ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పటం, రాజకీయ పార్టీలకు బాగా అలవాటు. ఈ విషయంలో నాలుగు ఆకులు ఎక్కువే చదివింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా వాళ్ళకు ఉన్న బ్లూ మీడియా కానీ, పేటీయం బ్యాచ్ కానీ చేసే తప్పుడు ప్రచారం, హడావిడి గురించి వేరే చెప్పనవసరం లేదు. ఒక పక్క అనుభవ లేమి, మరో పక్క అప్పులు, మరో పక్క ఆదాయం లేకపోవటం, ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేయాలో తోచక , చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటే, జగన్ మోహన్ రెడ్డిని నమ్మి, అసెంబ్లీలో ఛాలెంజ్లు చేసిన మంత్రి అనిల్ కుమార్ , ఇప్పుడు అడ్డంగా ఇరుకున్నారు. సెప్టెంబర్ 2019లో, అసెంబ్లీ వేదికగా చాలెంజ్ చేసిన అనిల్ కుమార్ యాదవ్, చూసుకోండి నా తడాఖా, డిసెంబర్ 2021 కల్లా పోలవరం పూర్తి చేస్తాం, చంద్రబాబుకి కొత్త బట్టలు పెడతాం, చంద్రబాబు ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు పెడతాం అంటూ చేసిన హడావిడి, ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది. ప్రస్తుతం డిసెంబర్ నెల వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన డిసెంబర్ 2021 డెడ్లైన్ వచ్చింది. డిసెంబర్ 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తాను, మా జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేసి చూపిస్తారు, కాచుకోండి అంటూ, తన సహజ శైలిలో రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ పైన, సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి.

anilkumar 01122021 2

రేపే పోలవరం ప్రారంభోత్సవం, ముఖ్య అతిధిగా అనిల్ కుమార్ వస్తున్నారు అంటూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి. పోలవర పూర్తయ్యింది, కొత్త బట్టకు వేసుకుని రండి, భోజనాలు పెడుతున్నారు, అనిల్ కుమార్ నీళ్ళు వదులుతాడు, వెళ్లి చూసి వద్దాం అంటూ అనిల్ కుమార్ ని ట్యాగ్ చేసి మరీ హేళన చేస్తున్నారు. అయితే వాస్తవంగా చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ని నాశనం చేసింది వైసీపీ. చంద్రబాబు అధికారంలో ఉండగా అప్పగించిన పని, మరో 4 నెలలు పని చేసి ఉంటే, ఈ పాటికే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేవి. రివర్స్ టెండరింగ్ అంటూ, నవంబర్ వరకు పనులు ఆపేశారు. తరువాత నుంచి, ఇప్పటి వరకు కేవలం 4 శాతం పని అయ్యిందని ఆర్టిఐ రిపోర్ట్ లు చెప్తున్నాయి. ఇక కేంద్రం అయితే, మేము డబ్బులు ఇవ్వం అంటుంది. వీటి పైన కేంద్రంతో, ఏ మాత్రం పోరాటం చేయటం లేదు. కనీసం అడగను కూడా అడగటం లేదు. ఇలాగే కొనసాగితే, పోలవరం అసలు పూర్తి కూడా అవ్వదు. ఒకటి కేంద్రంతో పోరాడటం, లేదా రాష్ట్రమే భరించటం. ఇవేమీ చేయకుండా, జబ్బలు చరిస్తే, పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు.

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు 2012 నుంచి నడుస్తూనే ఉంది. జగన మోహన్ రెడ్డి పైన 12 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని, తన సొంత వ్యాపార సంస్థల్లో క్విడ్ ప్రోకో ద్వారా జగన్ మోహన్ రెడ్డి చేసిన అవినీతి పైన సిబిఐ చార్జ్ షీట్లు వేసింది. ఇదే కేసులో జగన్ మోహన్ రెడ్డి జైలుకి కూడా వెళ్లి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పైన బయట ఉన్నారు. అయితే ఈ కేసులు విచారణ కోసం, జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాల్సి ఉన్నా, ఆయన వివిధ కారణాలతో వెళ్ళటం లేదు. ఇది ఇలా ఉంటే ఈ కేసుల పై రోజు వారీ విచారణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే డిశ్చార్జ్ పిటీషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులో, హెటిరో డైరెక్టర్ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించేందుకు హైకోర్టు నిరాకరించింది. హెటిరో సంస్థను కూడా ఛార్జ్‌షీట్ నుంచి తొలగించేందుకు కోర్టు ఒప్పుకోలేదు. హెటిరో సంస్థనే కోర్టు ఒప్పుకోలేదు అంటే, జగన్, విజయసాయి వేసిన డిశ్చార్జ్ పిటీషన్లను కోర్టు ఏమి చేస్తుందో చూడాలి.

