తిరుమలలో సాధారణం కంటే భక్తుల రద్దీ బాగా  పెరిగిపోయింది. దీనితో సరైన సదుపాయాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో టోకెన్లు తీసుకొన్న భక్తులకు స్వామి వారి,  సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. స్వామి వారి  సర్వదర్శనానికి కంపార్టుమెంట్‍లలో  వేల మంది భక్తులు వేచివున్నారు. నిన్న ఒక్క రోజే  63,214 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.  ఇందులో 23,147 మంది భక్తులు  శ్రీవారికి తిరుమలలో తలనీలాలు సమర్పించారు.  నిన్న ఒక్కరోజు స్వామి వారి హుండీ ఆదాయం రూ.5.50 కోట్లు వచ్చినట్లు టిటిడి ప్రకటించింది.

ఈ రోజు గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఒకేసారి రెండు జిల్లాలు జగన్ పర్యటన చేయటంతో, అధికారులు అలెర్ట్ అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో జగన్ ఇలా రెండు జిల్లాల్లో పర్యటన చేయలేదు. అయితే అదేదో ప్రభుత్వ కార్యక్రమమో కాదు, లేక పార్టీ కార్యక్రమం కాదు. ఆయన పెళ్ళిళ్ళకు వెళ్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో దేవాదాయ శాఖ మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహ వేడుకకు, విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం మండలం దాకమర్రిలోని నెల్లిమర్ల వైసిపి ఎమ్మెల్యే అప్పలనాయుడి కుమారుడి వివాహవేడుకకు, ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ విషయం పై గత కొద్ది రోజులుగా వార్తల్లో వినిపిస్తున్న వేళ, తాజాగా మరో అప్దేడ్ వచ్చింది. నిన్న హైదరబాద్ జూబ్లీహిల్స్‌ లో ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు వచ్చి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ముఖ్యంగా చంద్రబాబు ఇంటికి వెళ్ళే మూడు మార్గాలు పోలీసులు ఆధీనంలో మూసివేసి ఉంటాయి. వీటిని వదిలేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై నిన్న ఇరు రాష్ట్రాల అధికారులు ఆడిట్ చేసారు. ఇలా చేస్తే ఆ ఏరియాలో ట్రాఫిక్ ఫ్రీ అవుతుందని వారి అభిప్రాయం. ఇందు కోసం నిన్న తెలంగాణ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, అలాగే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ రవీందర్‌రెడ్డి , ఇతర ట్రాఫిక్‌ అధికారులు, అలాగే ఫైర్ సిబ్బంది వచ్చి చంద్రబాబు నివాసం దగ్గర పరిస్థితి ఎలా ఉంది, ఏమి చేయాలి అనే విషయం పై చాలా సేపు ఫీల్డ్ లో ఉండి మొత్తం పరిశీలించారు.

cbn 14122022 2

చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, మధుసూదన్‌తో కూడా కలిసి, ఏమి చేయాలి అనే విషయం పై చర్చించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 1 నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 65 వరకు ఒక దారి, అలాగే 36లో హెరిటేజ్‌ పక్క నుంచి, రోడ్‌ నంబరు 45 మీదుగా హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీ వరకు ఒక దారి లో నుంచి చంద్రబాబు నివాసానికి వెళ్ళవచ్చు. అయితే రోడ్‌ నంబరు 45 నుంచి వచ్చే వాహనాలను వదిలేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికి మూసి ఉన్న మూడు రోడ్లలో, సగం వాటిల్లో ట్రాఫిక్ వదిలేయాలని భావిస్తున్నారు. దీని పైన నిన్న ఇరు రాష్ట్రాల అధికారులు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరో పక్క చంద్రబాబు పర్యటనల నేపధ్యంలో, వైసీపీ వరుస పెట్టి రాళ్ల దా-డు-లు , అడ్డగింతలు లాంటివి చూసి, ఇప్పటికే కేంద్రం ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీని డబుల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో, చంద్రబాబు ఇంటి దగ్గర తెలంగాణా, ఏపి అధికారులు సెక్యూరిటీ ఆడిట్ చేసారు.

మోసపోయిన అమరావతి రైతులు రేపు ఢిల్లీలో నిరసనలు తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటితో అమరావతి ఉద్యమానికి మూడేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనలు చేయాలని అమరావతి జేఏసి నిర్ణయం తీసుకుని. ఇప్పటికే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండటంతో, అక్కడ నిరసన తెలిపి, తమ బాధలు చెప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఢిల్లీ వెళ్లి, 17న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు. అలాగే 18న పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ఎంపీలను కలిసి తమ బాధలు చెప్పుకుని వినతిపత్రాలు ఇస్తారు. ఇక 19న కిసాన్ సంఘ్ ధర్నాలో పాల్గొంటారు. రేపటి ఢిల్లీ పర్యటన వివరాలను అమరావతి పరిరక్షణ సమితి మీడియాకు వివరించింది.

Advertisements

Latest Articles

Most Read