ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెడుతోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై పెంచిందెంత, తగ్గించిందెంత అని ప్రతికా ప్రకటన ఇచ్చారు. అందులో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారన్నారు. ఆ ప్రకటనలో అన్నీ అవాస్తవాలే. ప్రజలపై భారం పడకూడదని కేంద్రం తగ్గించనప్పటికినీ 2018 లో చంద్రబాబు పెట్రోల్ ధర 80 రూపాయల కంటే తక్కువగా ఉన్నప్పటికి, దేశంలో ఏ రాష్ట్రం తగ్గించనప్పటికీ రెండు రూపాయలు తగ్గించి ప్రజలను ఆదుకున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇచ్చే ప్రభుత్వ పత్రికా ప్రకటనల్లో అన్నీ అబద్ధాలే ఉంటున్నాయి. ప్రతీది గత ప్రభుత్వంపై నెట్టేస్తున్నారు. జగన్ రెడ్డి పాదయాత్రలో బాదుడే బాదుడు అన్నారు. అదే బాదుడు మీరు కొనసాగించడంలేదా? పైగా అదనంగా ఒక రూపాయి పెంచామని గొప్పల్లాగ చెప్పుకుంటున్నారు. ధరలు పెంచుతూ 3 జీవోలిచ్చారు. చంద్రబాబు హయాంలో రోడ్డు సెస్సు వసూలు చేయలేదు. ప్రస్తుతం రోడ్లు బాగు చేయించకపోగా రోడ్డు సెస్సు వసూలు చేస్తున్నారు. డీజల్ ధరలు పెంచి ప్రజలపై మోపిన భారం చాలక మళ్ళీ పెట్రోల్, డీజిల్ రేట్ల పై పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం ప్రజల్ని మోసం చేయడమే.

gv reddy 07112021 2

పెట్రోల్, డీజిల్ ధరల గురించి పాదయాత్రలో ఏం మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదు. జగన్ రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాల వల్లనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ అనార్ధాలన్నింటికీ కారణం జగన్ రెడ్డి ప్రభుత్వ దోపిడీ విధానాలే. జగన్ రెడ్డి ఆదాయం పెంచలేదుగానీ ధరలు మాత్రం విపరీతంగా పెంచుతున్నారు.. ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారు. కానీ పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు.? జగన్ రెడ్డి దూకుడు పెంచారని దీంతో జనంపై పెట్రోల్ ధరల బాదుడు బాదుతున్నారు. విపరీతంగా లిక్కర్ పై ఎక్సైజ్ డ్యూటీ వేశారు. విపరీతంగా ట్యాక్సులు పెంచారు. హౌస్ ప్రాపర్టీ పెంచారు. చెత్త సేకరణపై కూడా ట్యాక్స్ వేశారు. రూ. 14 వేలు తక్కువ వచ్చిన పాపానికి 14 వేల కోట్ల రూపాయలు అదనంగా ట్యాక్సులు వేశారు. తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల పరిపాలనలో పెట్రోల్, డీజిల్ పై 3,800 నుంచి 4,200 కోట్ల రూపాయలు వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికే పార్లమెంటు సమాచారం ప్రకారం 11వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో తెలపాలి. ప్రశ్నిస్తే కుంటి సాకులు చెబుతున్నారు. కనీసం పది రూపాయలు తగ్గించాలి. దొంగ లెక్కలు చూపడం మాని పెట్రోల్ పై లీటరుకు కనీసం పది రూపాయలు తగ్గించాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న చర్చ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తుందా లేదా అని ? దీపావళి ముందు రోజు కేంద్ర ప్రభుత్వం, పెట్రోల్, డీజిల పై సుంకాన్ని తగ్గించింది. పెరిగిన పెంపుతో పోల్చితే, ఇది పెద్ద పెంపు కాకపోయినా, కచ్చితంగా ఊరట అనే చెప్పాలి. అయితే కేంద్రం, రాష్ట్రాలను కూడా తగ్గించమని కోరింది. తమ వంతు రాష్ట్ర పన్నుల రూపంలో తీసుకుంటున్న పన్నులును కూడా తగ్గించాలని కేంద్రం, రాష్ట్రాలను కోరింది. కేంద్రం అభ్యర్ధనను 23 రాష్ట్రాలు అంగీకరించి, తమ వంతు వాటాగా కూడా కేంద్రం కంటే ఎక్కువగా కొన్ని రాష్ట్రాలు తగ్గించాయి. దీంతో కేంద్రం తగ్గించిన పన్ను, రాష్ట్రం తగ్గించిన పన్ను, రెండూ కలిపి దాదాపుగా రూ.15 వరకు తగ్గుముఖం పట్టింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఉలకటం లేదు, పలకటం లేదు. గతంలో జగన్ మోహన్ రెడ్డి బాదుడే బాదుడు అంటూ చేసిన ప్రసంగాలు, అసెంబ్లీలో ఆవేశంగా చేసిన ప్రసంగాలు చూసి, జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు తగ్గిస్తారా అని ఏపి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న సందర్భంలో, నిన్న డిప్యూటీ మంత్రి ధర్మాన స్పందిస్తూ చేసిన ప్రకటన కొంత ఊరట ఇచ్చింది. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించటం మంచి పరిణామం అని చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటుంది చెప్పారు.