ఇప్పటికే చిత్ర విచిత్ర పన్నులతో ప్రజలను బాదేస్తున్న జగన్ ప్రభుత్వం, తాజాగా మరో బాదుడుకి సిద్ధం అయ్యింది. ఏపీలో వాహనదారులపై ప్రభుత్వం మరో బాదుడుకి సిద్ధం అయ్యింది. ఏపీలో ఇకపై పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ వేయనున్నారు. రవాణా వాహనాలకు ఏడేళ్లు దాటితే ఏటా రూ. 4వేలు కట్టాల్సి ఉంటుంది. అదే పదేళ్లు దాటితే ఏడాదికి రూ. 5 వేలు గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, 12 ఏళ్లు దాటితే ఏడాదికి రూ.6 వేలు గ్రీన్ ట్యాక్స్కట్టాలి అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మోటారు సైకిళ్లు 15 ఏళ్లు దాటితే ఏడాదికి రూ.2 వేలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలాగే 20 ఏళ్లు దాటితే ఏడాదికి రూ.5 వేలు గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, కార్లు, జీపులు వగైరా వాటికి 15 ఏళ్లు దాటితే రూ.5 వేలు గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 20 ఏళ్లు దాటిన కార్లు, జీపులకు రూ.10 వేలు గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక కొత్త వాహనాలు రూ.50 వేలు పైబడిన బైక్‍లపై 9 నుంచి 13 శాతం పన్ను పెంచారు. రూ.20 లక్షలకు మించిన వాహనాలపై 12 నుంచి 18 శాతం పన్ను పెంచారు. ఇవ్వాల్టి రోజున బండి లేని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. ఇప్పుడు ఈ పెంపు అందరి మీద గట్టిగానే పడననుంది.

ఆంధ్రప్రదేశ్ బీజేపీని ప్రక్షాళన చేసే చర్యలు చేపట్టింది, హైకమాండ్. ముఖ్యంగా అమిత్ షా తిరుపతి పర్యటన తరువాత, హైకమాండ్ కు ఇక్కడ విషయాలు మొత్తం అర్ధం అయ్యాయి. ఏపి బీజేపీలో కొంత మంది ముఖ్యులుగా చెప్పుకుంటూ వాళ్ళు చేస్తున్న పనులు బీజేపీకి లాభం కంటే, వైసీపీకి లాభం చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చింది. దీంతో ఇప్పుడు కోర్ కమిటీ పేరుతో చెక్ పెటింది. ఇన్నాళ్ళు కేవలం సోము వీర్రాజు ఏది చెప్తే అదే ఫైనల్ అయ్యేది. ముఖ్యంగా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్, సునీల్ దియోధర్, వీరి నలుగురి కనుసన్నల్లోనే పార్టీ నడిచేది. అయితే వీరి పైన సొంత పార్టీలోనే కొంత అసంతృప్తి ఉంది. వీరు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటారనే సందేశం వ్యక్తం అవుతూ వచ్చింది. వైసిపీని ఏమి అనకుండా, టిడిపి పైన విమర్శలు చేయటం, ఇలాంటివి చేస్తూ, ఈ అభిప్రాయాన్ని మరింత బలపడేలా చేసారు. ఇక పొత్తుల విషయంలో కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా ఒక సెక్షన్ అఫ్ మీడియాని దూరం పెట్టటం, కొంత మందిని సస్పెండ్ చేయటం, పురందేశ్వరి లాంటి వారిని దూరం పెట్టటం, రాజ్యసభ సభ్యులైనా సుజనా, సియం రమేష్ కు ప్రాముఖ్యత ఇవ్వక పోవటం, ఇలా అనేక తప్పిదాలు చేస్తూ వచ్చారు.

vishnu 30112021 2

అలాగే మిత్ర పక్షం జనసేన కూడా వీరి పైన ఆగ్రహంగా ఉందని, పలు సందర్భాల్లో వార్తలు కూడా వచ్చాయి. వీటి అన్నిటి నేపధ్యంలో తిరుపతి వచ్చిన అమిత్ షా, మొత్తానికి క్లాస్ పీకారు. మరీ ముఖ్యంగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోవటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో మొత్తం దెబ్బకు లైన్ లో పడ్డారు. పార్టీలోకి వచ్చిన వారికి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. అంతే కాదు, ఢిల్లీ వెళ్లి ఆక్షన్ మొదలు పెట్టారు. నిన్న ఏపి బీజేపీ కోర్ కమిటీ ప్రకటించారు. ఇందులో విష్ణు వర్ధన్ రెడ్డికి చోటు ఇవ్వలేదు. కన్నా లక్ష్మీనారాయణ, సియం రమేష్, సుజనా, పురందేశ్వరి లాంటి వారికి కూడా అవకాసం ఇచ్చారు. ఇక నుంచి ఏపి బీజేపీ ఏ నిర్ణయం తెసుకున్నా సోము వీర్రాజు ఒక్కరే తీసుకోవటానికి వీలు లేదు. కోర్ కమిటీ మొత్తం చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరితో సంప్రదించే ఇక నుంచి బీజేపీ ముందుకు వెళ్తుంది. పూర్తి ప్రక్షాళన దిశగా కూడా అధిష్టానం ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒక రకంగా, వైసీపీ అనుకూలంగా సాగుతున్న కొంత మంది బీజేపీ నేతలకు ఇబ్బందే మరి.

Advertisements

Latest Articles

Most Read