గత ఆరు నెలలు నుంచి ఏపిలో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎక్కడ గళం విప్పితే, ఎక్కడ తాము ప్రభుత్వ ఆగ్రహానికి గురి అవుతామో అని, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజు రోజుకీ సమస్యలు ఎక్కువ అవుతూ ఉండటంతో, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఇన్నాళ్ళు సజ్జల రామకృష్ణ రెడ్డిని కలిసి, తమ విజ్ఞాపన పత్రాలు ఇస్తూ, విన్నవిస్తూ వస్తున్నారు. అదే విధంగా, కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి, సమస్యలు చెప్పుకున్నారు. అయితే ఈ సమావేశాలు అన్నీ కేవలం ఫోటోలకు మత్రమే పరిమతం అయ్యాయని, ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. చీఫ్ సెక్రటరీని అడిగినా కూడా, తమ స్థాయిలో నిర్ణయం కాదని దాట వేస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ప్రతి నెల ఇవ్వాల్సిన నాలుగు వేల కోట్ల జీతాలు, పెన్షన్లు 1500 కోట్ల రూపాయలు, ఇవి చెల్లించటానికి ప్రతి నేలా ఇబ్బందులు పడుతూ, ప్రతి నెల వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని, సమయానికి జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీకి జీతాలు, పెన్షన్లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయానికి, ఖర్చులకు భారీగా తేడా ఉండటంతో, ఆ ఎఫెక్ట్ ఉద్యోగులు మీద పడుతుంది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

jagan 077102021 2

ఈ తరుణంలో, సిపీఎస్ ని వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పిన జగన్ మాటలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇక పీఆర్సీ గురించి కూడా ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లేట్ అయ్యిందని, ఎప్పటికి ఇస్తారు అని అడుగుతున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తే, ఇక అయ్యే పని కాదని గుర్తు చేస్తున్నారు. ఇక కనీసం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ రోజు ఉద్యోగ సంఘాలు అన్నీ జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి, ఆవేదన వ్యక్తం చేసారు. జీతాలు ఇవ్వలేక పోతున్నారని, పీఆర్సి అడ్డ్రెస్ లేదని, సిపిఎస్ పోయిందని, జీతాలు లేట్ అవుతున్నాయి అని, మెడికల్ రీయింబర్స్మెంట్ విషయంలో, రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన ఫలాలు, ఇలా ఏవి అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటూ ప్రెస్ మీట్ లో ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగులతో తక్షణమే జగన్ సమావేశం అయ్యి, వెంటనే తమ సమస్య పరిష్కరించాలని, లేకపోతే అందరం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

హెటిరో డ్రగ్స్, ఈ కంపెనీ గతంలో జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఏ4గా ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, క్విడ్ ప్రోకో ద్వారా జగన్ మోహన్ రెడ్డి కంపనీల్లో, పెట్టుబడి పెట్టారు. చివరకు సిబిఐ కేసుల్లో చిక్కుకున్నారు. ఈ కేసులు నడుస్తూనే ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత, అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెటిరో డ్రగ్స్ కు మళ్ళీ మంచి రోజులు వచ్చయి. విశాఖలో అనేక భూములు కట్టబెట్టారు అనే ప్రచారం జరిగింది. అలాగే కొన్ని ప్రభుత్వ పనులు కూడా హెటిరో డ్రగ్స్ కు అప్పగించారు. ఇక అలాగే విశాఖలో ఉన్న బేపార్క్ హెటిరో డ్రగ్స్ కొనటం వెనుక కూడా భారీ స్కెచ్ ఉందనే ప్రచారం జరిగింది. టిడిపి హెటిరో డ్రగ్స్ పేరుతో జగన్ మోహన్ రెడ్డి 300 కోట్లతో, బేపార్క్ కొన్నారు అంటూ విమర్శలు గుప్పించారు. అలాగే ఈ మధ్య కాలంలో హెటిరో డ్రగ్స్ అధినేత భారీగా ఆస్తులు పెరిగిన జాబితాలో చేరారు. వీటి అన్నిటి నేపధ్యంలో, కేంద్రం కన్ను హెటిరో డ్రగ్స్ పై పడింది. నిన్నటి నుంచి హెటిరో డ్రగ్స్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా విస్తృత సోదాలు జరుగుతున్నాయి. దాదాపుగా 20 బృందాలతో, వివిధ చోట్ల హెటిరో డ్రగ్స్ కార్యాలయాల పై ఐటి సోదాలు జరుగుతన్నాయి. ఈ సోదాల్లో కొన్ని కీలక డాక్యుమెంట్లు దొరికినట్టు తెలుస్తుంది.