dharmana 07112021 2

ఈ ప్రకటన చూసిన చాలా మంది సంబర పడ్డారు. ధరలు తగ్గిస్తారని ఆశ పడ్డారు. అయితే అటు ధర్మానకు, ఇటు రాష్ట్ర ప్రజలకు కూడా షాక్ ఇచ్చేలా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసిన ప్రకటన చూసిన వారికి షాక్ తగిలింది. ధర్మాన సరైన సమయంలో సరైన నిర్ణయం అని చెప్పి 12 గంటలు అవ్వక ముందే, ఈ రోజు పేపర్లో పెట్రోల్, డీజిల్ ధరల పై ప్రభుత్వం ప్రకటన చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ ప్రకటన చూస్తే, తప్పు అంతా కేంద్రం, చంద్రబాబుది అని, మా తప్పు ఏమి లేదని, మేము తగ్గించం అనే విధంగా ఆ ప్రకటన ఉంది. సహజంగా నిన్న ధర్మాన సరైన సమయంలో సరైన నిర్ణయం ని అంటే, జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఆ ప్రకటన చేసి ఉంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ రోజు పేపర్ ప్రకటనలో మాత్రం, పూర్తి విరుద్ధంగా ఉంది. రోడ్డు సెస్ ఎందుకు వేస్తున్నమో చెప్పారు. వ్యాట్ పాపం మాది కాదని చెప్పే ప్రయత్నం చేసారు. అంటే, ఇవన్నీ చూసిన వారికి, తాము తగ్గించం అని చెప్పకనే చెప్పినట్టు ఉంది. మరి ధర్మాన గారు చెప్పినట్టు, సరైన సమయంలో, సరైన నిర్ణయం ఎప్పుడు వస్తుందో ? తొందరగా రావాలని కోరుకుందాం.

అమరావతి రైతులు, న్యాయస్థానం టు దేవస్థానం అంటూ చేస్తున్న పాదయాత్ర ప్రజల ఆదరణతో దిగ్విజయంగా, అద్బుతంగా, జరుగుతుంది. ప్రజలు ఎక్కడికక్కడ పోటెత్తుతున్నారు. మూడు రాజధానులు వద్దు, ఒకటే రాజధానిగా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తూ, అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు ఇస్తున్నారు. రోజు రోజుకీ ప్రజాధరణ పెరుగుతుంది. అమరావతి రైతుల పాదయాత్ర ఆరో రోజుకి చేరుకుంది. గుంటూరు జిల్లా దాటి, ఈ రోజు ప్రకాశం జిల్లా పర్చూరుకు చేరుకుంది. గుంటూరు జిల్లాకు మించి, పర్చూరులో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ప్రజలు ఈ రోజు స్వాగతం పలికారు. దీంతో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కన్ను కుట్టిందో, లేక రూల్స్ కేవలం అమరావతి వారికే గుర్తుకు వచ్చాయో కానీ, పోలీసులు ఈ రోజు అమరావతి జేఏసి వారికి షాక్ ఇచ్చారు. అయితే అమరావతి రైతులు కూడా అదే స్థాయిలో జవాబు చెప్పారు. పాదయాత్ర నిర్వాహకులకు ఈ రోజు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా మూడు అంశాలు ఇందులో పొందుపరిచారు. ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు అంటూ ఒక కారణం చెప్పారు. అలాగే కో-వి-డ్ నిబంధనలు పాటించటం లేదని, మాస్కులు ధరించటం లేదని తెలిపారు. ఇక ఎక్కువ మంది జనం వస్తున్నారు అంటూ వింత వాదన వినిపించారు.

