మరో మారు ఫోన్ చేసి చెప్పటంతో, ఈ వ్యవహారం మరింత సంచలనం సృష్టిస్తుంది. అయితే దీని పై ఇంకా జైలు అధికారులు స్పందించలేదు. అయితే ఆఫ్ ది రికార్డు గా మాత్రం, పైప్ లైన్ లు కోయటానికి ఉపయోగించిన కత్తి అని, పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే, ఈ ఘటన పై స్పందించిన కొడుకు వంశీ కృష్ణ, తన తండ్రి బ్యారెక్ ను మార్చారని, అయితే ఇప్పుడు కొత్తగా క-త్తి కూడా బయట పడటం తమకు ఆందోళన కలిగిస్తుందని వాపోయారు. తన తండ్రికి రక్షణ కల్పించాలని, భోజనం కూడా చేయనివ్వకుండా కొంత మంది బెదిరిస్తున్నారని, అక్కడ ఏ స్థాయిలో పరిస్థితి ఉందో అర్ధం అవుతుందని, హైకోర్టుకు కూడా వెళ్ళకుండా, తమను అడ్డుకుంటున్నారని, దయచేసి అందరూ స్పందించి, మా నాన్నకు రక్షణ ఇవ్వాలని కోరారు. జగన్ మోహన్ రెడ్డిని ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో తిట్టారని, ఆయన పై కేసు పెట్టి, అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పరిస్థితి పై జైలు అధికారులు ఏమి స్పందిస్తారో చూడాలి.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పాటు, టీవీ5 న్యూస్ చానల్స్, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్ తో పాటుగా, దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ చంద్రచూద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, ఈ పిటీషన్ పై విచారణ చేసింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కోరిన ఇంట్రియం ప్రేయర్ ను సుప్రీం కోర్టు అంగీకరించింది. తమ పై ఎలాంటి దూకుడు చర్యలు తీసుకొకూడదు అంటూ సుప్రీం కోర్టుని కోరగా, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు, రాష్ట్ర ప్రభుత్వం, పిటీషనర్ల పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ఏపి ప్రభుత్వం, సిబిసిఐడి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణ వచ్చేంత వరకు కూడా, ఎలాంటి దుందుడుకు చర్యలు చేపట్టకూడదని, ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుని ఆరు వారాల పాటు వాయిదా వేసింది. నాలుగు వారాలు లోగా, ప్రతివాదులు అందరూ కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఈ విచారణ సందర్భంగా, సుప్రీం కోర్టు చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీడియా ప్రసారం చేసిన ప్రతి అంశాన్ని కూడా బూతద్ధంలో చూపించి, వాళ్ళకు ఉన్న హక్కులు కాలరాస్తున్నారని పేర్కొంది.

sc 31052021 2

ప్రతి దాన్ని రాజద్రోహంగా ప్రభుత్వాలు భావించటం, పరిపాటి అయిపొయింది అంటూ కోర్టు వ్యాఖ్యలు చేసింది. ప్రతి సారి ఈ విధమైన చర్యలు లేకుండా, అసలు రాజద్రోహం అంటే ఏమిటి, ఇందులో ఏమి వస్తాయి, ఏ కేసులు వస్తాయి, ఏ అంశాలు వస్తాయి, ఏ సెక్షన్ లు వస్తాయి, ఇలా పూర్తి విషయాల పై కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ, సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులోనే, అసలు రాజద్రోహం అంటే ఏమిటి, అంటూ పూర్తి మార్గదర్శకాలతో, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాసం ఉంది. దీంతో ఈ కేసు ఇప్పుడు భారత దేశ దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి. ఈ కేసు ఒక మైలు రాయిగా నిలిచిపోనుంది. ఇక పైన ఎవరు పడితే వారు, ఏ కేసు పడితే ఆ కేసు పెట్టకుండా, కొన్ని మార్గదర్శకాలు సుప్రీం కోర్టు చెప్పే అవకాసం ఉంది. అంతకు ముందు పిటీషనర్ తరుపు న్యాయవాదులు, తమ పై పెట్టిన రాజద్రోహం కేసు పై, తమ వాదనను సుప్రీం కోర్టు ముందు ఉంచారు. తాము ఒక ఎంపీ మాట్లాడిన విలేఖరులు సమావేశం చూపిస్తేనే, దాన్ని రాజద్రోహం అని ఎలా చెప్తారు అంటూ సుప్రీం కోర్ట్ ని ప్రశ్నించారు.