hetero 07102021 2

ముఖ్యంగా ఐటి శాఖకు వచ్చిన సమాచారంతో, సోదాలు చేస్తున్నారు. పన్ను ఎగవేత, తప్పుడు బిల్లులు, ఇలా అనేక ఆరోపణలతోనే ఐటి శాఖ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి జరుగుతున్న సోదాల్లో, హెటిరో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఐటి సోదాల్లో హెటిరో కార్పొరేట్ ఆఫీస్ లో భారీగా నగదు గుర్తించినట్టు చెప్తున్నారు. దొరికిన నగదుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే ట్యాక్స్ చెల్లింపుల్లో కూడా భారీగా అవకతవకలు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో ముడి సరుకు దిగుమతి చేసుకున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ క్రమంలో ఎగుమతి, దిగుమతిలో భారీగా వ్యత్యాసాలు ఉన్నాయని, విలువ తక్కువ చేసి ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్లుగా గుర్తించారు అంటూ, మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సోదాలు ఇంకా ముగియలేదని, శనివారం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. దీని పై సోదాలు ముగిసిన తరువాత, ఐటి శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెరాయిన్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా కొన్ని వేల కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుబడటం, అది విజయవాడకు లింక్ ఉందని తేలటంతో, ఈ కేసు ఒక సెన్సేషన్ అయ్యింది. గత నెల 16వ తేదీన, తాలిబన్ల నుంచి దాదాపుగా 3 వేల కిలోల హెరాయిన్ గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు వచ్చింది. టాల్కం పౌడర్ ముసుగులో, ఈ హెరాయిన్ దిగుమతి అయ్యింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఆ పార్సిల్ పై, విజయవాడకు చెందిన ఆషి ట్రేడింగ్ కంపెనీ అనే కంపెనీ పేరు రాసి ఉంది. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. తాలిబన్ల నుంచి, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 వేల కిలోల హెరాయిన్, అదీ విజయవాడకు రావటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పెద్ద పెద్ద వాళ్ళ సహాయం లేకపోతే ఇది జరాదని అందరూ భావించారు. అయితే రాష్ట్ర డీజీపీ స్పందిస్తూ, అసలు అషీ ట్రేడింగ్ కంపెనీ అనేది ఒక డమ్మీ కంపెనీ అని, విజయవాడ పేరు మాత్రమే వాడుకున్నారని తెలిపారు. అయితే టిడిపి మాత్రం డీజీపీ చేసిన ప్రకటన తప్పు అని చెప్తుంది. గత ఏడాది కాలంగా, ప్రతి నెల జీఎస్టీ కడుతున్నారని, అది డమ్మీ కంపెనీ అని ఎలా చెప్తారు అంటూ, కౌంటర్ చేయటంతో, ఈ విషయం పై అటు వైపు నుంచి ఇప్పటికీ సమాధానం లేదు.