amaravati 06112021 2

హైకోర్టు పర్మిషన్ తో 157 మంది రైతులు పాదయాత్ర చేస్తున్నారు. వారికి సంఘీభావంగా అనేక మంది రొజూ వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. మరి ఇది ఎలా తపు అవుతుందో పోలీసులుకు తెలియాలి. ఎక్కువ మంది జనాలు వస్తున్నారు అనేది ఒక కారణం అయితే, ఈ రోజు జగన్ పాదయాత్ర చేసి నాలుగు ఏళ్ళు అయ్యింది అంటూ, వైసీపీ నేతలు చేసిన పెద్ద ర్యాలీలను ఏమనాలి ? మొత్తానికి, నోటీసులు ఇచ్చిన పోలీసులు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కోరారు. దీనికి అమరావతి జేఏసి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని, పోలీసులు కనీసం ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయకపోతే, మేమే చేసుకుంటున్నాం అని అన్నారు. ప్రజలు మద్దతు ఇస్తే తాము ఏమి చేయం అని అంటున్నారు. వారం రోజుల్లో నోటీసులకు సమాధానం ఇస్తాం అని, ఈ పాదయాత్ర ఎట్టి పరిస్థితిలోనూ ఆపం అని తేల్చి చెప్పారు. చీరాల డీఎస్పీ వచ్చి నోటీసులు ఇచ్చిన సందర్భంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ రోజు పత్రికలు చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వింత అనుభవం ఎదురైంది. దేశం మొత్తం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నారు, మీరు ఎప్పుడు తగ్గిస్తారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ దీని పై ఆందోళన చేస్తుంది. పక్క రాష్ట్రాల్లో రూ.15 వరకు తగ్గించారని, ఏపి ప్రజలకు కూడా తగ్గించాలని టిడిపి ఆందోళన చేస్తుంది. అయితే వీళ్ళు తగ్గిస్తారో, తగ్గించరో కానీ, ఈ రోజు పేపెర్ లో వేసిన ప్రకటన చూస్తే, ఏపి ప్రభుత్వానికి తగ్గించే ఉద్దేశం లేదని అర్ధం అవుతుంది. ఈ రోజు ప్రకటనలో చాలా ఫేక్ ఉన్నాయని, సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఒక ప్రభుత్వ ప్రకటనలో, కోట్లు ఖర్చు పెట్టి, అబద్ధాలు చెప్పటం పై, విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంతో పోల్చితే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేవలం రూ.1 పన్ను పెంచినట్టు ఆ ప్రకటనలో తెలపటంతో, అందరూ షాక్ తిన్నారు. చంద్రబాబు హయాంలో రూ.2 మాత్రమే అదనపు వ్యాట్ వేస్తే, ఎప్పుడో వేసిన రూ.4 వ్యాట్ చూపించి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, అసలు వ్యాట్ పెంచనట్టు చూపిస్తూ, అతి తెలివి చూపించారు. దీని పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ, ఈ ప్రకటనలో ఉన్న ఫేక్ మొత్తం బయట పెట్టారు.

fake 07112021 2

లోకేష్ విడుదల చేస్తిన ప్రకటనలో ఉన్న అంశాలు ఇవి. చంద్రబాబు అధికారంలో ఉండగా, బాదుడే బాదుడు అని దీర్ఘాలు తీసి, రెండున్నరేళ్ళు అయినా, ఎందుకు వ్యాట్ తగ్గించ లేదు అంటూ లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబు గారి హాయంలో, వ్యాట్ కేవలం రూ.2. వ్యాట్ భారం పడకుండా రూ.4 నుంచి రూ.2కి తగ్గించింది చంద్రబాబు ప్రభుత్వం, అది ఎందుకు ప్రకటనలో పెట్టలేదని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత కేవలం రూ.1 సెస్ వేశానని ఫేక్ చేసారని, అసలు వాస్తవం 2020 ఫిబ్రవరి 29న పెట్రోలుపై అదనపు వ్యాట్‌ను రూ.2.76, డీజిల్‌పై రూ.3.07 కు పెంచారని, 2020 జులై 20న, మరోసారి పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.4 చొప్పున అదనపు వ్యాట్‌ మరోసారి పెంచుతూ ఆదేశాలు ఇచ్చారని, 2020 సెప్టెంబరు 18న, రోడ్డు అభివృద్ధి సెస్ పేరిట లీటరు రూ.1 చొప్పున విధించారని లోకేష్ తెలిపారు. మొత్తంగా, లీటర్ పెట్రోల్ పై రూ.30 వరకు, డీజిల్ పై రూ.22 వరకు పన్నులు రూపంలో బాదుతూ, ఇవి ఎందుకు ప్రజలకు చెప్పకుండా, తప్పుడు ప్రకటనలో జగన్ చెప్పారని లోకేష్ ప్రశ్నిస్తూ, వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేసారు.

Advertisements

Latest Articles

Most Read