ఆ-నం-ద-య్య మం-దుకు రాష్ట్ర హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న కూడా, ఆ-నం-ద-య్య మం-దు పై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావటం, అవి హౌస్ మోషన్ పిటీషన్ లకు మూవ్ కావటంతో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాలుగు రోజుల క్రితం, ఈ పిటీషన్ పై విచారణ జరిగింది. ఇదే విషయం పై, ఈ రోజు కూడా విచారణ జరిగింది. ఈ విచారణ మొదలు అయిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డాక్యుమెంట్ లు అందించలేదని, కమిటీలూ వేసిన వాటి ఫైండింగ్స్ ఇవ్వలేదని చెప్పి, ఈ రోజు ఉదయం 15 నిమిషాల పై హైకోర్టు వాయిదా వేసింది. 15 నిమిషాల వాయిదా తరువాత, మళ్ళీ విచారణ ప్రారంభం అయిన నేపధ్యంలో, ముఖ్యమంత్రి వద్ద దీనికి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని, ఈ సమావేశం ముగిసిన తరువాత, ఆ నిర్ణయం హైకోర్టుకు తెలియచేస్తాం అని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు చెప్పారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాదులు కొన్ని ఘటనలు చెప్పారు. ఆ మం-దు వాడటం వలన బ్లా-క్ ఫం-గ-స్ వస్తుందని, ఇప్పటికే ఈ మం-దు వాడిన కొంత మంది హాస్పిటల్ లో కూడా చేరారని చెప్పారు. అయితే దీని పై, ఆనందయ్య తరుపు న్యాయవాదులు దీనికి అభ్యంతరం చెప్పారు. ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు అని చెప్పారు. అయితే ఈ సమయంలో హైకోర్ట్, ఈ కేసుని మూడు గంటలకు వాయిదా వేస్తూ, ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుందో చెప్పాలని కోరారు.

hc 31052021 2

అయితే ఈ దశలో హైకోర్టు మూడ్ అర్ధం చేసుకున్న ప్రభుత్వం, ఎలాగూ హైకోర్టు అనుమతి ఇస్తుంది కాబట్టి, ప్రభుత్వమే అనుమతి ఇస్తే పోతుందనే ఉద్దేశంతో కావచ్చు, మరే ఉద్దేశమో కానీ, మధ్యానం ఒంటి గంట సమయంలో, ఆ-నం-ద-య్య మం-దు-కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని మూడు గంటలకు విచారణ ప్రారంభం కాగా, హైకోర్టుకు ఈ విషయం చెప్పారు. అయితే కళ్ళలో వేసే మం-దు-కు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు. దీనికి ఇంకా రిపోర్ట్ లు రాలేదని, ఇంకా సమయం పడుతుందని చెప్పారు. అయితే ఆ-నం-ద-య్య లాయర్ మాత్రం, దీనికి అభ్యంతరం చెప్పారు. క-రో-నా మరణాల్లో ఆక్సిజన్ అందక చనిపోతున్నారని, ఈ కంటి మం-దు దానికి ఉపయోగపడుతుందని, అనేక కేసులు మన ముందు ఉన్నాయని చెప్పారు. దీనికి స్పందించిన హైకోర్టు, కంటి మం-దు సాంపుల్స్ తీసుకుని, రెండు రోజుల్లో అన్ని రకాల పరీక్షలు జరిపి, గురువారం నివేదిక ఇవ్వలేని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇదే సందర్భంలో మం-దు తయారీకి ఉపయోగపడే ఆకులు విషయంలో కానీ, ఏర్పాట్లు కానీ ప్రభుత్వం కూడా సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరగా, ఇవన్నీ తమ తుది ఆర్డర్లో స్పష్టం చేస్తామని హైకోర్టు చెప్పింది.

Advertisements

Latest Articles

Most Read