center 06102021 2

అయితే ఇది మరో టర్న్ తీసుకుని, కాకినాడ లింకులు బయట పడ్డాయి. ఒక న్యూస్ ఛానల్ లో, అషీ ట్రేడింగ్ కంపెనీ సుధాకర్, కాకినాడలో ఆలీషా అనే సముద్రపు డాన్ దగ్గర పని చేసే వారని, ఈ ఆలీషా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనిషి అంటూ కధనాలు రావటం, ఈ లింకులు ఆఫ్రికా వరకు ఉండటం, దీన్ని టిడిపి రచ్చ రచ్చ చేయటంతో, ప్రతి రోజు ఈ విషయం పై ఏపిలో చర్చ జరుగుతుంది. అయితే ఏపి పోలీసులు మాత్రం, ఈ విషయం పై గతంలో ఇచ్చిన స్పందన తప్ప ఏమి లేదు. ఇక జాతీయ స్థాయిలో, ఈ విషయం పై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హెరాయిన్ విషయంలో, ఏకంగా విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్లు భావించిన కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసుని ఎన్ఐఏకు బదిలీ చేస్తూ కొద్ది సేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి మాదకద్రవ్యాల దిగుమతిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఏ దేశాల నుంచి ఎప్పటి నుంచి దిగుమతి చేసారు అనే విషయం పై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. మరి ఈ విషయంలో బిగ్ బాస్ బయట పడతారో లేదో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది కేంద్రం. ఏపి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం దెబ్బ కొట్టింది. పోలవరం ప్రాజెక్ట్ నిధులు పై కేంద్ర ఆర్ధిక శాఖ తేల్చేసింది. డబ్బులు ఇవ్వం అంటూ చేతులు ఎత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి మొదలైంది. చంద్రబాబు వల్ల కాలేదు, మేము మెడలు వంచి పోలవరం ప్రాజెక్ట్ తీసుకుని వస్తాం అని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు చేతులు ఎత్తేసింది. గతంలో కేంద్ర మంత్రివర్గం ఏదైతే తీర్మానం చేసిందో, ఆ తీర్మానం మేరకు రూ.20 వేల కోట్లకు మించి ఎట్టి పరిస్థితిలో కూడా రూపాయి కూడా అదనంగా నిధులు ఇవ్వం అంటూ తేల్చి చెప్పింది. దీని అంతటి పై, కేంద్ర జల శక్తి శాఖ, కేంద్ర ఆర్ధిక శాఖకు ఒక లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి, అదనంగా మరో నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి, ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది. దేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్ట్ లకు సంబంధించి, ఇటీవల అదనంగా నిధులు మంజూరు చేసిన విసయాన్ని ఆ లేఖలో కేంద్ర జల శక్తి శాఖ , ఆర్ధిక శాఖ అధికారులకు గుర్తు చేసింది. ఈ గుర్తు చేసిన అనంతరం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలి అంటే, డ్యాముకు సంబంధించి మరో నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆ డబ్బులు ఇవ్వాలని కోరింది.

jagan 07102021 2

అయితే ఆ లేఖను పరిశీలించిన కేంద్ర ఆర్ధిక శాఖ, పలు అంశాలను ఈ సందర్భంగా కూడా ప్రస్తావించింది. ప్రధానంగా గతంలో కేంద్ర మంత్రి వర్గం రూ.20 వేల కోట్లకు మించి ఇవ్వకూడదని తీర్మానం చేసిందని, దీనికి సంబంధించి తమకు ఇచ్చేందుకు అదనంగా ఇచ్చేందుకు, నిబంధనలు అంగీకరించవని, కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. అదే విధంగా దేశంలో ఇతర ప్రాజెక్ట్ లు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాజెక్ట్ లకు సంబంధించి, ఇప్పటికే పూర్తయ్యాయని, అదనంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇతర ప్రాజెక్ట్ లకు, నీటి వసతులు కల్పించేందుకే ఈ నిధులు మంజూరు చేస్తున్నాం అని, అంతే కాని పూర్తికాని ప్రాజెక్ట్ లకు, అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని పేర్కొంది. ఈ సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు కూడా తేల్చి చెప్పారు. ఈ లేఖను కూడా రాష్ట్రానికి పంపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగలింది. ఇక ఇందులో తాము ఏది చేయలేమని కేంద్రం చెప్పేసింది. రాజ్యసభలో వైసిపీకి బలం ఉన్నా, కేంద్రం పై ఒత్తిడి తేకుండా, అన్ని బిల్లులకు మద్దతు ఇస్తూ, చివరకు ఇలా రాష్ట్రానికి ఏమి చేయకుండా, కేంద్రం రాష్ట్రం కలిసి ఏపి గొంతు కొస్తున్నాయి. ఏపి ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయటం లేదో అర్ధం కావటం లేదు.

Advertisements

Latest Articles

Most Read